ఇంటిలో వస్తువులు కనిపించకపోతే, పిల్లలు దారి తప్పితే, ఎవరు కిడ్నాప్ చేశారు? ఇలా పలు కుటుంబ సభ్యులకు గతంలో కొందరు చేతిలో అంజనం వేసి చెప్పేవారు. కాలానుగుణంగా ఇప్పుడు అంజనం స్థానే ట్యారెట్ కార్డులు, పెండ్యులం, క్రిస్టల్ బాల్ చోటు చేసుకున్నాయి. కేరళలో 'దేవప్రశ్నం' వేసి పరిష్కారాలు కనుగొంటారు. గతంలోలా అంజనాలు వేయటం, గవ్వలు వేసి సమస్యలకు పరిష్కారాలను ఇప్పుడు కొన్ని గ్రామాలలోనే కానవస్తుంది. ఇప్పుడు ప్రముఖ నగరాలలో విద్యాధి కులు సైతం ట్యారెట్ కార్డులు, క్రిస్టల్ బాల్, పెండ్యులం ప్రయోగంలో శిక్షణ పొంది అనేక వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్నారు.
భారతీయ అతీతశక్తుల సంబంధాలకు కొదువ లేదు. ప్రతి భారతీయుడు ఏదో ఒక సందర్భంలో జ్యోతిష్యుడిని, వాస్తుశాస్త్రజ్ఞుడు, లేదా ట్యారట్ కార్డ్ రీడర్‌ను సంప్రదించకుండా వుండలేదు. పాల్ అనే ఆక్టోపస్ ప్రపంచ ఫుట్‌బాల్ విజేతను ప్రకటించగానే విశ్వమంతా నివ్వెర పోయింది.
ముంబైలో పోలీసులు భవిష్యవాణిపై దృష్టిసారించారంటే నాస్తికులు, లౌకికవాదులు ముక్కున వేలేసుకున్నారు. ముంబైలోని గోపాల్ టేక్వానికి 45 సంవత్సరాలు. వారు 2006 బాంబు దాడులను, 2008 నవంబర్ 26న జరిగిన దాడులను ముందుగానే పసిగట్టారు.
తాజ్‌మహల్ హోటల్, గేట్‌వే ఆఫ్ ఇండియా కొలాబాలోని పోలీస్ ప్రధాన కేంద్రం, హేమంత్ కర్కరే ఫొటోపై దండ వారికి ముందుగానే గోచరించాయి. తాజ్‌హోటల్‌పై రానున్న ప్రమాదాన్ని ముందే శంకించారు. ముంబైలోని రైల్వేస్టేషన్ దాడులను ముందుగానే వూహించి పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు.
నెహ్రూనగర్‌లోని వరుస దాడులలో పాల్గొన్న ఓ ఉగ్రవాది ఊహాచిత్రాన్ని పోలీసులకు అందించి, మరొక యువకుడు అనారోగ్యంతో బాధపడుతూ,ఉగ్రవాదులకు చేయూతనందిస్తున్నాడన్నారు. పోలీసులు గోపాల్ సలహా మేరకు స్పందించి వారిని ఖైదుగావించారు. ఉగ్రవాదులపై మరింత వల పన్నేందుకు పోలీసులనుండి ఉత్సుకత కానరాక పోవడంతో గోపాల్, వారికి దాహం వుంటేనే నీరు అంది వ్వగలం కానీ, దప్పిక లేకపోతే తాను చేసేది ఏమీలేదన్నారు. హత్యలు ఇతర క్రిమినల్ కేసులలో ముద్దాయిలను పట్టించ డానికి టేక్వానీ పోలీసులకు ఎంతగానో సహకరించాడు.
ఓసారి గోపాల్ వద్దకు పరపతిగల కుటుంబ సభ్యులు విచ్చేసి తప్పిపోయిన తమ కూతురు జాడ తెలుపమన్నారు. వారి కుమార్తె ఢిల్లిdలో వుందనీ, తన ప్రియునితో అక్కడ వుంటుందన్నారు. వారింట్లోని పనిమనిషే, ఆమె ఢిల్లిd పోవడానికి సహకరించిందన్నారు. చివరకు కూతురి జాడ తెలుసుకుని ఇంటికి తీసుకువచ్చారు. మెక్సికోలోని ఓ పోలీస్ కమ్మాండేంట్ కానరాక పోతే డ్రగ్ స్కాంలో కిడ్నాప్ అయ్యాడనీ, తను ఎక్కడ వుందీ జాడ తెలియజేశారు.
అత్రీందీయ శక్తులను ఫోరెన్సిక్ సైన్స్‌కు ప్రత్యామ్నాయంగా పేర్కొనవచ్చు. కోర్టులో ఫోరెన్సిక్ సాక్ష్యాలు ఎంతో ఉపకరిస్తాయి. సీనియర్ పోలీస్ ఆఫీసర్ తాను అతీంద్రియ శక్తులు గల వారిని కొన్ని సంక్లిష్టకేసుల విషయంలో సంప్రదిస్తామన్నారు. ఈ విషయాలను గోప్యంగా వుంచాలి కానీ బహిర్గతం చేయరాదన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం 'బీర్ మ్యాన్ కిల్లింగ్స్' విషయంలో సైకిక్ శక్తులు గల గోపాల్ 11వ రోజు దాడి చేయనున్నాడని చెప్పగానే, పోలీసులు ఆప్రదేశంలో నిఘాపెంచి నిందితుడిని పట్టుకున్నారు.
ట్యారెట్ కార్డ్
సంగీతా కృష్ణన్ ట్యారెట్ కార్డ్ నిపుణురాలు. ఆమె 'ఆరా' రీడర్ కూడా. ఆమె తప్పిపోయిన వ్యక్తుల జాడను కనుగొనడంలో నేర్పరి. ఓ ప్రముఖ రాజకీయవేత్త తప్పి పోయిన తన కుమారుడు బ్రతికి వున్నాడా, అయితే ఎక్కడ వున్నాడని ఆమెను ప్రశ్నించాడు. ఆమె పెండ్యూలమ్, మ్యాప్ సాయంతో సరిగా ఎక్కడ వున్నదీ నిర్దారించింది. సరైన సమయానికి, సరైన నిర్ణయం తీసుకోవడంలో ట్యారెట్ కార్డ్, మ్యాప్ సహకరిస్తాయి.
డా|| జ్యోతికా చిబ్బర్ గత 15 సంవత్సరాలుగా సైకిక్ గా ప్రాక్టిస్ చేస్తుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఆమెవద్దకు పలువురు వస్తుంటారు. ఒకసారి ప్రముఖ సినీనటి ఇంటి నుండి వెళ్లిపోయిన ఆమె కుమార్తె ఆచూకి తెలుపమన్నది. జ్యోతికా ఆలోచనలలో నిమగ్నమైతే ఆమె వున్న సందు, ఇల్లు గోచరించాయి. జ్యోతికా తల్లి దండ్రులకు కూడా 'భవిష్యవాణి' చెప్పడంలో అనుభవం కారణంగా ఈమెకు ఆ విధ్య సునాయాసంగా అబ్బింది.
డా|| జ్యోతికా, రిలైన్స్ వారికి ఎక్కడ ఆయిల్ నిక్షేపాలు వుందీ మ్యాప్‌లో పాయింట్ చేసి సరిగా చెప్పగలిగింది. ఆమెకు చిన్న తనం నుండే పోయిన వస్తువులను ఎలా కనుగొనేదీ తెలుసు. ఆమె ధృడసంకల్పం, ఆత్మవిశ్వాసంతో ఇవన్నీ సరిగా చెప్ప గలిగేది. ఆమె మానసికంగా వస్తువులను స్కాన్ చేసేది. నవంబర్ 26 ఉగ్రవాదుల దాడి తర్వాత, పోలీస్ ఆఫీసర్లు బాధితులను హీలింగ్ ద్వారా కోలుకొనేట్లు చేయమని ఆమె సహాయాన్ని అర్ధించారు.
