తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆవిర్భవించినట్లు చెప్పుకుంటున్న కోదండరాంరెడ్డి నాయకత్వంలోని రాజకీయ జేఏసీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పుచేతుల్లో రాజకీయ జేఏసీ నడుస్తుందని పలువురు తెలంగాణా వాదులు ఆరోపించారు.
తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 'రాజకీయ జేఏసీ నైతికత - ప్రజాప్రతినిధుల రాజీనామా డిమాండ్'అనేఅంశంపై హైకోర్టు న్యాయవాది కె. చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమా వేశం లో పలువురు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ పప్పులు ఉడకవన్న భయంతో కావాలనే కొన్ని పార్టీలు ఈ అంశాన్ని సాగదీస్తున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు, ప్రస్తుత కేసీఆర్ ఆస్తులెన్నో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోదండరాంరెడ్డి నాయకత్వంలోని రాజకీయ జేఏసీకి సంస్థలు, పార్టీలు, కమిటీల అమోదంతో ఏర్పడనందున నైతికత లేదని అన్నారు.
తెలంగాణ కోసం ఏర్పాటుచేసిన కమిటీకి బీజేపీ లిఖితపూర్వకంగా అభిప్రాయాన్ని వెలిబుచ్చకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.