15, నవంబర్ 2011, మంగళవారం

పెద్దలపై చిన్న చూపెందుకు?

బాల్యం - 20 ఏళ్లయితే, కౌమార, యవన దశలు 40 సంవత్సరాలు. ఇలా మనిషి జీవిత ప్రయాణంలో 3 దశలు పూర్తి చేసి 60 ఏళ్లు చేరుకుంటే ఃషష్టిపూర్తిః మన తెలుగు సంవత్సరాలు 60. ప్రభవ నుంచి అక్షయ వరకు ఇవే పునరావృతమవుతాయి. కాలచక్రంలో 60 ఏళ్లు పూర్తయిన వ్యక్తికి ఃషష్టిపూర్తిః చేస్తారు.
దీన్నే సంప్రదాయ భాషలో ఉగ్రరథ శాంతి అంటారు. డెభ్బై వసంతాల వ్యక్తికీ ఃభీమరధిశాంతిః చేస్తారు. 83 సంవత్సరాలు దాటితే ఃఃసహస్ర చంద్రదర్శనంఃః వెయ్యి పున్నములు సందర్శనోత్సవము జరుపుతారు. వృద్ధులు రెట్టించిన ఉత్సాహంతో జీవించేటట్లు చేసేందుకే ఈ ఉత్సవాలు.
మన పెద్దలు దీవించే టప్పుడు ఃఃశతయుష్మాన్‌ భవః అని దీవిస్తారు.
ఈ నూరు సంవత్సరాల జీవితాన్ని నాలుగు దశలుగా 25 ఏళ్లు బ్రహ్మచర్యం శ్రమము, 25 ఏళ్లు గార్హస్థ్యం, 25 ఏళ్లు వాన ప్రస్థం, 25 ఏళ్లు సన్యాసం అని మన పెద్దలు నిర్ణయించారు.
ఇవి మానవుని సర్వతోముఖాభివృద్ధికి, ఆధ్యాత్మికోన్నతికి, తద్వారా సమాజ వికాసానికి, దేశ కళ్యాణానికి తోడ్పడతాయని వారి విశ్వాసం. వీటినే ఆశ్రమ ధర్మాలు అంటారు. ఈ కాలంలో ఆశ్రమ ధర్మాల సంగతటుంచి వృద్ధాశ్రమాల్లో చేర్పించి ఏ శ్రమాలేకుండా చేతులు దులుపుకుంటున్నారు.

