15, నవంబర్ 2011, మంగళవారం

“ముత్యం”ముచ్చట్లు

ముత్యం అన్న పేరే స్వచ్ఛతకి మారు పేరు. అసలా పేరు లేకుండా మన భారతీయ సాంప్రదాయంలో...
పెళ్లిళ్లు, పేరంటాలు సాగవు, భద్రాచల రామయ్య, శ్రీశైల మల్లన్న, తిరుపతి వెంకన్న ఇలా...
ఏ దేవుళ్ల వేడుకుల లోనైనా ముత్యాలు లేకుండా ఆ కార్యక్రమాలని ఊహించుకోగలమా
అంతెందుకు మన పెళ్లిళ్లలోనే, ముత్యాల మండపం, ముత్యాల తలంబ్రాలు, ముత్యాల పల్లకీలు...
తెలుగింటి మగువలు వేసే అందమైన ముగ్గులకి ముత్యాల ముగ్గులంటూ సాంప్రదాయబధ్దంగా...
మన పెద్దలు ముత్యాలకే పెద్దపీట వేయగా దాన్నే తరతరాలుగా కొనసాగిస్తున్నామంటే....
మన భారతీయ సమాజంలో ముత్యాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఒకపðడు ఖరీదైన ఆభరణాల సరసన నిల బడి... ధీటుగా చూస్తున్న ముత్యాలు నేడు నకిలీ ల బారిన పడి విలవిల బోతున్నాయని చెప్పక తప్పదు. ఏది ఏమైనా అతివలకు అందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో 'ముత్యాలు' ప్రధాన భూమిక పోషిస్తున్నాయనే చెప్పాలి.
నేటి ఆధునిక ప్రపంచంలో మారుతున్న ఫ్యాషన్‌కి తగ్గట్టు 'ముత్యం' కూడా తన పంధాని మార్చుకుని ఎవరికి కావాల్సిన విధంగా వారి ఆభరణాలలో ఒదిగిపోతూ ఎప్పటికపðడు సరికొత్త అందాలకు కారణమవుతూ వస్తోంది. నిరాడంబరతనే కాదు, అంతకు మించిన దర్పాన్ని, స్వచ్ఛత నీ, సౌకుమార్యాన్ని ఏక కాలంలో ప్రతిబంబించే ముత్యం నాటి మహారాజులనే నేడు సామాన్యుడి ఇంట కూడా చిరు నవ్వులు చిందిస్తోందంటే అతిశయోక్తి కాదేవెూ ఎంతటి అద్భుత సౌందర్య రాశి అయినా మెడలో చిన్నపాటి ముత్యాల హారం ఉందంటే ఆ సౌందర్యం అజరామరమే అవుతుంది. అందుకనేవెూ అతివల అందాన్నే కాదు వారి మనసుల్ని కూడా ముత్యమంత స్వచ్చతతో ఉన్న వారని పోలుస్తుంటారు.
నిత్య జీవనంలో మనిషి వినియోగించే అనేక రకాల అలంక రణలలో నవరత్నాలకో ప్రత్యేక స్ధానం ఉంది. అందులో ఎని మిది రత్నాలు మన భూభాగంలోనే దొరికేవయితే ముత్యం మాత్రం సముద్రంలో దొరికేది కావటం విశేషం.
సహజ ముత్యం ఎలా తయారవుతుందంటే....
ఆల్చిప్పలలో స్వాతి చినుకులు పడితే ముత్యంగా మారుతుందని మన కవులు చాలా అందంగా ప్రకృతి పరవశింప చేసాలా రాసినా... వాస్తవానికి సముద్రంలో నివసించే మెలస్కస్‌ జీవులు విడు దల చేసే కర్బన పదార్ధాల ద్వారా స్వఛ్ఛమైన ముత్యాలు ఏర్పడతా యి. ధృడ కవచాన్ని కలిగిన ఈ జీవుల్లోకి పరాన్న జీవులు కాని, ఇసుక రేణువుల కానీ ప్రవేశిస్తే... వాటిని బయటకు పంపే ప్రయ త్నంలో తన చుట్టూ ఉన్న ఆర్గో నైట్‌ కరంకియోలిస్‌ అనే కర్బన పదా ర్ధాన్ని విడుదల చేస్తుంది. దీనేనే 'నాక్రే' (మదర్‌ ఆఫ్‌ పెరల్‌) అని పిలు స్తారు. మెలస్కస్‌లో ప్రవేశించిన జీవుల ఆకారం, సైజుల ఆధారంగానే ముత్యాల పరిణామాలుంటాయి. ఇవి ఇసుక రేణు వు స్ధాయి నుండి సుమారు 500 క్యారెట్ల బరువున్న గుండు ఆకా రం వరకూ కూడా తయారవుతుంటాయి.
ప్రపంచంలోనే మేలిముత్యాలు దొరికే ప్రాంతాలుగా హిందూ, అరేబియా సముద్ర ప్రాంతాలని పేర్కొంటారు. ఇప్పటికి ఈ సముద్ర గర్భం నుండి ముత్యాల ఉత్పత్తి కొనసాగుతుండగా.. ఎర్రసముద్రంలో దొరికే నల్లని ముత్యాలు ప్రపంచ దృష్టిని ఆక ర్షించినా.. అక్కడి కాలుష్యం వాటిపై కాటేసి... చాలా వరకు నల్ల ముత్యాల ఉత్పత్తి తగ్గిపోయిందనే చెప్పాలి.
ఇక ముత్యాల పరిశ్రమకు ఒకపðడు మారు పేరుగా నిలచిన ఇరాకలోేని బస్రా నేడు విలవిలబోతోంది. అక్కడి సముద్ర జలాల లో దొరికే సహజ ముత్యాలు ప్రపంచ వ్యాప్తంగా టన్నుల కొలది సరఫరా చేసినా... అక్కడ ఉండే చమురు నిక్షేపాలపౖౖెనే ప్రభుత్వా లు ఎక్కువ మక్కువ చూపడం, ఈ కారణంగానే సముద్ర జలాలు పూర్తిగా కలుషితమై బస్రా ముత్యాల పరిశ్రమని దెబ్బతీసింది. అడపా దడపా బస్రా నుండి స్తున్న ముత్యాలకు ప్రపంచ వ్యాప్తం గా నేటికీ మంచి గిరాకీ ఉండి లక్షల్లో ధర పలుకుతోంది.
ఇక మంచి ముత్యాలలో హంస, కుడుకల్‌, నూరి, సూర్తి ఇలా పలు పేర్లతో పిలిచే ముత్యాలు ఉన్నాయి. ఇవన్ని వేటికవే తమ ప్రత్యేకతని నిలుపుకున్నవి కావటం విశేషం.
'కల్చర్డ్‌ పెరల్స్‌' :
ముత్యాల వాడకం పెరిగాక తొలినాళ్లలో వాటి ఖరీదు ఎక్కువగా ఉన్న సమ యంలో మత్యాలేర్పడే తీరు తెన్నులపై పరిశోదనలు చేసిన శాస్త్రవేత్తలు ముత్యాల తయారికి అనువైన రసా యనం కాల్షియం కార్బనేట్‌గా నిర్ధారించి సాధారణ ముత్యపు చిప్పలలోకి దాన్ని ప్రవేశ పెట్టి ముత్యాలను తయారు చేయటంలో సక్సస్‌ అయ్యారు. ఇందుకు ఆద్యుడిగా జపాన్‌కి చెందిన శాస్త్రవేత్త మికామెతో కోకిచినే చెపðకోవాలి. దాదాపు 17 ఏళ్ల పాటు చేసిన అనేక ప్రయోగాల ఫలితంగా 1890 ప్రాంతంలో ముత్యాలని సృష్టించి సమస్త మానవాళి నీ ఆశ్చర్య చకితుల్ని చేసాడు. అయితే అప్పటికి సహజసిద్దంగా ముత్యాలు వెల్లువలా వస్తుం డటంతో నాటి సమాజం పెద్ద గా పట్టించుకోక పోయినా... 1940 తరువాత ఈయన రూపొందించిన తరహాలో తయార వుతున్న ముత్యాలనే మనం 'కల్చర్డ్‌ పెరల్స్‌'గా పిలుస్త్తున్నాం.
సహజ సిద్దంగానే తయ్యారయ్యే ముత్యాలు తరహాలోనే వీటిని కృత్రిమంగా ముత్యాలను తయారవుతున్న కల్చర్డ్‌ పెరల్స్‌ నేడు యావత్‌ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. దీంతో ఓ పరిశ్రమగా ఈ ముత్యాల తయారీ కొనసాగుతోందనే చెప్పాలి.
