15, నవంబర్ 2011, మంగళవారం

మీలోని ఫోటోగ్రాఫర్‌ని తట్టిలేపండి

ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లలో వేగమే తప్ప నాణ్యత కొరవడుతోందన్నది మాత్రం వాస్తవం.
పనైపోయిందన్న భావనతో ఉండేవారు ఎక్కువయ్యారు సంతృపి ్తకలిగేలా....
ఫోటో తీసామనుకునేవారు బహు అరుదై పోయారు. అందుకే మీరే మీలోని ఫోటోగ్రాఫర్‌ని తట్టిలేపండి.. కెమేరాను చేత పట్టి ప్రకృతి ఒడిలో, సమాజంలో.. జరుగుతున్న వివిధ దృశ్యాలను బంధించి...
మీలోని సృజనాత్మకతకు పదును పెడితే... మంచి ఫోటోగ్రాఫర్‌గా వెలుగొందటం ఖాయం.
నాణ్యమైన ఫోటోలు తీయాలనుకుంటే అందుకు అనుగుణంగా కొందరు సీనియర్‌ ఫోటోగ్రాఫర్లు...
ప్రొఫషనర్లు చెప్పిన కొన్ని సూచనలు అందిస్తున్నాం. చదవండిక....
ప్రతి వ్యక్తిలోనూ కళాత్మక దృష్టి ఉంటుంది. అది ఏ కోణంలో అయి నా కావచ్చు. అందునా చేతిలో కెమేరా ఉందంటే... నచ్చినట్లు ఫోటో లు తీయటం వాటిని చూస్త్తూ మురిసి పోవటం కద్దు. ఒకపðడు ఫోటోగ్రఫీ అంటేనే ఖరీదైన ప్రక్రియగా ఉన్నా... డిజిటల్‌ కెమేరాల రంగ ప్రవేశంలో సాంకేతికత జోడై కొత్తపుంతలు తొక్కుతోంది. అవస రమైన ఫోటోలని మాత్రమే ప్రింట్స్‌ వేయించుకున్న వారు కొందరైతే... కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి చూసుకుంటున్నవారు మరి కొందరు... ఏది ఏమైనా డిజిటల్‌ విప్లవం దెబ్బకు సెల్‌ఫోన్లలో చేతిలో ఇమిడి పోయే కెమేరాలు వచ్చేసిన ఈ రోజుల్లో ఫోటోగ్రఫీ అన్నది సాధారణ ప్రజల్లో భాగమైపోయిందన్నది అక్షర సత్యం. నచ్చినది కనిపిస్తే చాలు ఓ ఫోటో తీసి పడేసే యువత చాలానే కనిపిస్తారు మనకి. అయితే ఏదో అల్లరి చిల్లరగా కాకుండా ఫోటోగ్రఫీపై అవగాహన పెంచుకో వాలని, తన కంటూ ఓ ప్రత్యేకత నిలుపుకోవాలని ఉవ్విళ్లూరే వారూ చాలానే ఉన్నారు నేటి సమాజంలో ఇందుకు వయసుతో నిమిత్తం లేదు... చూసిన దృశ్యాన్ని, రసరమ్యంగా ఒడిసి పట్టి తన కెమేరాలో బంధించగలిగే నేర్పు, అంతుకు మించిన ఓర్పు ఉంటే చాలు.
మీ కెమేరాపై అవగాహన ఏర్పరచుకోండి....
కాలానుగుణంగా దాదాపు ప్రతి ఇంటిలో డిజిటల్‌ కెమేరా వచ్చి చేరిందనే చెప్పాలి. అసలు మీ దగ్గరున్న కెమేరా సాంకేతికతపై పూర్తిగా అవగాహన ఏర్పరుచుకోండి. ఏది ఎలా వాడుకోవాలో లాభమేంటి నష్టమేంటి అన్న పూర్తి వివరాలు, పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని కెమేరాతో పాటు మీకిచ్చే యూజర్‌గైడ్‌లో ఉంటుంది కనుక దానిని అధ్యయనం చేయండి. మీకు అలవాటైన వెూడ్‌ లోకి కెమేరా మార్చుకోవటం, కెమేరా మెగాపిక్సిల్స్‌, చిత్ర నాణ్య త అన్నింటిపై దృషి ్టపెట్టండి. కెమేరా స్ధాయి కూడా మిమ్మల్ని మంచి ఫోటోగ్రాఫర్‌గా ప్రశంసలందిస్తుందని గుర్తు పెట్టుకోండి.
ప్రయోగాలు చేయండిలా....
మీరు కెమేరాని ఆటో వెూడ్‌లో పెట్టేసి ఇష్టానుసారం ఫోటోలు తీసుకొనే కన్నా మాన్యువల్‌ వెూడ్‌లో పెట్టి చిత్రాలు తీస్తే ఫలితం బాగుంటుంది. పైగా ఏ లైటింగ్‌కి ఏతరహాలో ఫోటో తీయాలనే దాని పై అవగాహన పెరుగుతుంది. ముఖ్యంగా మీరు ప్రకృతి దృశ్యాలు, కొన్ని రకాల ఆయిల్‌ పెయింటింగ్స్‌, సంధ్యా సమ యాలు, చిన్నారుల్లో కనిపించే ఆహ భావాలు, కాంతి తక్కువగా ఉండే ప్రదేశాలలో, ఒకవైపు నుండి కాంతి వస్తున్న పðడు ఇలా అనేక సందర్భాలలో ఆటోలో పెట్టి ఫోటో తీస్తే ఫ్లాష్‌ కూడా పనిచేసి కొన్ని భావనల్ని చెరిపేసే ప్రమాదం ఉంటుంది. అదే మాన్యుయల్‌లో తీస్తే ఆ ప్రమాదం ఉండదు. ప్రత్యేక అంశంగా కూడా ఫోటో తీసాక మీకే కనిపించడమే కాకుండా మీకో ప్రత్యేకతని తెచ్చి పెడు తుంది.
స్టాండ్‌ వాడండి....
మీకెంత అనుభవంఉన్నా ఒక్కో సారి ఫోటోలు షేక అవ్వటం గమనిస్తాం...అందుకే నిష్ణాతుల్ని ఓ సారి గమనించడండి. ట్రైపాడ్‌ స్టాండ్‌ కి కెమేరా బిగించి ఫోటో తీస్తారు. మన అరచేతులెంత స్ధిరత్వంతో ఉన్నా అవతల మనం తీసే వస్తువు, వ్యక్తులు అంతే స్ధిర త్వంతో కూడి ఉండరన్నది గమనించడం మంచిది. మంచి ఫోటోలు తీయాలనుకుంటే ట్రైపాడ్‌ కొనుక్కొంటే మంచిది.
సహజ కాంతికే ప్రాధాన్యం...
చాలా మంది ప్రతి ఫోటోకి ఫ్లాష్‌ని వాడేస్తుం టారు... దీంతో ఫోటో తన సహజత్వా న్ని కోల్పోయి, చాలా కృత్రి మంగా కనిపిస్తుంది. తప్పదను కున్నపðడే ఫ్లాష్‌ వాడుతూ సహజ కాంతికి ప్రాధాన్యత ఇస్తే మంచి ఫోటోలు చిత్రీకరించొచ్చు. రాత్రి వేళ ల్లో కొవ్వెత్తి కాంతిలోనో, ఏ టేబుల్‌ లైట్‌ కాంతిలోనో చదువుతున్న వారి ఫోటో తీసేపðడు ఫ్లాష్‌ వాడితే తన సహజత్వాన్ని ఎంత కోల్పోతుందో పరికించండి. అది రాత్రయినా, పగలైనా తప్ప దనుకుంటేనే ఫ్లాష్‌ని వాడితే మంచి ఫోటో లు తీయచ్చు. అయితే ఎక్పోజర్‌ని పరి గణలోకి తీసుకునిఎప్పటికపðడు పరిశీలించండి. ఏ ఫోటో ఏ ఎక్పోజర్‌తో తీసారో గుర్తుంచుకోవట వెూ. రాసుకోవటవెూ చేయండి.
వ్యూఫైండర్‌ వాడాల్సిందే...