కుటుంబమే బాల్యానికి నాందీ. సమాజ నిర్మాణానికి అదే పునాది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా తెరమరుగై చిన్నచిన్న కుటుంబాలు తెరమీదకు వచ్చాయి. ఏకసంతానంతో కుటుంబం ఇంకా చిన్నదై పోయింది. తల్లిదండ్రులకు ఒక్కరే సంతానమై, ఆ యిద్దరూ కూడా ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేకుండా ఉండే ఇంట్లో ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటి పాఠశాలలో మాట్లాడానికి అవకాశం లేదు. ఇంట్లో కూడా మాట్లాడడానికి ఎవరూ ఉండరూ!
ఇక యవ్వనం అనేది ఒక వరం లాంటిది. తగల బడుతుందని తెలియక మిడుత దీపంపై పడుతుంది. తెలియక చేప గాలానికున్న ఎరను తింటుంది. భోగాలు మబ్బులో మెరిసే మెరుపు తీగల్లాగా చంచలమైనది. జీవితం తామరాకు మీది నీటి బిందువులాంటిది. ఆయువు తరంగాలుగా చంచలమైనది. యవ్వనం తర్వాత వచ్చే వృద్ధాప్య దశ శేష జీవితానికి బంగారు బాటకావాలి. వయస్సు పెరుగుతుంది. ఆయుష్షు తరుగుతుంది. కానీ ఇంకా జీవించాలనే ఆశమాత్రం చావదు.
వృద్ధాప్యం సార్థకత కావాలంటే సంసారం చంచలమైనది సంపదలు ఎండమావులాంటివని నన్నయగారు చెప్పిన మాటను స్ఫురణకు తెచ్చుకోవాలి. సముద్రాన్ని ఈదవచ్చునేవెూగానీ, సంసారం దాటలేమనే నానుడి అందుకే పుట్టింది. ఃఃఎంత సాంపదించినా కూటికే - ఎన్నాళ్లూ బతికినా కాటికేఃః అంటారు పెద్దలు. అందుకే ఃఃఈ సంసారమనే సముద్రాన్ని దాటటం నాకు శక్యం గాదుఃః అంటారు కులశేఖరాళ్వార్లు.
వృద్ధుడంటే ఎవరు
ఃఃమాజీ యువకుడుఃః
కనుక నేటి యువకులే రేపటి వృద్ధులు అని చెపðకోవచ్చు. జీవనయానంలో 60 సంవత్సరాలు దాటిన వారిని వృద్ధులుగా గుర్తించడం పరిపాటి. వీరినే సీనియర్‌ సిటిజన్‌లు అంటారు. వయోవృద్ధులు చంటిపాపలతో సమానం. వీరిని కంటి పాపల్లా చూసుకోవడం మన కర్తవ్యం. అందుకే ప్రతియేటా అక్టోబరు ఒకటవ తేదిని వృద్ధుల దినోత్సవంగా జరుపు కుంటాం. ఈ పేరు చెప్పి కాసిని పళ్ళు ఇచ్చో వారితో కాసేపు ఆడిపాడో కాలక్షేపం చేసేసి మరుక్షణం నుంచే నాటి మొహం చాటేస్తే అంతకన్నా అన్యాయం.. అహేతుకం మరొకటి ఉండదు.
వృద్ధులు సర్వ సమర్థులు
ప్రపంచ వ్యాప్తంగా 60 సంవత్సరాలపై వయసు బడిన వయోవృద్ధులు దేశానికి భారం కాక, కొండంత అండగా నిలుస్తున్నారు. ఈ రోజున ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, వివిధ రాష్ట్రాలలో గవర్నర్లు, ముఖ్యమంత్రులలో వయోధికులే అధికంగా ఉన్నారు. దీని ద్వారా వారి అనుభవాలు దేశానికి ఎంతో అవసరమన్న విషయం విదితం అవుతున్నది. వయోవృద్ధుల సేవలు, అనుభవం సమాజాభివృద్ధికి దోహదపడాలంటే మరింత ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగ లగాలి. ఇందుకు దోహదం చేసేందుకే ప్రతి యేడాది అక్టోబర్‌ 1న అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం నిర్వహించాలని 1990లో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. 1991 నుండి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ దినోత్స వాన్ని పాటిస్తున్నాయి.

రెక్కలుడిగిన వారికి దిక్కు కావాలి
అందివచ్చిన బిడ్డలు వృద్ధాప్యంలో తమను అక్కున చేర్చుకుంటారని ఏ తల్లిదండ్రులైనా ఆశిస్తారు. కానీ రెక్కలొచ్చిన పిల్లలు చదువులు, కెరీర్‌ అంటూ పెద్ద నగరాలకు, ఇతర దేశాలకు పయనమవుతున్నారు. పెళ్ళిళ్ళూ పేరంటాలు అయ్యాక మైక్రోఫామిలీ అంటూ ఎవరికి వారు చిన్న చిన్న కుటుంబాలను ఏర్పాటు చేసుకుని పెద్దలను వృద్ధుల ఆశ్రమాలకు పంపేస్తున్నారు. వారి యోగ క్షేమాలు బాగా చూసుకోం డంటూ డబ్బులు కట్టి పోషణ, సంరక్షణ వంటి బాధ్యతల నుంచి తపðకుంటు న్నారు. ఇలా చేయడం వల్ల వృద్ధులకు తలదాచుకోడానికి ఒక చూరు, వేళకింత తిండి, రోగమొస్తే నాడి పట్టే డాక్టరు దొరుకుతున్నాడేవెూ కానీ వారి నాడి గ్రహించి వారు కోరుకుంటున్న ఆప్యా యత,అనురాగం, ముద్దు ముచ్చట, నా అనే తోడు, మనవలతో కాలక్షేపం వంటి వాటిని అందించేవారు అరుదైపోతున్నారు.వృదా ్ధశ్రమా లలో వృద్ధులు ఎందరో ఉంటారు. అయినా ఎవరి కివారు నలుగురిలో ఉన్నా ఒంట రవుతున్నారు. చుట్టూ ఉన్నది
తనలాంటి వాళ్ళేకావడంతో కలిసి కంటతడిపెట్టుకుంటున్నారు. ఒకరి కథలు ఒకరు చెపðకుని ఓదార్చుకుంటున్నారు. ఃవృద్ధో బాలసమఃః పెద్దవుతున్న కొద్దీ పెద్దలు పసి బిడ్డలైపోతారు. బిడ్డల్ని వదలి ఉండలేరు. ఉన్నా ప్రశాంతంగా బతకలేరు.

