15, నవంబర్ 2011, మంగళవారం

గోవు తల్లి.. పొదుగే పాల సీసా...




చూసారా! ఈ పిల్ల్లాడు ఆవు పొదుగు నుండి పాలు ఎలా తాగేస్తున్నాడో పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో అన్న జాలితో పాటు పాలిస్త్తున్న ఆవు
దాతృ హృదయాన్ని కూడా ప్రశంసించలేకుండా ఉండలేక పోతున్నారుగా!
అసలు ఈ బాలుడు ఇలా ఆవు పాలు తాగేందుకు పొదుగుని ఆశ్రయించి ప్రపంచ వ్యాప్తంగా మీడియాని ఆకర్షించడం వెనుక కధా కమామిషు ఇది.

కలియుగ ప్రారంభంలో 'శ్రీవారి'పై అలిగిన లకిëదేవి వైకుంఠం వీడి పోగా... ఆమెని వెతుక్కుంటూ భువికేతెంచిన మహా విష్ణువు తిరుమల గిరుల్లో తపమాచరిస్తుంటే... సాక్షాత్తు కామధేనువే... అక్కడి ఆలమందలలో కల్సిపోయి... మహా విష్ణువుండే పుట్టపై పొదివి నుంచి పాలు కారుస్త్తు ఆతని ఆకలి దపðలు తీర్చినట్ల్లు తిరుపతి వెంకన్న కధల్ల్లో చదువుకున్నాం... అదే తరహాలో గోమాతలు పసివాళ్లకు పాలిచ్చి సాకిన సన్నివేశాలు బోలెడు మన చిత్రాల్లో చూసి విచిత్రంగా చూస్త్తూ... మరీ చోద్యమంటూ నొసళ్లు చిట్లిస్తూ... బుగ్గలూ నొక్కు కున్నాం. అయితే దాదాపు ఇలాంటి సీన్‌నే అటు ఇటుగా రిపీట్‌ చేసాడు కాంబోడియాలోని ఓ చిన్నారి. ఏకంగా ఆవు పొదుగులో తల పెట్టి పాలు తాగేస్తూ... వార్తల్లో కెక్కాడు.. మరి వివరాల్లోకి వెళ్తే...
18 నెలల ఈ బాలుడి పేరు ధా సోఫాత్‌ ఇలా చేస్త్తున్న సన్నివేశాలు చూడాలంటే కాంబోడియా రాజధాని ఫోంఫెన్‌కి 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీమ్‌ రీప్‌ రాష్ట్రంలోని ఫియాస్‌ గ్రామం వెళ్ల్లాఇ్సందే. అక్కగ ఆ బాలుడిలా చేయటానికి గల కారణాలను బాలుడు తాత ఊమ్‌ యాంగ్‌ మీడియాకి వివరిస్తూ....కాంబోడియాలో నివాసముండే తమ కుంటుంబం ఇటీవల సంభవించిన తుఫాను కారణంగా అక్కడ జనజీవనం అస్ధవ్యస్తం కావ టంతో.. చేసేందుకు పనులు లేక తమ జీవనానికి దారితెన్ను కనిపించక ధాయిలాండ్‌కి వలస బాటపట్ట్టాల్సి వచ్చిందని.. చెప్పారు. ఈ క్రమంలో తమకున్న పశు సంతతిని కూడా తరలిం చుకుపోయామని చెప్పాడు. వరదల తాకిడి తగ్గాక ఫియాస్‌కి వచ్చామని... అప్పటికే తన తల్ల్లి వద్ద పాలు తాగటం మానేసిన ధా సోఫాత్‌ ఆకలిని తట్టుకోలేక ఓ రోజు సమీపంలో ఆవు దూడ తన తల్ల్లినుండి పాలు తాగుతుండటాన్ని గమనించి..


పాక్కుంటూ ఆ పొదివిని వడిసి పట్టి పాలు తాగటం ప్రారంభించాడు.
తొలుత గమనించి దూరంగా తీసుకెళ్లినా.. బిగ్గరగా ఏడ్వటంతో తప్పనిసరి పరిస్ధ్ధితి లో దీన్ని పట్టించు కోకున్నా చుట్టు పక్కల ఉన్న జనాలు మాత్రం ఈ విపరీత ధోరణిని తపð పడుతుండటంతో ఆవు పొదివి నుండి బాలుడ్ని దూరం చేసినా... అడపా దడపా ఇలా పొదివి నుండి పాలు తాగుతున్నాడు.
ఇలా పొదివి నుండి పాలు తాగినందు వల్ల బాలుడికి రోగాలు వచ్చిన దాఖలాలు లేనే లేవని, ఎలాంటి కలుషితం కాని పాలను నేరుగా తాగటం ఓ కారణం కావచ్చని... ఆవు పొదుగు ఓ వేళ కలుషితమైనా పాల వల్ల పెరిగిన రోగ నిరోధక శక్తి బాలుడ్ని కాపాడుతోందని స్ధానిక వైద్య నిపుణులు చెపðకొచ్చినట్ల్లు వివరించాడు ధా సోఫాత్‌ తాత ఊమ్‌ యాంగ్‌.
జీవన విధానం తేడా ఉన్నంత మాత్రాన తల్లి ప్రేమ పంచడంతో మేం పెంచుతున్న ఆవు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదని... కనీసం పొదివిని నోటితో తాగినపðడు ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయట్లేదని..ఇలా పాలు తాగుతున్న తన మనవడు సోఫాత్‌ కనీసం డయేరియా బారిన కూడా పడలేదంటే మీకు ఆశ్చర్యం కలగొచ్చు.. కానీ జరుగుతున్న వాస్తవాలివి. అయితే గియితే సోఫాత్‌ పెద్దాడయ్యాక తాను చిన్నతనంతో చేసిన ఈ చేష్టల కారణంగా ఏమైనా ఇబ్బందులు పడొచ్చు. అదీ కాలేజ్‌కి వెళ్లినపðడు.. స్నేహితుల కారణంగా అవమానాల పాలవుతాడేవెూననే నా బెంగంతా... అయితే నా మనవడు ఖచ్చి తంగా ఓ పెద్ద తుంటరి కావటం ఖాయమని జాతకాన్ని చెప్పేసారీ తాత గారు ఊమ్‌ యాంగ్‌..
ఇదండి విషయం... ప్రకృతి పద్ధతులకు విరుద్ధంగా బాలుడు చేసిన పని తపð అను కున్నా అమ్మ తనంలో కమ్మదనాన్ని ఆస్వాదించడం ఆ ఆవుది స్వార్ధమే అనుకున్నా... ఏఖండంలోనైనా... ఏ దేశంలోనైనా... ఏభాషైనా.. ఏ ప్రాంతమై నా... మతం, కులాల కతీతంగా ఆకలి కేకలు ఎంతటి పనినైనా చేయిస్తాయని తెలియ జెప్తోందిగా...