- ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కడ చూసినా...
- చిన్న చిన్న బల్బులు అద్భుత కాంతినిస్తూ ..
- ఇంత కాంతి నిచ్చే ఈ బల్బుమరెంత ఎంత బిల్లు...
- చేతికి తెప్పిస్తుందోననే భయం చాలా మందిలో ఉంది.
కం పాక్ట్ ఫ్లోరోసెంట్ లాంప్ అనబడే సిఎఫ్‌ఎల్ బల్బ్ మొదటగా మార్కెట్‌లోకి వచ్చినా ఎందుకో జనాల ఆదరణకు నోచుకోలేక పోయిందనే చెప్పాలి. కారణం వాటి ఖరీదు ఎక్కువ కావటమే కావచ్చు. అయితే ఇప్పుడు రెండు పుల్లల్లాగా అటాచబుల్ సిఎఫ్ ఎల్, దానికే ఉండే కాపర్ వైండింగ్ గల మాగ్నటిక్ బలాస్ట్‌తో మార్కెట్‌లోకి రావడం... అదీ చాలా చవకగా కూడా లభిస్తుం డటంతో పాటు వోల్టే జ్ హేచ్చు తగ్గులని తట్టుకుని నిలబడుతుం డటం తో సాధారణంగా మనకి ఇళ్లలో కనిపించే బల్బ్‌ల ఉనికి క్రమేపీ కోల్పోయేలా చేసిందనే చెప్పాలి.
అయితే నేటికీ గృహ అవసరాలకు వాడే విద్యుత్ తగ్గించుకోవాలని భావించే వారికి సిఎఫ్‌ఎల్ బల్బ్‌ల పట్ల్ల ఎన్నో అనుమానాలున్నా యి. వాటి నాణ్యత పైనా వస్తున్న ఆరోపణలని నివృత్తి చేస్తూ... వాటిని నివృత్తి చేసేకోణమిది.
ఒకప్పుడు సిఎఫ్‌ఎల్ బల్బ్స్ వచ్చిన తొలినాళ్లలో వాటిని సామాన్యుడు చూసి ఆనందించడమే కానీ ఖరీదు చెయ్యలేని ధరల్లో ఉండేవి. ఓవేళ ముచ్చట పడి అంత ధర పెట్టి కొనాలను కున్నా వాటి మన్నిక ఎలాగో తెలీయక ఇబ్బం దులు పడటమెెందుకులే అన్నభావనతో చాలా మంది కొనక ఆగిపోయారన్నది వాస్తవం. ఆమధ్య చైనా వస్తువులు మన మార్కెట్లోకి వెల్లు వెత్తి, ఎక్కడ చూసినా సిఎఫ్‌ఎల్ బల్బ్‌లని విస్తృ తంగా వినియోగంలోకి తెచ్చే లా చేసింది. దీంతో కేవలం పాతిక రూపాయల కే ఈ బల్బులు లభ్యం అవుతుం డటంతో జనం వేలం వెర్రి గా కొనేసి.. ఇళ్లలో సాధా రణ బల్బుల కి బదులుగా వాడే వారు. అయితే ఇవి ప్రసరింప చేసే వెలుతురు చాలా తక్కువగా ఉన్నా.. నీలిరంగు కల గల్సిన తెల్ల ని కాంతికిబాగా ఆకర్షితులు కావటంతో చైనా నుండి దిగుమతి అయినఈ బల్బులు తమ హవా చూపించాయనే చెప్పాలి....
లేని తలనొప్పి తెచ్చి పెట్టిన బల్బు
చైనా నుండి దిగుమతి అయిన ఈ సిఎఫ్‌ఎల్ బల్బులు ... నాణ్యత లేకున్నా... ధరతక్కువగా ఉండటంతో చాలా మంది కొనుగోళ్లు జరపడమే కాకుండా....చిన్నారుల చదువులకి వాడటం ప్రారంభిం చారు. అసలే ఇవి అందించే కాంతి తక్కువ కావటం మూలాన మెల్లమెల్లగా చదువుకునే విద్యార్ధులలో తల నొప్పులు, దృష్టి లోపా లు రావటం ప్రారంభించాయి.
