15, నవంబర్ 2011, మంగళవారం

మెరుగైన సమాజం కోసం...

అంధకారాన్ని తిడుతూ కూర్చోవడం కంటే, ఓ చిరుదీపం వెలిగించి చీకట్లను పటాపంచలు చేయడం ముఖ్యం. నైతిక విలువల పతనానికి జవాబు వ్యక్తిత్వ నిర్మాణం. ఈ కోవలో మానవత, ఆధ్యాత్మిక విలువల పునరుద్ధరణకు వ్రజాల వ్యాపారాన్ని కూడా మానుకొని దాదా లేగ్‌ రాజ్‌ 1937లో 'ప్రజాపిత బ్రహ్మ' ఓ ట్రస్ట్‌ను నెలకొల్పారు. దీనికి ప్రథమ అధ్యక్షులు జగదంబ సరస్వతి. ఈ సంస్థకు 86 దేశాలలో 6500పై బడి శాఖలున్నాయి.

ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ఐక్యరాజ్య సమితి, యూనిసెఫ్‌, ఆర్థిక సామాజిక పరిషత్‌ (ఏకోసాట్‌) ఉన్నత గౌరవాన్ని సముపార్జించాయి. మెరుగైన సమాజం కోసం రాజయోగ శిక్షణ, వరల్డ్‌ రెన్యువల్‌ స్పిరిచ్యువల్‌ ట్రస్ట్‌ ద్వారా రాజయోగ శిక్షణ, సమాజంలో వివిధ వర్గాలకు చెందిన వైద్యులు, ఇంజనీర్లు, సైంటిస్టులు, విద్యావేత్తలు, పత్రికా సంచాలకులు, వ్యాపారులు, న్యాయవాదులు, సమాజ సేవకులకు, సాంస్కృతిక కళాకారులు, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామసేవకులకు కార్యక్రమాలు, సమ్మేళనాలు నిర్వహిస్తారు.
నిద్రాణమైన శక్తుల పునరుజ్జీవనంలోనూ, అంతర్లీన శక్తులను మేల్కొల్పటంలోనూ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విశేష, కృషి చేస్తుంది. అంతేకాక జైళ్లలో, ఆసుపత్రులలో, పాఠశాలలో కూడా కార్య క్రమాలను రూపొందించారు. ఆరావళి పర్వత శ్రేణులలో సుందర ప్రకృతి రమ ణీయ ప్రదేశం ఆబూ పర్వత ప్రాంతంలో ఈ కేంద్రం నెలకొంది. ఓం శాంతి భవనం జ్ఞాన సరోవరం. యూనివర్సల్‌ హార్మనీహాల్‌, రాజయోగ సభాగృహం సోలార్‌ భోజనశాల, డైమండ్‌ జూబ్లిdహాల్‌, పీస్‌ పాల్య్‌, ఆధ్యాత్మిక సంగ్రహాలయం, గ్లోబల్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పేరెన్నిక గన్నవి. శాంతి స్థంభం, డైమండ్‌ హౌస్‌, తపస్యాధామంలను రోజూ కొన్ని వేల మంది దర్శిస్తారు.
కాలానుగుణంగా అన్ని విభాగాల్లో శిక్షణ అందిస్తారు. దీని కారణాన వారు జీవితంలో రాణించటానికి అవకాశాలు మెండుగా వుంటాయి. బ్ర హ్మకుమారీస్‌ ముఖ్య కేంద్రం మధువనం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ అకాడమీ వుంది. 28 ఎకరాల భూమిలో సామూహిక వికాస ప్రణాళిక కోసం విద్యను రూపొందించారు. అకాడమీ ఫర్‌ ఎ బెటర్‌ వరల్డ్‌ ద్వారా మార్గోపదేశం జరుగుతుంది.
మీడియా విభాగం
ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మీడియా విభాగాన్ని ప్రారంభించి 50 సంవత్సరాలైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని
సెప్టెంబర్‌ 16 నుండి 19వరకూ సదస్సు జరిగింది. దీనిలో దాదీజానకీజీ, బి.కె. కరు ణ, బి.కె. ఓంప్రకాష్‌, ప్రొ. కమల్‌ దీక్షిత్‌, బి.కె. ఆత్మప్రకాష్‌, బి.కె. గిరీష్‌, బి.కె. గంగాధర్‌, డా. సి.వి. నరసింహారెడ్డి, బి.కె. సరళా ఆనంద్‌, ప్రొ ఉజ్జ్వల్‌ చౌదరి, ఇర్ఫాన్‌ఖాన్‌, బి.కె. మృత్యుంజయ తదితరులు మార్గదర్శనం చేశారు.
ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మత సంస్థకాదు. ఆధ్యాత్మిక సంస్థ. ఇక్కడ మహిళా సాధికారత స్పష్టంగా కానవస్తుంది. ప్రకాష్‌, మణి ప్రతీ మీడియా సదస్సులోని పాల్గొని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా వారికి దిశాదర్శనం చేయడం గమనార్హం. మీడియాలో విలువల పరిరక్షణకు సంస్థ కంకణం కట్టుకుంది. స్వాతంత్రోద్యమ సందర్భంలో మీడియా చురుకైన పాత్రను పోషించింది. ఈ మధ్యకాలంలో శ్రీ సత్యసాయిబాబా సాయుజ్య సమయంలోనూ, రామ్‌దేవ్‌ బాబా, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో మీడియా ముందున్నది.
