ఈ విశ్వంలో కేవలం మనిషికే కాదు... జంతువులకూ, పక్షులకూ హక్కులుంటాయి. అయితే మనిషి తాననుకున్నది నోరు పెట్టి సాధించుకుంటే పశుపక్షాదులు ఆ పని చేయలేవు... అందుకే వాటిని మూగ జీవాలంటాం. మనిషి హక్కులకి ఉల్లంఘన జరిగితే... ఉద్యమించేవారు బోలెడు మంది ఉన్నారు... అందుకు మానవ హక్కుల సంఘాలూ ఉన్నాయి.
కానీ నోరులేని జీవాల హక్కులకు భంగం వాటిల్లితే.... వాటికి అరణ్యరోదనే. అయితే కాలానుగుణంగా ఈ జీవాల హక్కుల్ని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా జీవకారుణ్య సంఘాలు పుట్టుకొచ్చాయి. వాటికి అండగా నిలచేందుకు అనేక మంది నడుం బిగించినా... వీరు చేస్తున్న పోరాటాల ప్రభావం చాలా స్వల్పంగానే కనిపించడం ఆందోళనకరం.
జంతు పరిరక్షణలో అమల
1992లో హీరో అక్కినేని నాగార్జున భార్య అమల బ్లూ క్రాస్‌ను నెలకొల్పి అస్వస్థులైన పశు పక్ష్యాదులకు సేవలందిస్తోంది.. బ్లూ క్రాస్ సేవలను భారతీయ జంతు పరిరక్షణ సంస్థ గుర్తించడంతో ఈ సంస్థ దాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తోంది.. జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కలసి జంతు పరిరక్షణకు మొబైల్ వ్యాన్‌లు నడుపుతూ...శునకాలకు సంతాన నిరోధ చికిత్స, రాబిస్ వేక్సినేషన్, ఆలీవ్ రిడ్లే తాబేళ్ల,ఎలుగుబంట్ల పరిరక్షణకి కృషి చెస్తూ జంతు పరిరక్షణను పాఠ్యాంశంగా రూపొందించడంలో విశేష కృషి చేసింది.. దీని కార్యవర్గంలో చేరాలంటే వారానికి కనీసం మూడ్రోజులైనా రోజూ 3 గంటలు ఓ ఏడాది సేవలందించాలన్న నిబంధన ఉండటం విశేషం.
మనిషికీ.. మనిషికీ వైరం పెరుగుతున్నా... చాలా సందర్భాలలో జంతు వులే మానవాళికి అండగా నిలబడుతున్నాయన్న విషయాన్ని గమనిం చిన జంతు ప్రేమికులు సాధు జంతువులు, పక్షులనే కాదు, కౄర జంతు వుల పాలిట కూడా తమ మమకారాన్ని చూపిస్తూ... మానవ మృగాల వేటలో అంతరించి పోతున్న జీవుల సంరక్షణకు నడుంబిగించి... వాటిపై మక్కువ పెంచుకునేలా సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు అనేక మంది కృషి చేస్తున్నారు. సాటి మనిషినే కాదు... మీకు దగ్గరలోని ఉన్న జీవాలనీ హింసించవద్దంటూ చేస్తున్న ప్రచారం కొంతమేరైనా చైతన్యానికి నాంది పలుకుతోందనే చెప్పక తప్పదు.
