పోటాపోటీగా నిలిచిన 88 మంది సుందరీమణులను పక్కకు నెట్టి మిస్ అంగోలా లైలా లోపెజ్ ఔరా అనిపించుకునేలా విశ్వసుందరి కిరీటం దక్కించుకుంది.
బ్రెజిల్‌లోని సావోపౌలోలో చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీలలో వివిధ దేశాల సుందరీమణులను తోసిరాజని తన దైన శైలిలో సవ ూధానాలిచ్చి అందాల కిరీటాన్ని సొంతం చేసుకునిఅందర్నీ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తింది.
సోమవారం రాత్రి జరిగిన ఈ పోటీల ఫైనల్‌లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారు అడిగిన ప్రశ్నలకు లైలా లోపెజ్ చక్కటి సమాధానాలు ఇచ్చి విశ్వ సుందరి టైటిల్‌ను తన సొంతం చేసుకుంది.
మొదటినుంచి తొలి ఐదు స్థానాలలో సాగుతూనే లైలా తన దేశస్ధులనుంచి ఎన్నికయ్యేందుకు ఆశలు చిగురింపజేసి చివరికి విశ్వ విజేతగా నిలచింది. ఉక్రెయిన్‌కు చెందిన ఒలెస్యా స్టెఫాంకో తొలి రన్నరప్‌గా నిలవగా... బ్రెజిల్‌కు చెందిన ప్రస్కిలా మచాడో రెండో రన్నరప్‌గా నిలిచారు. ఫిలిప్పైన్స్‌కు మూడవ స్థానం, చైనా నాలుగవ స్థానం దక్కాయి.
కాగా, భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన తెలుగు అమ్మాయి వాసుకి సుంకవల్లి టాప్‌టెన్‌కు కూడా చేరుకోలేకపోయింది. విశ్వసుందరి పోటీల్లో భాగంగా మూడు రోజుల క్రితం నిర్వహించిన ''సంప్రదాయ దుస్తుల'' ఫోటో సెషన్స్‌కు ఆమె దూరమయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. విమానాశ్రయంలో వాసుకీ లగేజీని బ్రెజిల్ కస్టమ్స్ అధికారులు తనిఖీ నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల పాటు తమ వద్దే ఉంచుకున్నారు. పైపెచ్చు.. వాసుకీని బలపరు స్తూ తగినన్ని ఎస్‌ఎంఎస్‌లు, ఇ-మెయిల్స్ రాకపోవడంతో ఆమె టాప్ టన్‌లో స్థానం దక్కించుకోలేకపోయినట్టు తెలుస్తోంది.
అందాల రాణులను అందలమెక్కిచే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉత్కంఠగా...ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా... జరిగిన ఈ బ్యూటీ కాంటెస్ట్ 2011 ఫైనల్స్ పోటీలలో విజేతగా నిలచిన లైలాకు బ్రెజిల్‌కు చెందిన మిస్ యూనివర్స్ 2010 గ్సెమినా తన కిరీటాన్ని తొడిగారు.
2006లో అధికంగా 86 మంది పాల్గొనగా, మిస్ యూని వర్స్ పోటీల్లో గత ఏడాది వరకు అదే రికార్డుగా కొనసాగింది. మిస్ యూనివర్స్ 2011 ఫైనల్స్ పోటీలకు తొలిసారిగా బ్రెజిల్ దేశంలోని సావ్‌పౌలో నగరం వేదిక మారడంతో రికార్డు స్థాయిలో 89 మంది కాంటెస్టెంట్‌లు ఉత్సాహంగా ఈ అందాల పోటీల్లో పాల్గొంటున్నారు.
పర్సనాలిటీ డెవలప్‌మెంట్, పబ్లిక్ స్పీకింగ్ కోర్సెస్, స్పానిష్, పోర్చు గీస్ లాంగ్వేజ్ క్లాసెస్, రిజిడ్ జిమ్ వర్క్‌వుట్స్, విజువల్ పాయిస్, హెయిర్, మేకప్ సెషన్స్, పోటో షూట్స్, టివి గెస్టింగ్, పాసరె లాస్, గౌన్ స్విమ్‌సూట్ ఫిట్టింగ్స్ వంటి అంశాలలో పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకున్న ఈ అందాల భామలు తమ దేశాల సంప్రదాయ వస్త్రాల్లో తళుకుల్నీ సందడిగా ఫోటో సూట్స్‌లో అందాలు అరబోసి మధురా నుభూతులను పంచాయి.
ఈ సుందరీమణులు తమ ప్రతిభాపాటవాలకు పదునుపెట్టి బ్యూటీ కాంటెస్ట్ ఫైనల్స్ పోటీల్లో విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరినా చివరకి నల్లపిల్ల చక్కని సమాధానాలతో కిరీటాన్ని ఎత్తుకుపోయింది.
ఈ కిరీటం విలువ దాదాపు కోటిన్నర రూపాయల పైమాటే. ఈ కిరీ టాన్ని‘ప్రపంచ వ్యాప్త జ్యూయలరీలో పేరెన్నిక గన్న డైమండ్ నక్సన్ ల్యాబ్ తయారు చేసింది. ఇందులో 1371 రూబీ వజ్రాలు, జెమ్ స్టోన్స్, 544.31 గ్రాముల బంగారం, ప్లాటినంలతో రూపొందించారు.
ఇక ఈ అందాల పోటీల నుంచి నార్వే, జాంబియా దేశాలు తప్పు కున్నాయి. కేమన్ ఐలాండ్స్, చిలీ, ఇస్టో నియా, ఔమాంటెనెగ్రో, పోర్చు గల్, సెయింట్‌లూసియా, టర్క్స్ కేకోస్, వియత్నాం దేశాల మిస్ యూని వర్స్‌లు వివిధ కారణాల వల్ల పోటీల నుంచి విరమించుకొన్నారు.
జగజ్జేతని చేసిన సమాధానమిది...
అవకాశం వస్తే మీరు ఎలాంటి శారీరక మార్పునకు ఇష్టపడతారని న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నకు లైలా ధీటైన సమాధానమిచ్చింది. దేవుడు సృష్టించిన ప్రస్తుత తన ఆకృతితో సంతృప్తికరంగా ఉన్నాన ని, అవకాశం వచ్చినా తాను ఎలాంటి మార్పులు కోరుకోనని చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందిన న్యాయనిర్ణేతలు ఆమెవైపు మొగ్గుచూపారు. ఫలితంగా విశ్వవిజేత టైటిల్‌ను దక్కించుకుంది.
మన వాసుకీకి నిరాశే...
మిస్ యూనివర్స్ పోటీలో తెలుగమ్మాయి వాసుకీకి నిరాశ ఎదురైంది. ఇంతకు మునుపు నేషనల్ డ్రెస్ పోటీల్లో కూడా పాల్గొనలేకపోయింది. భారతీయతను కనబరిచేలా ఆమె ప్రత్యేకంగా తీసుకెళ్లిన దుస్తులు బ్రెజిల్ కస్టమ్స్ అధికారుల వద్ద వారం రోజుల పాటు ఉండిపోవటం ఫలితంగా ఫోటో సెషన్‌లో పాల్గొనలేకపోయినట్టు వాసుకీ తన ట్విట్టర్ బ్లాగులో పేర్కొంది. నేనే చాలా కలత చెందా.. నాకీ అవకాశం కల్పించిన దేశానికి... అందరికీ కృతజతలు.. వారంతా నన్ను క్షమించాలని విన్నవించింది.