30, జనవరి 2011, ఆదివారం

ఆరోగ్యశ్రీ దుర్వినియోగానికి నిదర్శనం

గత ఏడాది అక్టోబర్ 24న శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన జి.భవానీ మరణిస్తే.. రెండు రోజుల క్రితం ఆరోగ్యమిత్ర వారి ఇంటికి వెళ్లి భవాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వాకబు చేయటమే కాకుండా ఆరోగ్యశ్రీ పథకంలోchikitsa జరిగి ఆరోగ్యంగా ఉన్న౦దుకు ఆరోగ్యమిత్ర ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేయటం పట్ల ఆశ్చర్య పోతున్నారు జనాలు
వివరాల్లోకి వెళ్తే.. కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన జి.భవానీ జ్వరంతో బాధపడు తూ శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గత ఏడాది అక్టోబరు 18న చేరింది. 22నాటికే సుమారు ఒక లక్ష రూపాయలకు పైగా ఖర్చు కావడంతో బెబెల్తీన కుటుంబ సబ్యులు ఆరోగ్యశ్రీ కోసం దరఖాస్తు చేసారు. చికిత్సకు ప్రభుత్వ అనుమతి 23na వచ్చిన మరునాడే 24న భవాని మృతిచెందింది. మరణ ధృవపత్రాలు కూడా కుటుంబీకులకు తీసుకున్నారు. అయితే ఆమె మరణించిన వారం తర్వాత అక్టోబర్ 30న శస్త్రచికిత్స చేశామంటూ ఇప్పుడు ఆరోగ్యమిత్ర ప్రతినిధులు పరామర్శ. కి రావడం ఆరోగ్యశ్రీ పథకంలో నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి .