15, నవంబర్ 2011, మంగళవారం

అంధకారంలో... బ్రెయిలీ విద్య


ప్రపంచ చారిత్రక పరిణామంలో చదవలేని వినలేని చీకటి కోణాలెన్నో అలాగే కళ్ళు లేక కదలరాక అంధుల జీవితాలు చరిత్ర కాలగర్భంలోనే మిగిలిపోయాయి. వైకల్యమనే చెరసాలలో కన్నీళ్ళను కష్టాలను నేస్తాలుగా చేసుకొని జీవిస్తున్న వికలాంగులకు నిరంతరం జీవన్మరణమే. అయితే కాలక్రమంలో చీకటి చరిత్రలో పొడిచిన వేగుచుక్కల కాంతి కిరణాలే ఈనాటి ప్రగతికి మార్గ సోపానాలు.
అంధుల మార్గ సోపానమైన బ్రెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌ను సక్రమంగా నడపటం లేదు. దాంతో రాష్ట్రంలో అంధులకు బ్రెయిలీ లిపి అందని ద్రాక్షలా.. మిగిలిపోయింది.
ప్రభుత్వాలు పాలకులే అంధులపై తమకున్న కనీస బాధ్యతను విస్మరి స్తున్నారు. సమాజ అభివృద్ధిలో మాకు సైతం వాటా కల్పించి చదువ ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సిన వారే మాపై సవతి తల్లి ప్రేమ చూపితే ఎలా తన చిన్న తనంలోనే తన తండ్రిని అను కరిస్తూన్న క్రమంలో తను అంధత్వాన్ని స్వీకరించాడు. అయినా బాధ పడకుండా చదువుకోవా లనే తపనతో నాలాంటి అంధులకు సైతం విధ్వనందించాలనే ఉద్దేశంతో లూయి బ్రెయిలీ, మహౌన్నతమైన మేధస్సు నుండి ఉద్బ వించిందే బ్రెయిలీ లిపి.
1832 సంవత్సరంలో తయారు చేయబడి వాడుకలోకి వచ్చింది. బ్రెయిలీ లిపికున్న విశిష్ఠత గొప్పతనం ఏంటంటే - మొత్తం ప్రపంచ భాషలోకెల్లా బ్రెయిలీ లిపి మాత్రం ఒక్కటే. ఇప్పుడున్న కంప్యూటర్స్‌ సాఫ్ట్‌వేర్‌లకి అనుకూలంగా లిపి తీర్చిదిద్దిన గొప్ప మేధావి అయిన బ్రెయిలీ కూడా అంధుడే కదా, ప్రీకర్‌సన్‌, డాట్‌ మాట్రిక్స ఈనాటి ప్రింటర్స్‌కు ఆధారమైన పరికరాన్ని రూపొందించిన ప్రజ్ఞాశాలి మన లూయీబ్రెయిలి.
ఇంతటి గొప్ప చరిత్ర వుండి అంధుల కోసం ఉద్భవించిన బ్రెయిలీ లిపి మన రాష్ట్రంలో వున్న వేలాది అంధ విద్యార్థుల కోసం పాఠ్య పుస్త కాలు, బ్రెయిలి పలకలు, బ్రెయిలీ నోట్స్‌, టైప్‌బోర్డ్‌, మార్బల్‌బోర్డ్‌, పెగ్‌బోర్డ్‌లు అందించడానికి రాష్ట్రంలో ఒకే ఒక్క బ్రెయిలీ ప్రెస్‌ 1986 లో ఏర్పాటైంది. మన రాష్ట్రంలో ఉన్న అంధ విద్యార్ధులకి 12వేల పుస్త కాలు అవసరం కాగా 2 నుండి 3 వేల పుస్తకాలు ఏ మేరకు సరిపోత ాయో మీరే ఆలోచించండి. మేము కూడా చదువుకుంటాము. దేశ సంపూర్ణ అక్షరాస్యతలో మాకూ వాటా ఉందని ప్రభుత్వాలకు పాలకు లకు ఎన్నిసార్లు గుర్తుచేసినా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తున్నది.
పుస్తకాల ముద్రణకు పశ్చిమ జర్మనీ నుండి 1986 తెప్పించిన ఒరిజి నల్‌ హైడర్‌ బర్గ్‌ మిషన్‌ 5 నిమిషాల్లో 200 పేజీలు ముద్రణ చేయగలదు. కానీ ఇది గత పది సంవత్సరాలుగా రిపేరు చేయబడు తుంది. ప్రతి 2 నెలలకోసారి దీనికి రిపేరు ఖర్చు అరవై వేల రూపా యలు మాత్రమే. హిస్టోరియా డాటా ఎంట్రి మిషన్లు రెండుంటే ఇవి కూడా అధ్వాన్నంగానే ఉన్నాయి. ఏ మాత్రం పనిచేయకుండా మూల కు మూలుగుతున్నాయి. 5 కంప్యూటర్‌లుంటే వైరస్‌ పున్యామానీ ఇవి కూడా అంధ విద్యార్థుల పట్ల పక్షపాతం చూపిస్తున్నాయి. కంప్యూటర్‌ లను సరిచేసి పనిచేయించడానికి దిక్కు, మొక్కుమొక్కు లేదు. 4 చిన్న ప్రింట్‌ మిషన్లు ఉన్నాయి. ఇవి గంటకి 200 పేజీలు ప్రింట్‌ చేయగల దు. ప్రతి గంటకి 15 నిమిషాలు విశ్రాంతి అవసరం.