ఈ కల్చర్డ్‌ పెరల్స్‌లో పెప్సీ, డ్రాష్‌, బివాకో, రైస్‌ ,సిడ్‌, బడ్‌, బటన్‌ ఇలా ఎన్నో రకాలున్నాయి. వీటిలో మార్కెట్‌లో ప్రస్తుతం డిమాండ్‌ ఎక్కువగా ఉన్నది రైస్‌ పేరుతో పిలవబడే ముత్యాలకే.
సెమీ 'కల్చర్డ్‌ పెరల్స్‌' :
పూర్తిగా యంత్రాల సాయంలో ప్లాస్టిక పూసల రూప కల్పన చేసినట్లే ఈ ముత్యపు ఆకారాలను తయారు చేసి, వాటిపై కర్బన పూత పూస్తారు. ఇవి దాదాపు మంచి ముత్యాలను పోలి ఉండ టంతో... వీటి రంగ ప్రవేశం తరువాత ఏది నకిలీ, ఏది మంచి దని తెలుసుకోవటం కోసం ఖచ్చితంగా నిపుణులను ఆశ్రయించ క తప్పదు. అనేక రంగుల్లో కనిపిస్తుంటాయి.
మాజోర్కా ముత్యాల పేరుతో మార్కెట్‌లో లభ్యమయ్యే ముత్యాలు ఇలా తయారైనవేనని నిపుణులు చెప్తుంటారు. ప్రజల్ని ఆకర్షించేందుకు వీటికి సెమీ 'కల్చర్డ్‌ పెరల్స్‌' అని పిలవటం మరో విశేషం.
ఎలాంటి ముత్యాలు కొనాలి...
వెన్నెల విరిసేంత తెల్లదనంతో ధృఢంగా, మందంగా ఉండే ముత్యాలు శ్రేష్టమైనవని, ఎలాంటి రంధ్రాలు , గీతలు లేని ముత్యాలు కొనడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. అలాగే గులాబి, కాస్త నలుపు దనాన్ని కలిగి ఉండి ధవళ కాంతులు వెదజల్లే ముత్యాలు మంచివని, అయితే గోధుమ వర్ణం, పసుపు రంగుల్లో ఉన్నవి మంచి ముత్యా లంటూ అంటగట్టే ప్రయ త్నం ఎంతపేరున్న షాపు లోచేసినా కొనకపోవటం మంచిదని ఇవి చాలా తక్కువ నాణ్యత కలిగిన వని, వాతావరణ ప్రభా వంతో ముత్యాలు రంగు మరేతత్వం ఉండ టంతో మీరు వెూసపోయే ప్రమా దం ఉంది. ఎంతటి ఖరీ దైన ముత్యమైన దాని జీవన కాలం 100 నుండి 150 ఏళ్లు మాత్రమేనని.. ఆ తరువాత అవి రంగు మారిపోవటం ఖాయమని చెప్తున్నారు నిపుణులు.
మత్యాల నగరం మనదే...
ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌ ముత్యాలకు పెట్టింది పేరుగా నిలిచిందనే చెప్పాలి. హైదరాబాద్‌లో నాణ్యమైన ముత్యాలకు పెట్టింది పేరుగా నిలిపేందుకు అప్పటి ఆరవ నిజాం ప్రభువు మహబూబ్‌ ఆలీఖాన్‌ ఎంత గానో కృషి చేసాడు ముత్యాలంటే అమితంగా ఇష్ట పడి దాదాపు తాను చేయించు కునే ప్రతి నగలోనూ ముత్యాలకు స్ధానం కలిపించిన ఆలీఖాన్‌ హర్యానాలోని నగల వర్తకుడైన రాందత్‌మలేజీని హైదరాబాద్‌ రప్పించుకునేవారని.. ఆ క్రమంలోనే ఆలీఖాన్‌ ప్రోద్భలంతో ఆయన కుమారుడైన కేదారీనాధ్‌ 1908లో ఛార్మినార్‌ దగ్గర లోని ఫత్తమట్టి ప్రాంతంలో ముత్యాల కోసం ప్రత్యేకంగా ఓ అంగడిని తెరిచి వ్యాపారం ప్రారంభించినట్ల్లు చెప్తారు. ఇలా భారత దేశంలోనే తొలిసారిగా ముత్యాల కోసం ప్రత్యేకంగా ఓ షాపు మన హైదరాబాద్‌లో నే ప్రారంభం కావటం గమ నార్హం. ఆపై అనేక మంది ఇక్కడ ముత్యాల వ్యాపారాలు ప్రారంభించడంతో హైదరాబా ద్‌ ముత్యాలకు ప్రత్యేక పేరే వచ్చింది.
