తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కో సం తెలంగాణలోని అన్నిరాజకీయ పార్టీల నాయకుల్లారా ఏకం కండని తె లంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజీనామా చేసినప్పుడల్లా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, తరువాత పరిస్తితి భిన్నంగా ఉందని అంటూ పల్లెల్లో ఉన్న కూలీలు, కార్మికులు, కర్షకులు ఉద్యమం లో మమేకమై తెలంగాణ సాధన కో సం నాయకత్వం వహించాలన్నారు.