చాలా మంది ఏదో తీస్తున్నాం... మరీ లాంగ్‌ షాట్‌ అయితే ఫోటో షాపీలో క్రాప్‌ చేసేద్దాం.. ఏమైనా ఫోటోలు బాగానే వస్తున్నాయిగా అంటూ కెమేరాలోని స్క్రీన్‌ పైనే ఎక్కువ ఆధారపడుతుంటారు. చిత్రం చూసేందుకు మీకు అను కూలంగా ఉన్నా వ్యూఫైండర్‌లో చూస్తూ... ఫోకస్‌పై దృష్టి కేంద్రీ కరించుకుంటూ... అవసరమైన వాటిని గుర్తిస్తూ మిగిలినవి నియంత్రించుకుంటే అందమైన దృశ్యం సాధ్యం.
బెటర్‌ ఫోటోగ్రాఫర్స్‌గా ఎంపికవుతున్న వారి చిత్రా ల్లో ఫోకస్‌ ప్రాధాన్యత తో కూడి ఉంటుం దని గుర్తెరగండి.
నిత్య అధ్యయనం, సాధన
మంచి కెమేరా కొన్కుక్కున్నా... ఫోటోలు తీస్తున్నాం... అని అనుకుంటే పొరపాటే.. మీకు అందుబాటులో ఉన్న సమయంలో మీ కెమేరా పై నిత్యం ప్రాక్టీస్‌ చేస్తే... మీలో అవగాహన మరింత పెరుగుతుంది.

అందుకే ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్‌ మాల్కం గ్లాడెల్‌ తన అనుభవాలను రంగరిస్తూ రాసుకున్న 'ఔట్లెరిస్‌' పుస్తకంలో ఫోటోగ్రఫీలో బెటర్‌గా ఎదగాలంటే కనీసం 10,000 గంటలు పెట్టుబడి పెట్టి, ప్రాక్టీస్‌ చేయా ల్సిందే అని రాసుకున్నాడు. ఇది వాస్తవం కూడా... ఇలా చేయటం వల్ల పలు కెమేరా విషయాలు, వాటిని వాడే పద్దతులు తెలియటం ఓత వంతైతే... మనదగ్గురున్న కెమేరాతో రహదారులు, చెట్లు, పూలు, కీటకాలు, కుటుంబసభ్యుల, స్నేహితులు, వారి ఆనందాలు, విషాదా లు, చిన్నారుల చేష్టలు, బోసినవ్వులు, ఏడుపులు ఇలా అనేక అంశాల పై ఫోటోలు తీస్తూ ప్రాక్టీస్‌ చేయండి. అందువల్ల మీ కెమేరాపై మీకు అనుభవం రెట్టింపు అయ్యి ఏ కోణంలో చూస్తే ఫోటో ఎలా తీయచ్చు, ఎంత జూమ్‌, ఎక్పోజర్‌ తదితరాలపై ఆలోచన క్షణాలలో కలుగు తుంది.
అనుభవాలు గ్రహించండి...
ఫోటో తీసాక ఇదెందుకిలా జరిగిందన్న అనుమానం వస్తే.. దాన్ని నివృత్తి చేసుకోవటానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల నుండి తెలుసుకోవటమే కాకుండా ఫోటోగ్రఫీకి చెందిన వివిధ పత్రికల్ని, ఫోటోగ్రఫీకోసం ఏర్పాటు చేసిన వివిధ వెబ్‌ సైట్లని చదువుతుంటే అనేక రకాల కెమేరాలు, ఫోటోగ్రఫీలో వస్తు న్న మార్పులు, ఫోటోగ్రాఫర్ల అనుభవాలు, అడపా దడపా వారు నిర్వహించే పోటీలలో మీరూ పాల్గొం టే... మీకు ఉత్సాహం ఉండటమే కాదు... మీలో పోటీ తత్వం పెరిగి మంచి చిత్రాలు తీయాలన్న కసి పెరుగుతుంది.
చివరిగా...
ఓ లక్ష మాటలు చెప్పాల్సిన పనిని ఓ చిన్న చిత్రం చేస్తుందన్నది వాస్తవం. ఇదే దృష్టిలో ఫోటో లు తీయటం ప్రారంభించండి. అనవర భేషజాలు, పక్కన పెడితే... మీరే మంచి ఫోటోగ్రాఫర్‌గా ఎద గటమే కాదు మీకు అదనపు ఆదాయాన్ని సమ కూర్చేదిగా కూడా మారుతుంది.