15, నవంబర్ 2011, మంగళవారం

రెండంచుల కత్తి 498 ఎ

పెళ్లికి ముందే 498(ఎ) చట్టంపై అవగాహన చేసుకునేలా యువత సిద్దమౌతుంటే...
అసలు ఈ చట్టం అనేక పర్యాయాలు దుర్వినియోగమవుతోందని...
సాక్షాత్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సందర్భాలు అనేకం....
ఈ నేపథ్యంలో 498(ఎ) చట్టంపై అవగాహన, పర్యవసానాలు, చట్టం తొలగించకుండానే...
నిజమైన బాధితులు ఉపయోగించుకునే మార్గాలను వివరించడానికి..
అకారణంగా బాధలు పడుతున్న వారి ఉపశమనానికి 'ఆంధ్రప్రభ' చేసిన ప్రయత్నమిది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న గత సామెతని తిరగరాస్తూ...ఒక్క ఫిర్యాదుతో ఆరేడు కుటుంబాలు కూల్చు అన్న తరహాలో కొత్త సామెతని రాసుకోవాల్సి న పరిస్దితి దాపురించింది. ఇందుకు మన కుటుంబ వ్యవస్థ ను శాసిస్తున్న 498(ఎ) చట్టమే ఓ ఉదాహరణ. నాణన్ని పైకి ఎగిరేస్తిే సమాన ఫలితం ఎలా ఉండదో.. అలాంటి ఫలి తాలనే 498(ఎ) ఇస్తోందన్నది అన్ని వర్గాల ఆవేదన. కట్నం కోసం హింసిస్తున్నారంటూ భార్య లేదా కోడలు పెట్టే 498(ఎ) కేసు కేవలం ఆమె భర్త, అతని తల్లిదండ్రులకే పరిమితం కాక దగ్గరి బంధువుల కుటుంబాలలోనూ చిచ్చు పెడుతొందన్న ఆరోపణలు బోలె డు వినిపిస్తున్నాయి. వాస్తవాలు తెలుసు కోకుండా అరెస్టులు జరుగుతుం డటం తో ఒక్క 498(ఎ) ఆరేడు కుటుంబాలను కుప్పకూలుస్తోంది. భర్త, అత్తమామలు, ఆడపడుచులు 'తన దారికి' రావాలంటే.. ఇదే అస్త్రంగా భావించే భార్యల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించేదే. ఇది యువ తుల్లో చట్టంపై వచ్చిన అవగాహనా? లేక మరేదైనా పేరుపెట్టాలో అర్ధం కావటం లేదు.
చట్టం ఏం చెబుతోందంటే...
1983లో పార్లమెంట్‌ ఆమోదించిన ఈ 498(ఎ) చట్ట్టం వల్ల ఓ స్త్రీని అకారణంగా అవమానపరిచినా... శారీరకంగా, మానసికంగా హింసకుగురైనా... అదనపు కట్నం కోసం భర్త లేదా అతని బంధువు లు బాధిస్తే అండగా ఉండి, తప్పు చేసిన వారికి మూడు నుంచి ఏడేళ్ళ జైలుశిక్షతో పాటు పరిహారం సైతం చెల్లించేలా చూడాలని నిర్దే శిస్తుంది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వ్యక్తులకు తమ వాదన లు వెంటనే వివరించే హక్కుగానీ, బెయిల్‌ గానీ దొరకదు. దీంతో ఓ కుటుంబమంతా అరెస్టు కావటం తప్పదనే చెప్పాలి. కాగా ఈ చట్టం కింద నమోదైన కేసులో చాలా వరకు అక్రమంగా పెట్టినవేనని తేల టం... దురదృష్టకరం. ఈ కేసులన్ని చివరకి విడాకులకే దారి తీయటం ఆందోళ న కలిగించే అంశమే. క్షణికావేశంలో ఓ భార్యమణి తీసుకునే నిర్ణయంతో ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయి నా ఆ ఇంటి అల్లుళ్లపైన పడి వారి కాపురాల్లోనూ చిచ్చు రేపుతుండటంతో విడాకులిస్తున్న అల్లుళ్ల సంఖ్యా పెరుగుతోందంటే,పరిస్థితి తీవ్రత అర్థ మవుతోంది.
ఫిర్యాదు, అరెస్టు :