చిన్న చూపు చూడొద్దు..
చాలా మంది ముత్యాలే కదా అని చిన్న చూపు చూస్తూ... ఇష్టానుసారం వాడి ఎక్కడ పడితే అక్కడ పడే స్తుంటారు. దీంతో అవి తమ సహజ రంగుల్ని కోల్పోయి గోధుమవర్ణంలో మారిపోతుంటే... మనం వెూసపోయా మని భావిస్తుంటారు. అయితే ముత్యాలు సహజ సిద్దంగా ఏర్పడినవి. ఇవి వేడిని తట్టుకోలేవు, అందుకే వీటిని ఏదైనా సాయంత్రం పూట జరిగే ఫంక్షన్లకి వేసుకు వెళ్లండి. ముఖ్యం గా ఇళ్లలో ఉండేపðడు వంట చేసేపðడు, అందునా వేసవిలో ధరించకుండా ఉండటమే మంచిది.వేడి తగిలితే అవి తమ రంగుని కోల్పోతాయన్న విషయం గుర్తెరగండి.
అలాగే భధ్రపరిచేపðడు ఎలా పడితే అలా ముత్యాలు పడేయకండి. అలాగే పూర్తి పొడిగా ఉండే వాతావరణం కూడా ముత్యాలకు పడదు. ఈ వాతావరణంలో అవి పగుళ్లకు నోచుకునే ప్రమాదం ఉంది. దీని వల్ల అవి గీతలు పడివాతావరణ ప్రభావానికి తొందరగా లోన య్యే అవకాశం ఉందన్న విషయాన్ని పరిగణలోకి తీసు కుంటే మంచిది.


పరమత సహనానికి ప్రతీక ముత్యం
గోల్కొండని పాలించే నవాబులు తానీషా కాలంలోనే భద్రాచల రాముడి కళ్యాణానికి శ్రీరామ నవమి నాడు ముత్యాలను తలంబ్రాలుగా పంపేవారు... అంటే ముత్యాలకున్న ప్రాధాన్యతనే కాదు... నాటి నవాబుల కాలం నుండే హైదరాబాద్‌ పరమత సహనానికి ప్రతీకగా నిలిచిందనే చెపðకోక తప్పదు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తోంది.
ముత్యాలు ఎలా భద్రపరచు కోవాలి..
ముత్యాల నగలు మీ అవసరం పూర్తయ్యాక మెత్తని బట్టలో కాసింత ఆలివ్‌ ఆయిల్‌ని వేసి ముత్యాలని జాగ్రత్తగా తుడిచి, ముఖ్‌ మాల్‌ బట్టతో ప్యాక చేసి దాచుకొంటే నిత్యం తళ తళ మెరుస్తుంటాయి.నిత్యం బీరువాలలో ఉంచేస్త్తే మీరు బట్టల సువా సన కోసం వేసే అనేక కెమికల్‌ బాల్స్‌ వాసనకి కూడా రంగు మారిపోతుంది. కనుక అడపా దడపా బైటకి తీసి వాడండి.
ముత్యాల నైపుణ్యం మనోళ్ల సొంతం
అలాగే ఎంత చిన్నని ముత్యానికైనా రంధ్రాలు చేయగల నైపుణ్యత హైదరాబాదీలకే సొంతం అనటంలో సందేహం లేదు. అందుకే ప్రపంచంలో పలు దేశాల నుండి ముత్యాలు ఇక్కడకి కేవలం రంధ్రాలు చేయటా నికే వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. పెరల్‌ సిటీగా పేరున్న మన హైదరాబాద్‌లో ఆమధ్య ముత్యాల వ్యాపారం కాసింత మందగించినా... నేడు సామాన్యులకే కాదు యువతకి కూడా క్రేజీ ఆర్న్‌మెంట్‌ అయింది.