15, నవంబర్ 2011, మంగళవారం

అక్కడ”మహత్ముడే‘దేవుడు

'జాతిపిత' అని పిలిపించుకునే 'బాపూజీ' ఇప్పుడు ఉపన్యాసాలకో.. నోట్ల మీద దరహాసానికో..
చిరునామాగా మారిపోతే... ఆయన జయంతినో... వర్థంతినో.. 'నేతాశ్రీ'లకు చటుక్కున గుర్తొచ్చి 'చిటుక్కున' దండలేసి వదిలేస్తుండగా. వాడవాడలా గాంధీ విగ్రహాలున్నా... నేటితరం నేతల విగ్రహాల ముందు వెలవెలబోతున్నాయి...
ఆలనాపాలనా కరువై.. కళ్లజోడు కూడా లేనివి కొన్నయితే.. కాళ్లు... చేతులు వి రగ్గొట్టు కొన్నవి మరికొన్ని...
దర్శనమిస్తున్న ఈ రోజుల్లో తాము పీలుస్తున్న స్వేచ్చవాయువులు 'గాంధీ'గారి బిక్షే...
తమ 'అంటరాని కులపోళ్ల'కు అండగా నిలిచి సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.
ఆయన కనుక.. మా దృష్టి లో ఆయన దేవుడేనంటూ.. 'గాంధీ'ని దైవాంశుడిగా నమ్మి...
ఓ మందిరాన్ని నిర్మించి నిత్య పూజలతో ఆరాధిస్తూ 'బాపూ భక్తులం మేం' అని గర్వంగా చెప్పుకొంటున్నారా ఒరిస్సాలోని 'భత్రా' గ్రామస్తులు.. ఈ వివరాల్లోకి వెళితే...

బ్రిటిష్‌ దాస్య శృంఖాలల నుంచి భారతమాతకు విముక్తి కల్పించేందుకు.. అహింసనే పరమా యుధంగా ఎంచుకుని... తన బోసి నవ్వులతోనో యావత్‌ భారతీయుల్లో స్ఫూర్తిని నింపి.. పోరాట పటిమని రగిల్చి ఆంగ్లేయులపై అవిశ్రాంత పోరాటం సల్పిన యోధుడు.. యావత్‌ స్వాతంత్య్ర పోరాటా యోధులెం దరికో మార్గదర్శిగా నిలచింది 'బాపూజీ'యే అనడంలే సందేహం లేదెవ్వరికీ... నాడు 'గాంధీ' 'దండం' పెట్టి శాంతియుతంగానే ఓ మహా సత్కార్యాన్ని సాధించి విజేతగా నిలబె డితే... నేడు 'గాంధీగిరి' అంటూ 'దండప్రయోగాల'కు దిగు తున్న వారెందరో ఈ సమాజంలో అడు గడుగు నా కనిపిస్తారు.
1970కి ముందు ఈ దేశంలోని అనేక గ్రామాలలో

