వేటూరి సాహితీపీఠం అవార్డును సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణికి అందుకున్నారు. శనివారం తుని వాసవీ కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపంలో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం లో తొలి అవార్డును తనికెళ్ళ భరణిని ఎంపిక చేసి సత్కరించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ కులానికి శ్రీనాథుడు , మసక మసక చీకటిలో, గసగసాల కౌగిలి అంటూ ఇద్దరు ప్రేమికులను సంగం సగం అంటూ పదాలను తిరగేసి గస గసాలుగా పలికించిన గొప్ప సినీకవి వేటూరి అని అన్నారు. సినీ సాహితీలోకం లో తనదైనశైలిలో రాతలు రాసి నావపై వెళ్ళిపోయిన వేటూరి అదృష్టశాలని ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.