రాష్ట్రంలో యువనేత జగన్‌ను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ పశ్చిమ గోదావరి జిల్లాకు సోకింది. నర్సింగ్ కళాశాల వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు(టీడీపీ) ఇంటికి మంత్రి పితాని సత్యనారాయణ(కాంగ్రెస్)నేరుగా వెళ్ళి విందారగించి రావడం కొత్త రాజకీయానికి తెరలేపింది.
ప్రస్తుతం జగన్ ప్రభావంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం తగ్గిన నేపథ్యంలో కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రి పితాని, ఎమ్మెల్యే టీవీ రామారావు మధ్య రహస్యంగా మంతనాలు సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది.