క్రికెట్ మత్తులో ప్రపంచం యావత్తు మైమరచినా సాంప్రదాయ క్రీడలపట్ల ఆయా దేశాలు మక్కువ చూపిస్తూనే తమ ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నాయి. 'క్రికెట్'ని ప్రోత్సహించినట్లు మమ్మల్నెందుకు ప్రోత్సహించరాదంటూ.. ఇతర క్రీడల ఆటగాళ్లు వాపోయిన సందర్భాలూ అనేకం.
బాలీవుడ్‌తో సహాసినీతారలం తా 'క్రికెట్'కే జేజేలు కొడుతూ 20-20 పేరుతో జట్లను, ఆటగాళ్ళని కొనుగోళ్లు సైతం చేయటమేకాక వివిధ సందర్భాలలో
తామే రంగంలోకి దిగి 'క్రీడాస్ఫూర్తి' నింపే మిషతో క్రికెట్ ముసుగులో అభిమానుల జేబులకి చిల్లులు పెట్టి మరీ కాసుల వర్షం కురిపించుకుంటున్నారన్నది నిజం.
అయితే వీరందరికీ భిన్నంగా... యువ సినీకెరటం 'రామ్‌చరణ్ తేజ' సాంప్రదాయ 'పోలో' ఆటకి ప్రాచుర్యం కల్పించేందుకు నడుంబిగించి,
తానో జట్టుకు అండగా నిలిచారు. దీంతో ఒక్కసారిగా 'పోలో' పట్ల కోట్లాది మెగా అభిమానుల దృష్టి ఆకర్షించి కొత్త ఊపిరులూదాడనే చెప్పాలి!
కాబోయే శ్రీమతి ఉపాసనతో కలిసివచ్చి 'పోలో' ఆటగాళ్ల ని 'గుర్రమెక్కి' మరీ ఉత్సాహపరిచిన ఈ మగధీరుడి ప్రయత్నం సఫలం కావాలనే ఆశిద్దాం..
ఇంతకీ ఈ పోలో ఆట ఎక్కడిది? దాని విశేషమేమి? ఓ సారి పరికిస్తే...
20వ శతాబ్దం ప్రారంభంలో హారిపిన్ విట్నీ సారధ్యంలో పోలో ఒక అతి వేగవంతమైన క్రీడగా రూపుదిద్దుకుంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఈ పోలోలో ఇండోర్, అవుడ్డోర్ పోలోలున్నాయి.300 గజాల పొడవైన ఒక పెద్ద పచ్చగడ్డి మైదానంలొ ఆడేది సాంప్రదాయక పోలో. ఇందులోని ప్రతి జట్టుకీ నలుగురు ఆటగాళ్ళు గుర్రాలపై ఉంటారు. ఓ వైపు 8 గజాల దూరం కలిగి పొడుగాటి గోల్ స్తంభాలు ద్వారా బంతిని పోనించి అత్యధిక గోల్‌లు వేయడమే ఆట లక్ష్యం. గాలి పరిస్థితి, మైదానం పరిస్థితులు ఇరు జట్టులకు సమానంగా ఉండాలని, ప్రతి గోల్ అనంతరం జట్టులు దిశను మార్చుకుం టాయి. గోల్ చేసేందుకు పొడవైన పిడి కలిగిన మేలట్ ను వాడుతారు.వీటిని వుడ్ మేటల్స్‌కి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి తయారు చేస్తారు. తల భాగం సిగార్ ఆకారంలో ఉండి, టిపా అనే దృఢమైన చెక్కతో చేయబడు తుంది. ఆటగాళ్ళు అభిరుచిని బట్టి మారుతూ ఉంటుంది. మహిళా ఆట గాళ్ళు, పురుష ఆటగాళ్ళు వాడే మేలట్ల కంటే తక్కువ బరువు గల మేల ట్‌లను వాడుతారు. కొందరు పోలో ఆటగాళ్ళకు పోలో మేలల్ పొడవు గుర్రం సైజును బట్టి ఉంటుంది. గుర్రాల కాళ్ళకు గాయం కాకుండా మోకాలు కింద నుంచి ఫెట్లాక్ వరకు పోలో రాప్స్‌తో చుడతారు.
