30, జనవరి 2011, ఆదివారం

పరిహారం ...ఫలహారంగా .. ఆపై పరిహాసం...

వరదలు, నిషా, జల్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు అందాల్సిన ప రిహారం అనర్హులకు ఫలహారంగా .. పరిహాసంగా మారిం ది. ఆదర్శ రైతులు, గ్రామ స్థా యి అధికారులు, అధికారపార్టీ నేతలు సూచించిన వారికే పరిహారం అందడంతో అర్హులకు రిక్తహస్తం ఎదురయ్యింది. దీంతో నిజంగా నష్టపోయిన రైతులు పరిహారం అందక లబోదిబోమంటున్నారు.

నిషా, లైలా, జల్ తుపాన్ల వల్ల రైతులు తీవ్రంగా న ష్టపోయారు. పంటతో పాటు, పెట్టుబ డి మొత్తం నీటిపాలయ్యింది. ప్రభుత్వం స్పందించి ఇ న్‌పుట్ సబ్సిడీ కింద ఒక్క నంద్యాల వ్యవసాయ సబ్ డివిజన్‌కు 5,035.1 హెక్టార్ల పంట నష్టానికిగాను రూ. 1.97 కోట్ల నష్టపరిహారం మంజూరు చేసింది. అయితే నష్టపరిహా రం మంజూరు నేతల కనుసన్నల్లోనే జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇడమంటే మీకెప్పుడూ ఇచేసమనే అధికారుల మాతతీరీ నివ్వెర పరుస్తోంది.