15, నవంబర్ 2011, మంగళవారం

కుటుంబానికీ..'బడ్జెట్‌'తప్పని సరి

మన 'నేతాశ్రీ'లు లెక్కలేనన్ని 'హామీ'లు గుప్పించి, ఓట్లు దండుకుని తీరా 'విషయం' అమలు ఎప్పుడని అడిగితే 'బడ్జెట్‌ లోటు' తర్వాత చూద్దామనే సమాధానాలు మన నిత్య జీవితంలో బోడెలన్ని వింటూనే ఉన్నాం..ప్రభుత్వాలే కాదు, కంపెనీలకు ఈ 'బడ్జెట్‌ లోటు' పదమే. కొంపలు ముంచి 'శఠగోపాల'కు బాటలు వేస్తోందన్నది వాస్తవం. 'బడ్జెట్‌ లోటు' పదం కుటుంబ వ్యవస్థను తాకి అతలాకుతలం చేస్తు న్న సందర్భాలు అనేకం. నిత్యం వార్తా కథనాలుగా చూస్తున్నాం. 'ఆర్థికం'గా అవరోధాలను సున్ని తంగా అధిగమించి 'లోటు'ని పూడ్చుకొని నిలదొక్కుకొనే వారు కొందరైతే, 'బడ్జెట్‌' ఫ్యామిలీ ఆర్థిక పరిధి దాటి, అప్పుల పాలై, ఆస్తులు పోగొట్టుకొని చివరికి 'ఆత్మార్పణ'లకు కూడా దారి తీస్తున్న సందర్భాలు అనేకం సాక్షాత్కరిస్తూనే ఉన్నాయి.
ఒకప్పుడు చేతితో చిల్లర తీసుకెళ్తే.. సంచి నిండా సరుకులు వచ్చేవని నాటితరం వారు చెబు తుంటే విని అలానా అంటూ ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి. వచ్చి చాన్నాళ్ళయ్యింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నా... ఇవి పట్టని ప్రభుత్వాలు 'టాక్స్‌'ల మోతతో వాటికి మరింత హుషారెక్కించి పరుగులు పెట్టించి సామాన్యుడికి 'అందని ద్రాక్ష'లా చేసిందనడంలో సంశయంలేదు.
విలాస వంతమైన జీవితానికి మార్గ్గాలు వేసేందుకు క్రెడిట్‌ కార్డులు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కావు. టార్గెట్‌లు రీచ్‌ కావటానికో... తమ ఆకలిని తీర్చుకోవటానికి ఉపాధిలో భాగంగానో తీపి కబుర్లు చెప్పి మిమ్మల్ని తమవైపు ఆకర్షించే వివిధ బ్యాంక ఏజంట్లు సమర్ధ వంతంగా తమ పనిని తాము చేసుకు పోతుంటారు. మీరు అడక్క పోయినా ... లాభాలు, బోనస్లంటూ చెప్పిన కబుర్లకు మీరు కాసింత మొగ్గు చూపితే క్షణాల్లో మీ చేతిలో కార్డు పెట్టేస్తారు. దీంతోనే మీకు అసలు కష్టాలు ప్రారంభం అవుతాయి. పొరపాట్న ఏ నెలాఖరు రోజునో మీరు అవస రార్ధం ఎక్కడ ఈ కార్డు ఉపయోగించినా... సదరు మొత్త్తాన్ని ఎపðడు చెల్ల్లిస్త్తున్నారంటూ టెలీఫోన్‌ సంభాషణలతోనే మీ ఇబ్బందులు ప్రారంబ ్థమవుతాయి.
