బంగ్లాదేశ్, ఇథోపియా, నేపాల్, మరికొన్ని పేద దేశాలలో మాతా, శిశు సంరక్షణకు అధికంగా ఖర్చు చేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి అధ్య యనంలో వెల్లడైంది.
సమితి సభ్య దేశాలు గత ఏడాదికాలంలో తల్లి, పిల్లల సంరక్షణకోసం 4,000 కోట్ల డాలర్లను వ్యయం చేస్తుండగా, ఇందులో సింహభాగం ఖర్చుచేస్తున్నదని అత్యంత పేద దేశాలే కావడం విశేషం. భారత్‌లో ఏటా 350 కోట్ల డాలర్లను మాతా, శిశు సంరక్షణకోసం ఖర్చు చేస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్ అధ్యక్షత మంగళవారం జరిగిన ఒక ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం అనం తరం ఇందుకు సంబంధించిన నివేదికను విడు దల చేశారు. మాతా, శిశు సంరక్షణపై సభ్య దేశాలు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటున్నాయ ని, అత్యంత పేద దేశాలు తల్లులు, పిల్లల పౌష్టికా హారంకోసం ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చించడం హర్షణీయమ ని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ జులియో ఫ్రెంక్ వ్యాఖ్యానించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లోని మాతా, శిశు సంరక్షణ విభా గాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ ఫ్రెంక్ గతంలో మెక్సికో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. తమ దేశంలోని జనాభాకు తగిన పోషకా హారం అందజేయడంలో అత్యంత పేద దేశాలు శ్రద్ధ వహిస్తుండగా, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ అంశాన్ని విస్మరిస్తున్నాయని డాక్టర్ ఫ్రెంక్ వ్యాఖ్యానించారు.
మాతా, శిశు సంరక్షణ కోసం సభ్య దేశాలు 4,000 కోట్ల డాలర్లను వ్యయంచేయాలని గత ఏడాది జరిగిన సదస్సులో తీర్మా నించడం జరిగిందని, ఈ దిశగా జరుగుతున్న కృషి సంతృప్తిగా వుం దని డాక్టర్ ఫ్రెంక్ అన్నారు. ఈ మొత్తంలో 1,100 డాలర్లు పేద దేశా లే ఖర్చుచేయడం శుభ పరిణామమని ఆయన అన్నారు.
ఈ దిశగా గత ఏడాది కాలంగా జరుగుతున్న కృషి అమోఘంగా వుందని డబ్ల్యుహెచ్‌ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఫ్లావియా బుస్త్రియో పేర్కొన్నారు. అప్పడే జన్మించిన శిశువులకు ఇన్‌ఫెక్షన్ సోకకుండా తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించాల్సి వుందని, ప్రసవం అనంతరం తల్లిd, బిడ్డా పలుదఫాలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
బంగ్లాదేశ్ మరికొన్ని పేద దేశాలు ఈ దిశగా విశేషంగా కృషిచేస్తున్నాయని ఆమె ప్రశంసించారు. తాము కొత్తగా 3,000 మంది మిడ్‌వైఫ్స్‌ను నియమించడంతోపాటు మరికొంతమందికి చంటి పిల్లల పోషణలో శిక్షణ ఇస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. నేపాల్ కూడా 10వేలమంది మహిళలకు శిశు సంరక్షణలో శిక్షణ ఇవ్వడానికి సంకల్పించింది. ప్రతీ ఏటా 80లక్షలమంది పిల్లలు పుట్టిన ఐదు రోజులకే మరణిస్తుండగా, 3,50,000మంది మహిళలు కాన్పు అయిన వెంటనే మరణిస్తున్నారు.
ఈ నేపథ్యంలో 2015నాటికి శిశు మరణాలను అంతంచేసే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ఒక ప్రణాశికను రూపొందించి అమలు చయాలని సంకల్పించింది. ఇందు కోసం జాన్సన్ అండ్ జాన్సన్ వంటి ప్రైవేటు సంస్ధల సహకారం కూడా తీసుకోవాలని తీర్మానిం చడం గమనార్హం.
కాగా, ఉత్తర కొరియా, సాలమన్ దీవులు, యెమన్, బురుండి, దికి బౌటి, ఈక్వటోరియల్, గుయ్‌నియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, గాబాన్, మెడ గాస్క ర్, టోగో తది తర చిన్నదేశాలకు మాతా, శిశు సంర క్షణ కోసం ఎటు
వంటి నిధులు అందడం లేదు.
అభివృద్ధి చెందుతున్న దేశా లకన్నా, అత్యంత పేద దేశా లలో పసిపిల్లలకు పౌష్ఠికా హారం అందజేయాల్సిన అవశ్యకత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) పై వుందన్నది నిర్వివాదాంశం.