పనీ పాటలకే పనికొచ్చే దళితుల్ని.. బడిలోకి రానిచ్చే వారు... అందరి మధ్య వారు బతికితే తమకే అవమానమన్న రీతిలో గ్రామాలకు దూరంగా.. 'తాగు నీటి' కోసం సైతం బావులముందు పడిగాపులు పడుతూ.. తమని చూస్తేనే మలినమైపోతామన్న పెత్తందార్ల హూంకరింపుల నడుమ బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్న రోజులవి. తమలాగే ఊరి కి దూరంగా విసిరేసినట్లు ఉండే ఆలయాల్లో కొలవైన 'దేవుళ్ల'ను కళ్లారా వీక్షించేందుకు ప్రయత్నిస్తే.. కళ్లు పీకియించేసిన కాలమది... ఊరి పొలిమేర్లలో.. చాలీచాలని గూడుల్లో కాలాన్ని నెట్టుకొస్తూ.. స్వాతంత్య్రానంతరం తమకీ 'స్వేచ్ఛ' వచ్చిందన్న విషయాన్ని మరచి.. ఊడిగాలు చేస్తున్న ఒరిస్సాలోని సంబల్‌పూర్‌ సమీపంలో ఉన్న 'భత్రా'గ్రామ దళితుల్లో గాంధీజీ స్ఫూర్తిని నింపింది. అదే ప్రాంతం నుండి ఒరిస్సా శాసనసభకు 1971లో శాసనసభ్యుడిగా ఎన్నికైన 'అభిమన్యు కుమార్‌'
ఏళ్లు పూళ్లుగా 'సమాజంలో' మార్పు వస్తుందని ఆశించినా ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసేకన్నా.. తానే ఆ పని ఎందుకు చేయకూడదన్న 'అభిమన్యు' అంటరానితనంపై గాంధీజీ చూపిన పోరాటం మహాత్ముని లక్ష్య సిద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లటం ప్రారంభించారు. సంబల్‌పూర్‌ సమీప గ్రామాలలో తిరుగుతూ గాంధీ ఆశయాలను వివరిస్తూ.. 'దేవుడే మనుష్యుల్ని గొప్పవాళ్లు.. అంట రాని వాళ్లుగా' విభజించి పుట్టించాడన్న ఆవేదన పంచుకునే వాళ్లు.. ఆలయ ప్రవేశానికి అనర్హు లుగా దళితుల పేరుతో వెలి వేయబడుతున్న వారికి తానే ఓ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి.. కులమతాల కతీతంగా.. స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొంటూనే 1934లో తమ సంబల్‌పూర్‌ ప్రాంతానికి వచ్చి భారీ బహిరంగ సభలో ప్రసంగించిన 'గాంధీజీ'కే ఓ మందిరం నిర్మిస్తే.. 'దళిత' చైతన్యానికి నాంది పల్కుతుందని ఆశించారు. అయితే ఆశించిన రీతిలో 'ఆర్థిక' స్థాయిలోకి వాయిదా పడుతూ వచ్చి ఈ మందిర నిర్మాణం..
1971లో వచ్చిన ఒరిస్సా సార్వత్రిక ఎన్నికల్లో 'దళితులు' తమ ప్రతినిధిగా 'అభిమన్యు'కే పట్టం కట్టి చట్టసభకి పంపించడంతో అదే ఏడాది మహాత్ముని 'మందిరం'కి శంఖుస్థాపన చేసిన ఆయన అన్ని హిందూ ఆలయాల వలే దీన్ని రూపొందించి మూడేళ్లలో పూర్తి చేయగలిగి అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి నందినీ స్ధపతి ప్రారంభించారు. హిందూ ఆలయంలో ప్రధానంగా దర్శనమిచ్చే ధ్వజస్తంభం స్థానంలో ఎత్తయిన స్తంభంపై 4 సింహాలు దర్శనమివ్వగా.. ఆలయం ముఖ ద్వారంపై 'త్రివర్ణ పతాకం' రెపరెపలాడుతుం డగా.. చిరునవ్వులు చిందిస్తూ అభయహస్తాన్ని చూపించే భరతమాత విగ్రహం ఇక్కడ దర్శనమివ్వడం విశే షం.ఇక ఆలయంలోపలి వైపు వెళితే... లోపలి గోడ లన్నీ దేశం కోసం పాటు పడిన నేతల ఫోటోలతో పాటు అన్ని మతాలకు సంబంధించిన చిహ్నాలు కని పిస్తాయి. గర్భాలయంలోధ్యాన ముద్రుడైన మహాత్ము డి విగ్రహం పూజలందుకుని కనిపిస్తుంది.. ఆలయం లో సేవలందించే 'పూజారులు' సైతం ఇక్కడ దళితులే.. వారి నోటి నుండి వెల్లువెత్తే ఒకే ఒక మంత్రం 'రఘుపతి రాఘవ రాజారాం... పతీత పావన సీతారాం' గాంధీ భోదన లే నిత్య పారాయణం. సాధారణంగా అన్ని దేవాలయాలకు వచ్చినట్లే ఇక్కడికి కూడా భక్తులు కొబ్బరికాయ తదితర పూజా సామగ్రితో వస్తారని... సాంప్రదాయ పద్దతులలో పూజలు, హారతి అన్ని ఉంటాయని.. ఉదయం, సాయంత్రం వేళల్లో వచ్చే భక్తుల మత విశ్వాసాలకు తగ్గట్టుగా పూజాదికాలు చేస్తా మని ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న కలియాబాగ్‌ చెప్పారు.
మన దేవాలయాల్లో చర్చిల్లో, మసీదులో నిత్యం వినిపించే భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ పవిత్ర గ్రంథాల ప్రవచనాల స్థానంలో సర్వ మత ప్రార్ధనలు, గాంధీబోధనలు వినిపిస్తాయిక్కడ.. ప్రతిరోజు గాంధీ విగ్రహంతోపాటు గర్బా éలయంలో కొలువైన నాటి స్వాతంత్య్ర సమరయోధులైన ఎందరో దేశ భక్తులకు నిత్య పూజలందించడమే కాక గాంధీ బోధనలపై చర్చ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఆదిత్య బిర్లా బాసట..
వివిధ పత్రికల్లో ఈ బాపూ ఆలయం గురించి వచ్చినకధనాలు విన్న ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధినేత ఆలయ అభివృధ్ధికి తన వంతు సహకారాన్ని అందిం చేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికల్ని సిద్దం చేయటమే కాక...ఆలయంలో గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించా రు. ఇక్కడికి వచ్చే యాత్రీకులకు తగిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నా మని ఆలయ నిర్మాణ సారధి అభిమన్యు కుమార్‌ తెలిపారు.
ఇప్పుడు ఈ ప్రాంతంలో అనేక గ్రామాలలో మతాలకతీతంగా 'మానవతే' మంచిదన్న గాంధీజీ దేవుడై పోవటం.. 'నవ' యువత 'బాపూ' స్ఫూర్తిగా ముందుకు సాగితే తమ 'లక్ష్యాలను' చేరుకొని.. నవభారత నిర్మాణం సాధ్యమే అని ఆనందంగా
చెప్తున్నారిక్కడి
బాపూ భక్తులు.