బ్యాంకులుకానీ, బ్యాంకేతర కార్య కలాపాలు కానీ నిర్వహించే ఆర్ధిక సంస్ధలు (ఎన్‌బిఎఫ్‌సి) ఏదైనా తమ వార్షక వడ్డీరేటు ప్రాతిపదికన మాత్రమే వడ్డీని వసూలు చేయాలని చట్ట్టాలు ఘోషిస్త్తున్నా... అది అమలు కావటమే లేదు. క్రెడిట్‌ కార్డ్డులను అందచేస్త్తున్న వివిధ బ్యాంకింగ్‌, సంస్దలు వినియోగదారుడి నుండి సగటున 2.99 శాతంగా వడ్డీని నెల వారీగా వసూలుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే ఏటా ఈ సంస్ధలు తమ కస్టమర్ల నుండి 25 శాతం పైగానే వడ్డీ గుంజుతూ.. దానికి 12 శాతం సర్వీసు ఛార్జీలు కూడా ముక్కుపిండి వసూలు చేస్తుం డటం తమని నిలువుగా దోచుకునే ప్రక్రియేనని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తమ వినియోగ దారులు వస్తువులు కొనుగోలు చేసిన 50 రోజుల వరకు ఎలాంటి వడ్డీ వసూలు చేయబోమని చెప్పినా ... మీరు సదరు బ్యాంకింగ్‌ సంస్ధ స్టేట్‌మెంట్‌ తయారు చేసిన నాటికి ఉన్న కొను గోళ్ల మొత్తంపై వడ్డీ లెక్కేస్తారు. అది ఏ 14, 15 తేదీలో అయితే... మీ కొనుగోలు మెత్తానికి అక్షణం నుండే వడ్డీ లెక్కిస్తారన్న మాట. అంటే మీకు 50 రోజులంటూ మీకిచ్చిన తాయిలం గాలిలో కలిసిపోయిందనేగా... ఇలాంటి చిత్ర విచిత్ర వ్యవహారు చేస్తూ... వార్తలో ్లకెక్కిన పలు సంస్ధలపై కన్నెర్ర చేసిన ఆర్బీఐ పర్శంటేజిలు, జమాఖర్చులు పారదర్శకతతో నిర్వ హించాలని ఆదేశాలు జారీచేసినా ఫలితం పెద్దగా కనిపించటం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
మీరు అడక్కుండానే ఊరడించి మరీ అంటగట్టే క్రెడిట్‌ కార్డు... సదరు సంస్ధ బకాయిల వసూళ్ల పేరుతో వేధింపులకు పల్పడం ప్రారంభించన్పఇకి కాని మీకు మీరు చేసిన తపð ఏంటో అర్ధం కాదు. క్రెడిట్‌ కారు ్డలు అందచేస్తున్న వివిధ బ్యాంకింగ్‌ సంస్ధలు తమ వసూళ్ల కోసం ఏకంగా ప్రయివేటు సైన్యాన్నే నిర్వ హిస్తూ... ఇష్టానుసారం దాడులకు పాల్పడుతున్నాయన్నది వాస్తవం. హరిశ్చంద్రుడు వెంట నక్షత్రకుడు ఉన్నాడో లేడో మనం చూడలేదు కానీ ఒక్కసారి క్రిడిట్‌ కార్డు వాడుకుంటే వడ్డీల మీద వడ్డీలు వస్తూ... అపð రెండింతలుగా చూపించి వేధింపులకు గురిచేస్తూ... తమ సైన్యాన్ని ఇళ్లమీదకు పంపించే సంస్ధలు బోలెడున్నాయి. వీరి చేష్టలు పూర్వపు రోజుల్లో కాబూలీ వాలాకన్నా... ప్రయివేటు వడ్డి వ్యాపారుల కన్నా హేయంగా తమ అపðలను తిరిగి రాబట్టుకునేందుకు కష్టమర్లపై భౌతిక దాడులకు కూడా వెరవట్లేదంటే పరిస్ధితి ఏస్ధాయిలో ఉంటోందో అర్ధం చేసుకో వచ్చు.
ఇదే విషయంలో కష్టమర్ల వ్యక్తిగత స్వేఛ్చకి భంగం వాటిల్లేలా వివిధ సంస్ధలు ప్రవర్తిసు ్తన్నాయని ముంబై లో సహా వివిధ కోర్డుల్లో కేసులు నవెూదు కాగా.. రిజర్వు బ్యాంకు కూడా దీనిపై తీవ్రస్ధాయిలోనే స్పం దించి కష్టమర్లపై సంస్ధల పేరుతో ప్రయివేటు సైన్యాలతో చేయిస్తున్న దాడులను ఉపేక్షించబోమని.. పెనాల్టీల పేరుతో వినియోగ దారుల నుండి మరి కొంత వసూళ్లు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్న విధానా లకూ స్వస్ధి పలకాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే వినియోగదారుడి కార్డు ఏక్టివేషన్‌ అయ్యి నెల రోజులు కాకుండానే బిల్లులు పంపి బలవంతంగా వసూలు చేసినట్లు ఎలాంటి ఫిర్యాదు అందినా సదరు సంస్ధ నుండి రెట్టింపు జరీమానాను వసూలు చేస్తామని ఆదేశా లు జారీ చేసినా క్రిడిట్‌ కార్డు దారులు తమ కష్టాలు తీరుతాయనుకుంటే పొరపాటు పడినట్ల్లే...