ఇక ఇక్కడా క్రికెట్ ఆటలోలా అంపైర్లుంటారు. బంతిని తీసే కర్రను పట్టు కొని ఉన్న ఒకరు. మైదానంలో గుర్రాలపై ఇద్దరు అంపయర్లు, సైడ్‌లైన్‌లో ఒక రేఫేరీ ఉంటారు. ఆటలు తరచూ హండికేప్‌తో ఆడబడతాయి. ప్రతి ఆట గాడి హండికేప్‌లను కలిపి ఇరుజట్టుల హండికేప్పులు పోల్చబడుతుంది. ఇరుజట్టుల హండికేప్‌ల మధ్యనున్న వ్యత్యాసం, ఆట ప్రారంభంలో తక్కువ హండికేప్ ఉన్న జట్టుకు గోల్‌గా ఇవ్వబడుతుంది. ఆట ప్రారంభంలో అంపె యర్లలో ఒకరు బంతిని రెండు జట్టుల మధ్య గట్టిగా విసురుతారు. ప్రతి గోల్ తర్వాత గాని ప్రతి చుక్కేర్ తర్వాత గాని జట్టులు మైదానంలో తమ వైపును మార్చుకుం టాయి. ఒక ఆటగాడు తమ కర్రను వాడి ప్రత్యర్థి కర్ర ను అడ్డుకోవడం ద్వారా హుక్ చేయగలడు. ఆ నియమాన్ని పాటించకుండా హుక్ చేస్తే ఫౌల్ ఇవ్వబడుతుంది. ఉదాహరణకు, ఒక ఆటగాడు మరొక ఆట గాడి గుర్రం దగ్గరకు వెళ్ళి వారి కర్రను హుక్ చేస్తే అది ఒక పెనాల్టి అవుతుం ది. దీన్ని 'హుక్' పద్ధతి ఆటగా పేర్కొన్నారు. సుమారు మూడున్నర ఇంచు లు కలిగి 113.4 గ్రాముల బరువు ఉన్న హై ఇంపాక్ట్ ప్లాస్టిత్‌తో తయారు చేసిన బంతిని ఈ ఆటలో ఉపయోగిస్తారు.
అలాగే ఇండోర్‌లో ఆడేది అరేనా పోలో. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో పుట్టిం ది. 100 గజాలని మించని మైదానంలో జట్టుకి ముగ్గురు ఆటగాళ్ళు ఉంటా రు. గోల్ స్తంభాల ద్వారా బంతిని పోనించి గోల్ చేసిన తర్వాత కాకుండా, ప్రతి ఆరు నిముషాలకు ఒకసారి జట్టులు దిశలు మార్చుకుంటాయి. ఈ ఆటలో నాలుగున్నర యించులుండీ గాలితో నింపిన తోలు బంతిని వాడ తా ు. ప్రత్యర్థి ఏకాగ్రతను భగ్నం చేస్తూ బంతి దూరం దూరం చేయడాని కి, షాట్‌ను చెడకొట్టడానికి ఈ పద్ధతిని వాడుతారు. ఇద్దరు డీకొనే కోణం 45 డిగ్రీల కంటే తక్కువ ఉన్నప్పుడే దీనిని అనుమతిస్తారు. దీన్ని బంప్ పద్ధతిగా చెప్తారు. అరేనా పోలో నియమాలలో యుఎస్, బ్రిటిష్ రకా ల మధ్య చిన్నచిన్న తేడాలున్నాయి. ఆటలో నాలుగు చుక్కా అని కూడా పిలవబడే వ్యవధులు ఉంటాయి. 5.6 అడుగులు ఎత్తు ఉండే ఎత్తయిన చక్క సరిహద్దు గోడలు వాటిపైన వల ఉండటం వలన బంతి బయటకు వెళ్ళదు. ఒక వేళ బంతి బయటకు వెళితే, అది డేడ్‌బాల్‌గా భావిం చబడి, ఆట మరలా ప్రారంభమ వుతుంది.
పోలో పోనీలు (పొట్టి గుర్రాలు) : ఆటలో ఆటగాళ్ళు నడిపే గుర్రాలను 'పోలో పోనీలు' అని పిలుస్తారు. త్వరగతిలో వేగంగా వెళ్ళగలి గే సామర్థ్యం, సత్తాం, చురుకుతనం, ఉపాయంగా నడపగలిగే వీలు, ఒత్తిడి ని తట్టుకోవడం ప్రధానాంశాలుగా మేలుజాతి, సంకర గుర్రాలను ఎంపిక చేస్తారు. ఆటగాడి కదలికను బట్టి ముందుకు వెళ్ళాలో, తిరగాలో, ఆగాలో అని తెలుసుకునేలా శిక్షణ పొందిన గుర్రం ఆటగాడి నైపుణ్యానికి తోడుగా జట్టులో విజయాలు 60 శాతంపైగా పాత్ర పోషిస్తాయనే చెప్పక తప్పదు. ఆటగాళ్ళ కర్రానికి అడ్డురాకుండా తోక అలజడి ఉంటుంది.
