15, నవంబర్ 2011, మంగళవారం

జానపదం గుండె చప్పుళ్లు తప్పెటగుళ్లు

తెలుగు జీవన ప్రతిబింబాలుగా నిలచే సాంప్రదాయ కళలకు, జానపదాల పట్ల
నేటి తరానికి అవగాహన కల్పించడంలో చేస్తున్న నిర్లక్ష్యం.... వాటి పట్ల గ్రహణంగా మారి...
ఆదరణ కరువవుతూ... ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయన్నది వాస్తవం.
ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలకు
ప్రత్యేకత తెచ్చి పెట్టిన తప్పెటగుళ్లు చేరుతుండటం ఆందోళన కదలిగించే విషయం.
నేటికీ ఉత్తరాంధ్రా పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడి నుండి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందిన తప్పెటగుళ్లు నృత్యమే... అవసానదశకు చేరుకున్న ఈ కళని ఈ ప్రాంతంలోనియాదవ కుటుంబాలు తమ సాంప్రదాయ కళపై మక్కువతో పెంచి పోషించాలని తపన పడుతున్నా.... రోజు రోజుకి తమ జీవన ప్రమాణాలు, సంపాదన తగ్గి పోతుం డటం కూడా ఈ కళని కాపాడుకోలేక పోతున్నామని వాపోతున్న వారు చాలా మంది ఉన్నారు.
ఒకప్పుడు పూర్తిగా ఈ కళనే జీవనాధారంగా నమ్ముకుని ఉత్తరాంధ్రా జిల్లాలో అనేక కుటుంబాలు ఉండేవంటే అతి శయోక్తి కాదు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండ లం కేశవ రాయుని పాలెం, మురపాక, లోపింట, బుడు మూరు తో పాటు విజయనగరం, విశాఖ సరిహద్దు గ్రామాలలోనూ తప్పెటగుళ్లు కళని ప్రదర్శించే కళాకారులెందరో ఉండే వారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చి అనేక ప్రసంశలు పొందిన వారూ లేక పోలేదు.
తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సాగే ఈ కళా రూపా న్ని నేర్చుకునేందుకు నాడు యాదవుల లోనే ప్రత్యేక గురువులు కూడా ఉండేవారు. ఏడాది పాటు ఈ కళని నేర్పించడమే కాకుండా, ఎలాంటి గురు దక్షిణ ఆశించకుండా శిష్యుడికి కావాల్సిన అన్ని సౌకర్యాలు వారే చూసేవారంటే .. కళపై ఆనాటి పెద్దలకున్న మక్కువ తెలుపుతుంది.
అడపా దడపా... అనేక కార్య క్రమాలలో తప్పెటగుళ్ల నృత్యరీతు లు కనిపిస్తున్నా... ఇందులో పాడే పద్యాలు పాటలు.. అన్ని వంశ పారంపర్యంగా వల్లె వేస్తూ వచ్చినవే కావటం విశేషం.
ఈ నృత్యరీతికి తగిన ప్రామాణిక గ్రంధమంటూ ఏదీ లేక పోయినా. ఈ కళ ఆవిర్భావ విశే షాలు అందుబాటులో లేక పోయినా నేటి తరంలోనూ తమ పూర్వీకులు అందించిన ఈ కళని కాపాడుకొవాల న్న తపన కనిపిస్తునే ఉంది. ఉపాధి అవ కాశాలకు తగ్గట్టుగా పెరుగుతున్న అక్షరా స్యతా శాతం యాద వ కుటుంబాలలో పెరుగు తున్నా తమ ప్రాచీన కళ పట్ల మక్కువ ప్రద ర్శించే వారు చాలానే ఉన్నారు నేటికీ..
విచిత్రమైన వేషం...
