15, నవంబర్ 2011, మంగళవారం

పండుగ సరే.. పూట గడుస్తుందా

కేవలం 32 రూపాయలు రోజుకు సంపాదిస్త్తే... దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వ్యక్తిగా అర్ధం కాని లెక్కలెన్ని పేర్కొన్నా... అసలు వేల కొలది జీతాలు తెచ్చుకున్నా... అతి చాలీచాలని సంపాదనగానే మిగులు తూ.. పొదుపు మాట దేవుడెరుగు... పండగ వస్తోందంటేనే ఖర్చులను తలచుకుని భయపడి పోతున్నారు సామాన్య జనం.
ఉన్నంతలో వినాయక చవితి జరిపి గజానుణ్ని సాగనంపామనే సరికి విజయాలు కూర్చే విజయదశమి వేంచేసింది. ధరలవెూతతో చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా మారిన మధ్యతరగతి సగటు మనిషి ఆర్ధిక పరిస్ధితి తలచుకుని కుమిలి పోతున్నా... పట్టని ప్రభుత్వాలు రూపాయి కిలో బియ్యం అంటూ ఊర డింపు బెల్లాలు, తైలాలు ఇచ్చి... వ్యాట్‌ పరిధిలోకి మరిన్ని వస్తువుల్ని చేర్చింది చాలక... పన్ను ఫలితాన్ని ఎక్కువగా రాబట్టే ప్రయత్నాలు చేస్తూ...ఇష్టానుసారం పెంచుకుపోతోంది. దీంతో ఇప్పటికే అందని తీరాల కేగిన ధరలు.. దిగి రానంటున్నాయి. ఛాన్సు దొరికిందే తడవుగా వ్యాట్‌ రేటు పెంపు బూచి చూపి నిత్యా వసరాలధరలు ఓవైపు పెంచుకు పోతున్న వ్యాపారులకు పెట్రో, డీజల్‌ దరల పెంపు మరో అందివచ్చిన అవకాశంగా మారిందనటంలో సందేహం లేదు.
ఓనాడు పండగొస్తోందంటే... బంధుమిత్రులని, చిరు నవ్వుతో తమ ఇళ్లకు ఆహ్వానించి ఉన్నంతలోనే గొప్ప గా జరిపించే కుటుంబ పెద్దలు నేటి పరిణామాలు చూసి విస్తుపోతున్నారు. దసరా వచ్చిందంటే... సెలవులకు గ్రామాలలో ప్రతి ఇల్లూ కూతుళ్లు, అల్లుళ్లు, కోడళ్లు, కొడుకులు, మనుమలు, మనుమ రాండ్రులతో కళకళలాడేవి. అంతా కల్సి ఆనందంగా పండుగని జరుపుకోవటమే కాకుండా తోటివారికి ఇతోధికంగా సాయపడేవారు కూడా.
అయితేపూటగటవమేకష్ట్టంగా మారి పస్తులుంటున్న పేదలకే కాదు... మధ్యతరగతి కుటుంబానికీ పండగ వస్తోందని తలచుకుంటేనే బెంబేలెత్తుతున్న స్ధితి.నెలకొంది నేడు. నిత్యావసరాల ధరాఘాతం దెబ్బకి పల్లెల్లో సైతం పండగ హడావిడి కనిపించకుండా చేసిందంటే ఆశ్చర్యం కలగక మానదు. పండగలలో బట్టల కొనుగోలుకు మక్కువ చూపే సమాన్యుడు ఇపðడు బట్టల షాపు గుమ్మం తొక్కడానికన్నా ముందు చిన్న బోయిన తన జేబు వంక వింతగా చూస్తున్నాడు. వస్త్రాలపై వ్యాట్‌ వేసిన కారణంగా ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయని.. వస్త్ర వ్యాపారులు .. వ్యాట్‌ని ఎత్తేయాలని కోరుతూ బంద్‌లు హర్తాళ్లూ చేసినా ఫలితం లేక పోయింది. దీంతో పండగకు పాత బట్టలతోనే సరిపెట్టుకు రావాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న వారెందరో.
ఇక రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్ధితులు సైతం సామాన్యుడికి పండగ వాతావరణాన్ని దూరం చేసాయనే చెప్పక తప్పదు. ఆనందంగా పండగ జరుపుకుందామనుకున్న ఉద్యోగ వర్గాలపై 'పనికి వేతనం' అంటూ ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నం.177 తప్పని సరిగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయటంతో సమ్మె బాటలో ఉన్న వీరికి జీతాలు రాని పరిస్ధితి. సకల జనుల సమ్మె ప్రభావంతో తిరగాడని వాహనాలు రోజువారీ కూలిలపైనా ప్రభావం చూపిస్తూ.. సంపాదనలో సగం రాక పోకలకే చెల్లించుకోవాల్సి వస్తుండటంతో దసరా సరదాలు ఈ సారి లేనట్లే అని సరిపుచ్చుకుంటున్నారు. సాధారణంగా తెలంగాణా జిల్లాలో దసరా కు 5 రోజుల ముందు నుండే కనిపించే దసరా సంబరాలు, ఇళ్లలో కనిపించే కళా కాంతులు కారణాలేవైనా కాస్త తగ్గిందన్న మాట వాస్తవం.
ఇప్పటికే వ్యాపారాలు దెబ్బతింటున్నాయన్న మిషతో పాటు జరుగుతున్న పరిణామాలతో సరుకుల దిగుమతి కష్టతరంగా మారిందని వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ... పండుగలలో అరువు పద్దతిన ఇచ్చినా... పరిస్ధితి చక్కబడి తిరిగి సానుకూల వాతావరణ ఏర్పడితే కానీ తమ అపðలు తిరిగి రావని భావిస్తున్న వ్యాపారులు కూడా క్యాష్‌ అండ్‌ కేరీ అంటూ బోర్డులు పెడుతుండటంతో పండగకు కనీసం తమ ఇళ్లకు సన్నమైనా వేయించుకోని పరిస్ధితి యావత్‌ రాష్ట్రంలో నెలకొని ఉందన్నది వాస్తవం.
ఇన్నాళ్లూ తమ ఇళ్లలో పండుగలు చేసుకుందామంటూ బంధుమిత్రుల్ని పిలిచి హడావిడి చేసిన వారు నేడు తమ నెవ్వరు ఈ దసరాకి పిలుస్తారో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నది నిజం.
సమ్మెలు, జనం సమస్యలు పక్కకు పెడితే ముందు ఇంట్లో వాళ్లు పండగ ఎలా చేద్దాం అని వేసే ప్రశ్నకు జవాబు ఇవ్వలేని పరిస్ధితి చాలా కుటుంబ పెద్దల్లో కనిపిస్తోంది. గత సంబరాలను గుర్తుకు తెచ్చు కుంటూ... మానసికంగానూ ఒత్తిళ్లకు గురవుతున్న సామాన్యు లెందరో.. మరి వీరి దసరా సరదాలు తీరేదెలా కనీసం సంక్రాంతి నాటికైనా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు తొలగి ప్రశాంతంగా పండగల్ని చేసుకునే రీతిలో ప్రభుత్వా ధినేతలు చూడాలని శత విధాలా వేడుకుం టున్నారు. వేడుక జరుపుకునేందుకు సామాన్యు డి వేడుకోలు ఏమేరకు పట్టించు కుంటారో వేచి చూడాలి.

