15, నవంబర్ 2011, మంగళవారం

సినిమాకి బూస్టర్‌ ఈశ్వర్‌ పోస్టర్‌




సృష్టిలో లయకారకుడు ఈశ్వరుడైతే... తాను మాత్రం సృష్టికర్తనే అంటూ... తనదైన ముద్ర వేసుకునేలా...
నాటితరంలో ఎందరో హీరో హీరోయిన్లకు, కమేడియన్లకు తన కుంచెతో ఎప్పటికపðడు కొత్తదనాలనద్దుతూ...
2500 సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా వ్యవహరించి.. ప్రపంచంలో తనొక్కడినే.. అని తలెత్తి తెలుగువాడి పేరుని
మరోమారు గిన్నిస్‌లో కెక్కించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌.
సినీ పోస్టర్‌కు కేరాఫ్‌గా నిలచి ఎందరో శిష్యుల్ని తయారుచేసి తన విశాల కళాహృదయాన్ని చాటుకున్న ఆయన
సినీ పబ్లిసిటీలో లోటు పాట్లపై తాను చేసిన అధ్యయనాన్ని, తన అనుభవాలను రంగరించి రాసిన
'సినిమా పోస్టర్‌' పుస్తకావిష్కరణ సందర్భంగా 'ఆంధ్రప్రభ'తో ముచ్చటించారాయన..
ఏవస్తువైనా ఎంత గొప్పగా తయారు చేసినా... అది జనం లోకి వెళ్లాలంటే ప్రచారమే ప్రాణం. ప్రస్తుత సాంకే తిక విప్లవం ఈ మార్గాన్ని ఎంత సులభతరం చేసిందని అనుకు న్నా... పూర్వం దేనిని జనంలోకి తీసుకెళ్లా లన్నా... దండోరా లతో చాటింపులు వేసే ప్రక్రియ తర్వాతి కాలానికి గోడ పత్రి కలతో ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా సినీమలో పబ్లిసిటీకి వాల్‌పోస్టర్లే ప్రాణవాయు వులూదుతూ.. జనాలని ధియేటర్ల వైపుకు మళ్లించడంలో ప్రధానపాత్ర పోషించాయనటంలో సందేహం లేదు. తరాలు మారుతు న్నా.. సాంకేతికత కొత్త పుంతలు తొక్కి డిజిటల్‌ ప్రక్రియ ప్రారంభమయ్యాక చేతితో రాసే కళాకారులు దాదాపు కరువ య్యారనే చెప్పాలి. నాటి తరం అగ్రశ్రేణి కధానాయకులతో సహా పలు భాషల్లో అనేక వెరైటీలతో టైటిల్స్‌ని రూపొందించి జనం నోళ్లలో పబ్లిసిటీ ఈశ్వర్‌గా పేరెన్నికగన్నారు.
రూటు మార్చాలన్న తపన...
ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఈశ్వర్‌ తరతరాలుగా తన కుటుంబం కంచు, పంచలోహాల బొమ్మల తయారీతోనే కాలం నెట్టుకురావటం చూసి తానా ఒరవడిని మార్చాలనుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన చెప్తూ... తన తాత పైడియాచార్య, తండ్రి బుచ్చయాచార్యలు దేవాలయాలలో ఉండే ఉత్సవ మూర్తుల తయారీలో నిష్ణాతులు. అప్పటి కుటుంబ పరిస్ధితి దృష్ట్యా అదే బాటలో నా సోదరుడూ నడిస్తుంటే... చదువుకుని ప్రయోజకుడ్ని అయి తే గట్టెక్కొచ్చన్న తపన నాలో కసిని రగిల్చింది. నాలో కసికి థ్థర్డు ఫారంలో నేను తెలుగు పరీక్షలో రాసిన అక్షరాల ఒరవడికి ముచ్చటపడిన మాష్టారు లంక రామబ్రహ్మ శర్మగారు అన్ని సబ్జక్టులపై ఉచితంగా ప్రయి వేటు చెప్పి నాలో ఉత్సాహానికి ఊతమందించారు. ఆర్థ్ధిక పరిస్ధితి ముందు కు సాగని క్రమంలో ఎస్‌ఎస్‌ఎల్‌సి చదివేందుకు నన్ను ఆదుకున్నది కోనేశ్వర శర్మ మాష్టారు. స్కూల్‌ ఫస్టు వస్తానని అంతా అనుకున్నా... నేను కేవలం సాధా రణ మార్కులతో పాసవ్వటం అందరికీ ఆందోళన కలిగించింది.ఇందుకు నాకు నాటకాలపై ఉన్న ఆసక్తి, కథలు రాయటం కూడా ఓ కారణం... పరీక్షల సమయంలో రిహార్యల్సంటూ తిరగటం రాత్రుళ్లు సరిగా చదవలేక పోవటం వల్లే ఇది జరిగిందన్న విషయం గమనించిన మా కోనేశ్వర శర్మగారు నన్ను దండించాలని చూస్తే... తప్పించుకున్నా... ఆపై 2000లో అదే పాఠశాల శతవార్షిక సందర్భంగా సత్కారమందుకుంటూ మాష్టారి గురించి ఆరా తీస్తే.. ఈ లోకానికే దూర మె ౖపోయారన్న వార్త కన్నీళ్లు తెప్పించింది.
