నిన్నటి తరం వారంతా సినీ హీరోయిన్ల చీరలే కాదు వారు వాడిన రక రకాల ఆభరణాలను తెగ వాడి పడేసే వారు. పదహరణాల తెలుగుదనానికి ప్రతీకగా నిలచిన నాటి కధానాయికలు కేశాలం కరణల్లోనూ ఎప్పటికప్పుడు తమ ప్రత్యేకతని నిలుపుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వగా వారిని అనుకరిం చిన వారెందరో ఉన్నారు. మన ఇళ్లలోని అలనాటి ఫోటోలు చూస్తే నాటి తరం నాయికలైన సావిత్రి, వాణిశ్రీ, కాంచన ఇలా చాలా మందిని అనుకరించిన విధానం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరంలో కూడా హెయిల్ స్టైల్స్‌పై వెండితెర కధానాయికలనే స్పూర్తిగా తీసుకుని, తమ డ్రస్ కోడ్‌కి తగ్గట్టుగా కేశాలను మార్చుకుంటున్న వైనాన్ని చూస్తునేఉన్నాం.
నేడు ఫ్యాషన్ ప్రపంచం వెల్లువలా ముంచుకు వస్తున్నా... లంగా, వోణీలు, చీరకట్టులు తమ ప్రత్యేకతలని ఎంతలా నిలుపుకుం టున్నాయో... అదే తీరుగా వాలు జడలు నేటికీ మగువల అందాల ను రెట్టింపు చేస్తున్నాయనటంలో ఎలాంటి సందేహం ఉండదు. అతివల కేశాలంకరణ కేవలం ఆందా న్నే కాదు ఆరోగ్యాన్ని అన్నింటికీ మించి ఆనందాన్ని ఇచ్చేదిగా భావించే నాటి తరంలో నాగరం పాయ, ఈత పాయ, తూర్పు పడమర ఇలా లెక్కలేనన్ని వెరైటీలతో కేశాలం కరణలు దర్శనమిచ్చేవి.
మహిళల్లో ఈ కేశాలంకరణ క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్స రాల క్రితానిదన్నది చరిత్రకారులు ప్రవచిస్తుంటారు. అంతెందుకు మన రామాయణంలో సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు ఆమె చెంతకు వచ్చిన హనుమంతుడు అడిగిమరీ ఆమె తన క్షేమసమాచారాన్ని రామునికి అందించేందుకు చూడామణిని తీసు కున్నట్లు చదువుకున్నాం. చూడమణి అంటే సిగ పిన్ను ఇది నాటి రాచరికపు స్త్రీలు తమ జుట్టుని ఎంత ప్రాణ ప్రదంగా చూసుకుని బంగారంతో దానిని అలంకరిం చుకునేవారో చెప్పకనే చెపుతోంది కాదా..
ఇక సిగ్గుపడుతూ... హోయలొలకిస్త్తూ... ఓరకంట చూస్తూ... ముం దుకు సాగే అతివలకి వయ్యారం ఒలకించే వాలుజడ ఎంత అందాన్నిస్తుందో... కోపంతో విసురుగా విసిరే ఆ వాలు జడ తాచు పాములా మెడను చుట్టి ఆగ్రహాన్ని మరింత అందంగా చూపి స్తుంది... అసలు ఈ వాలు జడను అలంకరిం చుకోవాలంటే సమ యంపై నాడు ఎన్నో జోకులు పేలేవి.
నీలా కాశం కన్నా భామ కురులే నయం అని సూర్య చంద్రులే అనుకుని ఇలకి దిగి వచ్చి ఇంతుల జడపైన తీరుబడిగా కూర్చొంటే... అటూ ఇటు రాగిడీ, కొమ్ములు జంట కవుల్లా దర్శన మిచ్చేవి. ఇక వాటి సరసనే బంగారు తల పాకులు, తళుక్కున మెరుస్తుంటే... తిరుగుడు పూలు, చామంతి పూలు చిద్విలాసాలొలికిస్తు.. కురుల నడుమ ఒదిగి పోయేవి. వయ్యా రంగా కదిలే జడ చివరన బంగారు కుప్పెలు (జగ గంటలు) ఆక్రమిస్తే... పాపిటి భాగంన నుదిటి మీదకు జారేలా పాపిటి పిళ్లలు, చెంపల నుండి జుట్టులోకి మాటీలు వచ్చి చేరేవి. ఇక చెంప స్వరాలు ఇలా చెప్పుకుంటూ పోతే దేనికదే జడ అలంకరాన్ని రెట్టింపు చేసేవి.
