తెలుగువారి సంస్కృతీ సాంప్రదాయాలలో భాగమైపోయిన బొమ్మల్లో తన హస్త కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి తనకో ప్రత్యేక స్ధానం ఏర్పరచుకున్న గ్రామాలలో 'ఏటికొప్పాక' ఒకటి. దాదాపు 110 ఏళ్ల నుంచి ఎన్నో రకాల బొమ్మలని తయారు చేస్తున్న ఈ గ్రామస్తుల ప్రతిభాపాటవాలకు దేశాధినేతే ముచ్చటపడి సత్కరించిన సందర్భమూ సొంతం చేసుకున్న ఘనత ఈ గ్రామానిది.
విశాఖపట్నం జిల్లాలో జిల్లా కేంద్రానికి దాదాపు 60 కిలో మీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో ప్రవహించే వరహా నదీ తీరాన ఉన్న ఓ కుగ్రామం ఈ 'ఏటికొప్పాక'. ఇరుకు ఇరుకు సందు లుగా ఉండే ఈ ఊర్లోని చాలా మంది బొమ్మలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఓ వైపు గ్రామ దేవతైన బండమ్మ, మరోవైపు నూకాల మ్మల సాక్షిగా తెలుగుదనానికి తమదైన శైలిలో వన్నెలద్దుతూ...ఈ గ్రామంలో తయారవు తున్న బొమ్మలు ఇట్టే ఆకర్షిస్తాయనటంలో సందేహం లేదు.
అటవీ శాఖ సైతం పనికిరాదని నిర్ధారించిన 'అంకుడు చెట్టు' నుండి సన్ని తంగా...మెత్త్తగా ఉండే కలపని తమ చేతు లతో అందాల బొమ్మలుగా గృహంలంక రణ వస్తువులుగా తీర్చిదిద్దుతున్నారు. లక్క అనే కీటకాలను సేకరించి, వాటికు న్న చిన్నపాటి కొమ్ముల వంటి భాగాలను తొలగించి వాటి నుండి శ్రవించే జిగురు పదార్ధాన్ని శుద్ది చేసి 'స్టిక్‌లాక్' పేరుతో ఈ బొమ్మల తయారీలో వినియోగిస్తుండటంతో ఈ బొమ్మలని లక్క బొమ్మలని కూడా పిలు చుకోవటం కద్దు.
ప్రపంచ వ్యాప్తంగా విషపూరితమైన అనేక రంగులు రాజ్యమేలుతుంటే... నేటికీ 'ఏటి కొప్పాక'. బొమ్మల తయారీలో పసుపు కొమ్ములు, కూరగాయలు, కాకరకాయ ఇలా ప్రకృతిలో లభించే రంగులను లక్కతో మేళవించి కొత్త సొగసులు కల్పి స్తున్నారు. చిన్నారులు బొమ్మలు నోట్లో పెట్టు కుంటే విషపూరితమై అనారోగ్యం పాలు కావటం సహజం. అయితే 'ఏటికొప్పాక' బొమ్మలు ఇందుకు మినహాయింపనే చెప్పక తప్పదు.
'ఏటికొప్పాక' బొమ్మల్లో తాడూ బొంగరంకి, బుట్ట బొమ్మలకి ప్రత్యేక స్ధానం ఉంది. ఒకప్పుడు అమ్మాయిని అత్త వారింటికి సాగనంపేప్పుడు ఇక్కడి ప్రాంత ప్రజలు బొమ్మలు ఇచ్చి పంపడం సాంప్రదాయంగా ఉండేది. కాని మారుతున్న కాలం ఈ బొమ్మల్ని దిగమింగేసింది. వీడియో గేమ్స్, ప్లాస్టిక్ బొమ్మలు, చైనా తదితర దేశాల నుండి దిగుమతి అవుతున్న బొమ్మలు హానికరమే అయినవే అయినా సాంప్రదాయ బొమ్మల స్ధానం ఆక్రమించేసాయి.
అంతర్జాతీయంగా ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన బొమ్మల తయారీ కోసం వినియోగించే 'అంకుడు చెట్టు' నుండి కలపని అడవుల నుండి సేకరించేందుకు వెళ్లే కళాకారులపై వైపు పనికిరాదని చెప్తునే అటవీ శాఖాధికారులు పలురకాల కేసులు బనాయిస్తుండటం, వేధింపు లకు గురి చేస్తుండటం తో పాటు నానా కష్టాలు పడి బొమ్మలు తయారీ చేసినా అందుకు తగ్గ ప్రతిఫలం రాక పోవటంతో తరతరాల సాంప్రదాయంగా వస్తున్న ఈ కళ పట్ల మక్కువ ఉన్నా జీవితానికి అది ఉపయోగపడటం లేదన్నది ఇక్కడి కళా కారులు ఆవేదన చెందుతున్నారు. తమ వారసు లు చాలా మంది మరో వృత్తివైపు మరలటానికి ఈ కళలో ప్రోత్సాహకాలు తగ్గటమే కారణం గా పేర్కొంటున్నారు.