నా కల కల్లలైన వేళ....
ఎలాగైనా ఇంజనీరునవ్వాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఎస్సెల్సీ పూర్తయ్యాక ఆర్థ్ధిక స్తోమత నన్ను వెక్కిరి స్తున్నా... ఆయవారమైనా చేసి చదువుకోవాలని కాకినాడ వెళ్లి ఆంధ్రాపాలిటెక్నికలోే మూడేళ్ల ఎల్‌ఈఈ లో చేరా..మూడేళ్లు తిన్నా తినక పోయినా చదువే ప్రధానంగా ముందుకు సాగుతూ మరో 15రోజుల్లో ఫైనల్‌ పరీక్షల నెదుర్కోవాల్సి ఉండగా నా తల్లి చనిపోయినట్లు పిడుగుబాటు వార్త అందింది. దీంతో పరీక్షల సమయానికి వద్దామని వెళ్లా... సాంప్రదాయబద్దంగా జరగాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యే సరికి పరీక్షలు పూర్తయిపోయాయి. దీంతో ఫైనల్‌ ఇయర్‌ ఒక్కటే చదవచ్చన్న కొందరి సూచనలతో ఏడాది ఇంట్లోనే అందరికీ సాయంగా ఉంటూనే నా నాటకాభిలాష ను కొనసాగించా. ఫైనల్‌ పరీక్షల్లో హాజరు కావాలంటే 2 వేల పై చిలు కే అవసరం కావటంతో నా మిత్రులే ఓ బెనిఫిట్‌ స్టేజ్‌ షో ఏర్పాటు చేసి ఇచ్చారు. దీంతో కాకినాడ పాలిటెకి ్నక కాలేజి ప్రిన్సిపాల్‌ని కలిస్తే...ఈ ఏడాది నుండే రూల్స్‌ మారాయని.. ఫైనల్‌ ఇయర్‌లో చేరాలంటే హైద రాబాద్‌ నుండి బోర్డు డైరెక్టర్‌ అను మతి తీసుకోవాలి. లేదంటే మళ్లీ ప్రవేశానికి తాను అవకాశం ఇస్తామ ని చెప్పడం నా ఆశలపై నీళ్లు చల్లింది. మళ్లీ మూడేళ్ల చదువంటే కుదరని పని.. నన్ను నమ్మి డబ్బులిచ్చిన వారికి, చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తా నని నమ్మించిన నా వాళ్లకు నా ముఖం ఎలా చూపాలో అర్థ్ధం కాక. . ఓ మిత్రుడు మద్రాస్‌ వెళ్తున్నా అంటే... ఉన్నపళంగా నేనూ ఆతని వెంట నడిచా.. అలా 1960 ఫిబ్రవరిలో..మద్రాసొచ్చాక ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ... వారసత్వ సంపదగా నాలో స్వతహాగా ఉన్న కళాకారుడే నన్ను ఆదుకుంటాడన్న ఒకే ఒక నమ్మకంతో ఎనిమిది నెలలు అవకాశాలకోసం తిరగని చోటులేదు. పస్తులున్న రోజులు చాలానే ఉన్నాయి. అప్పటికే దక్షిణాది సినీ పరిశ్రమలో పబ్లిసిటీ డిజైనర్‌గా ఓ వెలుగు వెలుగుతున్న 'కేతా సాంబమూర్తి' మా పక్క ఊరాయనే అని తెలియటంతో ఓ సారి వెళ్లి కలిసా... నా గురించి చెప్పా... మా నాన్న పేరు వినగానే... హత్తుకుని తన దగ్గర పనిచేసే అవకాశంతోపాటు ఏకంగా 500 రూపాయలు జీతంగా ఇస్తామన్నారు. 1967లో వరలకి్ఝతో వివాహం జరిగే వరకూ ఆయన వద్ద అలుపెరగ కుండా పనిచేసా... పబ్లిసిటీలో అనేక మెళుకువలు తెల్సుకున్నా...