బంధం, సంబంధం
మన హిందూ, బౌద్ధ, జైనమతాలలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని మతాలకు చెందిన దేవీ దేవతలకు, ప్రవక్తలకు కూడా పశు పక్ష్యాదులకు అవినాభావ సంబంధం కనిపిస్తుంది. శ్రీ కృష్ణుడు ఆలు మందలతో ఎంత ఆనందంగా ఉండేవాడో అంతకు మించి ఆలు మందలతో పరవశించి పోయేవాడు. శ్రీరాముడికి సీతమ్మ జాడ కోసం వానరాల సాయంచేస్తే.... రామసేతు నిర్మాణా నికి ఉడుతలు సైతం ఇతోధికంగా రాళ్లు చేర్చి భక్తిని చాటు కున్నా యి. శివుడు సర్పభూషణుడైతె వెంకటేశ్వరుడు పుట్టలో వుండగా ఆకలి తీర్చి నది గోవు. అంతెందుకు దేవతలైన శివుడికి నంది, విష్ణువుకి గరుడ పక్షి, జగన్మాతకి సింహమే వాహనం. గణషుడికి ఎలుక, సుబ్రహ్మణ్యుడికికి నెమలి, కాలభైరవుడు శునక ప్రియుడు, దతా ్తత్రేయుడి వద్ద గోవులు, శునకాలు సరస్వతి, గాయత్రి హంస అంబాదేవి పులిపై విహరిస్తుంది. అంతెందుకు మహా విష్ణువు అవతా రాల లో ఎక్కువగా వివిధ జీవులు దర్శనమిస్తాయి మనకి. అంటే.. మనిషి ని, జంతువుల్ని భగవం తుడు సమానంగా చూస్తున్నాడనేగా అర్ధం.
ఇక మన పూర్వీకులు పశుపక్షాదులకు ఆహారం దొరకాలనే భావనతోనే చివరికి పిండ కర్మలలో కాకులకి ప్రాధాన్యత ఇచ్చారు. నగరీకరణతో కాకులు బీహార్‌లో కరువైతే కాకి బొమ్మలను చేసి వాటి వద్ద పిండాలను వుంచుతున్నారట. ఇక దానాలలో గో దానం ఎంతో విశిష్ఠతను సంతరిం చుకుంది. అలాగే బ్రహ్మోత్సవాలలో ఏనుగులు ప్రధాన ఆకర్షణగా నిలు స్తాయి. హిందూ పండుగలలో సంక్రాంతి తరువాత వచ్చే కనుమ ని పశువుల పండగగా రైతులు ప్రత్యేక పూజలు జరుపుతారంటే జంతు ప్రాధాన్యతని గుర్తెరగాలి. క్రీస్తుని గొర్రెల కాపరిగా కనిపిస్తాడు. బౌద్ధులు, జైనులు జీవహింస చేయరు. జైనులు పక్షులను బోనుల నుండి విడిపిస్తు. గాంధీ మహావీర్ జయంతులని అహింసా దినోత్సవంగా పరిగణిస్తారు.
దేవాలయాల్లో జీవులు...
హాంకాంగ్‌లొ కోతులకు అనేక పళ్లు పెట్టి వాటి ఆకలిని తీరుస్తారు. శృంగేరిలో చేపలకు ఆహారాన్ని వేస్తారు. రాజస్థాన్‌లో మూషికాలకు దేవాలయం వుండటం విశేషం. పలు పుణ్యక్షేత్రాల్లో గోశాలలను నిర్వ హిస్తున్నారు. మసీదులు, చర్చిలు, వివిధ దేవాలయాల గోపురాలపై చేరే పావురాలు అక్కడి సందర్శకులకు కనువిందు చేస్తుంటాయి.
పెంపుడు జంతువులకు హేపీ బర్త్‌డేస్
ఆధునిక సమాజంలో జంతువుల పట్ల్ల అనేక మంది ఆప్యాయతని, అను రాగాన్ని పెంచుకుంటున్నారు. పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాలలోనూ జంతువుల పెంపకం క్రమేపీ పెరుగుతోంది. ఇళ్లల్లో పిల్లులు, శునకాల ను కుటుంబ సభ్యులు గానే పరిగణిస్తు...వాటికీ పుట్టిన రోజులు జరుపు తున్నారంటే వాటినెంతలా ప్రేమిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
పండగొస్తే... ప్రాణ సంకటమే...
