కొన్ని పండుగలకు తరతరాల చరిత్ర ఉంటుంది. మరికొన్ని పండుగలు ప్రజల సంబరాల నుంచి పుట్టుకువస్తాయి. ఆట పాటలతో, ఆనందంతో ప్రజలు తమ సంతోషాన్ని పంచుకునే పండుగల్లో బతుకమ్మ పండుగ అతి ముఖ్యమైనది. ప్రపంచంలో మరెక్కడా లేని అరుదైన పండుగ, ఆడపడుచుల ఆనందకేళీ. ఈ పండుగ విశిష్టతను గుర్తించిన అనేక రాజకీయ పార్టీలు ప్రతి సంవత్సరం బతుకమ్మపండుగను ఘనంగా చేస్తూ ప్రజల ఆనందోత్సవాలకు కూడా రాజకీయ రంగులు అద్దే ప్రయత్నాలు చేస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీలు చేస్తున్న ఈ తతంగాన్ని చూసి పండుగను ప్రభుత్వం ఎందుకు విస్మరించాలన్న ఆలోచనతో ఈ సంవత్సరం నుంచి బతుకమ్మ పండుగను రాష్ట్రీయ పండుగగా అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా అందమైన బతుకమ్మలను ప్రకృతి సిద్ధమైన పూలతో ఆకర్షణీయంగా అలంకరించిన వారికి బహుమతులను, ఆటపాటలలో పోటీలను నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ప్రాంతమంతా మారుమ్రోగిపోయే సంబరం బతుకమ్మ పండుగ. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మతో, సీతకోకచిలుకల్లా పోటీలు పడేలా అందంగా అలంకరించుకున్న ఆడపిల్లలు తమ సంతోషాన్ని, బాధలను బాణీ కట్టి వినిపించే పాటలతో, పాటకు అనుగుణంగా లయబద్ధంగా కదిలే అడుగుల ఆటలతో సాగే జాతర బతుకమ్మ పండుగ. ఊరు వాడ, గొప్పా పేద, పిల్లలు, ముసలి వాళ్లు అన్న తేడా లేకుండా అంతా కలిసి సంబరంగా చేసుకునే ఊరందరి సమిష్టి పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిర్వహించే బతుకమ్మ పండుగ కథను, నేపధ్యాన్ని, ఆడే విధానాన్ని, పాటలను అంతర్జాతీయంగా వెబ్‌సైట్స్‌లో కూడా పొందుపరిచారు. విదేశాలలో వున్న తెలంగాణ ప్రాంత వాసులు సైతం ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగను ఆనందోత్సవాలతో ప్రతిఏటా నిర్వహిస్తున్నారు.
దేశవిదేశాల్లో సైతం అనాదిగా, ఆనవాయితీగా జరిపే ఈ పండుగకు చాలా ప్రాచీనమైన కథనే ప్రచారంలో ఉంది. లయకారుడు పరమ శివుని అర్ధాంగి, జగన్మాత పార్వతిదేవియే బతుకమ్మ అన్న విశ్వాసం మన పూర్వీకుల నుంచి వాడుకలో ఉంది. పార్వతిదేవి తన పుట్టంటి నుంచి కబురు రాకున్నా తండ్రి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళి అవమానింపబడి యాగాగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుందని, ఆమె ప్రాణత్యాగం చేయడం చూసి సహించలేని ప్రజలు, భక్తులు ముక్తకంఠంలో 'బతుకమ్మ, బతుకమ్మ' అంటూ హృదయవిదారకంగా విలపిస్తూ, భక్తితో పాటలు పాడగా పార్వతీదేవి ప్రత్యేక్షమైందనీ, అప్పటి నుంచి ప్రజలు బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారని ఒక కథ ప్రచారంలో వుంది. పుట్టిన పిల్లలు పురిటిలోనే చనిపోతుంటే వారికి 'బతుకమ్మ' అని పేరు పెట్టే ఆచారం ఇనాటికీ తెలంగాణ ప్రాంతంలో వుంది. బతుకమ్మ అన్న