కాళ్లకు, నడుముకు చిరుగజ్జెలు కట్టి, ప్రత్యేకంగా గజ్జెలుతో కుట్టించిన నిక్కరు, సాంప్రదాయంగా ధరించే లాల్చీతో పాటుగా తల పై కొట్టొచ్చే రంగుల పాగా, రంగు రంగుల కుచ్చిళ్లతో ఉండే కాశీ కోక, నడుంకి రెండు వైపులా వేలబ డుతూ... చూడముచ్చటగా... ఆకర్షించేలా ఉంటుంది తప్పెటగుళ్ల కళాకారుల వస్త్ర ధారణ. తొలినాళ్లలో ఈకళ కోసమే ప్రత్యే కంగా మట్టెకుండలను తయారు చేయిం చి.. వాటికి శుభ్రపరచిన మేకచర్మాలని, ఉడు ముల చర్మాలని తొడిగి వాయిద్యం గా వినియోగించే వారు.
అయితే ప్రదర్శనల సమయం లో అవి పగిలి పోతుండటంతో వాటి స్ధానంలో లోహ పు డబ్బాలను ప్రత్యేక వృత్తా కారం లో చేయించి వాడటం ప్రారంభించామని శ్రీకాకుళంకి చెందిన ఓ వృధ్ద కళా కారుడు చెప్పారు. ఈవాయిదాలను ఛాతిపై కట్టు కుని, లయ బధ్దంగా వాటిని వాయిస్తూ.. కళ్ల కు కట్టిన గజ్జెలతో... బృంద నాయకుడు పాడే జానపద పాటలకు తగ్గట్టుగా చుట్టూ తిరు గుతూ అద్భుత విన్యా సాలతో నృత్యం చేస్తారీ కళాకారులు.
సాము, గరిడీ విన్యాసాలు....
మధ్య మధ్యలో తమ వంశపారం పర్యంగా వచ్చిన సాము, గరడీలను ప్రదర్శిస్తూ... ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో 15-20 మంది ఓ బృందంగా ఏర్పడి ఈ నృత్యం చేస్తారు.
ఏకధాటిగా దాదాపు 4 గంటల పాటు ఎలాంటి విరామం లేకుం డా వీరి ప్రదర్శన జరిగేదంటే ఆశ్చర్యం కలిగించక మానదు. తప్పెటగుళ్ల ప్రదర్శనలు చూసేందుకు వచ్చే వారు కూడా అంతే భక్తి శ్రద్ద్ధలతో కళాకారుల నృత్యాన్ని , చేసే విన్యాసాలని ఆస్వాదించేవారు. ఈ తప్పెట గుళ్ల్ల ప్రదర్శనలో ఎక్కువగా కళాకారులు సారంగధర, శ్రీకృష్ణలీలలు, లవకుశ, ధర్మాంగద, చెంచుభామ ఇలా పలు పౌరా ణిక కళారూపాలను ప్రదర్శించేవారు. తమ కులదైవమైన గంగమ్మ పాటలతో పాటుగా శ్రీకృష్ణుడు జన్మాష్టమి, శ్రీకృష్ణ పరిణయం, సత్యభామ, జాంబ వతి ఇలా శ్రీ కృష్ణుని అష్ట భార్యలపైనా అనేక
పాట లను కూర్చి లయబద్దమైన నృత్యంతొ . గుండెెలపై ఉండే డప్పులను ఏకబిగిన వాయిస్తూ...భక్తిభావనతో పాడేవారు.
వర్షాల కోసం తప్పెటగుళ్ల ఆటలు..