అయితే సడన్‌గా తమ చిన్నారులు కళ్లకు సంబంధించిన వ్యాదులతో బాధ పడుతుండటంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళితే ఇదంతా చైనా బల్బు ల చలవేనని తేల్చి చెప్పడంతో.... క్రమేపీ వీటి వాడకం తగ్గిందనే చెప్పక తప్పదు.
ఈక్రమంలోనే ఇక వెలుతురు ఎక్కువ ఇస్తూ.... లేత వంకాయ రంగు కలసిన తెలుపు కాంతిని ప్రసరింప చేస్తూ ఆకర్షణీయంగా ఉండే... సిఎఫ్‌ఎల్ బల్బులని అనేకకంపెనీలు మార్కె ట్ లోకి దించాయి.
చైనా బల్బ్స్ మీద ప్రజలకి ఆసక్తి తగ్గి పోవ టంతోపాటు కాస్త ధరఎక్కువగా ఉన్నా. గతంలో పదే పదే కొన్న బల్బులకి తగ్గట్లు అన్ని బ్రాండెడ్ బల్బ్స్‌కి వారంటీ లభిస్తుండటం... వోల్టేజి ఒడిదుడుకులకు తట్టుకునే లా ఉండటం ముఖ్యం గా భారీగా వచ్చే కరెంటు బిల్లులు తగ్గించు కునేం దుకు తగిన ప్రత్యామ్నా యం మరొకటి కని పిం చకపోవటంతో ఊహిం చని విధంగా సామాన్యు లు సైతం వీటి వైపు మొగ్గు చూపారు.
లోవోల్టేజీకి ట్యూబ్‌లైట్స్ వెలగవు సరికదా.... సాధా రణ బల్బ్ కిరోసిన్ దీపాన్ని తలపిస్తున్న సమయంలో ఈ బ్రాండె డ్ సిఎఫ్‌ఎల్ బల్బ్స్ సగటు జీవిని ఆదుకున్నాయి. ఓ ఇంట్లో సిఎఫ్‌ఎల్ బల్బ్ దెెదీప్య మానముగా వెలుగుతుంటే... దాని వాడ కంపై ఎంక్వైరీ జరిపి చుట్టూ ప్రక్కలజనం కూడా వీటి వాడకంపై మక్కువ చూడటంతో నేడు చాలా చోట్ల అవసరానికి మించి కూడా సిఎఫ్‌ఎల్‌బల్బ్స్ తమ సేవలందిసు ్తన్నాయి.
బిల్లుల భారాన్ని తగ్గించుకోండిలా...
పిగ్మీబల్బ్‌స్ధానంలో 5వాట్స్ ఎంట్రీ లెవెల్‌గా ఉండే సిఎఫ్‌ఎల్ బల్బ్ పెట్టుకుంటే... బాత్ రూంలకి, బాల్కనీలకి, చిన్ని చిన్ని గదుల్లోన కాస్త వెలుతురు కోసం వాడే ఏరియాల్లో, ఎప్పుడూ వేసి ఉంచే గ్యారేజ్‌లలో, మెట్ల మీదకీ వీటిని శుభ్రముగా వాడుకోవ చ్చు. చాలా బాగా వెలుతు రుని ఇస్తుంది. ఒక పిగ్మీ బల్బ్ రోజుకి పన్నెండు గంటలపాటు వాడితే...గంటకి 15వాట్లు చొప్పున రోజుకి 180వాట్లు ఖర్చవుతుం ది. అలా నెలకి 5400 వాట్ల విద్యుత్ వాడుతున్నట్లే. అదే 5 వాట్స్ సిఎఫ్‌ఎల్‌ని రోజుకి పన్నెండు గంటలు వాడితే... గంటకు 5వాట్లు - 60 వాట్లు నెలకి 1800 వాట్లు వాడకం అవుతుంది అన్నమాట.
ఇలా మీరు వాడే ట్యూబ్ లైట్లు , ఇతర సాధారణ బల్బులని పరిగణ లోకి తీసుకుంటే మీకు కరెంటు బిల్లు ఎంత తడిపి మోపెడు అవు తోందో అర్ధం చేసుకోండి.
తక్షణం మీరు వెంటనే సిఎఫ్‌ఎల్‌బల్బ్‌ల లోకంలోకి మారి పోవా లనిపించడం లదూ.... మరెందుకాలస్యం... సిఎఫ్‌ఎల్‌కి మారి మీ విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించు కోండి....