15, నవంబర్ 2011, మంగళవారం

విశ్వ వేదికపై... మన మహిళ



ప్రకృతిని, భాషను, ప్రాంతాన్ని ఇలా ఏదైనా దానికి అమ్మలోని కమ్మదనాన్ని కలిపి...
‘స్త్రీ రూపాన్నిచ్చి ఆరాధించడం మన సనాతన భారతీయ సంప్రదాయం.
తల్లిగా, చెల్లిగా, ఆలిగా... అన్ని పాత్రల్లోనూ ఒదిగి పోయి..
సహనాన్ని, సాహసాన్ని కలగల్సి న రూపంగా నిలుస్తున్న మహిళలు...
పెరుగుతున్న సాంకేతిక విప్లవాన్ని, పురుష సామ్రాజ్యాన్ని ఎంత ధీటుగా...
ఎదుర్కొంటూ... సత్తా చూపుతూ... దూసుకుపోతున్న వారు సమాజంలో కొందరైతే...
పుట్టక ముందే ఆడపిల్లల్ని మొగ్గలోనే తుంచేయాలనుకుంటున్న వారు మరి కొందరు...
మన దేశంలో గత ఆరు దశాబ్దాలుగా మహిళల స్థాయిలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ మార్పు ఒక విచిత్ర పరిస్థితిని సూచిస్తోంది. ఒక పక్క మహిళలు విజయ సోపానంలో అగ్ర భాగాన ఉండగా మరో పక్క తన స్వంత కుటుంబ సభ్యులే త నపై పాల్పడుతున్న హింసను మౌనంగా భరి స్తున్న వారు ఉన్నారు. అయితే ఒక్కమాట మాత్రం నిజం. గతం తో పోలిస్తే వారు ఎంతో పురోగతి సాధిం ారు. సాధించవల సింది ఇంకా ఎంతో ఉంది. వారి సామర్థ్యాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవటం జరగలేదు. వారి దారి ఎన్నో అవరోధాలు, అడ్డం కులతో నిండి ఉంది. స్వాతంత్య్రానంతరం 60 ఏళ్ల కాలాన్ని ఒక సారి అవలోకిస్తే రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఒడి దుడుకులను వారు ఎదుర్కొన్నారని తెలుస్తుంది.
రాజకీయరంగంలో చూస్తే పార్లమెంటులో మహిళా సభ్యుల సంఖ్య 1952లో ఉన్న 4.4 శాతం నుంచి 2009 నాటికి 10.7కు పెరిగింది. భారత్‌లో మహిళలు రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌ సభ స్పీకర్‌, ప్రతిపక్ష నాయకుల హోదాలను పొందారు. పురుషా ధిక్య సమాజంలో ఉండి కూడా ఇందిరాగాంధీ, ప్రతిభా పాటిల్‌, మీరా కుమార్‌, సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్‌, షీలా దీక్షిత్‌, జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి రాజకీయాల్లో మేటి అనిపించుకుంటున్నారు. అయినప్పటికీ మహిళల రిజర్వే షన్‌ బిల్లు విషయంలో మాత్రం రాజకీయపార్టీల్లో కృత నిశ్చయంకొరవడింది. 