గ్రామాలలో సరైన సమయంలో వర్షాలు పడక పోయిన సందర్భాలలో తప్పెటగుళ్ల ప్రదర్శన చేస్తే... వరుణుడు కరుణిస్తా డన్న నమ్మకం ఉంది. ఇందుకు తప్పెట గుళ్ల కళాకారులు ఓ కధని కూడా చెప్తారు. పూర్వం వర్షాల కోసం గ్రామంలో అంతా వరుణ దేవుడ్ని సంతోష పర్చడానికి వరుణ యాగం చేస్తుంటే...యాదవులు తమ ఆల మందలతో ఊరి చివర ఉండటం పట్ల ఆగ్రహించిన వరు ణుడు వీరిపై వడగళ్ల వాన కురిపించాడని. దీంతో తమ కుల దైవమైన శ్రీకృష్ణుడిని ప్రార్దిస్తే... చిటికెన వేలుతో గోవర్ధన గిరి ని ఎత్తి.. దాని కింద ఆశ్రయం కలిపించి.. యాదవులతో పాటు సమస్త లోకాన్ని రక్షించి... వరుణుడి కోపాన్ని చల్లార్చాడని.. అప్పటి ఆనందోత్సాహాల నుండే ఈ తప్పెటగుళ్ల కళ పుట్టు కొచ్చిందని... నాటి నుండి యాదవులు తప్పెటగుళ్లతో ఆడి పాడి తే... వరుణుడు ఆయా గ్రామాలపై కరుణ చూపించి వానలు కురిపిస్తాడని చెప్పారు. అందుకే వర్షాల కోసం తామతో తప్పెట గుళ్ల ప్రదర్శనలు ఏర్పాటు చేసుకున్న సందర్భాలూ అనేకం అని ఈ కళాకారులు చెప్పారు.
నటికీ ఉత్తరాంధ్రా జిల్లాలో జరిగే యాదవ పండుగలతో పాటు గ్రామదేవతల పండుగలు, జాతరలో తప్పెటగుళ్ల ప్రదర్శన కని పిస్తునే ఉంది. తమ కుల దేవత గంగమ్మని కొలిచే సందర్భం లో ఖచ్చితంగా ఆ ఊర్లో తప్పెటగుళ్లు ఆడి పాడాల్సిందే. నేటికీ అక్కడక్కడా తప్పెటగుళ్ల బృందాల నడుమ పోటీలు ఉత్తరాం ధ్రాలో జరుపుతూ.. ఈ కళను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తుండటం అభినందనీయం. ఇప్పుడు ఉత్తరాంధ్రాలో జరిగే కార్య్‌క్రమాలతో పాటు ఏటా విశాఖపట్నం వేదికగా జరిగే విశాఖ ఉత్సవ్‌లోనూ ఈ జానపద కళాకారులు తమదైన శైలిలో ప్రదర్శన లిస్తూ... సభికుల్ని మైమరిపిస్తున్నారు.
కాపాడాల్సిన
బాధ్యత అందరిదీ
వేల ఏళ్ల నుండి మన సాంప్రదాయ కళలో ఒకటి గా మారిన ఈ తప్పెటగుళ్లు కళారూపం నేడు మారుతున్న కాలంతో పాటు మారుతోంది. ఉత్తరాంధ్ర యాస, భాషల్లో ఉండే పద మాధుర్యాన్ని ప్రపం చానికి అందించిన ఈ కళ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటునే ఎప్పటికప్పుడు కొత్త కొత్త పదాలతో సింగా రించుకుని జనం మధ్యకు వచ్చే ప్రయత్నాలు చేస్తునే ఉంది. కొందరి కృషివలురు కాలానికి ఎదురీదుతూ ఈ కళని కాపాడు కునేం దుకు చేస్తున్న ప్రయ త్నా లకు ప్రభుత్వం కూడా మరింత గా చేయూత అందిం చా ల్సిన అవసరం ఎం తుందో...
మన తెలుగుదనానికి ప్రతీక గా నిలుస్తున్న జాన పద కళా రూపాలని ఆదరించాల్సిన ఆశ్యకత కూడా మనపై అంతే ఉంది.
