నూట యాభయ్యో సినిమా ఎప్పుడు మొదలవుతుందో పాపం చిరంజీవికే తెలియని అమాయక స్థితిలో ఉంటె అప్పుడే మెగా స్టార్ పక్కన హీరోయిన్లుగా నటించేందుకు కొందరు నాయికలు తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అన్నయ్య వచ్చేదాకా తమ్ముడు గబ్బర్ సింగ్ తో సర్దుకుందాం అనుకున్న కాజల్ అగర్వాల్ మళ్ళీ ఈ పోటీలో కూడా ముందుందట.
ఆల్రెడీ మెగా కుటుంబంలో అందరితో నటించేసిన కాజల్ ఇక మెగా స్టార్ ఒక్కడితో చేస్తే చరిత్రలో ఏ హీరోయిన్ దక్కించుకొని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్టు అవుతుంది. అందుకే ఆరు నూరైనా పవర్ స్టార్ అయిపోగానే మెగా స్టార్ పని పట్టేందుకు ఇప్పటి నుండే సీక్రెట్ స్కెచులు గీస్తోందట. ఎలాగు చరణ్, అర్జున్, శిరీష్ కాజల్ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడో సారి ఇప్పుడో సారి చిరంజీవికి కనపడితే ఏదో ఓ మూమెంటులో దొరక్కపోతాడా అన్నది కాజల్ కంత్రీ ప్లాన్ కాబోలు!
తుపాకి నుంచి సేకరణ