పెంపుడు జంతువుల పట్ల్ల ఆరాధనాభావం ఎంత పెరుగుతోందో అంతకు మించి జీవహింస పెరుగుతోంది. సాధారణ పండగలొస్తే.... లక్షలాది మూగ జీవులు బలికావాల్సిందే... అన్న పరిస్ధితి కనిపించడం ఆందోళన కలిగించేదే... పండగలలో మేకలు, గొర్రెలు, వేల సంఖ్యలో ఒంటెలు వధిస్తుంటే... కనువిందుగా అడవిలో కనిపించే నెమళ్లు, దుప్పులు, అడవి పందులు, అనేక రకాల అడవి జీవులు, పిట్టలు వేటగాళ్ల ధర్మమా అని ఆరగింపైపోతున్నాయి. దేవాలయాల్లో జంతు బలి నిషేధం బోర్డులకే పరి మితమై పోయింది. పండగ వచ్చినా, జాతర జరిగినా వేలాదితలలు తెగి పడుతున్నాయి. గిరిజన పండుగలలో ఆవులు, గేదెలతో పాటు దున్నపోతుల్ని బలిచ్చే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోందంటే ఆశ్చ ర్యం కలుగక మానదు.
హింస బారిన పశు, పక్ష్యాదులు
తమకు పనికి రాకుండా పోయాయని జీవుల్ని కబేలాలకు అమ్మేస్తున్న వారు కొందరైతే.. విచక్షణారహితంగా వధశాలలో చంపేస్తూ వాటి మాం సాన్ని సొమ్ము చేసుకుంటున్న వారు మరి కొందరు. ఇక జంతు రవాణా కలిగిస్తున్న చిత్రవధ అంతా ఇంతా కాదు. రాజస్థాన్ నుండి ఒంటెలను కాలినడకన తరలిస్తుండగా... ఆవులు. మేకల్ని ఒక చోటి నుండి మరో చోటికి తరలించేప్పుడు గంటల తరబడి నిలబెట్టి హింసిస్తున్నారు. అలాగే వినోదం పేరుతో సర్కస్‌లలో జంతువులకు ఇచ్చే శిక్షణలో వాటికి ఎంతో వేదనకు గురి చేస్తుండడటంతో... వాటికి సహజవాతావరణం కరువై, సరి యైన పోషణ లేక రోగాల బారిన పడి చనిపోతున్నాయి.
విందుగా, పసందుగా....
వేట మాంసం పేరున దుప్పులు, నెమళ్లు, అడవిపందులు, కుందేళ్లు మాంసాన్ని దాభాలలో యదేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఔషధ తత్వాలు, పౌష్టికత పేరుతో ఉడుంలను చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నా.. నియంత్రణ చట్టాలు అమలు కావట్లేదనటానికి ప్రత్యక్ష సాక్ష్యం.
శాపంగా మారిన నగరీకరణ
పెరుగుతున్న నగరాలు, గనుల పేరిట పారిశ్రామీకరణ అటవీ వైశాల్యం కుదించేస్తోంది. దీంతో ఆశ్రయం కరువైన ఏనుగులు, పులులు, ఎలుగు బంట్లు, కోతులు గత్యంతరం లేక నగరబాట పడుతున్నాయి. ఈమధ్య విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాలలో ఊళ్లపై పడిన చిరుతల ఘటనలే ఉదాహరణ. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన జంతు సం రక్షణ కేంద్రమైన ముంబై నేషనల్ పార్క్ నేడు ఆక్రమణాలకు గురై 'లిలీపుట్' లా తయారైు కావటం ఆందోళన కలిగించేదే..
పశు, జంతు పరిరక్షకులు
కూృరత్వం పెచ్చు మీరితే కారుణ్యం తన వంతు పాత్రను పోషి స్తుంది. ాఈఆ, ఊిఆ, ఇంీఊ ఈక్షాా, ప్రాణిమిత్ర సంఘ్, సహ యోగ్ ఇలా పలు సంస్థలు జంతువులని సంరక్షించేందు కు జనాలను చైత న్యం చేస్తుంటే.. యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ ఛానళ్లు జీవుల ఆవస్యకతపై ప్రజలలో అవగాహన కలుగచసున్నారు.