'తొలి' అవకాశాలు..
పెళ్లయ్యాక కేతాగారి అనుమతి తీసుకుని1967 ఫిబ్రవరి 27న నా పేరుతోనే 'ఈశ్వర్‌' అనే సంస్ధని స్ధాపించా... సరిగ్గా ఇదే సమయంలో బాపు-రమణలు పరిశ్రమకు పరిచయ మవుతూ... 'సాక్షి' చిత్రాన్ని ప్రారంభించి.. దానికి పబ్లిసిటీ డిజైన్‌ చేయమని నన్ను అడిగారు. స్వతహాగా బాపు మంచికళాకారుడు...అలాం టి వ్యక్తిని ఒప్పించడం మాటలు కాదు.. శ్రమకోర్చి నే చేసిన డిజైన్లల్లోంచి కొన్నింటిని ఎంచడం...నా పేరు వెండి తెరపై ప్రముఖంగా చూసుకోవటంతో వారితో పాటు నాకూ తొలి అవకాశం లభించింది.
'విజయ'ధరహాసానికి కారణం ఆయనే..
నిజమే... విజయా సంస్ధ అధినేత నాగిరెడ్డిగారు వారి కుటుంబ సభ్యులు వారి ప్రింటింగ్‌ ప్రెస్‌ అయిన ప్రసాద్‌ ప్రాసెస్‌లో నా సాక్షి డిజైన్‌ని చూడకపోయి ఉంటే నేనూ ఓ సాధారణ కళాకారుడిగా ఉండి పోయేవాడినేవెూ తెలుగులో ఎన్ట్టీఆర్‌ నటించిన రాముడు భీముడుని.. హిందీ లో 'రామ్‌ ఔర్‌ శ్యామ్‌' పేరుతో తెర కెక్కిస్తూ... అప్పటికే ఓ ప్రఖ్యాత ఆర్టిస్టుతో పబ్లిసిటీ డిజైన్లు చేయించినా ఎక్కడో తెలియని వెలితి.. దీంతో సాక్షికి నే చేసిన డిజైనింగ్‌ నచ్చి నన్ను పిలిచి డిజైన్లు చేయించుకున్నారు. నా పని తీరు నచ్చి న నాగి రెడ్డిగారు ఆపై తమ వద్దకు వచ్చే జెమిని, ఏవిఎం, అంజలీపిక్చర్స్‌, వీనస్‌ పిక్చర్స్‌, చిత్రాలయా, దేవర్‌ ఫిలిమ్స్‌, ప్రసాద్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, విజయ వాహిని, అన్నపూర్ణ, సురేష్‌, శివాజీ ప్రొడక్షన్స్‌, ఇలా అనేక సంస్ధలకు నన్ను రిక మెండ్‌ చేయటం జరిగింది. ఈ దేశంలోని దాదాపు అన్ని భాషల్లో 2500 చిత్రాలకు పబ్లిసిటీ డిజైన్లు రూపొందించాను.. ఈ అవకాశం అందరికీ దొరక్కపోవచ్చు.
గంగాధర్‌తో పోటీ..
