15, నవంబర్ 2011, మంగళవారం

'లిటిల్‌ ఫ్రాన్స్‌' పుదుచ్చేరి

అనేక కులాలు, మతాలు కలగల్సి భిన్నత్వంలో ఏకత్వంగా కనిపించే మనభారత దేశంలో ఃలిటిల్‌ ఫ్రాన్స్‌ః ఒకటుందంటే నమ్మకం కలగట్లేదా
అయితే మీరు ఖచ్చితంగా ఓ సారి పాండిచ్చేరిని చూసి రావాల్సిందే. ఇక్కడ భారత దేశంలో పాటు ఫ్రెంచ్‌ దేశానికి సంబంధించిన వేష భాషలు మనకి కనిపించి అచ్చెరువు గొలుపుతాయి.
నేటికీ నాటి పాలకులు అవలంబించిన సాంప్రదాయాలనే అక్కడి ప్రభుత్వాలు అవలంబిస్తూ ... పర్యాటకులని విశేషంగా కట్టుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదేవెూ.
మన దేశంలో తొలి నాళ్లలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి నాటి ఫ్రెంచి పాలకులకు ఆవాసంగా పేరు పొంది.. రాష్ట్రం గా అవతరించినా.. వారి నాగరికతతో పాటు హిందూ సంస్కృతినీ తనలో మిళితం చేసుకుని గతవైభవాలను చాటుతో పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది.
ప్రెంచి వారు ఈ భారత దేశానికి వర్తకం నిమిత్తం వచ్చేపðడు తొలి సారిగా ఈ ప్రాంతాన్ని చేరుకుని తమ భాషలో ఃకఠఛీజీఛిజ్ఛిటడః అని పిలిచే వారట. అంటే కొత్త ఊరు అనే అర్ధం. అప్పటికే తమిళులు ఎక్కు వగా ఉండే ఆ ప్రాంతంలోని వారు కూడా ఫ్రెంచి వారిని ఆకర్షించేలా తమ ప్రాంతాన్ని పుదు ొ కొత్త, చ్చేరి ొ ఊరు అని తమిళంలో పుదుచ్చేరిగా పిలుచుకునే వారని...కాల క్రమంలో ఫ్రెంచ్‌ వారు దానిని పాండిచ్చేరిగా పిలవటంతో అదే పేరు ఇప్పటికీ కొనసాగుతోందన్నది చరిత్ర కారులు చెప్తారు. వివిధ రాష్ట్రాలు తమ తమ ప్రాంతాలలో వివిధ నగరాలకు గతంలో ఉన్న ప్రాధాన్యత పేర్లను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి పేర్లు మారుస్తున్న క్రమంలో ప్రస్తుతం గోవా సర్కారు పాండి చ్చేరి పేరును పుదుచ్చేరిగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
పురాణ కాలం నుండి పాండిచ్చేరి ప్రాంతా నికి అత్యధిక ప్రాధాన్యత ఉందని చరిత్ర కారులు చెప్తారు. ఇక్కడే అగస్త మహాముని తన ఆశ్రమాన్ని నిర్వహించే వాడని, సంస్కృత విద్యాలయ నిర్వాహణ కూడా ఈ ప్రాంతం లో జరిగినట్లు ఇక్కడ దొరికిన అనేక ఆధారాలు చెప్తున్నట్లు వారు పేర్కొం టారు. క్రీస్తు శకం 2వ శతాబ్ధలోనే పాండిచ్చేరి పొడుకె వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ది కెక్కిందని... ప్రస్తుతం పాం డిచ్చేరి కి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న అరికిమేడునే అప్పట్లో పొడుకె అని పిలిచే వారని హాంటింగ్‌ ఫోర్డ్‌ అనే రచయిత తన రచనల్లో పేర్కొన్నాడు.
ఇటీవల పురావస్తు శాఖ జరిపిన అరికి మేడులో జరిపిన తవ్వకాలలో అనేక రోమన్‌ సాంప్రదాయ పాత్రలు లభించడంతో ఈ ప్రాంతాన్ని నౌకా కేంద్రంగా చేసుకుని వర్తక వ్యాపారాలను రష్యన్లు నిర్వహించే వారన్న వాదనలకు మరింత బలం చేకూరింది.