ఎదుటివారిలా మీరు స్టేటస్‌ ఉన్న వారని గొప్పలకు పోయి... క్రిడిట్‌ కార్డు జారీ చేసే బ్యాంకుల ఏజంట్లు మాటలకు బోల్తాపడి ఈ ప్లాస్టిక కార్డు తీసుకుంటే పాముని పక్కలో పెట్టి పడుకున్నట్లే... మీరు ఆర్ధికంగా మరిన్ని చిక్కులు కొనితెచ్చుకున్నట్లే... అందుకే ఇలాంటి చిక్కుల్లో చిక్కుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేలా ప్రయత్నాలు చేసుకోవాలన్నదే మా అభిలాష.
ప్రస్తుతం జరుగుతున్న కార్డు మోసాలను దృష్టిలో పెట్టుకుని 'నగదు' చెల్లింపుకే ప్రాధాన్యత ఇస్తే 'వడ్డీ'ల బారినుంచి కాకుండా షాపింగ్‌ చేసే తత్వం అలవడుతుంది. వస్తువులు చేతికొచ్చినా, తీసు కున్న అప్పుని తిరిగి చెల్లించలేక, 'వడ్డీ'లు కట్టలేక ఆందోళనకు గురైన వారిని మనం ఎందరినో చూస్తున్నాం. బంపర్‌ ఆఫర్లం టూ ఎన్ని ఆశలు చూపినా క్రిడిట్‌ కార్డుల జోలికి పోకుండా ఉండటమే మంచిది. తొలి నాళ్లలో సరదాగా ప్రారంభమై... ఆపై విలాసాలకు ప్రధాన కారణంగా మారేది ఈ క్రిడిట్‌ కార్డులే. ఈ కార్డుల వల్ల అనేక ఇబ్బందులు కొని తెచ్చు కున్న వారిని ఓ సారి గమనించండి. 'ఎదుటి వారి సమస్య'లే మనకి గుణపాఠాలు కావాలి.
చాలీచాలని జీతాలున్న మన జీవితాలని రూపొందించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఆర్థిక వనరులు, అవస రాలు రాసుకుంటూ, ఆర్భాటాలు అదుపులో చేసుకునేలా మన బడ్జెట్‌ నిర్ణయించుకుని, ఉన్నంతలోనే పొదుపు మంత్రం పఠిస్తే మన భవిష్యత్‌ కూడా ఆనందమయం చేసు కునే ఆస్కారం కలుగుతుంది. అలాగే మనం సంపాదిస్తున్న జీతం నెల ఖర్చులకు సరిపోకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిందే. ఖర్చులను నియంత్రిం చేందుకు ప్రయత్నించండి. అవసరం లేకున్నా కొత్త వస్తువు చూడ గాలనే కొనేయాలన్న 'ఆతృత'ను చంపుకొని కుటుంబ అవస రాలు, విలువలు, ప్రాధాన్యతకి అనుగుణంగా మీ కుటుంబ బడ్జెట్‌ రూపకల్పన చేసుకొంటే.. ఉన్నంతలో మీ వ్యక్తిగత లక్షణాలను, సంతృప్తికరంగా చేరుకోవచ్చు. వచ్చిన ప్రతి అవకాశం వినియో గించుకొంటూనే.. మనకి లేనివాటి గురించి అనవసర ఆలోచనల్ని పక్కకు నెడుతూ.. ముందుకు సాగితే.. మీ 'బడ్జెట్‌' వినియోగం సక్ర మంగా సాగుతుంది.