ముంబైలో ఆరు సంవత్సరాల క్రితం అతీంద్రియ శక్తులను ప్రోత్సహించరాదనే ఓ చట్టం జారీ చేశారు. అందువలన సైకిక్‌లు ఈ విషయంలో ఆచి, తూచి అడుగు వేస్తారు. పోలీసులందరూ 'సైకిక్' లను నమ్మరు. కేసుని బట్టి పరిష్కారానికి సమ్మతిస్తారు. ఏమాత్రం విజయం కాకపోయినా, కటకటాల
పాలు అవాల్సిందే. సైకిక్‌ల విషయంలో ఎంతో అప్రమత్తంగా వుండాలని సామాజిక శాస్త్రవేత్త నందినీ సర్దేశాయ్ తెలియజేశారు. మానసిక ప్రశాం తిని కలుగజేయడానికి ఉపకరిస్తారు కానీ, నేరస్తులను పట్టించడంలో సరిగా నిర్ణయించలేరంటారు.
అతీంద్రియ శక్తులు గల వారంటే సమాజంలో సహజంగానే అను మానాలు తలెత్తుతాయి. ఈ మధ్య కాలంలో విద్యాధికులు కూడా కొందరు 'సైకిక్' లుగా చెలామణి అగుచున్నారు. పోలీసు ఆఫీసర్లు ప్రత్యేక సందర్భాలలోనే వీరి సలహాలను తీసుకుంటారు. 'సైకిక్' లు చెప్పిన విషయాలు సరికాకపోతే వారిపై చర్య తీసుకోరు. గోప్యంగా వుంచుతారు మరి కొందరు పోలీసు ఆఫీసర్లు వారి డ్యూటీపైనే ఆధారపడతారు కానీ 'సైకిక్' ల సహాయాన్ని అర్థించరు.
ప్రపంచ వ్యాప్తంగా కేస్ స్టడీస్
1 న్యూజెర్సీలోనే డెబ్బీ తప్పిపోయిన తన ముగ్గురి పిల్లల ఆచూకిని తెలపని డిటెక్టివ్ లవ్ మాస్టర్ బోన్‌ను అర్థించింది. ఫలితం లభించక పోవడంతో సైకిక్ నాన్సీ వెబర్ సహాయాన్ని అర్థించింది. నాన్సీ తన అతీంద్రియ శక్తులతో చూసి, ముగ్గురిలో ఒక కుమార్తెను కుక్క గాయపరిచిందనీ, పిల్లలు తప్పని సరిగా దొరుకుతారన్నది, నాన్సీ చెప్పింది వాస్తవమే. అలాగే జరిగింది.
2. పోలీస్ సార్జెంట్ రిచర్డ్ కీటన్, ( మారిన్ కౌంటీ పోలీస్ విభాగం) తన 30 సంవత్సరాల అనుభవంలో చాలా సార్లు 'సైకిక్'ల సహాయం ఫలించిందన్నారు. అన్నెట్టే సైకిక్ ధ్యానంలో కూర్చొని క్రైమ్ సీన్‌ను వీడియా తీసినట్లు చక్కా వివరించే వారట. ఆమె ఇచ్చిన ఆధారాలు ఎంతగానో ఉపకరించాయన్నారు.
3. ఆరెగాన్‌లో మార్చి 1986లో జాన్ బర్కె తన భార్య అలెక్సిస్ ఎటు వెళ్లిందో తెలియ జేయమని డిటెక్టివ్ రాబర్ట్‌లీ సహాయాన్ని కోరాడు. ఫలించకపోగా అలెక్సిస్ తల్లి సైకిక్ మెక్ క్వారీని అభ్యర్థించింది. జాన్ సోదరుడే నిందుతుడని చెప్పగా అదే నిజమైంది.
డిటెక్టివ్‌లు, పోలీసులు కూడా అతీంద్రియ శక్తులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కేసులు రుజువైనాయి.