ఇక క్రీస్తు శకం 4వ శతాబ్దర నుండి ఈ ప్రాంతాన్ని పల్లవులు, చోళులు, పాండ్య చక్రవర్తులు, విజయనగర మహారాజుల ఆధీనంలో ఉండేదని... వారి రాజరికాలు పతనమ య్యాక స్ధానిక నాయకత్వాలు, జమిందారీ వ్యవస్ధలు పునాదులూ రుకుంటున్న క్రమంలో 1673లో ఈస్టిండియా కంపెనీ పేరుతో వచ్చిన ఫ్రెంచి వారు వర్తక కేంద్రంగా దీనిని ఏర్పాటు చేసుకుని చివరికి ఫ్రెంచి అధికారిక కేంద్రం చేసుకున్నారని... మనకి చరిత్ర చెప్తున్న సత్యం.
సముద్ర మార్గం గుండా రవాణా చేసుకునేందుకు పాండిచ్చేరి ముఖ్య కేంద్రం కావటంతో అప్పట్లో దీని కోసం ప్రెంచి వారితో బ్రిటీష్‌ పాల కులు, డచ్‌ దేశీయులు అనేక యుద్ధాలు చేసినట్లు చివరికి ఒప్పందాలు కుదుచ్చుకుని పుదుచ్చేరిపై అధికారాన్ని పంచుకున్నట్ల్లు చరిత్రకారులు వెల్లడిస్తుండగా... 1850 నుండి పుదుచ్చేరి, యానాం, కరైకాల్‌, చందే ర్‌ నగర్‌, మాహే ప్రాంతాలు ఫ్రెంచి వారి ఆధీనంలో ఉన్నాయని.. భార త దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినా... 1954 వరకు కొనసా గినట్లు చెప్తారు.
స్వాతంత్రానికి పూర్వం ఎక్కువగా ప్రెంచి పాలకుల చేతిలో ఉన్నందు వల్లో ఏవెూ... నేటికీ ఆ పోకడలు పాండిచ్చేరిలో కనిపిస్తాయి. విభిన్న సంస్కృతుల కలబోతతో గత చరిత్రకు సాక్ష్యాలుగా ఫ్రెం చి పాలకులు కట్టించిన అనేక కట్డడాలు నేడు పాండిచ్చేరిని పర్యాటక కేంద్రంగా మార్చ డంలో ప్రధాన భూమిక పోషిస్తు న్నాయని చెప్పడం అతి శయోక్తి కాదేవెూ.
ఇక ఈ రాష్ట్రంలో విభిన్న వాతావరణానికి తగ్గట్టుగానే ఈ రాష్ట్రంలోని జిల్లాలు కూడా వేర్వేరు చోట్ల ఉండటం ఓ విశేషం. యానాం, మాహె, కరైకాల్‌, పుదుచ్చేరి అనే నాలుగు జిల్లాల సముదాయంగా ఉంది పాండిచ్చేరీ రాష్ట్రం.
బంగాళా ఖాతం తీరాన తమిళనాడుకు అంతర్భాగంగా ఉన్న 293 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో పాండిచ్చేరి ఉంటే... మరి కొంత దూరంలో 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కరైకాల్‌ విస్తరించి ఉంది. ఇక మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకి నాడకు 25 కిలో మీటర్ల దూరంలో 30 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో బంగాళా ఖాతాన్ని ఆనుకుని ఉన్న పట్టణంగా యానాం ప్రసిద్ది కెక్కగా అరేబియా సముద్ర తీరంలో కేవలం 9 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మహె విస్తరించి ఉంది. ఇలా పలు చోట్ల విసిరేయబడ్డ ప్రాంతాలతో విభిన్నంగా కనిపించే ఈ రాష్ట్రానికి ప్రత్యేక సరిహద్దులంటూ లేకపోవటం ఓ విడ్డూరం కాగా... ఈ రాష్ట్ర జనాభా అంతా

కల్సి 12 లక్షలు పైచిలుకు ఉంటుందని ఓ అంచనా. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా ఉన్నప్పటికీ అన్నిటి కన్నా విశిష్ట విరసిల్లుతోంది పాండిచ్చేరి మాత్రమే.