ఆ జగన్మాత పేరు పెడ్డితే ఆ పిల్లలు బతుకుతారన్న గట్టి నమ్మకం ఈనాటికీ ప్రజల్లో ఉంది. వరంగల్ రాజధానిగా రాజ్యమేలిన కాకతీయుల కాలంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ పండుగ ఈ నాటికి కూడా అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. వర్షబుతువు చివరిదశలో తెలంగాణ ప్రాంతంలో విరబూసిన తంగేడు పూలతో పసిడి పరికిణిని చుట్టుకుని, గట్టు వెంట పూసే గునుగుతో వెండి అంచులు దిద్దుకుని సింగారించుకున్న పల్లెపడుచులా ఆహ్లాదకరంగా వుంటుంది. అలుగులు పారే చెరువులు, కుంటలు నిండుగా తొణికిసలాడుతాయి. పూరిగుడిసే లు సైతం పందిరి మీద పొదుల మీద, పెరట్లో విరగబూసిన బీరపూలు, గుమ్మడిపూలు, కట్లపూలు, బంతిపూలతో బంగారు అద్దినట్లు ,రంగురంగుల హరివిల్లుగా కనులనిండుగా కనిపిస్తాయి. విశ్వకర్మ నిర్మించిన అందమైన భవనాల్లో ఎక్కడా కనిపించని ప్రకృతి అందాలు ఆ పూరిగుడిసేల్లో దాగి ఉన్నాయా అన్నంత అపురూపంగా కనిపిస్తాయి. ఏడు రంగుల ఇంధ్రదనస్సు నేలకు దిగివచ్చి పొలం గట్ల వెంట పాకినట్టు రంగురంగుల పూలు కనిపిస్తాయి. ప్రకృతి శోభ ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది. పూలుకోసుకు వచ్చే వంతు మాత్రమే మగవారిది. ఇక హడావుడి అంతా ఆడవారిదే. తెలంగాణ సంస్కృతికి వైభవానికి ప్రతికగా జరిపే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. దేవి నవరాత్రులతో పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగుతుంది. మహాలయ పక్ష అమావాస్య రోజు మట్టితో చేసిన బొడ్డెమ్మలను సాగనంపి ఆ తెల్లవారి నుంచిప్రతిరోజు సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడచులు కనుల పండుగగా తొమ్మిది రోజులు రంగురంగుల పూల హరివిల్లుగా బతుకమ్మలను పేర్చి లయబద్దంగా ఆడుతారు. చివరి రోజు (దుర్గాఅష్టమి రోజు) పెద్దగా పేర్చిన బతుకమ్మను ఇంటి ముందు వాకిళ్లలో, వీధిలో, కూడలిలో వుంచి ఆడపడుచులంతా కలిసి సాముహికంగా పాటలు పాడుతూ, లయబద్దంగా చేతులు కలుపుతూ, అడుగులో అడుగు వేస్తూ బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ పాటలన్నింటిలోనూ లక్ష్మీదేవి, బతుకమ్మ, గౌరమ్మ, పార్వతి, శివుడు, అత్తవారింట్లో ఆడపిల్ల నడుచుకోవల్సిన తీరు తదితర ఇతివృత్తాలే ఎక్కువగా వుంటాయి. జామురాతిరి దాక ఆడి చివరకి బతుకమ్మను చెరువులో , వాగులో నిమజ్జనం చేస్తారు. ముత్తెదువలు పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇంటి నుంచి తెచ్చిన తీపిపదార్థాలు( సద్దులు) అందరికీ పంచుతారు. ఊరంతా చెరువు గట్టుకు తరలివచ్చిందా అన్నట్లుగా బతుకమ్మ సంబరాలు సాగుతాయి.
పిల్లాపాపలకు ఆరోగ్యాన్ని, ఆడపిల్లలకు ముత్తైదుతనాన్ని ఇస్తుందని భావించే బతుకమ్మ ప్రజలందరికీ మంచిచేయాలని, అంటురోగల నుంచి సర్వజనులను రక్షించాలని మనం ప్రార్థిద్దాం.