''అక్షరాస్యతలో మనం అధమసానంలో ఉన్నాం. విన్నాక సిగ్గేసిందంటూ.. ఈ మధ్య మన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గారు వాపోవటం చూసాం. కేవలం రాయడం, చదవ టం మాత్రమే అక్షరాస్యత కాదనీ... గౌరవం, అవకాశాలు, అభివృద్ధి గురించి చెప్ప డమే నిజమైన అక్షరాస్యతని..1965 నవంబరు 17వ తేదీన యునెస్కో సభ్యదేశాల విద్యా మంత్రుల మహాసభ నిర్ణయంతో 1966 నుండి ఏటా సెప్టెంబర్ 8వ తేదీని ''అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం''గా జరుపుకుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లోనే కాకుండా వయోజన విద్యమీద దృష్టి కేంద్రీకరించడం కోసం ఐరాస 1945 లో విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో)ని ప్రారం భించి.,,అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం, సాంస్కృతిక పరిరక్షణతో పాటు విద్యా క్రియాశీల కార్యక్రమాలలోశాంతి, రక్షణలకు తోడ్పాటునందిస్తుంది.
ఇక యునెస్కో లెక్కల ప్రకారం పపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం ఆందోళన కలిగించేదే.. స్వాతంత్య్రం వచ్చి 63 ఏళ్ళు గడు స్తున్నా 65 శాతం అక్షరాస్యతనే సాధించగలిగాం. మన దేశం స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే 80 శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది. అందరూ చదివినపుడే గ్రామాభివృద్ధి జరుగుతుంది.