15, నవంబర్ 2011, మంగళవారం

ఒకే ఒక్కడు

కంప్యూటర్‌ అనే ఒక ిగొప్ప యంత్రాన్ని వ్యక్తిగత యంత్రంగా మార్చి, దాన్ని జేబులో అమర్చగలిగిన అమెరికన్‌ సాంకేతిక నిపుణుడు స్టీవ్‌ జాబ్స్‌
2011 అక్టోబర్‌ 5న పరమపదించారు. యాపిల్‌ కంప్యూటర్‌ కంపెనీ ‘స్ధాపించి...కంప్యూటర్‌ని సామాన్య మానవుడి ముంగిట చేర్చి...
ుd, ఠుn|, శ-, ఈుషd లాంటి చిట్టి కంప్యూటర్ల ఆవిష్కరించి ఇతరులకన్నా వేరుగా ఆలోచించటం ఆయన నైజం.
338 సాంకేతిక ఉపకరణాలకు పేటెంట్‌ హక్కులు పొందిన అసాధారణ పత్రిభావంతుడుగా ప్రపంచ స్వరూపాన్ని మార్చేయ గలననిచూపినవాడు. సమాచార సాంకేతికతని సామాన్యుడి చేరువ చేస్తునే.... ప్రతిరోజూ ఇదే తనకు చివరి రోజన్నంతగా కష్టపడి పని చేస్తూ....
ప్రపంచమే విస్తుపోయేలా తన దైన శైలిలో దూసుకు పోయిన ఆధునిక సాంకేతికతకు పితామహుడనదగిన స్టీవ్‌ జాబ్స్‌ మరణంతో సమాచార సాంకేతికతకు తీవ్ర విఘాతం జరిగిందన్న మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌, వాల్ట్‌ డిస్నీ కంపెనీ అధినేత బాగ్‌ ఐగర్‌, ఫేస్‌ బుక్‌ అధినేత
మార్క్‌ జకర్బర్గ్‌, అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాల మాటలు అక్షర సత్యాలు... స్టీవ్‌ జాబ్స్‌కి నివాళిగా ఈ ప్రత్యేక వ్యాసం.
స్వంత పరిశోధన లేకుండా సాంకేతిక ఉపకరణాలను తయారుచేసే వాళ్ళంటే జాబ్స్‌ ఇష్టపడేవాడు కాదు. ఈ మాటే అన్నాడని కోపగించుకొని డెల్ల్‌ కంపెనీ యాజమాని 'నీ యాపిల్‌ కంపెనీని కొంటాను అప్పుడేంచేస్తావ్‌..' అనడిగాట. దానికి బదులుగా జాబ్స్‌ 'నా షేర్‌ హౌల్డర్లందరికీ డబ్బులు తిరిగిచ్చేసి కంపెనీకి తాళం వేస్తాను'' అన్నాడు. ఒక సంవత్సరకాలంలోనే యాపిల్‌ కంపెనీ డెల్ల్‌ కంపెనీ ఆస్తుల్ని అధిగమించింది. అప్పుడు జాబ్స్‌ అన్నాడట... 'షేర్‌ మార్కెట్‌ సెంటిమెంట్లను బట్టి కాదు,స్వశక్తిని బట్టి భవిష్యత్తును నమ్ముకోవాలని!