గుండె చప్పుళ్లు.. ఈ తప్పెట్లు
తొలి నాళ్లలో గుండెలపై దరువుల వేస్తూ సాగే ఈ నాట్యాన్ని గుండె తప్పెట్లుగా... పేర్కొనేవారని.. ఆపై దీని పేరు తప్పెట్లుగా మారిందని దాదాపు 400 ఏళ్ల నుండి దైవాంశ నృత్యంగా భావించే ఈ నృత్యాన్ని తప్పెటగుళ్లుగా వ్యవహరిస్తున్నట్లు తప్పెట గుళ్ల కళాకారులు చెప్తున్నారు. ఇంతటి ప్రాచీన కళకు నేడు ప్రజల నుండి ఆదరణ కరువవ్వటం వల్ల దీనిని ముందుకు తీసుకు వెళ్లాంటే భారంగా ఉందని... దీంతో కనీసం తమ భవిష్యతరానికి కూడా ఈ తప్పెటగుళ్లని నేర్పించగలమో లేదో అన్న సంశయాన్ని వ్యక్తం చేసారు మరికొందరు.
‘బంగారు”తప్పెట్లు
భీష్మఏకాదశి నాడు తమ కులదేవత అయిన గంగమ్మని భక్తి శ్రద్దలతో పూజిస్తూ సాగే ఈ తప్పెటగుళ్లలో మహిళలు కూడా పాలుపంచుకునే వారు. తొలి తప్పెట గుళ్ల కళాకారిణిగా యలమంచలి బంగారమ్మగా తమ తాతలు చెప్పుకునేవారని... ఆమెని ప్రేరణగా తీసుకుని అనేక మంది మహిళలు తప్పెటగుళ్లు నేర్చుకుని అనేక ప్రదర్శనలు ఇచ్చేవారని, వీరు కేవలం భక్తి జానపదాలే కాకుండా... గాజులమ్మ పాట, పండ్లను అమ్మే వారి పాట, మందులోడి పాటలు పాడి జనాన్ని మైమరిం పించేవారనీ.. నేటికీ ఈ పాటలంటే పడిచచ్చేవారున్నారన్నారు.
సరస్వతికి ప్రత్యేక ప్రార్ధనలు
దాదాపు ఎక్కడ ప్రదర్శన జరిగినా... గణ నాధుడైన వినా యకుడిని ప్రార్ధించనిదే.. తమ ప్రదర్శన ప్రారంభించరు. ముఖ్యంగా ముందుకు వెనకకు అడుగులు వేస్తూ శరణు. శరణు గణపతి అంటూ... ప్రార్ధన చేసాక... తమకీ విద్యని ప్రసాదించింది సరస్వతీ దేవియేనన్న నమ్మకంతో ఆమెని భక్తి భావనతో కొలుస్తూ... పాటలు పాడుతూ వలయా కారంలో ఆనందంతో తిరుగుతూ... లయబధ్దంగా అడుగు లు వేస్తూ... సుదీర్ఘమైన గీతాలాపలనతో... చేసే ప్రార్ధనలు చూపరులను ఆకర్షించేలా సాగుతాయి.
ప్రచారానికే పరిమితమైపోతూ..
ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరిం చుకున్న ఈ తప్పెట గుళ్ల రూపం నేడు జనాదరణ కరువై విలవిల పోతోందన్నది వాస్త్తవం. ఉత్తరాంధ్రా జిల్లాలను నేతలు సందర్శించే సంద ర్బా లలో వారికి ఘన స్వాగతం పలికేప్పుడు నేటికీ అక్కడి నేతలు ఈ సాంప్రదాయ నృత్య కళాకారుల్ని ముందు వరు సలో ఉంచి ప్రోత్సహిస్తున్నా రు. ప్రభుత్వం అమలు పరిచే అనేక సంక్షేమ కార్యక్రమాలపైన, అనేక సమస్యపై జన చైత న్యానికి ప్రచారాస్త్రంగా ఇక్కడ తప్పెట గుళ్ల కళాకారుల సేవ ల్ని వాడుకుంటున్నారు అధికారులు.