ఇక్కడ దాదాపు రెండు కిలో మీటర్ల పొడవుడే సెరినిటీ బీచ్‌ తన ప్రకృతి అందాలతో మనల్ని కట్టి పడేస్తుందనటంలో సందేహంలేదు. ఈ బీచ్‌ ఒడ్డున నిర్మించిన మహాత్ముడి విగ్రహం, నాటి పాలకుల యుద్దాలకు స్మారకంగా నిర్మించిన చిహ్నాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. పైగా ఈ బీచ్‌ ఒడ్డున నిర్మించిన లైట్‌హౌస్‌ గత 150 ఏళ్లుగా నిరంత రాయంగా తన సేవల్ని అందిస్తూ...చరిత్ర సృష్టిస్తుండగా... ఇక్కడి ఫ్రెంచి కట్టడాలు వారి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా మన కి ఆహ్వానాలు పలుకుతూ ఆకర్షిస్తుంటాయి. వీటి చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతి పర్యాటకుడి మదిలో కలుగ చేసేలా వీటి నిర్మాణం ఉందనే చెప్పాలి.
ఃఐలండ్‌ ఆఫ్‌ పీస్‌ః బొటానికల్‌
ఇక పాండిచ్చేరిని సందర్శించే ప్రతి పర్యాటకుడు రమణీయ పూల అందాలకు నెలవైన ఃఐలండ్‌ ఆఫ్‌ పీస్‌ః బొటానికల్‌ గార్డెన్‌ని సందర్శించి తీరాల్సిందే. ఇక్కడ మనదేశంలో లభ్యమయ్యేఅనేక పూల జాతులతో పాటు విదే శాల నుండి తెచ్చిన అనే క పూల మెక్కలను పెం చుతూ... ప్రశాంతతకి, పచ్చ దనానికి మారు పేరుగా కనువిందు చేస్తు న్నారీ గార్డెన్‌ నిర్వాహకులు. అలాగే ఇక్కడికి దగ్గర్లో ఉన్న భారతీ పార్కు కూడా పచ్చదనానికి నెలవై ఉండగా... ఇందులోని నెలకొల్పిన మ్యూజి యం తన శిల్ప కళా సంపదతో మనల్ని కట్టి పడేస్తుంది.ఇక్కడి శిల్పా లు ఒకదానిని మించి మరొకటి అన్నట్లు విశేషంగా ఆకటు ్టకుంటాయి.
అవర్‌ లేడీ ఆఫ్‌ చర్చి :
ఇక పాండిచ్చేరీకి 4కిలో మీటర్ల దూరంలో ఉన్న పురాతన చర్చిని ఆరోగ్యం ప్రసాదించే పిలుస్తారు.1690లో అనియా కపురంలో నిర్మించబడిన ఈ చర్చిని ఇప్పటికి అనేక మార్లు పున:నిర్మాణం చేసారు. 1843 లో సెయింట్‌ ఆంధోనీ ప్రతిష్టించిన క్రీస్తు విగ్రహా లు ఆకట్టుకునేలా ఉంటా యి. ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శిస్తే... ఆరోగ్యం సిద్ధి స్తుందని ఇక్కడి వారి నమ్మకం. అత్యంత ఆకర్షణీయంగా చిత్రీకరించిన అనేక చిత్రాలు, గ్లాస్‌ పెయింటింగ్‌లు చూపరులను ఆకట్టుకుంటాయి.
షాపింగ్‌ ఫెస్టివల్‌
పర్యాటకుల్ని ఆకర్షించే క్రమంలో పాండిచ్చేరి సర్కారు పాండిచ్చేరిలో ఏటా నిర్వహించే షాపింగ్‌ ఫెస్టివల్‌ గూర్చి ప్రత్యేకంగా చెపðకోవా ల్సిందే. ఈ ఫెస్టివల్‌ని సందర్శించే వారికి లక్కీ కూపన్లు, బంపర్‌ ప్రైజు లంటూ ప్రత్యేక బహుమతులు అందిస్తోంది. ఇక్క డ అనేక రకాల తమిళ, ఫ్రెంచి ఫర్నీచర్‌తో పాటుగా ఎలక్ట్రానిక్స వస్తువుల, చేతితో తయారు చేసిన కాగితపు అలంకరణలు పాండిచ్చేరీ సాంప్రదాయ దుస్తులు, గృహౌపకరణాలు ఇలా అనేక రకాల వస్తువులతో పాటు ప్రత్యేక రాయితీలతో వాహనాదులను కూడా అమ్మకానికి ఈ ఫెస్టివల్‌లో పెడతారు. కేవలం కొనుగోలు కోసమే కాకుండా ఈ ఫెస్టివల్‌లో జరిగే సాంస్క ృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలను కూడా భారీగా నిర్వహిస్తారు.ీ కార్యక్రమాలకు ప్రతి రోజు పాండిచ్చేరీ ముఖ్యమంత్రి హాజరవుతారు.
