ఒక్క సినిమా చేస్తేనే ఎగిరి గంతేసి మూడు నాలుగు సినిమాలకు నిర్మాతలను సూట్ కేసులో సర్దేసే దర్శకులున్న ఈ ఫాస్ట్ కాలంలో బాలకృష్ణకు 'సింహా,' జూనియర్ ఎన్టీయార్ కు 'బృందావనం'లాంటి రెండు పెద్ద హిట్లిచ్చిన దర్శకులు బోయపాటి శ్రీను, పైడిపల్లి వంశీలకు ఇంకా కాలం కలిసిరానట్టే ఉంది.
సింహా బొమ్మ పడి సంవత్సరం దాటుతున్నా హీరోల వేటలో కథల వేటలో ఉన్న బోయపాటి, అసలు ఉన్నా లేకున్నా పెద్ద తేడా లేదనేలా తయారైన పైడిపల్లి ఇంతవరకు తమ తదుపరి ప్రాజెక్టు ఏదీ అనౌన్స్ చేయకపోవడం దురదృష్టకరం. విజయం వరించిన బాబాయ్ బాలకృష్ణ 'పరమ వీర చక్ర' మొదలెట్టి ఇరగ్గొడితే, అబ్బాయ్ జూనియర్ ఎన్టీయార్ 'శక్తి' చూపడానికి ఇంచుమించుగా రెడీ అయిపోయాడు. వచ్చిన హిట్టుని హీరోలు యూజ్ చేసుకున్నంతగా దర్శకులు క్యాష్ చేసుకోకపోవడం ఫీల్డులో కొత్తేమి కాదంటున్నారు విశ్లేషకులు.
ఇప్పటికైతే బాబాయ్ అబ్బాయ్ కొట్టిన హిట్టు దెబ్బలకు వీరిద్దరూ భస్మం అయిపోయినట్టే.
తుపాకి నుంచి సేకరణ
తుపాకి నుంచి సేకరణ