కట్నం కోసం తనని వేధిస్తున్నారని భార్య లేదా కోడలు పోలీస్‌ స్టేషన్‌లో 498(ఎ) కింద ఫిర్యాదు ఇస్తే నిజమా, కాదా అని పరిశీలించకుండా బెయిల్‌ లేని కేసుగా పరిగణించి భర్త, వృద్ధ తల్లి దండ్రులతో పాటు కేసులో పేర్కొ న్న వారందరినీ అరెస్టు చేస్తా రు. దీంతో తాము నేరం చేయలేదని నిరూపించుకునే బాధ్యత ఆ కుటుంబానిదే. పైగా భార్య లేదా కోడలు తర ఫు బంధువులు కూడా ఆమె తరపున పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవచ్చని చట్టంలో పేర్కొనడంతో సమస్య మరింత జటిలమవుతోందన్న ఆరోపణలున్నాయి. కొత్తగా భార్యా భర్తల పరస్పర అవగాహనకి రాలేక... అభిప్రాయ బేధాలతో తమ మాటే నెగ్గాలన్న పంతాల కు పోయి కొందరు 498(ఎ)ను వినియో గించుకుంట తమ ఆడపిల్ల అత్తవారింట కష్టాలు పడుతోందన్న భావనతో తల్లిదండ్రులో ఆమె తర పు బంధువులో 498(ఎ) కింద కేసులు పెడుతున్నారన్న ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి.
పెద్దమొత్తం డిమాండ్‌
ఆలూమగలు మధ్య వచ్చే తేడాల ను చక్క బెట్టాల్సిన భార్య/కోడలు బంధువులు తమ మాట వినకుంటే ... 498 (ఎ) చట్టం కింద కేసు నమో దు చేస్తామని 'బ్లాక్‌ మెయిల్‌'కు పాల్పడుతున్నారని, కోర్టు బయట పరి ష్కారం పేరుతో పెద్దమొత్తంలో డిమాండ్‌ చేస్తున్నా రన్నది ఆరోపణ. బెయిల్‌ పొందే అవకాశం లేక పోవ టంతో తాము తప్పు చేయకున్నా, వివాహం కాని తోబుట్టువుల భవిష్యత్‌, వృద్ధ తల్లి దండ్రులు, ఇతర బంధువుల కోసం కుటుంబ పరువు వీధి పాలు కాకుండా ఉండేం దుకే తప్పని పరిస్ధితిలో డబ్బు ఇచ్చి రాజీ పడు తున్నామనే వారి సంఖ్య పెరుగుతోంది. ఎన్నారై సంబంధాలలో అయితే కోట్లు చేతులు మారుతున్నాయన్న విమర్శ లేకపోలేదు.
భార్య తరపు వారి వేధింపులు ఈ రకంగా ఉంటే... మరో వైపు పోలీ సులూ ఎక్కువేనని... దీనివల్ల ఆత్మహత్య చేస్కున్న వారూ ఉన్నారన్నది జగమెరిగిన సత్య మన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా 498 (ఎ) చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగాఉన్నా.. నిందితు లు తప్పు చేశా రని రుజువైనవి రెండు శాతం మాత్రమే.
సెక్షన్‌ 498(ఎ) సమస్యకు పరిష్కారమా?
భార్యభర్తల తగాదాని సివిల్‌ కేసు కాగా ఇక్కడ క్రిమినల్‌ కేసుగా పరి గణించడం, పైగా ఇది నాన్‌ బెయిలబుల్‌ కేసు కావడం, విచారించ కుండానే అరెస్టు చేయటం అసలు సమస్యకు ఆజ్యం పోసి నట్లు అవు తోంది. దీనికి తోడుగర్భిణీ స్త్రీలు, బాలలు కేసులో ఇరుక్కుంటే ఆపై పరిణామాలు ఎలా ఉన్నా ముం దు అరెస్టే. ఈ కేసులో నిందితు లని.. నిరూపితం కాకమునుపే 'దోషి'గాపేర్కొంటం విడ్డూరం.
కట్న కానుకలూ నేరాలేగా....
వివాహసమయంలో నగదు, వస్తు తదితర రూపాల్లో భారీగా 'కట్నం' ఇచ్చుకోవటం జరిగే తంతే.. కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే అని పరిగణించడం లేదో ఏ ఒక్కరికీ అర్ధం కాదు. వృద్ధ తల్లి దండ్రులు, బంధువులు సమస్యలెదుర్కో కూడదనే భావనతో సర్దుకుపోయిన వారున్నా...498 (ఎ) కేసులో ఉన్న భర్త, భార్య తిరిగి కల్సి జీవించిన సందర్భాలు అరుదే. వివిధ కారణాలతో భర్తకి దూరమవ్వా లనుకునే భార్యలకి పాశుపతాస్త్రంలా దొరిందన్న అపవాదును ఈ చట్ట ం ఎదుర్కొంటోం దన్నది వాస్తవం.