''నేను త్వరలోనే చచ్చిపోతాననే జ్ఞాపకమే ఒక సాధనంగా గొప్ప పనులు చేయాలనే తాపత్రయాన్ని నాలో కలిగిస్తూ వచ్చింది. బయటి నుంచి వచ్చే వత్తిళ్ళు, సన్మానాలు, సత్కారాలు, వైఫల్యాలు,సిగ్గుపడే పరిస్థితులు ఇవన్నీ ఆ మృత్యుముఖం ముందు వెలవెలపోయాయి. ఏది అసలైనదో, ఏది ముఖ్యమైనదో అది మాత్రమే మిగిలింది. నీలో పరాజయాన్ని తెచ్చి పెట్టే అంశాలను తొలగించుకోవాలంటే, చావు దగ్గరలోనే ఉందనే భావన ఎప్పుడూ నీకు గుర్తుకు వస్తూ ఉండాలి. నీలో దాచుకోవాల్సింది ఏమీ లేదు. మన హృదయాన్నే అనుసరించక వేరే దారి లేదు. మనకున్న సమయం చాలా తక్కువ. దాన్ని వృధా చేసుకోవద్దు. ఇతరుల అభిప్రాయాల ధ్వనులు నీ ఆత్మ ధ్వనిని ముంచేయకుండా చూసుకోవాలి'' (స్టాన్‌ ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థుల నుద్ధేశించి 2005లో స్టీవ్‌ జాబ్స్‌ చేసిన ప్రసంగంలోంచి...) స్టీవ్‌ జాబ్స్‌ 1955 ఫిబ్రవరి 24న విస్కాన్సిన్‌లోని గ్రీన్‌ బేలో ఒక సిరియా మహమ్మదీయుడికి జన్మించాడు. ఆర్మీనియా కుటుంబానికి దత్తువెళ్ళాడు. హైస్కూల్‌ చదువు కాలిఫోర్ని యాలో పూర్తి చేశాడు. హైస్కూల్లో చదివేటప్పుడే సెలవుల్లో హ్యూలై ట్స్‌ పెకార్డ్స్‌ కంపెనీలో తాత్కాలికోద్యోగిగా పనిచేశాడు. అక్కడే తన కన్నా ఐదేళ్ళ పెద్దవాడయిన స్టీవ్‌ వోజ్నైక అనే డిజైనర్‌తో స్నేహం కుదిరింది. హూమ్‌బ్రూ అనే కంప్యూటర్‌ క్లబ్‌లో చేరి వాళ్ళ సమావేశాలకు వెళ్తూ కంప్యూటర్‌ రంగం మీద ఆసక్తి పెంచుకొన్నాడు. 1972లో పోర్ట్‌లాండులో రీడ్‌ కాలేజీలో చేరాడు. ఒక సెమిస్టర్‌ అయ్యాక ఆ చదువు నచ్చక వేదాంతం, విదేశీ సంస్కృతులలోకి మారాడు. కాలేజీలో చేరిన తర్వాత కూడా స్థానికంగా హరేకృష్ణ దేవాలయం నుంచిప్రసాదం తెచ్చుకొని కడుపు నింపుకొంటూ, వాళువారంతంలో వాళ్ళు పెట్టే అన్నం తింటూ, కోక బాటిళ్లు అమ్ముకొంటూ, ఆడిటింగ్‌ క్లాసులకు వెళ్ళి వాణిజ్య పరమైన పరిజ్ఞానాన్ని పెంచుకొన్నాడు. మొదటి నుంచీ ఆధ్యాత్మిక మార్గం మీదే మక్కువ ఎక్కువ. భారత దేశానికి వచ్చి ఇక్కడ ఆధ్యాత్మికతని అధ్యయనం చేయాలనుకున్నాడు. అందుకు డబ్బుకోసం అటారీ వీడియోగేముల కంపెనీలో చేరాడు. కొంత డబ్బు సంపాదించి ప్రాణమిత్రుడు డేనియల్‌తో కలిసి భారత్‌ వచ్చాడు. నీమ్‌ కరోలీబాబా కైంచీ ఆశ్రమంలో ఆధ్యాత్మిక శిక్షణ పొందాడు. నున్నగా గుండుగీయించుకొని బౌద్ధాన్ని స్వీకరించి మనోబలాన్ని, ఆత్మ విశ్వాసాన్ని సమకూర్చుకొన్నాడు. కట్టుపంచె ధోవతితోనే అమెరికా తిరిగి వెళ్ళాడు. మళ్ళీ అదే వీడియో గేముల కంపెనీలో ఉద్యోగం కుదిరింది. కంపెనీ యాజమాని ఒక సర్క్యూట్‌ బోర్డులో చిప్స్‌ సంఖ్యని తగ్గించగలిగితే ప్రతిచిప్స్‌కీ 100డాలర్లు ఇస్తానని చెప్పాడు. జాబ్స్‌ ఈ విషయాన్ని స్టీవ్‌ వోజ్నైకతోే సంప్రదించాడు. వచ్చిన డబ్బు ఇద్దరూ చెరిసగం పంచుకొనేట్టు అనుకొని ఆ సర్క్యూట్‌ బోర్డ్‌ లోంచి 50 చిప్స్‌ని తొలగించగలిగారు. సాంకేతిక నిపుణుడిగా ఇది జాబ్స్‌ తొలి అడుగు. కానీ, అటారి యాజమాని ఐదువేల డాలర్లు ఇవ్వవలసి ఉండగా, 700డాలర్లే ఇచ్చాడట! ఇది తొలి గుణపాఠం.
జాబ్స్‌ ప్రేరణతో స్టీవ్‌ వోజ్నైక తన ఉద్యోగానికి రాజీనామా చేసి బైటకు వచ్చాడు. ఆశలూ, ఆశయాలూ ఉన్నాయి గానీ, ఇద్దరి దగ్గరా చిల్లిగవ్వలేదు. సైంటిఫిక కేలిక్యులేటర్‌ లాంటి విలువైన తమ వస్తువులను అమ్మిన డబ్బుతో యిద్దరూ కలిసి 1976ఏప్రియల్‌ 1న 'యాపిల్‌ కంపెనీ' స్థాపించారు. సిలికాన్‌ లోయలోని జాబ్స్‌ స్వంత కుటుంబ గ్యారేజీలో ఈ కంపెనీ తన ఉత్పత్తి ప్రారంభించింది. ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డుల తయారీతో మొదలెట్టి వ్యక్తిగత కంప్యూటర్‌ తయారు చేయగలిగే స్థితికి వచ్చారు. ఆ దశలో ఇంటెల్‌ ప్రోడక్ట మార్కెటింగ్‌ మేనేజర్‌ ఎ.సి. మైక మర్కులా జూనియర్‌ ముందుకు వచ్చి ప్రోత్సహించాడు. వాళ్ళు తయారు చేసిన మొట్టమొదటి కంప్యూటర్‌ ఖరీదు 666.66 డాలర్లు. అది బాగా విజయవంతమయ్యింది. వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించారు. 1980 నాటికి మూడు ఆధునాతన వెర్షన్లను విడుదల చేసి యాపిల్‌ కంపెనీ పీసీల కంపెనీగా ప్రఖ్యాతిగాంచింది. 1మెగాహెడ్జ్‌ ప్రోఫెసర్‌, 4కె ర్యామ్‌లతోపాటుగా ఆడియో కెసెట్‌ పెట్టుకొనే అవకాశాలతో యాపిల్‌ 2కంప్యూటర్‌ అత్యధికంగా ప్రజల్ని ఆకట్టుకొంది. వీళ్ళ మొదటి మకింతోష్‌ కంప్యూటర్‌ 1984 టీ వీ తెరతో మరన్ని అద్భుతాలను ఆవిష్కరించింది. 1980లో యాపిల్‌ కంపెనీ పబ్లిక కంపెనీ అయ్యింది. ఆ సమయానికి జాబ్‌ వయసు 25 ఏళ్ళు. ఆదాయం 165 మిలియన్‌ డాలర్లు. కోట్లకొద్దీ ధనం వచ్చిపడుతున్న కొద్దీ, అంతే సంఖ్యలో శత్రువులూ పెరగ సాగారు. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఈయన వ్యవహార శైలి నచ్చని వాళ్ళే ఎక్కువ. అమెరికాని కుదిపేసిన 1984 ఆర్థికమాంద్యం ప్రభావం సమాచార సాంకేతికతపైన కూడా ప్రసరించడంతో యాపిల్‌ కంపెనీ నష్టాల బాట పట్టింది. ఆ సమయంలో కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌లో కొత్త మార్పులు తీసుకురాగా జాన్‌ స్కల్లీ అనే డైరెక్టర్‌ జాబ్స్‌ని అడ్డుకున్నాడు. తక్కిన డైరెక్టర్లు స్కల్లీకే వంతపాడటంతో 1985లో యాపిల్‌ కంపెనీ నుంచి జాబ్స్‌ వైదొలిగాడు. నిజానికి పెప్సి కంపెనీ సహాధ్యక్షుడైన స్కల్లీని ఎంతకాలం ఈ పంచదార రంగునీళ్ళు అమ్ముకొంటావు.. అంటూ, యాపిల్‌ కంపెనీలోకి తీసుకొచ్చినవాడు స్టీవ్‌ జాబ్సే! అతను వచ్చాక అభిప్రాయ బేధాలేర్పడి చివరికి, తెచ్చినవాడే బయటకు పోవాల్సి వచ్చింది. ఇది మరొక గుణపాఠం అయితే జాబ్స్‌ రంగ నిష్క్రమణం చెయ్యలేదు. కంప్యూటర్‌ రంగంలో తరువాతి అడుగు అనే అర్థం వచ్చేలా 'నెక్ట' కంప్యూటర్‌ సంస్థని స్థాపించి హార్డ్‌వేర్‌లో అనేక గొప్ప ఆవిష్కరణలను ప్రవేశపెట్టాడు. పోష్ట్‌ స్క్రిప్ట్‌, మాగ్నెటో ఆప్టికల్‌ డివైస్‌లు, ఇంకా మరికొన్ని ఉపకరణాలను నెక్ట్స కంపెనీ ద్వారా పరిచయం చేశాడు. ఇ-మెయిల్‌లో గ్రాఫిక్సని ప్రవేశపెట్టి, ఎంపిక చేసిన చోట క్లిక చేస్తే వివరాలు వచ్చే పద్ధతుల్ని తెచ్చాడు. కంప్యూటర్లోనే ఈథర్నెట్‌ పోర్ట్‌ అమర్చి ఇచ్చాడు. అంతర్‌ వ్యక్తిగత (ఇంటర్‌పర్సనల్‌) కంప్యూటర్‌ని తీసుకొచ్చి కంప్యూటర్ల ద్వారా సమాచారం మార్చుకొనే విధానాన్ని సృష్టించాడు. ఇవన్నీ నెక్ట్స కంపెనీ ద్వారా సాధించిన విజయాలు.
జాబ్స్‌ బైటకు వెళ్ళిపోయాక యాపిల్‌ కంపెనీ మరింత దిగజారసాగింది. దాంతో కళ్ళు తెరిచిన యాపిల్‌ కంపెనీ 1996లో నెక్ట్స కంపెనీని429 మిలియన్‌ డాలర్లకు తామే కొనుగోలు చేసి, జాబ్స్‌ని తిరిగి యాపిల్‌ కంపెనీ సలహాదారుగా ఒక ఏడాది తరువాత తాత్కాలిక సిఇవోగా జాబ్స్‌ని నియమిం చారు. అలా తన మాతృసంస్థ తిరిగి తనచేతుల్లోకి వచ్చాక సాహసోపేతమైన కొన్ని నిర్ణయాలు తీసుకొన్నాడు జాబ్స్‌. దండగమారి ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసి, సహకరించని ఉద్యోగులను పనిలో నుండి తొలగించాడు. కంపెనీని లాభాల బాటలోకి మళ్లించాడు. ఆ ఊపులో వచ్చిందే ఐమాక అనే ఆల్‌ ఇన్‌ వన్‌ కంప్యూటర్‌. 2001 అక్టోబర్‌లో 5జీబీ నిలవ సదుపాయం ఉన్న ఐపొడ్‌ పోర్టబుల్‌ మ్యూజిక ప్లేయర్ని ఆవిష్కరించి ఒక విప్లవాన్ని సృష్టించాడు. ఎంపి 3 ప్లేయర్ని తెచ్చి మార్కెట్‌ని ఊపేశాడు. 2007లో ఐఫోన్‌ని తెచ్చి సెల్లులార్‌ వ్యవస్థనీ కంప్యూటర్‌ వ్యవస్థనీ కొత్త మలుపులు తిప్పాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి కాదు, ఎక్కడికి వెళ్తోందో అక్కడికి నా ప్రయాణం అన్నాడు. టచ్‌ స్క్రీన్‌ సదుపాయంతో ఐపాడ్‌ని తీసుకువచ్చి కంప్యూటర్‌ని అరచేతిలో బంధించటంలో జామ్స్‌ అసాధారణ ప్రతిభని కనబరిచాడు. జాబ్స్‌ నేతృత్వంలో తాజా ఐ-ఫోన్‌ ఉపకరణమే చివరి ఆవిష్కరణ. ఇంత చేసినా యాపిల్‌ కంపెనీలో ఆయన జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు మాత్రమేనట. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే సిఇవో జాబ్స్‌ పేరు గిన్నీస్‌ బుకలోే నవెూదయింది. జాబ్స్‌కు ప్రస్తుతం ఆపిల్‌ కంపెనీలో 7,500,000 షేర్లున్నాయి. 2007 ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం స్టీవ్‌ జాబ్‌స ఆస్థి విలువ 5.7 బిలియన్‌ డాలర్లు. ఇదిలా ఉండగా, 1986లో లూకాస్‌ ఆర్ట్స్‌ అనే కంప్యూటర్‌ యానిమేషన్‌ విభాగాన్ని 10 మిలియన్‌ డాలర్లకు కొని, 'పిక్సర్‌ యానిమేషన్‌స్టూడియో' ఏర్పరిచాడు. దాని ద్వారా యానిమేషన్‌ చిత్రాలునిర్మించి, పంపిణీ దారులుగా డిస్నీ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. 1995లో టారు స్టోరీ గొప్ప విజయం సాధించింది. ఎ బగ్స్‌ లైఫ్‌, టారు స్టోరీ 2, మాన్‌స్టర్స్‌. ఇంక, ఫైండింగ్‌ నీవెూ, ది ఇన్‌క్రెడిబుల్స్‌, కార్స్‌, రాటటూయిలాంటి చిత్రాలు నిర్మించాడు. పిక్సర్‌ కంపెనీ మంచి లాభాల బాటలో ఉండటంతో డిస్నీ కంపెనీయే 7.4 బిలియన్‌ డాలర్లకు పిక్సర్‌ కంపెనీని కొనుగోలు చేసింది. జాబ్స్‌ కంపెనీ గవర్నర్‌ బాడీలో చేరాడు. ఈ విధంగా వినోద రంగంలో కూడా కంప్యూటర్‌ వినియోగాన్ని ప్రవేశపెట్టి యాని మేషన్‌ విప్లవానికి కారకుడయ్యాడు స్టీవ్‌ జాబ్స్‌.2004లో జాబ్స్‌కి పేంక్రియాజ్‌ కేస్సర్‌ వచ్చినట్టు కనుగొన్నారు. 2009లో లివర్‌ మార్పిడి శస్త్ర చికిత్స కూడా చేశారు. తనకుచివరి ఘడియలు సమీపించి నట్లు గ్రహించి, జాబ్స్‌ 2011 ఆగస్టు 24నయాపిల్‌ కంపెనీ సిఇఓగా రాజీనామా చేశాడు. 'టీమ్‌కుక'ని తన వారసుడిగా ప్రకటించాలని కంపెనీని కోరాడు. కంప్యూటర్లో టైపు చేసుకొన్న ముఖ్యమైన డాక్యుమెంట్‌ సేవ్‌ కాకుం డానే డెలెట్‌ అయిపోయినట్టు, స్టీవ్‌ జాబ్స్‌ వెళ్ళిపోయాడు. అంతటి నూతనత్వం, సహజత్వం, నిబద్ధత కలిగిన మరో వ్యక్తిని చూడగలుగుతాం అనుకోవటం అత్యాశే అవుతుంది. తాను నమ్మిన బుద్ధుడి మార్గంలో 'సంఘం శరణం గచ్చామి' అంటూ నడిచి, వెళ్ళిపోయాడు స్టీవ్‌ జాబ్స్‌.