గజల్స్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానం సంపాదించుకుని మ్యూజిక్ కంపొజర్ గానూ తన సంగీత ప్రస్దానం సాగించి... బాలీవుడ్‌తో పాటు దేశ విదేశాల్లో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ గజల్స్ గాయకుడు జగ్జీత్ సింగ్ సోమవారం ఉదయం కానరాని తీరాలకేగారు.... బ్రెయిన్ హెమరేజ్‌తో బాధ పడుతున్న ఆయన గత కొంత కాలంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కోమాలో ఉండే చికిత్స పొందు తూ మరణించారు.
ఏటా తన పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించి అభిమానులకు కొత్త కొత్త గజల్స్‌నే బహుమతులుగా ఇచ్చే జగ్జీత్ సింగ్ 1941 ఫిబ్రవరి 8న రాజస్దాన్‌లోని శ్రీ గంగాధర్‌లో జన్మించారు. పంజాబి, సింధు,హిందీ, ఉర్ధూ, బెంగాలీ, గుజరాతీలతో పాటు నేపాళీ భాషల్లోనూ అనేక గజల్స్ పాడిన ఆయన ముంబైలో ఉన్నా వారంలో ఒక్కసారైనా ఇడ్లీ, దోశ, సాంబార్ ఇలా వంటలని రుచి చూస్తూనే...దక్షిణాదిన తన కచేరీలను ఇచ్చేందుకు ఇష్టపడతానని... తన భార్యకు ఇష్టమైన చీరలు కొనేందుకు చెన్నై వెళ్లటం... నా గజిల్స్ అభిమా నుల్ని కలుసుకోవటం ఆనందంగా ఉందని చెప్తూ... తన మక్కువ చూపే వారు.
సింగర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన అర్ధంకాని పదాలతో రాసే సినీ సాహిత్యం కన్నా అద్భుత పదాలతో వినుల విందు చేసే గజల్స్‌ని పాడటంలో ఆనందం ఉందని అటువైపు అడుగులు వేసినట్లు గతంలో ఓ ఇంటర్వూలో కూడా చెప్పారు.
ప్రముఖ గాయని చిత్రా సింగ్‌ని 1969లో వివాహమాడిన ఆయన తనకున్న కళాభిరుచితో కుర్తాను డిజైన్ చేయగా ... స్కాడ్ కన్సల్టెంట్ జగజీత్ కుర్తాగా వస్త్ర ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కుర్తా ప్రకటన లలో బ్రాండ్ అంబాసిడర్‌గానూ జగజీత్ వ్యవహరించారు.
బాలీవుడ్‌లో అనేక చిత్రాలలో తనదైన ప్రత్యేక ముద్ర వేస్తూ... పాటలు పాడిన ఆయన పలు గజల్స్‌కు మ్యూజిక్ కంపోజింగ్ చేసి... అద్భుతంగా వాటిని రూపొందించి పలు ఆల్బమ్‌లని విడుదల చేసారు. జాకీర్ హుసేన్, హరిప్రసాద్ చౌరాసియాలతో కల్సి అనేక సంగీత ప్రదర్శనలు నిర్వహించిన ఆయన యుఎస్, కెనడా, యుకె తదితర దేశాలలో మ్యూజిక్ కస్సర్ట్స్‌ను నిర్వహిస్తూ.... అభిమానులు కోరుకున్నంత కాలం తన నోట గజిల్స్‌నే పడతానని చెప్పిన ఈ గజిల్స్ కింగ్ వీలును బట్టి సినిమాల్లోనూ పాటలు శ్రావ్యంగా ఆలపించి విశేష అభిమానులని సొంతం చేసుకున్నారు. జగజీత్ సింగ్ మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులతో పాటు గజల్స్ గాయకులు, ఆయన అభిమానులు నివాళులర్పిస్తున్నారు.