ఇక జడ మొత్తానికి ధరించే నగని నాగరం అని పిలుచుకుంనే వారు. ఇది ఓ విధంగా బంగారు తొడుగులాంటిది. ఈ జడని బంగారంతో చేయించడమే కాకుండా అనేక రకాల వజ్రాలు, వైఢూర్యా లు, కెంపులు, పచ్చలు పొదిగి ప్రత్యేక ఆకర్షణగా నిలచి తెలుగు మహిళ ప్రాభవాన్ని చాటి చెప్పేవంటే అతిశయోక్తి కాదేమో.
బంగారం ధర పెరుగుతున్న దశలో వెండి, ఇతర లోహాలు, గాజు పూసలు, వివిధ రకాల దారాలతో అల్లిన జడలూ కనిపించేవి. అసలు పండగొచ్చిందంటే జుత్తుని అలంకరించేందుకు వివిధ రకాల పూలతో జడలు కుట్టుకోవటం సరేసరి.ఇదంతా... నిన్నటి మాటైతే...
నేటి తరం మహిళ్లో వస్త్రధారణలో వచ్చిన మార్పు కొప్పులకు కత్తెర వేసిందనే చెప్పాలి. లూజ్ హెయిర్ ఫ్యాషన్‌గా మారి పోనీ టెయిళ్లూ, బాబ్డ్ హెయిర్ ఇలా లెక్కకు మిక్కిలి పాశ్చాత్య కేశాలం కరణ తీరు వచ్చి హడావిడి చేస్తున్నా... సందర్బానుసారంగా నేటికీ పాత తరంలో కనిపించిన కేశా లంకరణలు అడపా దడపా దర్శనమిస్తునే ఉన్నాయి. పెళ్లిళ్లూ, పేరంటాలు ఉంటే వాలు జడలేసు కునేందుకే ఇష్టపడు తున్న అమ్మాయిల శాతం ఇప్పటికీ ఎక్కువగానే ఉందంటే.. అందులో అందం ఎంత ముచ్చట గొలుపు తుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడిప్పుడే మూల పడిని కొప్పులు మళ్లీ ముందుకు దూసుకొచ్చి కొత్త తరహాగా కనువిందు చేస్తుండటం ఓ విశేషం కాగా... ఇందుకు తగ్గట్టు జ్యూలరీస్‌లో అనేక రకాల బంగారు జడలు దొరుకు తున్నాయి. నేడు బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న క్రమంలో కృత్రిమ బంగారంతో రూపొందు తున్న జడలు కనువిందు చేస్తున్నాయి. వన్ గ్రామ్ గోల్డ్, క్రిస్టల్ యాక్సెసరీలు ఇలా సిగ తరగ అనేలా సింగారించేందుకు ఓ భారీ ట్రెండ్ సృష్టించేలా బోలెడన్ని ఆభరణాలు వచ్చేసాయి.
ముఫై ఏళ్లు దాటగనే... నాజూకు కొప్పులో ఓ గులాబీని గుచ్చి సరిపెట్టుకోవటం ఫ్యాషన్‌ని నేటికీ కొనసాగిస్తునే ఉండగా... పెళ్లి జడలని అలంకరించుకునేందుకు నేటి తరం మహిళలు ఆనందంగా ముందుకేగుతున్నారు.
కాలమెంత మారుతున్నా మహిళలు తమ కేశాలంకరణపై మక్కువ చూపిస్తునే ఉండటంతో అందుకు తగ్గట్టు మెర్సీరింగ్, బెర్లారినా, కాస్‌కేడ్, క్రిస్ క్రాస్, సాఫ్ట్, రింగ్ లెస్ ఇలా అనేక రకాల క్రిస్టల్‌తో ప్రత్యేకంగా తయారైన ఆభరణాలు అందుబాటులోకి వచ్చి కేశాలంకరణలు జరుగుతునే ఉన్నాయి. రంగు రంగు డిజైన్లతో కూడిన రిబ్బన్లు, పూసలు, హెయిర్ పిన్నులు, క్లిప్పులు, జడ బిళ్లలు ఇలా సిగనలంకరిం చుకునే ఆభరణాలు బోలెడుండగా... పాశ్చాత్య నాగరికత నుండి దిగుమతి అవుతున్న టియోరాలు పెళ్లిళ్లలో, పుట్టిన రోజు వేడుకల్లో మగువల నెత్తిన కాంతులిడుతూ ధగధగలాడుతున్నాయి. కేశాలకు కొత్త అందాలను చేకూర్చడమే లక్ష్యం కనుక మక్కువ ప్రదర్శించే మగువలున్నంత కాలం ఎన్ని రాకలైన ఆభరణాలైనా వెల్లువలో వస్తాయి. వాటిలో కొమ్మలుంటాయి, పక్షలుంటాయి. పూలుంటాయి... మెరిసే ముళ్లు ఉంటాయి...