2010 మార్చి 9వ తేదీన ఈ బిల్లు ను రాజ్యసభ ఆమోదించింది. అయితే లోక్‌ సభలో దాని ని ఇంతవరకూ ప్రవేశపెట్టలెెదు. ఆర్థిక రంగానికి వస్తే స్వాతంత్య్రం ఆర్జించే నాటికి పరిశ్రమల్లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థానాల్లో మహిళలుండడం ఊహ కందనిదే. ఈనాడు మనకు ఎందరో మహిళా పారి శ్రామికవేత్తలు, ప్రముఖ ఎగ్జిక్యూటివ్‌లు కన బడుతున్నారు. కిరన్‌ మజుందార్‌ షా (బయో కాన్‌ ), ఏక్తా కపూర్‌ (బాలాజి టెలి ఫిల్మ్స్‌), చందా కొచ్చర్‌ (ఐసిఐసిఐ ఎండి, సిఇఒ), ఇంద్రా నూయి (పెప్సి కో చైర్మన్‌, సిఇఒ ) వంటివారు దేశ విదేశాల లోని మొదటి పది మంది అగ్ర శ్రేణి పెట్టుబడిదారులు, ప్రము ఖ ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో ఉన్నారు. మరో పక్క బొంబా యి స్టాక్‌ ఎక్స్‌ఛేంజి లో లిస్టింగ్‌ అయిన కంపెనీల బోర్డు స్థానా ల్లో మాత్రం కేవలం 5 శాతం మంది మహి ళలే ఉండడం ఆశ్చర్యం. దేశంలో మరింత మంది మహిళలు విజయవంతంగా అక్షరాస్యులవుతున్నారు. మహిళల అక్షరాస్యతా శాతం 1951లో 8.86 శాతం ఉండగా 2011లో వారి శాతం 65.46గా ఉంది. గర్భవతిగా ఉండగా మరణిం చేవారి సంఖ్య 1982-86లో 580గా ఉండగా అది 2007-09 నాటికి 212కు తగ్గింది. అయితే గర్భస్థ పిండ దశలో ఉండగానే ఆడ శిశువుల భ్రూణహత్యలు పెరగడం వల్ల స్త్రీ, పురుష నిష్పత్తి లో వ్యత్యాసం పెరిగింది. కాగా మన దేశంలో ప్రతి ఏటా 5.7 మిలియన్‌ గర్భ స్రావాలు జరగడం విచారించదగిన అంశం. మహిళల పట్ల హింస కూడా గత 64 ఏళ్లలో పెరి గింది. వరకట్నం హత్య కెసుల సంఖ్యలో కూడ పెరుగుదల కని పిస్తోంది. 1965-75 మధ్య ఒక్క వరకట్న హత్య కేసు నమోదు కాగా 2009 నాటికి వాటి సంఖ్య 8,383కు చేరింది. అత్యాచారం కేసుల విషయానికి వస్తే 1974లో 2,962గా ఉన్నవి, 2009 నాటికి 21,397కు చేరుకున్నాయి. అయితే ఇంతకు ముం దు ఇటు వంటి హింసకు గురైనవారు బయటికి చెప్పుకోవడానికి వెనుకాడేవారు. ఇటీవల కాలంలో వారు వాటిని వెల్లడించేందుకు బయటకు వస్తున్నారు.
ఇక సినిమా, ఫ్యాషన్‌ రంగాలలో భారతీయ మహిళ లు జయకేతనం ఎగురవేశారు. సుస్మితా సేన్‌, ఐశ్వర్య రాయ్‌లు మిస్‌ యూనివర్స్‌, మిస్‌ వరల్డ్‌ పురస్కారాలను గెలుచుకున్నారు. సంగీత పరి శమకు అసాధారణ సేవ లందించినందుకు గాను 'మెలోడిక్వీన్‌'గా పేరొందిన లతా మంగేష్కర్‌కు భారతరత్న అవార్డును బహూకరించారు. నటిగా అద్భుత మైన నటన ప్రదర్శిం చినందుకుగాను షబనా ఆజ్మీకి ఐదు సార్లు నేషనల్‌ అవార్డు లభించిం ది. మదర్‌ ఇండియా, ఆరాధన, బ్యాండిట్‌ క్వీన్‌ వంటి చిత్రాలు భారతీయ మహిళల దీన స్థితిని చూపినా మరోపక్క వాటి లో వారి నటన భారతీయ మహి ళలప్రతిభకుగుర్తింపు తెచ్చాయి.
ఈ పరిణామాలను బట్టి చూస్తే మహిళా రంగం ముందు కు దూసుకువెడుతోందని, అయి తే అది అన్ని రంగాల్లో సమం గా లేద నే అంశాన్ని, వారు కొన్నిటిలో కొత్త సమస్య లెద ర్కుంటున్నారనే భావం కనిపిస్తోంది.
---- ఘండికోట పార్వతీశం