ఆటగాడు చుక్కాల సమయంలో అలిసిపోయిన గుర్రాలను మార్చి కొత్త గుర్రాలను వాడవచ్చు. అందుకు ఆటగాడికి 4 నుంచి 8 గుర్రాల వరకు ఉం టాయి. వీటిని 'పోలో పోనీల స్ట్రింగ్' అని పిలుస్తారు. జట్టులో పురుషులు, మహిళలు కలిసి ఉండవచ్చు. ఆటలో 1వ నంబర్ ఆధారస్థానం, ఈ ఆట గాడు ప్రత్యర్థి జట్టులోని 4వ స్థానం ఆటగాడితో తలబడాలి. 2వ నంబర్‌దీ ముఖ్య పాత్రే స్కోర్ చేయడం. ఒకటవ నంబర్ ఆటగాడు బంతిని అందించి రక్షణగా నిలబడుతూనే, ప్రత్యర్థి జట్టులోని 3వ నంబర్‌తో తలపడాలి. సాధా రణంగా 3వ నంబర్ ఆటగాడే జట్టులోని అత్యుత్తమఆటగాడు. ఇది ఓ రకం గా యుక్తిపరంగా సారధి స్థానం అనే చెప్పాలి. అతనికే హండికాప్ ఎక్కువ గా ఉంటుంది. ఇక 4వ నంబర్ ఆటగాడు ప్రధాన రక్షకుడిగా... మైదానంలో ఎక్కడైనా తిరుగుతూ, గోల్ వేయడాన్ని అపుతాడు. అయితే పోలో కుడి చేతువాటంతోనే ఆడాలి. పోలో ఆటలో ధరించే దుస్తులు, హెల్మెట్ ప్రేక్షకులు గుర్తుపట్టే రంగులో, మోకాలు కింద వరకు సవారి బూటులు, తెల్లటి బ్రౌస ర్లు ఆటగాడి స్థానం సంఖ్య ఉన్న చొక్కా. గ్లవ్స్, రిస్ట్‌బ్యాండ్‌లు, నీపాడ్స్, స్పర్‌లు, ముఖానికి మాస్క్, ఒక కొరడా ఉంటాయి.
'పోలో' రూపాలు అనేకం:
సాంప్రదాయక పోలో, అరేనా పోలోలకు దీటుగా మారుతున్న కాలంతో పాటుగా పోలో కూడా వివిధ రూపాల్లో ఆడటం ప్రారంభించారు. పశ్చిమ యునైటెడ్ స్టేట్స్‌లో కౌబాయ్‌డ్రస్సులతో ఆడే కౌబోయ్ పోలో. సముద్ర తీర ప్రాంతాలలో ఆడే బీచ్ పోలో. ఇదే తరహాలో దుబయ్, మియామిలలో ఇసుక తిన్నెలపై ఆడే సాండ్ పోలో, మంచు కురిసే ప్రాంతాలలో ఆడే 'ఐస్‌పోలో' ఆడుతున్నారు. దీనికి తోడుగాపోలో ఆటని కేవలం గుర్రంపై మాత్రమే ఆడాలన్న నిబంధని పక్కకు పెట్టి మానసికోల్లామే ప్రాధాన్యంగా దోనే పోలో, సైకిల్ పోలో, ఒంటి పోలో, ఏనుగు పోలో, గోల్ఫ్ కార్ట్ పోలో సెగ్వే పోలో, యాక్ పోలో. తదితరాలు తెరపైకి వచ్చాయి.
పోలో గత చరిత్ర..
క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం ముందే పెర్షియా దేశ రాజులు తమ అశ్విక దళానికి శిక్షణ కోసం ఈ ఆటను ఆడించేవారు. వందమంది జట్టుగా ఓ యుద్ధంలా సాగే ఈఆట కాలక్రమేణ ఇరాన్ దేశీయ ఆటగా మారింది. 6వ శతాబ్దంలో రాజు ఖోశ్రో పర్విజ్, అతని సభాసదులతో ఓ జట్టుగా... రాణి పరివారం మరో జట్టుగా ఈ ఆటను ఆడినట్లు పెర్షియన్ సాహిత్యంలో ఉంది. 9వ శతాబ్దంలోని ఇరాన్ చరిత్రకారుడు ఫెర్డోసి రచిం చిన షానమే (రాజుల కావ్యం)లో టునియన్ బలహాలకు, రాజ కుమారుడైన సియవాష్ జట్ల మధ్య ఒక అంతర్జాతీయ మ్యాచ్ జరిగిందని, అందులో సియవాష్ అద్భుత నైపుణ్యం ప్రదర్శించాడని తెలిపాడు. పెర్షియా నుంచి జపాన్‌కు, అక్కడినుంచి తూర్పు ప్రాంతలకు భారత్ ఉపఖండం. చైనా వంటి ఆసియా లోని ఇతర ప్రాంతాలకు పాకిన పోలో పట్ల ఆకర్షితుడైన ఉత్తర భారతదేశ మొదటి ముస్లిం చక్రవర్తి సుల్తాన్ కుత్‌బుతీన్ ఐబక్ 1210లో పోలో ఆడుతూ ప్రమాదవశాత్తు మరణించాడు. ఈతని సమాధి నేటి పాకిస్థాన్‌లో ఉన్న లాహోర్‌లోని అనార్కళి బజార్ సమీపంలో ఉంది. ఇక చైనాలో వర్ణ చిత్రాలలో, విగ్రహా లలో ఈ ఆట గొప్పతనం కనిపిస్తుంది.
ఆధునిక పోలో మూలాలు మనవే...
ఆధునిక పోలోని తామే రూపొందించినట్లు బ్రిటిష్ వారెంత చెబుతున్నా.. దీని మూలం మణిపూర్‌లో 1వ శతాబ్దంలో సాంప్రదాయ గ్రామీణ ఆటలైన 'సగోల్ కంజీ' అని చరిత్ర కారులు చెప్తారు. ఆ ప్రాంతంలో స్థానిక ఆచారా లతో జరిగే లాయ్ హరాబ పండగలో దేవుడు కుమారుడైన కోరి పాబా జీవి తాన్ని సూచించేదిగా మర్జింగ్ అనే రెక్కల గుర్రం వస్తుందని భావించి ఆ మేరకు ఆడేవారు. ఏడుగురు ఆటగాళ్ళు గుర్రం పై కూర్చుని చిన్నపాటి బెత్తంతో బంతిని మైదానంలో ఏమూల దాటించినా గోల్ చేసే ఈ ఆటలో. ప్రత్యర్థులపై శారీరకం గా కూడా దాడి చేయవచ్చు. దీంతో గుర్రాలకు, ఆటగాళ్లకు రక్షణ కోసం పాంపాంలు తోలు కవచాలు కట్టే వారు. మణిపూర్ రాజులు తమ కోట లోపల మునుంగ్ కంగ్జే బుంగ్ పేరుతో పోలో మైదానం ఏర్పాటు చేసుకుని నిత్యం ఆడుతూ.. అప్పుడప్పుడూ తమ ఆటని ప్రజలు చూసేందుకు వీలుగా 'మాపాన్ కంగ్జేయ్ బుంగ్' పేరుతో విశాలమైన మైదానం ఏర్పాటుచేసారు. ఇప్పటికి రాజభవనానికి బయట నున్న మైదానంలో క్రమం తప్పకుండా పోలో ఆడటం మనకి కనిపిస్తుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద పోలో మైదానం మనదే..
మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ఇంఫాల్ పోలో మైదానమే ప్రపంచంలోనే అతి పెద్ద పోలో మైదానం. ఆధునిక పోలోకు తండ్రి అని చెప్పబడే లెఫ్టనంట్ షేరర్, 1850లో ఈ మైదానం సందర్శించి దీని పొడవు 225 గజాలు, వెడ ల్పు 110 గజాలున్నట్లుగా కొలిచి ప్రపంచంలో అతి పెద్దదని నిర్ధారించాడు.
అత్యధిక ఎత్తు మైదానం పాక్‌లో...
ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న పోలో మైదానం. పాకిస్థాన్‌లోని చిత్రాల్ జిల్లాలోని శందూర్‌లో ఉంది ఇది 16వ శతాబ్దం నాటిదని ఇది 4307 మీటర్లఎత్తులో ఉన్నట్లు నిర్ధారించారు. అప్పట్లో ఇక్కడి రాజు మెహ్తర్ చిత్రాల్ ఆహ్వానం మేరకు బ్రిటీష్ మేజర్ కాబ్ వెన్నెల కాంతిలో ఇక్కడ పోలో ఆడడానికి వచ్చేవారట. నేటికీ ఈ మైదానంలో ప్రతి ఏడాది జూలై లో చిత్రాల్, గిల్గిట్ జట్టుల మధ్య సాంప్రదాయక పోలో పోటీ జరుగు తుండటం విశేషం.
