రోడ్లపై తిరుగాడుతున్న అనాధలను చూసినప్పుడు, పిల్లల ప్రేమామృతానికి దూరమైన పండుటాకులు తమ బాధల్ని చెప్తూ ఏడుస్తుంటే... 'స్వంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి తోడు పడవోయ్' అంటూ.. సాగే గీతిక గుర్తొచ్చి మనలో ఉప్పొంగిన ఉత్సాహంతో... వీరందర్నీ చేరదీసి ఓ అనాధ శరణాలయాన్నో... ఓ వృధ్ధాశ్రమాన్నో మనమే నిర్వహించేస్తే పోలా అనుకున్న సందర్భాలు బోలెడుంటాయి.
కానీ అందులో బోలెడన్నిసాధక బాధకాలున్నాయని... ఎవరి సాయం అందక పోతే... మనమే ఆర్ధికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెనక్కి తగ్గేవారు మన సమాజంలో కొందరుంటే... కేవలం వీరి కారణంగా సమాజంలో గొప్ప గొప్ప హోదాలు పొందుతూ... ఎనలేని పేరు ప్రతిష్టలు... అవార్డులు, రివార్డులు కొట్టేస్తున్నా... చాలా అనాధ శరణాలయాలు, వృధ్ధాశ్రమాలలో వారి బాధల్ని గాలికొదిలేస్తున్నారన్న ఆరోపణలు బోలెడు వినిపిస్తున్న ఈ రోజుల్లో కెన్యాలో ఓ కుటుంబం ఏకంగా ఏనుగుల శరణాలయాన్ని
గత 20 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తూ అందరి ప్రశంసలూ పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే....
బలిష్టమైన ఏనుగుల సమూహాలకు పెట్టింది పేరయిన ఆఫ్రికా దేశాలలో ఒకటైన కెన్యా దేశంలో సంబురు అటవీ ప్రాంతంలో డగ్లస్ హామిల్టన్ ఈ ఏనుగుల శరణాలయాన్ని నిర్వహిస్తూ కేవలం ఏనుగు లనే కాకుండా వేలాది అడవి జంతువులకు, పక్షులకు అండగా నిలుస్తూ... వారి బాగోగులు పట్టించు కుంటున్నారు. ఇందు ఆయన భార్య రియాతో పాటు మనుమరాలు సబా కూడా సహకరిస్తున్నారు.
ఇంగ్లాండ్‌లోని డోరెట్‌లోజన్మించిన డగ్లస్ హామిల్టన్ కాన్స్టా నియాలో పెరిగారు. తన స్కూల్ జీవితాన్ని కేప్ టౌన్, దక్షిణాఫ్రికాల లో కొంత కాలం సాగించి స్కాట్‌లాండ్‌లోని గోర్డెన్‌స్టోన్ స్కూల్ లో చేరారు. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయం నుంచి బాచిలర్ డిగ్రీ తీసుకున్న ఆయన అదే యూని వర్శిటీలో డాక్టరేట్ చేసారు.
1993లో ఆయన 'సేవ్ ది ఎలిఫెంట్' అనే ఛారిటీ సంస్ధని ఏర్పాటు చేసి ఎటువంటి లాభా పేక్షలేకుండా ఏనుగుల సంతతిని అభి వృధ్ధి చేసిసంరక్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
తనకు ఏనుగులపై మక్కువ కలగటానికి కారణాలు డగ్లస్ వివరిస్తూ... ఓ రోజు సఫారీలో ఏను గుల్ని చూడటానికి వెళ్లా... అక్కడే ఓ చెట్టు దగ్గర సేద తీరుతున్న సమయంలో ఓ ఆడ ఏనుగు తన తొం డంతో నన్ను తాకింది. దాని తొండం నుండి వెలువడిన వేడి గాలులు అది ఏదో బాధ పడుతోందని... అనిపించి దాన్ని కాసేపు చేతి స్పర్శతో సేద తీర్చా.. చెవులను నిమిరి...దగ్గరలో ఉన్న గడ్డి తినిపించా... అది నాకెందుకో మానసికంగా సంతృప్తి కలిగించిందన్నారు..
మన్యారా లేక్ వెంబడి తిరుగాడే ఏనుగులని బంధించి అనేక మంది స్మగ్లర్లు వాటిని చంపేసి, దంతాలను తరలించుకు పోవాల ని చూడటం తనని కలిచి వేసిందని... దీంతో స్మగ్లర్లని ప్రభుత్వానికి పట్టించడమే కాకుండా ఏనుగులకు దహన సంస్కారాలు కూడా తమ కుటుంబం నిర్వహించామని... మరోవైపు తన భార్య వైద్య నిపుణురా లు కావటంతో ఈ అడవిలో ఏనుగులని మచ్చిక చేసుకోవటం, వాటి గాయాలను మాన్పేందుకు ఎప్పటి కప్పుడు తగిన మందులు ఇవ్వ టంతో అవి మాకు బాగా చేరువయ్యాయి. వాటి ఆలనా పాలనా చూస్తు.. స్మగ్లర్ల దాడుల బారిన పడకుండా వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు.