అప్పట్లో సినిమా వస్తోందంటే చాలు నాకూ గంగాధర్‌కే పోటీ ఎక్కువగా
డేది. ప్రేక్షకులు కూడా మేం చేాసిన డిజైన్ల్లపై చర్చించుకునేవారంటే అతి శయోక్తి కాదేవెూ గంగాధర్‌, నేనూ కేతా గారి శిష్యులమే... వయసు రీత్యా నాకన్నా రెండేళ్లు చిన్న వాడే అయినా వృత్తి రీత్యా నాకన్నా మూడేళ్లు పెద్దే. మా మధ్య ఒకరి కన్నా ఒకరం బాగా డిజైన్‌ చేయాలన్న పోటీ తత్వం ఉం డేది కానీ వైషమ్యాలకు, వైరుధ్యాలకీ తావుండేది కాదు.. మంచి స్నేహితుల్లా ఉండే వాళ్లం. ఈ మధ్యే ఆ మిత్రుడు నన్ను విడిచి అనంత లోకాలకేగాడు.
ఇపðడెందుకు చేయట్లే...
2000లో వచ్చిన 'దేవు ళ్లు' చిత్రమే నా ఆఖరు చిత్రం. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంని అంది పుచ్చు కుంటూ ఎందరో యువ కళాకారులు ఉద్భవి
స్తున్నారు. అది జనాలకు నచ్చుతున్నాయా లేదా అన్న ప్రాధాన్యత కనుమ రుగై... ఎవరేం చేస్తున్నారో అసలు ఆ పేరేంటో... పరిశీలించి చద వితే కానీ అర్థం కాని పరిస్ధితి నెలకొంది. కంప్యూటర్‌ ఫాంట్లపైనే ఆధార పడు తుండటంతో చాలా టైటిల్స్‌ మరీ మక్కీకి మక్కీ కాపీ కొట్టినట్లు అనిపించిన సంద ర్భాలూ అనేకం ఉన్నాయి. ఇలాంటి పోటీతత్వం నాక స్సలు పడదు. నా పద్దతికి విరుద్దం కూడా ... అందుకే అప్పటి నుండి సినిమాలు వదిలేసుకుని,ఎన్టీఆర్‌, చిరం జీవిలాంటి హీరోల పాత చిత్రాలు రీరిలీజ్‌లకి కొత్త తరహా పోస్టర్‌డిజైన్లు 2007 వరకు చేసా... ఇప్పటి తరా నికి ఆ చిత్రాలు కూడా అవ సరం లేకపోవటంతో ధియే టర్లకొచ్చి సినిమాలు చూసే వారు లేకపోవటంతో ఆ పని వత్తిడీ తగ్గింది.
నా వాళ్లేం చేస్తున్నారంటే..
ఇద్దరమ్మాయిలకీ పెళ్లిళ్లయి అమెరికాలో స్ధిరపడ్డారు. పెద్దబ్బాయి విజరు తమిళ చిత్రాలకు డిజైనర్‌గా వ్యవహరిస్తూ... అడపాదడపా వృత్తిపరమైన సలహాలడుగుతుంటాడు. చిన్నబ్బారు శశికుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చెన్నైలో స్ధిరపడ్డాడు.
అనుభవాల ఆవిష్కరణ ..
2007లో మాన్యువల్‌లో పోస్టర్లు డిజైన్‌ చేయించుకోవటం పూర్తిగా తగ్గాక.. నా పాత చిత్రాల పోస్టర్లని ఓ పుస్తకంగా వేద్దామనుకున్నా... అందుకు నా అనుభవాలను రంగరించి పూర్తిచేద్దామన్న నిర్ణయం తీసు కున్నా.. మూడేళ్లపాటు శోధిస్త్తూ... సినీ పోస్టరు పుట్టు పూర్వోత్తరాలు... నాకు ముందు సినీ పోస్టర్ల డిజైన్లలో దిగ్గజాలైన 19 మంది గురించి, వారి సేవల గురించి వారి కుటుంబ సభ్యుల్ని కల్సి ఫోటోలు సేకరించి రాసుకొచ్చా.అలాగే నాకు అన్ని విధాల అండగా నిలబడిని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి కూడా ఈ పుస్తకంలో రాసుకున్నా... తొలి తరంలోని పోస్టర్‌ డిజైన్లను సేకరించి పొందుపరిచా.. నా ఆర్ట్‌ గ్యాలరీ విశేషాలకీ ఇందులో స్థ్ధానం కల్పించి 'సినిమా పోస్టర్‌' పుస్తకంగా ఆవిష్కరిస్తున్నా...