మొట్టమొదటి పోలో క్లబ్ భారతదేశంలోనే
ప్రపంచంలో మొట్టమొదటి పోలో క్లబ్ భారతదేశంలోని అస్సాంలోని సిలి చార్‌లో కెప్టెన్ రాబర్ట్ స్టీవర్ట్, మేజర్ జనరల్ పియరేర్ అనే ఇద్దరు బ్రిటిష్ సైనికులు 1834లో క్లబ్ కల్కత్తా పోలో క్లబ్‌ను స్థాపించారు. దీన్ని నేటికీ పురాతన పోలో క్లబ్‌గా పిలుస్తారు. ఇంగ్లాండ్‌లోని తోటి సైనికులకు పరిచ యం చేశారు.నాటి నుండి ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ సైనిక అధికారులు ఈ ఆటని ఆడేవారు. దీంతో వివిధ కోణాలలో లోటు పాట్లు గమనించి బ్రిటీషి యన్లు అనేక నియమాలను రూపొందించారు. 1874లో మొట్టమొద టిసారి గా లాంఛనంగా నియమాలను రూపొందించిన హుర్లింగం పోలో అసోసియే షన్ సంస్థే యునైటెడ్ క్లింగ్డంలో పోలోను నియంత్రించే సంస్థ నియమాలలో అనేకం నేటికీ అమలులో ఉన్నాయి. బ్రిటిష్ సైనికులు ద్వారా అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, మెక్సికో, పాకిస్థాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాలలో పోలోకి ప్రాచుర్యం లభించడంతో 1892లో రివర్ ప్లేట్ పోలో అసోసియేష న్ స్థాపించబడింది. ఇదే ప్రస్తుత అసోసియే షన్ అర్జెంటీనా దె పోలో సంస్థకు పునాది. 1800-1910 మధ్యకాలంలో భారతీ య ప్రిన్సిపాలిటీల జట్టులే అంతర్జాతీయ పోలో క్రీడారంగంలో ఆధిపత్యం వహించేవి. అప్పట్లో స్థానిక ఖాన్‌లు, మీర్‌లు, మెహ్తర్‌లు తమ రాజ్యం వార్షిక ఆదాయంలో 50 శాతానికిపైగా ఈ ఆట కోసం వెచ్చించేవారంటే ఆశ్చర్యం కలగక మానదు. మైదానంలో గడ్డి తొలగించి, ఆడటానికి సురక్షితమైన, మైదానం ప్రతివైపు మధ్యలో గోల్ స్తంభాలు ఎనిమిది గజాల దూరంలో ఆట స్థలాన్ని మంచి పరిస్థితిలో ఉంచుకోవడానికి పోలో మైదానం నిరంతరంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఒలంపిక్‌లో పోలో :
ఒలింపిక్ క్రీడలలో పోలో 1900-1939 వరకు మాత్రమే ఆడిన ఈ పోలో 1998లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ క్రీడగా గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా పోలో ఆటను నిర్వహిస్తున్నది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పోలో. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పోలో, ప్రపంచ పోలో ఛాంపియన్ షిప్‌ను మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంది.ఒలింపిక్ క్రీడలలో భాగంగా పోలో ఆట 77 దేశాల క్రీడాకారులు ఆడుతున్నారంటే ఆదరణ ఎంత పెరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.
ఆగ్నేయ ఆసియా క్రీడలలో పోలో చేర్చబడింది. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, థాయ్ లాంట్, ఫిలిప్పైన్స్ దేశాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఈ పోటీలో మలేషియా జట్టు బంగారు పతకం సాధిస్తే, సింగపూర్ వెండి పతకం, థాయ్‌లాండ్ కాంస్య పతకం గెలుచుకున్నాయి.
మహిళల పోలో :
మహిళలు మాత్రం పాల్గొనే పోలో కేవలం యుఎస్‌లో మాత్రమే ఉంది. ఈ మహిళల పోలోను యునైటెడ్ స్టేట్స్ ఉమన్స్ పోలో ఫెడరేషన్ నిర్వహిస్తున్నది. సాంప్రదాయంగా సామాజికంగా, ఆర్థికంగాను అతిస్వల్ప మంది మాత్రమే ఆడే ఈ ఆటలో ఎక్కువ మంది పాల్గొనప్పుడే ఆట ప్రమాణాలు పెరుగుతా యని ఆటగాళ్ళు కోరుతున్నారు. 1980 నుంచి పోలోకు జనాకర్షణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. మరి నేటితరం పోలొ పై ఏమేర ఆకర్షితులై భారతావనిలో పెరిగిన ఈ ఆటని పెంచిపోషిస్తారో వేచి చూడాలి.