30, జనవరి 2011, ఆదివారం

మామను మరిపించేసాడు

మామ నాగార్జున, తాత నాగేశ్వర్ రావుల పేరుతో సుమంత్ ఫీల్డులోకి దిగి పదేళ్ళైనా పట్టుమని ఓ పది మంచి సినిమాలు చేయలేకపోయాడు. ఒకవేళ సినిమాలు మంచివైనా ప్రేక్షకులను హాల్లకు రప్పించెంత సీను ఇతగాడికి లేకుండా పోతోంది. మామేమో తాత పాత పాటలను రీమిక్స్ చేసి కొట్టించుకుంటుంటే అల్లుడేమో మామ పాటలను వాడుకుంటున్నాడు.

'ఘరానా బుల్లోడు'లోని 'భీమవరం బుల్లోడా...' హిట్టు పాటను రీమిక్స్ చేసి 'రాజ్' సినిమాలో యూజ్ చేసుకున్న సుమంత్ అక్కడ నాగ్ కేవలం ఆమనితో మాత్రమె డ్యాన్సులు కడితే ఇక్కడ హాట్ హాట్ ప్రియమణి, విమలా రామన్లను చంకలో వేసుకొని మామను మరిపించే జోరులో కన్పిస్తున్నాడు.

తుపాకి నుంచి సేకరణ

కెరీర్ జీవన్మరణ సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే ఇక మాట్లాడడానికి ఏం మిగిలింది.