డా సి.వి. నరసింహారెడ్డి, మాజీ డైరెక్టర్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌, రేడియో చానెల్స్‌ తీరు తెన్నులను వివరించారు. మీడియాను తక్కువ అంచనా వేయరాద న్నారు. బ్రిటిష్‌ వారిని తోకముడిచేట్లు చేయడంలో మీడియా సఫలమైం దన్నారు. దాదీజీ జానకి మీడియాను ఉద్దేశిస్తూ 'అంతర్వాణి'ని గమ నించాల్సిన అవశ్యం ఎంతైనా వుందన్నారు. బి.కె. ఓం ప్రకాష్‌ జనతాకా హిత్‌, జనతాకీ ఉద్ధాన్‌ గురించి ప్రస్తావించారు.
క్రైమ్‌, సినిమా, క్రికెట్‌, సెలబ్రిటీలు:-
నేడు మీడియా వీటికి ప్రాధాన్యత యివ్వడంతో, అభివృద్ధి కరవార్తలకు, చోటు కుంచించుకుపోయింది. సామాజిక స్పృహ అవసరంగా ఈశ్వరీయ విశ్వ విద్యాలయం పని చేస్తుంది. బి.కె. నిర్వాయర్‌, ప్రధాన సంపా దకులు, వరల్డ్‌ రెన్యువల్‌ తమ ప్రసంగంలో 75 సంవత్సరాల యాత్ర చిన్నది కాదనీ, ప్రతి ఆత్మకు శాంతి, ఈశ్వరుని ప్రేమ కావాలన్నారు. 'పీస్‌ ఆఫ్‌ మైండ్‌' టీవీ చానల్‌ను బి.కె. కరుణాభాయ్‌ నిర్వహిస్తున్నారు. దీనిలో వ్యాపార ప్రకటనలు ఉండకపోవడం గమనార్హం.
మీడియాలో ఆధ్యాత్మికం:-
నేడు పలు వార్తాపత్రికలు, మీడియా చానళ్లు ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, దిహిందూ, ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, భక్తి, ఆస్తా, సంస్సార్‌, విలువల పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు.
అవినీతి రహిత సమాజం:-
ప్రతీ రంగంలోనూ ఆధ్యాత్మికత చోటు చేసుకొని, సత్యమార్గం వైపు పయనిస్తే అవినీతికి చోటుండదు. వేకువనే ధ్యానం, వ్యక్తి తనకు తాను పరివర్తన కావటం చేస్తే అదే స్వర్ణ యుగమని బి.కె. నిర్వాయర్‌ పేర్కొన్నారు. ఇర్ఫాన్‌ఖాన్‌ మీడియా సమాజానికి దర్పణం వంటి దన్నారు.
నేనెవరో తెలుసుకోవాలి:-
దాదీజీ జానకీ ప్రతివారూ తానెవరో అన్వేషణ చేయాలన్నారు. నిస్వార్థభావంతో సేవలందించాలి. విలువలతోనే శక్తి చేకూరుతుంది. పరివర్తన్‌తో ఒకటి, పదకొండు అవుతుందన్నారు. డా సి.వి.ఎన్‌.రెడ్డి మీడియాను ఉద్దేశిస్తూ ఆబూ పర్వత శ్రేణులలో 'అన్నయా' అనే ఆప్యాయపిలుపు కుటుంబ సంస్కారాన్ని సూచిస్తుందన్నారు. పౌరసంబంధ అధికారులు నీతి నియమాలను పాటించాలన్నారు. టుజీ స్పెక్ట్రమ్‌, ఆధార్‌, సత్యం కంప్యూటర్స్‌, నీరా రాడియా వ్యవహారాలు భారత్‌ పరువును తీశాయన్నారు.
పవిర్తన్‌:-
బి.కె. కరుణ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో శిక్షణ కారణంగా 10 లక్షల కుటుంబాలలో పరివర్తన జరిగిందన్నారు. వై. భాస్కరరావు విశ్రాంత జనరల్‌ మేనేజర్‌ ఆంధ్రాబ్యాంక్‌ మానవ సంబంధాలు సరిగా లేకపోతే పరిశ్రమలలో కార్మిక నాయకులచే దెబ్బలు తినడం ఖాయమన్నారు. గ్లోబల్‌ ఎధిక్స్‌లా గ్లోబల్‌ సంబంధాలుండాలన్నారు. ఫ్రెడరిక్‌ మై గేల్‌ రైల్వేలో 1.4 మిలియన్ల ఉద్యోగులున్నారనీ, 22 మిలియన్ల ప్రయాణీకులు రోజూ ప్రయాణిస్తారు. ఆర్కోణం రైలు ప్రమాద సమయంలో విపత్కర పరిస్థితులలో ఎలా రైల్వే అధికారులు వ్యవహరించిందీ, ప్రమాద తీవ్రతను ఎలా అదుపులో పెట్టిందీ వివరించారు.
నవీన పోకడలు:-
నేడు నేడు ట్విట్టర్‌, యూట్యూబ్‌ కొత్త ఆలోచనలకు తెర తీశాయనీ బ్లాగ్‌ను సకారాత్మక ఆలోచనలకు ఉపయోగించాలన్నారు. జి. అనీజా, పిఆర్వో, నార్మ్‌, హైదరాబాద్‌ వ్యవసాయంలో 'ఈ అగ్రికల్చర్‌, సాంకేతిక అభివృద్ధి గురించి వివరించారు. గ్రామీణ స్థాయిలో యువతకు, మహిళ లకు నూతన వ్యవసాయ పద్ధతులను తెలియజేసి అధికోత్పత్తులకు 'నార్మ్‌' శిక్షణను పవర్‌ పాయింట్‌ ప్రదర్శన ద్వారా తెలియజేశారు.