పూర్తిగా పర్యావరణ పరిరక్షణకే అంకితమైన డగ్లస్ బార్య రియా డగ్లస్ ఇప్పుడు కెన్యాలో వన్య ప్రాణి సంరక్షణ కోసం ఛారిటీని నిర్వహిస్తున్నారు. దీని ఆధ్వర్యంలో ఎన్నో జంతువులకు వైద్య సేవలం దిస్తున్నారు. 'ఆఫ్రికా ఎలిఫెంట్ కింగ్‌డమ్' పేరుని సార్ధకత చేయాలం టే... ఉత్తర కెన్యా అంతటా 'ఏనుగులను కాపాడుదాం' అనే ఏకైక నినాదం వినిపిస్తు ప్రభుత్వం, ప్రజల సహకారంలో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.అలాగే ఈ రిజర్వు ఫారెస్టులో జంతువుల కోసం ప్రత్యేకంగా జిపిఎస్ రేడియోని నిర్వహి స్తు ఏనుగులను, ఇతర జంతువులను పర్యవేక్షి స్తున్నామన్నారు.
అలాగే నైలూనది ఒడ్డు నవేలాది అకేషియా చెట్ల ని, కిగేలియా చెట్లని పెం చి ఏనుగులని చూసేందు కు వచ్చే పర్యాటకులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసామని వీరికి పర్యావర ణ అనుగుణంగానే అతిధి గృహాలను నిర్మించామన్నారు. పర్యావరణాన్ని కలుషితం చేసే రంగులు, రసాయన పదార్ధాలున్న ఆహారా న్ని వాడటాన్ని ఇక్కడ నిషేదించామని... అయితే అతిధులకు సౌకర్యవంతమైన భోజనాదులు దొరికేలా ఏర్పాట్లు చేసామని... పడిపోయిన చెట్ల నే పడుకునేందుకు వీలుగా ఉండేలా మంచాలను, పెద్ద పెద్ద సోఫాలని రూపొందించ మని...ప్రతి కాటేజ్‌లోనూ కనీసం పది మంది అతిధులుండే అవకాశం ఉందని అన్నారు.
అలాగే సఫారీలో ఏనుగుల్ని చూడాలనుకునే వారికి రక్షణ గానూ, గైడ్‌గానూ కొందరు వ్యవహరిస్తారని, తమతో పాటుగా టెంట్లు తదితర సరంజామా తీసుకెళ్లి యాత్రీకులకు అన్ని సౌకర్యాలు కలుగ చేయటం ఇక్కడ ప్రత్యేకతని చెప్పారు. ఇలా అతిధులకు తాము అంది స్తున్న వివిధ రకాల సేవలపై వచ్చే ఆదాయాన్ని అడవి జంతువుల కోస మే వినియోగిస్తున్నామని చెప్పారు. ఇటీవల డిస్కవరీ ఛానల్ నిర్మిం చిన ఐమాక్స్ చిత్రానికి డగ్లస్ తన సహాయ సహకారాలని అందిం చారు. ఈ చిత్రం నిర్మిస్తున్న సమయంలోనే డగ్లస్ మనుమరాలు సబా డగ్లస్ అడవిలో జంతువుల తో చేసిన ధైర్య సాహసాలను చూసిన ప్రముఖ వార్త్త సంస్ధ అయిన బిబిసి తాను జంతువులపై నిర్మించే డాక్యు మంటరీలకు ప్రత్యేక న్యూస్ ప్రజంటర్‌గా తీసుకుని ప్రోత్సహిస్తోంది.
ఏనుగులపై తాము గత 30 ఏళ్లుగా చేస్తున్న అధ్యయ నాలని, అనుభవాలని రంగరించి 'ఎమాంగ్ ది ఎలిఫెంట్' అనే పుస్తకాన్ని కూడా వెలువరించారాయన. ప్రస్తుతం డగ్లస్ నిర్వహిస్తున్న ఈ ప్రకృతి కేంద్రమైన ఏనుగుల శరణాలయంలో దాదాపు 400 రకాల అరుదైన పక్షి జాతుల్ని కూడా సంరక్షించే ప్ర క్రియ చేపట్టారు. అలాగే అంతరించి పోతున్న జిరాఫీలు, నీటి ఎద్దులు, గుర్రాలు, కోతుల ఇలా అనేక జంతువులు ఇక్కడ దర్శనమిచ్చి పర్యాటకులకి కనువిందు చేస్తున్నాయి.
ఈ భూమిపై అంతరించిపోబోతున్న జీవాలని ముందే గుర్తించి వాటి సంరక్షణకు విస్తరణకు డగ్లస్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతైనా హర్షణీయం.
లక్ష డాలర్లతో భవిష్య నిధి ఏర్పాటు
డగ్లస్ సేవల్ని గుర్తించి గత ఏడాది సెప్టెంబర్ 25న ఏటా ప్రకృతి ఆరాధికులకు ఇండియాపోలీస్ అందించే లైఫటైమ్ ఎచీవ్ మెంట్ అవార్డుని అందుకున్నారు. ఈ సందర్భంగా తాను అందుకున్న లిల్లీ మెడల్‌తో పాటు లక్ష డాలర్లను 'సేవ్ ఎలిఫెంట్' సంస్ధకు భవిష్య నిధిని ఏర్పాటు చేసారు.