'ఓరి నీ స్పీడు తగలెయ్యా...గిన్నీస్ బుక్కులో ఎక్కుతావ ఏంటి ' అంటూ రవితేజ సినిమాల స్పీడును చుసిన ప్రేక్షకులు గుడ్లు తేలేస్తున్నారు. సినిమా విడుదలను, హిట్టును కూడా ఆస్వాదించకుండా వెనువెంటనే తదుపరి సినిమా షూటింగులోకి దూరిపోయే రవితేజ ఈ ఏడాది కూడా వరసపెట్టి సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు.
వాలకం చూస్తుంటే విజన్ 2020 ప్లాన్ వేసేసి అప్పటి వరకు కాల్షీట్లు ఇచ్చేస్తాడేమో అనిపిస్తుంది.
వీర లెవెల్లో ముస్తాబవుతున్న 'వీర' వెనువెంటనే 'నిప్పు' మొదలు కాబోతుంది అనేది ఓ వార్తయితే ఆ తరువాత వైవీఎస్ చౌదరితో మరో సినిమాకు ఆల్రెడీ డెట్లు ఇచ్చేసాడట. ఇంతలా రవితేజ ఎందుకు తొందర పడుతు న్నాడబ్బా...అంటే ఇప్పటికే నలభై మూడేళ్ళు నిండాయి మరో రెండేళ్ళు పోతే తనని ఎవరూ దేకరు అన్న జీవితసత్యాన్ని ముందే గ్రహించాడు అంటూ కొన్ని వర్గాలు జోకులు పేల్చేస్తున్నాయి. ఇంతకీ ఈ నలభై మూడేళ్ళు ఎన్నేళ్ళ కింది మాటో?
తుపాకి నుంచి సేకరణ
తుపాకి నుంచి సేకరణ