15, నవంబర్ 2011, మంగళవారం

గోసంరక్షణలో జస్రాజ్‌


హైదరాబాద్‌లోని జస్రాజ్‌ చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ ప్రాక్టీస్‌కు స్వస్థి చెప్పి తన పూర్తి సమయాన్ని గోసంరక్షణకూ, జంతు సంరక్షణకూ కేటాయించారు. గుజరాత్‌లో గోవధ నిషేధ చట్ట రచనలో ప్రముఖ పాత్ర పోషించిన ఈయన కర్ణాటకలో కూడా గోవధ నిషేధానికి చట్టాన్ని రూపొందించారు. అయితే దీనికి రాష్ట్రపతి అనుమతి లభ్యం కావాల్సి ఉంది.
21 సంవత్సరాలుగా 12,000 గోవులను వధ నుండి తన టీమ్‌తో కాపాడగలిగిన జస్రాజ్‌ జంతు సంరక్షణ కోసం జంతు ప్రియుల తరపున సుప్రీం కోర్ట్‌లో వాదిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ ప్రాణిమిత్ర సంఘ్‌, అధ్యక్షులుగా, యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌లో సభ్యులు.గా వ్యవహరి స్తున్న ఈయన కేవలం గోవులే కాకుండా పావురాలను, పాములు, నెమళ్లు, లేళ్లు, ఎలుగు బంట్లు, తాబేళ్ల సంరక్షణ కోసం కృషి చేస్తు... ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడెమీ, జైన్‌ సంఘాలు, ప్రభుత్వేతర సంస్థ లలో జంతు సంరక్షణ, చట్టాల గూర్చి అవగాహనను కలుగ జేస్తున్నారు.