రానున్న కాలం ఎలా ఉంటుందో అని భయపడి చచ్చే వాళ్లం... కానీ విపత్కర పరిస్ధితులన్నే ప్రభుత్వాలు ముందే చూపించేస్తున్నాయి. సమాజంలో సామాన్యుడి బతుకుని దుర్భరం కావటానికి అవినీతి, లంచగొండి తనం ఓ కారణమైతే... ధరల నియంత్రణపై ప్రభుత్వానికి పట్టు లేక పోవటం మరో కారణం.
- జి.వి. రామ శాస్త్రి, రిటైర్డ్‌ టీచర్‌, నేరేడ్‌ మెట్‌.

ఈ సారి దసరా పండగని మా కుటుంబం నుంచి బర్తరఫ్‌ చేసి పారేసాం. జనం గోడు పట్టని నాయకుల కారణంగా మాలాంటి వారికి పనిదొరకని పరిస్ధితి. దొరికినా వచ్చింది ఆటో ఛార్జీలకే సరిపోతోంది. ఇలాంటపðడు దసరాని సరదాగా జరుపుకోగలమా చెప్పండి.
- ఆర్‌. వెంకట్రాముడు, రోజువారీ కూలి, చింతల్‌ బస్తీ.

దసరా సరదాల సంగతటుంచి... అసలు పండగ రోజైనా పస్తులు ఉండకుండా ఉంటామా అన్నదే మా ప్రశ్న. కిలో బియ్యం రూపాయని చెప్తున్న పెద్దలు మిగిలిన వస్తువుల ధరలపై దృష్టి పెట్టరెందుకు నాకు తెల్వకడుగుతున్నా..
- జి. శ్రీ మహాలకి్ఝ, గృహిణి, పెకెట్‌

పెరిగిన ధరలు, జరగని వ్యాపారంతో మా బతుకులు అస్త వ్యస్తమవుతున్నాయి. దసరా సరదా మాట దేవుడెరుగు ఏ రోజు భోజనం ఆరోజు చేస్తే పెద్ద పండగ చేసుకున్నంత ఆనందంగా మారిపోయాయి పరిస్ధితులు.
- ప్రభాకర్‌, ఎలక్ట్రీషియన్‌, మల్కజ్‌గిరి.

ప్రత్యేక లక్ష్యం కోసం సమ్మెబాటలో ఉన్న మాకు జీతాలివ్వమని చెప్తోంది ప్రభుత్వం. పెద్ద స్ధాయి ఉద్యోగులు సరే.. కానీ మాలాంటి దిగువ స్ధాయి వారింటికి పండగొచ్చిందంటే భయమేస్తోంది. చేతిలో చిల్లి గవ్వలేదు. దసరా చేసే పరిస్ధితి లేదు.
- నాయక, తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగి