30, జనవరి 2011, ఆదివారం
మృతి చెందినా..ఆరోగ్యం నయమైందని ఆరోగ్యశ్రీ డాబు
హైదరాబాద్‌లోని ఇండో అమెరికన్ ఆసుపత్రిలో పథకం కింద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోష్ఠ గ్రామానికి చెం దిన నగిరి రాజు(22) గత నెల 29న గొంతు క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇది తమ ఖర్మని సరిపెట్టుకున్న కుటి౦బీకులు సంప్రదాయం ప్రకారం అన్ని తతంగాలు ముగించి ఇప్పుడిప్పుడే మనసు కుదుట చేసుకొంటున్న నేపద్యంలో... ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి మృతుడి కుటుంబానికి ఓ లేఖ అందింది. ఆరోగ్యశ్రీతో రాజు ఆరోగ్యం నయమైందని, ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి లేఖ వచ్చింది. అంతేనా.. ఆ పథకం ఎంతో మందికి లబ్ధి చేకూర్చిందని, ఈ పథకం కిందే రాజు చికిత్స చేయడం తమకెంతో ఆనందంగా ఉందని మరీ రాశారు. ఇది చూసిన కుటుంబానికి నవ్వాలో.. ఏడవాలో అర్థం కాలేదు.