జీవితాంతం రుణపడి ఉంటా
ఈశ్వర్‌గారు 52 మందిని శిష్యులలో నేనూ ఒకటినై నందుకు గర్విస్తున్నా... ఆయన 'సినిమా పోస్టర్‌'లు చూసి ఆకర్షితుడినై ఆయన శిష్యుడిగా చేరినప్పటికి ఆయనతమ్ముడు బ్రహ్మం, దావుద్‌గార్లే ఆయనకు సహా యకులు. నేను దసరా బుల్లోడు, శ్రీకృష్ణ పాండవీయం తదితర ఎన్నో చిత్రాలకు పనిచేసే అవకాశం వచ్చింది. ఆపై ఈశ్వర్‌గారి సలహా మేరకు ఆర్ట్‌ కాలేజీలో చేరా... తర్వాత ఉద్యోగరీత్యా బెంగళూర్‌, విజయవాడలోపని చేశా...ప్రస్తుతం మా ఎడిటర్‌ విజయబాబుగారి ప్రోత్సా హంతో 'ఆంధ్రప్రభ'లో ఆర్టిస్టుగా వున్నాను. ఇంత ఎదగడానికి కారణం ఈశ్వర్‌గారే. ఆయనకు జీవితాంతం రుణపడి వుంటాను.
- కె.ఎన్‌.భాస్కర్‌ ఆర్టిస్ట్‌, ఆంధ్రప్రభ
పక్కనే ఉంచుకుని పరుగులు తీసా...

నాకు బాగా పరిచయం ఉన్న ఈశ్వర్‌గారి ఇంట్లో ఉంటూ, గంగా ధర్‌గారి దగ్గర అవకాశం కోసం తిరుగుతూ ఉండేవాణ్ణి. కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు ఈశ్వర్‌ గారే నేను అడగ్గానే అసిస్టెంట్‌గా అవకాశం కల్పించారు. పది ఏళ్లు శిష్యరికం చేసి పబ్లిసిటీ డిజైన్లకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. 'వర్క్‌' విషయంలో అంత 'సీరియస్‌'గా ఉంటారో.. ఆదరణలో ఎంత ఆప్యాయంగా ఉంటారాయన...,గురువుగా లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా...'' -
- ముగడ భాస్కర్‌, సినీ ఆర్టిస్ట్‌ , చెన్నై
ప్రతిసృష్టికర్త ఆయన...
ఈశ్వర్‌ గారి ప్రధమ శిష్యుడిగా 8 ఏళ్ల పాటు ఆయన శిష్యరికం చేసే అరుదైన అవకాశం నా సినిమా పోస్టర్‌ ద్వారా ప్రతిసృష్టికర్త అయ్యారు. ఆయన శిష్యులలో నేనూ ఒకడ్ని అయినందుకు గర్వంగా ఉంది. ఎందరో ఏకలవ్య శిష్యులు మా గురువు గారికి ఈ ఆంధ్ర దేశమంతటా ఉన్నారంటే ఆశ్చర్యం ఉండ దేవెూ సినీమాకి పబ్లిసిటీ ఉన్నంత కాలం గురువుగారి పేరు చిరస్ధాయిగా ఉంటుంది.
- దావూద్‌, సినీ పబ్లిసిటీ డిజైనర్‌, చెన్నై
అన్నయ్య సన్నిధి.. నాకు పెన్నిధి.
రాముడు ఉన్నచోట లక్ష్మణుడు ఉన్నట్లే 'పబ్లిసిటీ' ఈశ్వర్‌ తన చిత్ర జైత్ర యాత్రలో నాకూ భాగం కల్పిం చారు. 'అను' 'ఫాంట్స్‌' (అక్షర రూపాలు) రూపకల్పన లో అన్నయ్యతో చేసిన అనుభవం నాకు బాగా ఉపయో గపడింది. నేటికీ 'మీ అన్నగారికి కుడిభుజం' అంటుంటే. ఆ ఆనందం వేరే... నాతో సమానంగా తన శిష్యులకీ ఈ ప్రచార చిత్రకళలోని మెళ కువలతో పాటు... వినయ విధేయతలు, సత్ప్రవర్తన నేర్పించి.. తీర్చిదిద్దా రు. నేనలా ఎదిగిన వాణ్ణే'
- కె.బ్రహ్మానందం, ఆర్ట్టిస్ట్‌, చెన్నై