జైనుల ప్రముఖ పాత్ర
అహింసను ప్రచారం చేసే జైనులు పశు, పక్ష్యాదుల కోసం ప్రత్యేక ఆసు పత్రులను నిర్వహిస్తూ... గోవధ నుండి ఎన్నో ఆవులను రక్షిస్తు వాటి రక్షణ కి గోశాలలను నిర్వహి స్తున్నారు. రుద్రారం పశు వధశాలను ఆపేం దుకై ఎంతో కృషిగావించారు. వీరి సహకా రంతో హైదరాబాద్‌లో ప్రాణిమిత్ర సంఘ్, సహయోగ్ సంస్థలు పనిచేస్తున్నాయి.
ఖైదీల సంరక్షణలో గోవులు
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జైలులో ఖైదీలకు గోసేవను కేటాయించారు. గొ సేవ పాపాలను హరిస్తుందని ఖైదీలచే పశుపాల న, పోషణ చేయిస్తూ... వీటి పాలను రోగులైన ఖైదీలకు అందిస్తున్నామని, తద్వారా ఖైదీలలో ప్రశాంతత చోటుచేసుకుంటోందని..గో సేవ కోసం పంజాబ్ నుండి మరిన్ని గోవుల ను తెచ్చినట్లు సీనియర్ జైల్ సూపరింటెండెంట్ బి.ఆర్.వర్మ తెలియజేశారు. ఇండియా లో ని బారేలీ జైలులో గోసేవ ద్వారా ఖైదీలు మన: శాంతిని పొందు తుంటే, ఓహియో జైలులో ఖైదీలతో గోవధ చేయిస్తున్నారు. దీం తో ద్వారా వారిలో మరింత అశాంతి కలుగుతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
విహంగాలకూ హక్కులున్నాయి
వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972, సెక్షన్ 12, జంతువుల క్రూరత్వ నిరోధక చట్టం-1960, సెక్షన్11 ప్రకారం పక్షులను ఇరుకు పంజరాలలో బంధించి, వాటి రెక్కలు, తోకలను కత్తిరిస్తే, వారు శిక్షార్షులే, సూరత్‌లో 494 పక్షులను బంధించి పట్టుబడ్డ ఆజమ్ షేక్ కోర్ట్‌ను ఆశ్రయించాడు . అజామ్ న్యాయవాది తన కక్షిదారుడు పక్షుల విక్రయాన్ని ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాడనీ, వాదించినా...న్యాయమూర్తి వాటిని అతనికి అప్పగించనవసరం లేదనీ, గాలిలో వదిలి వేయమనగా సుప్రీం తలుపు తట్టాడు అక్కడ కూడా జస్టిస్‌షా తన తీర్పులో సెక్షన్ 541 విచార ణాస్మ్రతి ప్రకారం పక్షులు స్వేచ్ఛగా విహరించడానికి వాటికి హక్కు వుందని జుడీషియల్ మెజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయం సరైనదన్నారు.
ద్వారకా తిరుమలలో గజేంద్ర మోక్షం
ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని లక్ష్మి అనే ఆడ ఏనుగును 250 చదరపు గజాల స్థలంలో ఆస్ బెస్టాస్ షెడ్‌లో పెట్టి దానికి ఆహారం సరిగా అందించలేదు. పరిసరాలు శుభ్రత లేక పాదాలు పగిలాయి. కంపాషన్ అన్ లిమిటెడ్ ప్లస్ యాక్షన్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ, సహయోగ్, వరల్డ్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్ తరపున మహేష్ అగర్వాల్, వర్మ, రావు, సుజాత లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని వెటర్నరీ డాక్టర్లతో సంప్రదించి ఆలయాధికారులకు ఏనుగు సంరక్షణకై చర్యలను సూచించారు.