తరాలు మారినా... మన సంస్కృతిని, తెలు గు జాతి వైవిధ్యభరిత జీవన విధానాన్ని ప్రపంచం నలుదిశలా చాటి చెప్తున్న బొమ్మ లకు రాను రాను ఆదరణ తగ్గుతుండటం ఆందోళన కరమైన అంశమే. పైపై రంగులని ఆశ్వాదిస్తూ...మన పునాదుల్ని మనమే తవ్వే స్తూ... స్ధానిక కళలకి సమాధి కట్టేస్తున్నాం. గతమెంతో ఘనమని విర్రవీగటమే కాదు...నేటి తరంలోని సాంప్రదాయ కళల్ని భవిష్యతరాల కు అందించాల్సిన బాధ్యతల్ని గుర్తెరిగి ప్రోత్స హించండి. మీకు దగ్గర్లో అడపాదడపా జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్లలో మన వాళ్లు తయారు చేసే బొమ్మల్ని కొని వారికి ఊతమివ్వాల్సిన అవసరం గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వం నుండి తగిన ప్రోత్సాహం లభించక పోవటం వల్లే కొయ్య బొమ్మల పరిశ్రమ కుంటుపడు తోందని, బొమ్మలకు జీవం పోస్తున్న ఎందరో కళాకారుల జీవనం ముందుకు సాగే వీలులక అయిన కాడికి అమ్ము కోవాల్సి వస్తోందని ఆవేదన వినిపిస్తోంది. ఓ నాడు ఎంతో మక్కువతో జనం ప్రశంసలు పొందిన ఈ కుటీర పరిశ్రమ అంతర్జాతీయ మన్నలను పొందినా నేడు ఆదుకునే వారు లేక అంతరించి పోతుందేమోననే భయం స్దానికులలోనే కాదు యావత్ తెలుగునాడులోనూ ఉందన్నది అక్షర సత్యం. అప్పు ఊబిలో కూరుకు పోతున్న ఈ కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
ఈ కళకీ ఓ చరిత్ర ఉంది...
చింతలపాటి కుటుంబం దాదాపు 200 ఏళ్ల క్రితం ఈ గ్రామానికి వచ్చి స్ధిరపడ్డారు. సాంప్ర దాయ భూస్వాములుగా, ఈ ప్రాంతానికి రాజులుగా చలామణి అయ్యే వీరు విజయనగర మహరాజు లకు వీర విధేయులై ఉండే వారు. ఈ ప్రాంతంలో విస్తారంగా సాగవుతున్న చెరుకు పంటను దృష్టి లో ఉంచు కుని భారత దేశంలో తొలి చక్కెర కార్మాగారం ఏటికొప్పాకలో నిర్మించిన ఘనత వీరిది.
1906లో ఏటి కొప్పాకలో భూస్వామిగా ఉన్న సి.వి.పద్మరాజు మద్రాసు నుండి లక్కను తీసు కువచ్చి స్ధానికంగా ఉండే వడ్రంగితో తన అభిరుచికి తగ్గట్టు రకరకాల బొమ్మల్ని తయారు చేసి దాని తో నగిషీలు దిద్దారు. ఇవి చాలా మందిని ఆకర్షించడంతో అనంతర కాలంలో బొమ్మలకు సమీప అడవుల్లో దొరుకుతున్న 'అంకుడుచెట్ల”కలపను బొమ్మలుగా మలచి, పసుపు, మధ్యప్రదేశ్‌లో లభ్య మయ్యే రంగు రంగుల కూరగాయల పొడులను దిగుమతి చేసుకుని తమదైన శైలిలో సాంప్రదా యాలను అనుసరిస్తూ రూపకల్పన చేసి అనతి కాలంలోనే యావత్ రాష్ట్ర దృష్టిని ఆకర్షించారు. ఆపై పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ పనికి అన్వయించుకుంటూ... బొమ్మల తయా రీలో వివిధరకాలు మిషనరీలను తీసుకువచ్చి... కొత్త కొత్త బొమ్మలను వేగవంతంగా తయారు చేసి దేశ విదేశాలకు సైతం ఎగుమతిచేసేస్తాయికి ఎదిగారు. ఏటి కొప్పాకలో తయారైన బొమ్మలకు నేటీకీ జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాల్లో ప్రత్యేక ఆదరణ ఉంది.
మరికొంత మంది తమలోని కళను మెరుగు పరుచుకునేలా ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖ పట్నం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహ్మదాబాద్, ఎంఎస్ యూనివర్శిటీ బరోడా తదితరాల సహకారంలో ఫైన్ ఆర్ట్స్‌లోనూ ప్రావీళ్యత సంపాదించడమే కాక అనేక రూపాలను సృష్టించడంలో విజయం సాధించారు.