ఎందుకంటే ప్రింటింగ్‌ మిషన్లకి ఎసి వుంటేనే సక్రమంగా పని చేయ గలవు. గత కొంత కాలంగా ప్రింటింగ్‌ మిషన్ల నీడిల్స్‌ రిపేరులో వుం టేనే పట్టించుకునే నాథుడే లేదు. అయితే యంత్రాలు సరిగా పనిచేయ డానికి ఇక ఎసి గురించి చింతన దండగేకదా. అందుకే 12 వేల పుస కాల డిమాండ్‌కు కేవలం 2-3వేల పుస్తకాలే ప్రింట్‌ అవుతుంటే చాలీ చాలని పుస్తకాలతో విద్యార్థులు పడే ఇబ్బంది ఊహించలేం. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకే పుస్తకాలు అందక పాఠాలు ఎలా చెప్పా లో తెలియని పరిస్థితి. జి.ఓ.ఎం.ఎస్‌ 410 ప్రకారం స్కూల్‌ ఎడ్యుకేష న్‌ ప్రీగా పేపర్‌ ఇవ్వాలి గత మూడు సంవత్సరాలుగా మానేసి 2011 ఫిబ్రవరిలో పేపర్‌ కొంత ప్రెస్‌కి ఇచ్చింది. పేపర్‌ లేక కూడా పుస్తకాల ప్రింట్‌ నిలిచి పోయింది మరి.
ప్రింటింగ్‌, డిస్పాచ్‌, ప్రూఫ్‌ రీడింగ్‌, బైండింగ్‌, డాటా ఎంట్రీ, స్టోరేజీ, లైబ్రరీ మొత్తం మిషనరీ ఆఫీ సు నిర్వహణ అన్నింటికీ కేవలం 4 గదుల భవనం ఉండటంతో ఇరుకు గదుల్లో ఇవన్నీ సాధ్యం కాక ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. నూతన భవన నిర్మాణానికి నూతన మిషనరీ ఇప్పిం చాలని 1999లోనే ఉద్యోగులు ముఖ్యమంత్రి అధికా రులకు విజ్ఞప్తి చేసినా అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే మిగిలిపోయింది.
బ్రెయిలీ ప్రెస్‌ 1986లో ఏర్పాటైనపుడు మొత్తం 32 మంది స్టాఫ్‌ వుంటే ప్రస్తు తం 10మంది స్టాఫ్‌ మాత్రమే. విద్య ప్రాముఖ్యత పెరుగుతున్న కొద్ది స్టాఫ్‌ని తగ్గించి బ్రెయిలీ ప్రెస్‌ని నిర్వీర్యం చేయాలనో ఆలోచనే విడ్డూరం. మరీ వీరికి 1993-1998, 2003,2009 సంవత్సరాలలో పిఆర్‌సి నాలుగుసార్లు పెరిగితే ఇప్పటికీ 1993 పిఆర్‌సి ప్రకారమే జీతాలు ఇస్తున్నారు. ఇదెక్కడి న్యాయం దేశంలో అత్యధికంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జీతాలు తమ ఇష్టానుసారంగా పెంచుకోవచ్చు. అందినంత స్వాహా చేయవచ్చు. కానీ బ్రెయిలీ ప్రెస్‌ ఉద్యోగుల కు పెంచిన పీఆర్‌సి ప్రకా రం జీతాలు ఇవ్వరా
ఇప్పటికైనా బ్రెయిలీ ప్రెస్‌ సక్రమంగా నిర్వహణ జరగాలంటే ఆర్థిక పరిస్థితులు చాలా ప్రాధాన్యం. అయితే ప్రభుత్వానికి ఈ చిన్న విష యం కూడా పట్టడం లేదు. 100 రోజుల్లో 2కోట్లు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి ప్రకటిస్తే అది ఇంకా ఫైనాన్స్‌ డిపార్ట్‌్‌ మెంట్‌లోనే కోటి 36 లక్షలకు కుదించబడి ఫైలు మూలకు మూలుగుతుంది. ముఖ్యమంత్రి ప్రకటించిన 100రోజుల గడువు ముంచుకొస్తుంది. కానీ తగ్గించిన బడ్జెట్‌నైనా ఇచ్చిన పాపానపోలేదు. దేవుడైతే కరుణించాడుకానీ పూజారి వరం ఇవ్వలేదు అన్నటు గా తయారయ్యింది. బడ్జెట్‌ కేటాయింపులు క్రమంగా తగ్గించి బ్రెయిలీప్రెస్‌ను భవిష్యత్‌లో కను మరుగు చేయాలనే ప్రభుత్వ ఆలోచన సరళి మార్చు కోవాలి. రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే అంధుల విద్య కూడా సంపూర్ణ అక్షరాస్యతలో భాగమే కదా.బ్రెయిలీ విద్య ఇప్పటికైనా అంధులందరికీ అందేలా ప్రమాణాలు పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బ్రెయిలీ ప్రెస్‌ను ఆధునీక రిం చి, నూతన కంప్యూటర్‌ అటాచ్‌ మెంట్‌ హైడల్‌బర్గ్‌ ప్రింటింగ్‌ మిష న్‌ దీని సామర్థ్యం కాని 300 పేజీలు ప్రిం ట్‌ చేస్తుం ది. ఈ మిషన్‌ అలాగే రిపేర్‌ లో వున్నది. కంప్యూట ర్స్‌, హిస్టోరియా డాటా ఎంట్రి మిషన్లు, 4 చిన్న ప్రింటింగ్‌ మిషన్లకు ఆధునీకరించాలి.
