తెలుగువాడికి మరో అరుదైన అవకాశం దొరికింది.
సుప్రీం న్యాయమూర్తులలో ఒకరిగా పనిచేసే అవకాశం దక్కించుకున్నారు జస్టిస్ జాస్తి చలమేశ్వర్
పల్లె సీమలే పట్టు కొమ్మలన్న మహాత్ముని సిద్దాంతాన్ని
మనసా.. వాచా.. కర్మణ నమ్మి తన ఊరిపైనే కాదు...
తెలుగు భాషాభివృధ్ది ðపైనా.. కూచిపూడి నాట్యంపై..
చూపి వాటి అభివృధ్ధికి కృషిచేస్తూ... భారతీయ సంస్కృతి పరిరక్షణలో అనేక సంస్ధలకు మర్గదర్శనం చేసిన మహామనీషి.
కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని పెద ముత్తవి గ్రామంలో జాస్తి లక్ష్మీనారాయణ, అన్నపూర్ణా దేవి దంపతులకు 1953 సంవ త్సరం జూన్ 23న జన్మించారు చలమేశ్వర్.
తండ్రి న్యాయవాదిగా మచిలీపట్నంలో పనిచేస్తున్న సమయంలో అక్కడి హిందూ హైస్కూల్‌లోనే పియుసి వరకు చదివి, ఆపై చదివేందుకుమద్రాస్‌లోని లయోలా కాలేజీలో చేరి బిఎస్సీలో ఫిజిక్స్ ప్రాధాన్యతగా పట్టా సాధించారు.
తండ్రి చేపట్టిన న్యాయవాద వృత్తి పట్ల ఆకర్షి తులైన ఆయన విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివ ర్శిటీలో చేరి 1976 సంవత్పరంలోఎల్‌ఎల్‌బి పట్టా తీసుకున్నారు. అదే ఏడాది బార్ కౌన్సిల్‌లో న్యాయ వాదిగా తన పేరు నమోదు చేసుకుని డాక్టర్ భీమరాజు, పి.రాజారావు, కె. శ్రీనివాస మూర్తి తదితర సీనియర్ న్యాయవాదుల వద్ద రాష్ట్ర హైకోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేసారు.
సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ఇన్‌కమ్ టాక్స్, ఎలక్షన్‌లా, కాన్‌సిట్యూషన్, క్రిమినల్ లా, రాజ్యాంగం తదితర విభాగాలలో విశేష అనుభవం గడించిన ఆయన 1985లొ రాష్ట్ర లోకా యుక్త స్టాండింగ్ కౌన్సిల్‌గా ఏడాది పాటు వ్యవహరించారు. 1988లో హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన న్యాయ వ్యవహా రాలు చూసే ప్రభుత్వ న్యాయవాది గా రెండేళ్ల పాటు పనిచేసారు. 1995లో సీనియర్ కౌన్సిల్‌గా పదోన్నతి పొంది అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా వ్యవహరించారు. అదనపు న్యాయమూర్తిగా, హైకోర్టు న్యాయమూర్తిగా తన సేవలందించిన ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం కావటం పట్ల యావత్ తెలుగు జాతి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన నియామక ఉత్తర్వులు త్వరలో రాష్ట్రపతి విడుదల చేయనున్నారు.
తెలుగుదనంపై మక్కువ ఎక్కువ...
చలమేశ్వర్ ఎంత ఎత్తుకు ఎదిగినా తన స్వగ్రా మాన్ని ఏనాడూ మరిచి పోలేదు. న్యాయమూర్తిగా క్షణం తీరిక లేకున్నా... వ్యవసాయంపై ఉన్న మక్కువ తో తన ముత్తవి గ్రామానికి ఏడాదికి కనీసం రెండు సార్లయినా వచ్చి పేరు పేరుగా అక్కడి గ్రామస్తులను పలుకరించి వారిలో ఒకరిగా మమేకమైపో తారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తాను దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా ఆ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరవ్వటం ఆయన ప్రత్యేకత. అక్కడి పంటలను, పచ్చని పొలాలను పర్యవేక్షిస్తూ, ఆ ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదించేవారు. తెలుగు భాషన్నా, ఇక్కడి మనుష్యులన్నా ఆప్యాయత ప్రదర్శించే ఆయన తన ఇంట తెలుగుదనం కూచిపూడి నృత్యంపై ఆసక్తి ప్రదర్శించే వారు. ఆ నాట్యానికి పుట్టినిల్ల యిన కూచిపూడిలో కళాపీఠం నిర్మాణా నికి తన వంతు సహాయ సహకారాలం దించారు. బ్రహ్మకుమారీస్ సంస్ధ నిర్వహించిన పలు కార్య క్రమాలలో పాలు పంచుకున్నారు. సుప్రీం న్యాయ మూర్తిగా చలమేశ్వర్ 1918వరకు పదవిలో కొనసాగ నున్నారు. ఈయన భార్య పేరు లక్ష్మీ నళిని, వెంకట రామ్ భూపాల్, నాగభూషన్, లక్ష్మీ నారాయణ ముగ్గురు కుమారులు.
పుట్టిన రోజు కానుకగా
న్యాయమూర్తి పదవి
1997, జూన్ 23న తన పుట్టిన రోజు నాడు రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీక రించిన జస్టిస్ చలమేశ్వర్ 1999 మే 17న పూర్తి స్ధాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007లో పదోన్నతి పై గౌహతి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లిన ఆయన 2010లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
తెలుగునాడు నుండి 'సుప్రీం' న్యాయమూర్తులు
జస్టిస్ పి. సత్యనారాయణ, జస్టిస్ పి.జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ పి. చిన్నపరెడ్డి, జస్టిస్ కె.రామస్వామి, జస్టిస్ కె. జయ చంద్రా రెడ్డి, జస్టిస్ బి.పి. జీవన్‌రెడ్డి, జస్టిస్ ఎం. జగన్నాధ రావు, జస్టిస్ పి. వెంకటరామారెడ్డి, జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పలుకేసుల్లో సంచలన తీర్పుల తో న్యాయవ్యవస్ధ లో గణనీయమైన సేవలందించారు. వీరు చూపిన బాటలో తన ప్రత్యేకతని చాటుకుంటారని ఆశిద్దాం.