నేడు వయోధికుల దినోత్సవం

మనమేం చేద్దాం
వృద్ధాప్యంలో ఉన్నవారితో ప్రతిరోజూ కాసేపైనా వాళ్ళతో గడపాలి, యోగక్షేమాలు తెలుసుకోవాలి.వారి అభిప్రాయాలను గౌరవించి కుటుంబంలో ఓ గుర్తింపు ఉన్నదన్న విశ్వాసాన్ని కలిగించాలి. వాళ్ళు ఉండే గదుల్ని శుభ్రంగా ఉంచాలి. 80 ఏళ్లు దాటిన వారుండే గదుల్లో పాలిష్‌ బండలు వేయకుండా మామూలు ఫ్లోరింగ్‌ చేయాలి. అలాగే వయోధికులు కూడా తమ కాలాన్ని ఆధ్యాత్మికంగా పఠనాసక్తిని పెంపొందించు కోవాలి. నిత్య వ్యాయామం చేస్తూ ఃఃమూడు కాళ్ళ ముదుసలిఃః అనే మాట రాకుండా చూసుకోవాలి. ప్రశాంత జీవనాన్ని గడపుతూ కోపాన్ని తగ్గించుకోవాలి. వీలైతే ఇతరులకు సహాయ పడాలి. తమ సంతానం తమను విడిచిపోయారని బాధ ఉండటం సహజం. కానీ ఈ ఆధునిక యుగంలో ఇంటర్‌నెట్‌ ద్వారా పిల్లలతో మాట్లాడుకోవచ్చు. అలా వీలైనంత వరకు వారు ఎవ్వరికీ భారం కాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.


ప్రభుత్వానికీ ఉంది బాధ్యత
ఉమ్మడి కుటుంబం ఉంటే పిల్లల, వృద్ధుల ఆలనాపాలనలను అందరూ చూసుకునేవారు. వివిధ కారణాల వల్ల ఆ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. సహజంగా తమ పిల్లల దగ్గర శేషజీవితాన్ని సంతోషంగా గడపాలని వృద్ధులు కోరుకుంటారు. ఆడపిల్లలు పెళ్లయిన తరువాత దూరంగా వెళ్లిపోతారు. కానీ ప్రస్తుతం కొడుకులు కూడా అంతే. కొడుకులపై ఆధారపడేతత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఃరాజ్యాంగంః 41వ అధికరణంలో వృద్ధులైన పౌరుల పట్ల ప్రభుత్వం బాధ్యతను ప్రస్తావిస్తుంది. వృద్ధుల సంక్షేమం రాష్ట్రాల పరిధిలోని అంశం అయినప్పటికీ వీరికి సంబంధించిన ప్రధాన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1999లో ఒక వృద్ధుల జాతీయ ప్రణాళిక (ఎన్‌పిఒపి)ను రచించింది. 2007లో తల్లిదండ్రుల, వృద్ధుల సంక్షేమ పోషణ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. వయో వృద్ధుల కొరకై, అనాథ వృద్దుల కొరకై నెలకు రూ. 200 భృతిని చెల్లిస్తుంది. రాష్ట్రాలు కూడా వృద్ధాప్య పెన్షన్‌ పథకం,ఆరోగ్య భద్రత కోసం రాష్ట్రీయ స్వాస్త్య భీమా యోజన ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. తల్లిదండ్రుల, వృద్ధుల ఆలనాపాలనా చూడకుండా నిర్దయగా వ్యవహరించే పిల్లలను, తల్లిదండ్రుల పోషణ బాధ్యతను వహించేటట్లుగా 2007 సంవత్సరంలో కేంద్రం చట్టం చేసి, అన్ని రాష్ట్రాలను తమ నియమ నిబంధనలు రూపొందించుకొని అమలు చేయమని కోరింది. మన రాష్ట్రంలో ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు జీవోలను జారీ చేయడం జరిగింది. ఎంతో మంది వృద్ధులు భరణం అందక కృశించి కాలగర్భంలో కలిసి పోతున్నారు.