అలా కాకుండా అనవసర ఆర్భాటాలు ప్రదర్శిస్తూ... అందరిలా మీకు ప్రత్యేక గుర్తింపు కోసం తాపత్రయపడుతూ ఇష్టానుసారం ఖర్చులకు తెరలేపి.. అయిన దానికీ కాని దానికీ జేబులో చెయ్యి పెడుతూ పోతే.. దానికి వచ్చే పెద్ద 'బిల్లు' కారణంగా జేబు చిల్లు పడటం ఖాయం.
ధరాఘాతాలతో తప్పుకొనే సామర్థ్యం మీకుందని అనిపించినా.. 'అవసరం మేరకే ఖర్చు' అని పరిమితి విధించుకుంటే భవిష్య ఉపద్రవాన్ని ముందే అధిగమించే ఆస్కారం ఉంటుందని గమనించి ఆ మేరకు నిర్ణయం తీసుకోండి.
'జీతం' రాగానే జల్సాలు చేయటం.. వాటిని కొనసాగించడానికి అప్పులు చేయటం అంటే సరైన ప్రణాళిక లేకుండా మీరు జీవితాన్ని గాడిపేస్తు వచ్చింది వచ్చినట్లు ఖర్చు చేసేస్తున్నారనే దాని అర్థం. ఇలా చేస్తే అనుకోని అవాంతరం.. ఆపదో.. అవసరమో? ఏ ప్రాణాల మీదకో వస్తే.. చేతిలో చిల్లిగవ్వలేక గిలగిలలాడాల్సిన దుస్థితి... అందుకు కారణం మీరే అని..తెెలిసిన వారెవ్వరూ ఆదుకో వట్లేదన్న ఆరోపణలతో కాలం గడుపుతున్న వారిని చూస్తున్నాం.
ఆ పరిస్థితి మనకీ ఏనాడైనా ఎదురు కావచ్చేమో? అందుకే.. మీ జీవితంలో పదో.. వందో.. నిర్థిష్టమొత్తాన్ని నిర్ణయించుకొని పొదుపు చేయండి.. సమయానుకూలంగా అది మీకు ఉపయోగ పడుతుంది.
జీతం రాగానే ఓ బడ్జెట్‌ని నిర్థేశించుకొని... మీ ఆదాయాని కన్నా ఖర్చులు అధిగమిస్తు న్నాయని భావిస్తే.. వాటిని అధిగమించేందుకు మీ సన్నిహితులతో.. ఇంట్లో వారితో ఆలోచనలు చేయండి...మీ 'ఫ్యామిలీ బడ్జెట్‌'తో వచ్చే హెచ్చుతగ్గుల్ని ఎప్పటి కప్పుడు పరిశీలించేందుకు మీరే 'ఆడిటర్‌' అవతారం ఎత్తీ.. ఖర్చులు తగ్గించడమో అదనపు ఆదాయాల మార్గాల అన్వేషణ ఆలోచన లు చేస్తే ఫలితం ఉంటుంది.
అయితే.. అన్నింటికీ కావాల్సింది మీ మీద మీకు నమ్మకం.. ఆదాయ వ్యయాల నడుమ సత మతమై పోతూ, అనవసర ఆలోచనలు చేయకుండా సమతూల్యంపై దృష్టి కేంద్రీకరిస్తే.. మీ 'ఆర్థిక ప్రణాళిక' ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో మీరే చూడొచ్చు.

పట్టాలు తప్పిస్తున్న ప్లాస్టిక్‌ కార్డులు
పెరగని జీతాలు, పెరుగుతున్న 'మాద్యాన్ని' ఏమాత్రం పూడ్చలేకపోతుంటే, జనం ఆశల్ని సొమ్ము చేసుకునే క్రమంలో 'క్రెడిట్‌' కార్డులు పుట్టుకొచ్చాయి. చేతిలో పచ్చకాగితం లేకున్నా ఈ ప్లాస్టిక్‌ కార్డుంటే కోరు కున్న వస్తువు క్షణాల్లో సొంతమైపోవడంతో తమ 'సంపాదన' సమస్యని పక్కకునెట్టి వేలం వెర్రిగా ఈ కార్డుల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. క్షణికావేశంతో 'క్రెడిట్‌' కార్డులతో అవసరాలను తీర్చుకుంటే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయనే విషయాన్ని గ్రహించండి.