ఎలా వెళ్లాలంటే....
ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలలతో పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న పాండిచ్చేరిని జీవిత కాలంలో ఓసారైనా చూసి తరించాల్సిందే. ఇక్కడి పోవాలనుకునే వారు చెన్నై ఎయిర్‌ పోర్డులో దిగి 135 కిలో మీటర్లు వేరే వాహనంలో పోవాల్సి ఉంటుంది. రైలు మార్గంలో అయితే మధు రై, త్రివేండ్రం, విల్లు పురం రైల్వేస్టేషన్లలో దిగి సులభంగా ఇక్కడికి చేరు కోవచ్చు. అతిధుల్ని ఆహ్వానించేలా ప్రభుత్వ టూరిజం సంస్ధతో పాటు వివిధ ప్రయివేటు సంస్ధలు కాటేజీలు నిర్వహిస్తున్నాయి. చౌక ధరల్లో మరి కొన్ని వసతి సౌకర్యాలు అందిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుండి పాండిచ్చేరికి ప్రత్యేక ప్యాకేజీలతో టూర్‌లు నిర్వహిస్తున్నాయి. మరెందు కాలస్యం.... ఈసారి శీతాకాలాన్ని సరదాగా పాండిచ్చేరిలో గడిపేందుకు ప్లాన్‌ చేసుకోండి.


నాలుగు జిల్లాల సముదాయం
ఆధ్యాత్మికతకు తోడుగా ప్రకృతి రమణీయత కలగల్సి విశేషంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న పాండిచ్చేరీ రాష్ట్రమంతా ఒక్క దగ్గరే ఉందా అంటే అలా లేదు. యానాం, మాహె, కరైకాల్‌, పుదుచ్చేరి అనే
నాలుగు జిల్లాల సముదాయం ఇది.


ఆకట్టుకునే ఎక్వేరియం
బొటానికల్‌ గార్డెల్‌లో ఉండే భారీ ఎక్వేరియం కూడా తన ప్రత్యేకతని నిలుపుకుంటూ ఆకర్షించడంలో తనవంతు పాత్ర పోషిస్తోంది. ఇక్కడ విశ్వంలో అరుదుగా కనిపించే ఆర్నమెంట్‌ చేపలు తమ అందాలను ఆరబోస్తు తెగ ఆకట్టుకుంటాయి.


శ్రీ అరబిందో ఆశ్రమం
పుదుచ్చేరీలోని శ్రీ అరబిందో ఆశ్రమం విశాల ప్రాంగణంతో అద్భుత ప్రకృతితో ఆహ్వానం పలుకుతూ ఉంటుంది.
ఈ ఆశ్రమంలో అరవింద, మదర్‌ సమాధులని అనేక పుష్పగుచ్ఛాలతో అలంకరించి దర్శించే వారికి ప్రశాంతతని చేకూ రుస్తుంటాయి. ప్రతి ఏటా ఆగష్టు 15వ తేదీన అరవిందుని జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడకి లక్షలాది అరవిం ద భక్త్తులు తరలి వస్త్తారు. వీరిలో భారత దేశంతో పాటు అనేక దేశాల వారు మనకి కనిపిస్తారు.
ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్‌ నుండి వచ్చిన వారికి 'ఆంధ్ర ఆశ్రమం' ప్రత్యేకంగా ఆశ్రయం కలిపిస్తూ సేవలందిస్తోంది.
అనేక మంది విధ్యా ధీకులు సేవలందిస్తున్న ఈ ఆశ్రమంలో యాత్రీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తారు.ఇక ఈ ఆశ్రమంలో లభించే అనేక ఆయుర్వేద ఔషధాలు, చేతి వృత్తులతో చేసిన అనేక వస్తువులు నాణ్యతకు మన్నికకు పేరెన్నిక గన్నవి.