30, జనవరి 2011, ఆదివారం

వర్మా సొల్లు కాన్సెప్టు

పరిశ్రమ అంటే పది మందికి ఉపాధి చూపేలాగా ఉండాలిగానీ, ఉన్నవారిని బికారీలు చేసేలా ఉండకూడదు అంటూ రోజువారీ జీతాల మీద పనిచేసే కొందరి సిని కార్మికులు రామ్ గోపాల్ వర్మ అయిదు రోజుల కాన్సెప్టు 'దొంగల ముఠా' మీద నిప్పులు చెరుగుతున్నారు.

వారాలకు వారాలు ఎవరికీ పనిలేక సినీ కార్యకలాపాలు మొత్తం స్తంభించిపోవడంతో బతుకు బండీ లాగడమే కష్టం అయ్యిందని వాపోతున్న కార్మికులకు ఇప్పుడు అయిదు రోజుల్లో అయిదుగురితో సినిమా తీస్తానని వర్మ చెబుతుంటే ఎక్కడో కాలడం సమంజసమే. 'అంతగా ఉద్ధరించాలి అనుకుంటే...నెలలకు నెలలు సినిమాలను తీస్తున్న దర్శక నిర్మాతలకు 'వన్ మంత్' క్రాష్ కోర్సు పెట్టి మెళుకువలు నేర్పించుకోవచ్చు కదా...ఈ సొల్లు కాన్సెప్టులతో మా పొట్టలు కొట్టడం దేనికో' అంటూ ఓ సినీ నిరుద్యోగి వర్మపై కాటేసాడు.

ఇప్పుడే ఇలా కోప్పడుతుంటే అసలు 'దొంగల ముఠా'లో విషయం ఎంతో చూసిన తరువాత ఇంకెలా మాట్లాడతారో మరి?

తుపాకి నుంచి సేకరణ