కేసీఆర్‌తోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకూ ఎన్నికల్లో పోటీకి దిగకుండా సిద్ధమైతే తాను రాజీనామాకు సిద్ధమేనని ప్రజారాజ్యం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను పేటెంట్ హక్కుగా అనుకోవడం సరికాదని , రాజకీయ పార్టీల జెండాలను పట్టుకుని ఉద్యమిస్తే అది కేవలం రాజకీయ పార్టీల ఉద్యమంగానే ఉంటుందని, ఏ ఒక్క రాజకీయ పార్టీ నిర్ణయంతో తెలంగాణ సాధ్యం కాదని, అన్ని పార్టీలు సమష్టి నిర్ణయంతో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.