ముందు జాగ్రత్తలు
498(ఎ) ఎదుర్కోక తప్పదనిపిస్తే మీ తల్లిదండ్రులని ఈ కేసుకి దూరం చేసేందుకు.. మీతో ఎలాంటి సంబంధం లేదని మీకే నోటీసు నిప్పించండి. 498(ఎ) కేసు లో మీ లాయర్‌ ను బెయిల్‌కి ప్రయత్నించమనండి. లభించని పక్షంలో నేరుగా కోర్టులో సరెండరవ్వండి. మీకు దూరంగా ఉంటు న్న మీ భార్య ఓ వేళ మీపై కేసు నమోదు చేస్తే పోలీసుల దృష్టికి తీసుకువచ్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకుండా చూస్కోండి. మీ భార్యను రమ్మంటూ లాయర్‌ నోటీసు పంపి ఆపై విడాకులకు నోటీసివ్వడం మంచిది.
ఎదురొస్తున్న కొత్త తరహా సంప్రదాయం..
వివాహ పటిష్టత ఆర్థిక భవితపై ఆధారపడి పోవటంతోకట్న కాను కలు తెరవెనుకెన్ని అందుకున్నా ఎలాంటి కట్నం ఇచ్చి పుచ్చుకోలె దని,'రాయించుకునే కొత్త సంప్రదాయం ప్రారంభమవ్వటం చూస్తుం టే వ్యవస్ధపై ఎంత నమ్మకం పోతోందో అర్ధం చేసుకోవచ్చు.
పెళ్లయ్యాక ఇలా చేయండి... సాంప్రదాయబద్ధంగా మీ పెళ్లి జరి గినా దానిని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోండి, కట్నం ఇచ్చి పుచ్చు కోలేదని రిజిస్ట్రార్‌ సమక్షంలో సంతకం చేసినా మీకొచ్చిన బహు మతులని నమోదు చేయించుకొంటే మంచిది.
క్రిమినల్‌ లాయర్‌ను
సంప్రదించాలి :
ఈ కేసు క్రిమినల్‌ 'లా'కు సంబం ధించింది. మధ్యవర్తుల్ని సలహాలకే పరిమితం చేసి.. ఆ తరహా కేసులు చూసే క్రిమినల్‌ లాయర్‌ని సంప్రదిస్తే తగిన రక్షణ దొరుకుతుంది.. మీ నుండి తప్పు జరగలేదను కుంటే మీ నడుమసాగిన ఉత్తర ప్రత్యు త్తరాలు, ఫోటోలు, వీడియో తదితర సాక్ష్యాలను రక్షించు కోంటూ రాష్ట్ర డిజిపికి, మహిళా కమీషన్‌ తదితరులకు దాని కాపీలు పంపితే ఆర్బిటరీ అరెస్టు నుంచి రక్షించవచ్చు.
పోలీసులతో ఎలా ...
మాపై 498(ఎ) నమోదైతే పోలీసులు ఉదయాన్నే హడావుడి చేస్తూ కలవరానికి గురిచేస్తారు. రాకుంటే అరెస్టు తప్పదనే దానర్ధం. సం యమనం పాటిస్తూ.. విలువైనవస్తువులు, ఆభరణాలని తీసేసి, మీకు కావాల్సిన మందుల్ని, ఫోన్‌ నంబర్లు రాసుకొనేందుకు పుస్త కం పెన్నుని తీస్కొని వెళ్ల్లండి.. పోలీసులు అమర్యాదగా ప్రవరిస్తే రహస్యంగా ఫోటోలో, వీడియోనో మాటలను రికార్డు చేస్తే మంచిది.
కుటుంబ వ్యవస్థను నాశనం చేయ్యెద్దు
ఒకరిద్దరు పిల్లలు కలిగిన తర్వాత అభి ప్రాయ భేదాలు వచ్చి భార్య 498(ఎ) కేసు నమోదు చేయడం. పట్టుదలలు పెరిగి విడాకుల దాకా వెళ్ళడంతో పిల్లలు తండ్రి లేదా తల్లి దగ్గర ఉండా ల్సి వస్తోంది. భార్యాభర్తలిరువురూ ఆ పసి మనసుకు అయ్యే గాయం లెక్కలోకి తీసుకోకపోవడం విచారకరం.
మరో వివాహం చేసుకుంటే తప్పేంటనే వాదించే మహిళలకి అప్పటికి సంతృప్తి కలిగినా మాజీ భర్తవల్ల కలిగిన పిల్లలు, తాజా భర్తతో సంసారం పొసగక సమస్యలు పుట్టుకొచ్చి క్షణికా వేశంలో మీరు తీసుకునే నిర్ణయాల ఫలితం అనుభవించాల్సి రావచ్చు.
498(ఎ) చట్టం సద్వినియోగం కానంత కాలం సమాజానికి చెడునే చేస్తుందనడంలో సందేహం లేదు.