బ్రెయిలీ ప్రెస్‌పై అవగాహన కలిగిన వ్యక్తుల్ని నియమించాలి. 1-10వ తరగతి పుస్తకాలే కాకుండా యూనివర్సిటీ స్థాయి వరకు పుస్తకాలు ప్రింట్‌ చేయాలి. 1-10 వర కు బ్రెయిలీ లిపిలో చదువుకున్న విద్యార్థి ఒకసారి ఇంటర్‌పె ౖస్థాయి విద్యను సాధారణ లిప ిలో చదవడం సాధ్యం కాదు
అంధులకు చేయూతనిస్తే వీరు సైతం అద్భుతాలు సృష్టిస్తారన్నది వాస్త వం. బ్రెయిలీ లిపిని ప్రపంచానికి పరిచయం చేసింది. కూడా అంధుడే కదా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోమించిన ఎరిక విహ్నేరియా అంధుడే. 2010 సివిల్స్‌లో 78వ ర్యాంకుతో ఐఎఎస్‌ సాధిం చిన స్వాతి కూడా అంధురాలే కదా. ఈమె చదివింది బ్రెయిలీ పుస్తకాలే. యూరోపియన్‌ యూనియన్‌ 27 సభ్యదేశాల సమావేశాల ప్రసంగా లను స్పానిష్‌, ఫ్రెంచ్‌, జర్మనీ, చైనా భాషల్లోకి అనువదించింది కూడా అంధురాలైన ఆలేక్సి యా కూడా బ్రెయిలీ లిపిలో నే చదువుకుంది. అందుకే ఆలేక్సియా కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఈ సంవత్సరం యంగ్‌ అచీవర్స్‌ అవార్డ్‌ను ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోను, ప్రపంచ చరిత్రలోను అంధులకు అవకాశమిస్తే మేము సైతం దేనికి తీసిపోమన్నది రుజువు చేశారు. కనుక ప్రభుత్వం ఇకనైనా బ్రెయిలీ ప్రెస్‌ను పునరుద్ధరించాలి.
ఏటా ముద్రించేవి మూడు వేలే..
మన రాష్ట్రంలో అంధులకు విద్యనందించేందుకుగాను 10వ తరగతి వరకు మాత్రమే రాష్ట్ర ప్రభు త్వం 8 రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ప్రైవేట్‌ వ్యక్తులు 10 రెసిడెన్షియల్‌ పాఠశాలలను నిర్వహిస్తు న్నారు. వీటిలో మొత్తం విద్యార్థులు 1800పైగానే చదువుకుంటున్నారు. వీరందరికి సంవత్సరా నికిగాను 12వేల బ్రెయిలి పుస్తకాలు, 2 వేల బ్రెయిలి పలకలు స్టిక్స, మార్బల్‌ బోర్డ్స్‌, సెగ్‌ బోర్డ్‌ లు, టేప్‌బోర్టులు అవసరమవుతున్నాయి. కానీ ప్రతి విద్యా సంవత్సరం బ్రెయిలి ప్రెస్‌ నుండి 2, 3 వేల పుస్తకాలు మాత్రమే ప్రింట్‌ అవుతున్నాయి.

కోతలే బోలెడు...
సంవత్సరం - కేటాయింపు - విడుదల - కోతశాతం
2008-09. 15లక్షలు. 10 లక్షలు. 44.
2009-10. 10లక్షలు. 5 లక్షలు. 50.
2010-11. 10లక్షలు. 4 లక్షలు. 40.
2011-12. లేమీ లేవు.
- పోడిశెట్టి రాజశేఖర్‌.