మీరు ఫుడ్‌పాయిజన్ బారిన పడ్డారా? అయితే మీరు ఈ పాటికి తెగ హడావిడి చేసి...సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరు చెప్పిన మందల్లా వాడేసి... చివరికి ఆసుపత్రుల వెంట పరుగులు తీసి.... జేబుకు పెద్ద చిల్లే పెట్టించుకున్నారా? అయితే ఈ సారి ఇలాంటి పరిస్ధితే వస్తే గాభరా పడి ఉరు కులూ... పరుగులూ తీయకం డి. కేవలం ధనియాల నూనెతో మీ ఫుడ్‌పాయిజన్ బాధల్ని తీర్చేయచ్చంటున్నారు పోర్చు గల్ పరిశోధకులు.
పోర్చగల్‌లోని బీరా ఇంటీరియల్ విశ్వవిద్యాలయం లో పని చేస్తున్న డాక్ట్టర్ డోమిం గీస్ నేతృత్వంలోని పరిశోధకు ల బృందం తాజాగా ఆహారం విషమయమైనప్పుడు జరుగు తున్న ఇబ్బందుల పై చేసిన పరిశోధనల్లో వంటింట్లో ఉండే ధని యాలే పెద్ద యాంటీ బయోటిక్‌గా తేలినట్లు వెల్లడించారు. సాల్మో నెల్లా, ఈ కోలీ లాంటి కణాలుతో పాటు ఎమ్‌ఆర్‌ఎస్‌ఏ తదితరా లు ఫుడ్ పాయిజన్‌కి గురైన వారి చర్మంపైన దాడి చేయటమే కా కుండా శ్వాస ప్రక్రియపైనా ప్రభావం చూపుతాయని దీంతో ఊపి రితి త్తులని దెబ్బతీస్తున్నట్లు గుర్తించామని వెల్లడించింది. ఇందుకు కొద్దిపాటి ధనియాల నూనె ఎంతో ఉపయుక్తంగా ఉన్నట్లు తమ పరిశోదనలో వెల్లడైనట్లు చెప్పారు.
ఈ
నూనె 12 రకాల బాక్టీరియాపై ప్రభావం చూపి వాటిని నియంత్రిస్తోందని... అందువల్ల ఆహారం విషతుల్య మైన సమయంలో ఎమ్‌ఆర్ ఎస్‌ఏ లాంటి విషపూరిత బాక్టీ రియాలపై ధనియాల నూనె సుదీర్ఘ పోరాటం జరిపి విజయ వంతంగా అడ్డు కట్ట వేయగలు గుతోందని.. అందువల్లే ధని యాలను ఉపయోగించి ఫుడ్ పాయిజనింగ్‌ని ఎదుర్కొనేం దుకు... మాత్రలు, టానిక్స్ తయారీ చేసేం దుకు సన్నాహాలు చేస్తున్నామని డాక్ట్టర్ డోమింగీస్ మీడియాకు వెల్లడించారు.