ప్రాధమిక విచారణ జరగాల్సిందే...
498ఏ కేసులో ఏమాత్రం పొరపాట్లు జరిగిన ఓ నిండు కుటుంబం పరువు బజార్న పడుతుంది. ఈ కేసు బుక్‌ చేసిన ప్పుడు వాస్తవాల కోసం పోలీసు ఉన్నతాధికారితో దర్యాప్తు చేసి విచారించాలి లేకుంటే కుటుంబమే ఛిన్నాభిన్నం కావటం ఖాయం.. నిర్ధోషుల జీవితాలు బలవుతాయి.
- జి. ప్రభాకర్‌, హైదరాబాద్‌



భర్తలో మార్పు కోసమే ఫిర్యాదు
ఏళ్ల తరబడి కాపురాలు చేసి వయసొచ్చిన పిల్లలున్నవారు కూడా ఈ చట్టం కింద కేసులు పెడు తున్న సందర్బాలునాకు తెల్సు. వ్యసనాలకు బానిసలైన భర్తల్ని మార్చుకునేందుకు తప్పని స్ధితిలో కొంద రు ఈ చట్టాన్ని వాడుకుంటున్నారు. దీన్ని దుర్వి నియోగం అనలేం కదా?
- శ్రీమతి జి. నీరజా కుమారి, టీచర్‌.

తప్పుడు ఫిర్యాదులకు పెనాల్టీ
498 (ఎ) కింద నమోదైన కేసుల్లో రుజువైనవి చాలా తక్కువ.. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తు.. కోర్టుల సమయాన్ని వృధా చేస్తున్న వారి విషయంలో అప్రమత్తతగా ఉండాలి. తప్పుడు కేసని తేలితే... ఫిర్యాదుదారు నుండి తగిన పెనాల్టీ విధించి వసూలు చేస్తే కొంత మంచిది. - శ్రీమతి తాతా పద్మావతి, గృహిణి.



చట్టంలో మార్పులు అవసరమే..
గృహ హింసని క్రిిమినల్‌ కేసుగా భార్య నమోదు చేస్తే... భర్త విడాకులంటూ కుటుంబ కోర్టుకెక్కుతూ.. వివాహవ్యవస్ధని ఛిన్నా భిన్నం చేసుకుంటున్నారన్నది నిజం. చట్టం దుర్వినియోగంపై ఇప్ప టికే సుప్రీం కోర్టు ఆవేదన చెందుతోంది. దీనిలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉంది.
- ఎం.గౌరీపతి శాస్త్రి, న్యాయవాది


ఫిర్యాదుకు ముందు కౌన్సిలింగ్‌
భార్యాభర్తల మధ్య పొరపొచ్ఛాలు ఆర్ధిక బంధాలుగా మారి పోతుండటం, తప్పుడు సమాచారాలను వినటం వల్ల అవి మరింత ముదిరి 498 (ఏ) మీదుగా చివరకి విడాకులకు దారి తీస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో కొందరి దంపతుల మధ్య కౌన్సిలింగ్‌ నిర్వహించాక వారి కాపురాలు నిలబెట్టుకున్న వారూ ఉన్నారు.
-పి.నాగభూషణం, కుటుంబ సలహా కేంద్ర నిర్వాహకులు.