చిరంజీవి ఇంట్లోని నలుగురు కుటుంబ సభ్యులు నాలుగు సొంత కుంపట్లు పెట్టుకొని నిర్మాతలై పోతే నేనెందుకు కాకూడదు అనుకుంది చిరు సొంత మనిషిలా ఫీలయ్యే ప్రజారాజ్యం నాయకురాలు శోభారాణి.
నాగబాబు అంజన ప్రొడక్షన్స్, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, పవన్ కళ్యాణ్ తన క్రియేటివ్ వర్క్స్ తో పాటుగా రామ్ చరణ్ కూడా నాన్న నూట యాభయ్యో చిత్రానికి తల్లి సురేఖ పేరు మీద బ్యానర్ స్థాపించే పనిలో ఉన్నాడు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా సామాజిక న్యాయం మీద కథను రెడీ చేయించేసి చిరంజీవి ఆశీసులు కూడా పొందిన శోభారాణి రేపో మాపో ఓ స్వీట్ డబ్బా ముందు పెట్టి ఈ సినిమా శుభవార్త మీడియాకి విడుదల చేసే పనిలో ఉందట.
చిరంజీవి నాలుగు స్తంభాలాట అంటూ ఇప్పటికే మీడియా దంచేస్తుంటే ఈ బ్యానర్ కూడా చిరు ఖాతాలోకే వెళితే ఐదో స్థంభం ఎక్కడ పాతేది?
తుపాకి నుంచి సేకరణ
చిరంజీవి నాలుగు స్తంభాలాట అంటూ ఇప్పటికే మీడియా దంచేస్తుంటే ఈ బ్యానర్ కూడా చిరు ఖాతాలోకే వెళితే ఐదో స్థంభం ఎక్కడ పాతేది?
తుపాకి నుంచి సేకరణ