సామాజిక సేవలోనూ ముందంజ...
గాంధీజీ మందిరం నిర్మించాక 'అభిమన్యు' 'భత్రా' గ్రామస్థులంతా సభ్యులుగా ఏర్పాటు చేసిన 'అభివృద్ధి కమిటీ' నేటికీ చురుకుగా 'సమాజసేవ' చేస్తోంది. 'భత్రా' తోపాటుగా పరిసర గ్రామాలలో పారిశుధ్యం, వైద్య, పశు వైద్య, రక్తదాన శిబిరాలు ఇలా ఎన్నో ప్రయోజనకర కార్యక్రమాలు నిర్వహి స్తోంది... తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్న ఈ 'గాంధీ ఆలయాన్ని' కేవలం ఒరిస్సా లోని ప్రజలే కాక ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌లలోని వారు కూడా సందర్శించి... శాంతి సందేశాలను వినటమే కాదు.. మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారని 'భత్రా' గ్రామస్తులు చెప్పారు.
ఉత్సవాలు
అన్ని దేవాలయాలలోనే ఇక్కడా ప్రత్యేకంగా ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా గాంధీజయంతి అక్టోబర్‌ 2తోపాటు గణతంత్ర దినోత్సవమైన జనవరి 26, స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 వేడుక లు కోలాహలంగా జరపటం ఆనవాయితీగా వస్తోంది.. అలాగే గాంధీ వర్ధంతి అయిన జనవరి30న భారీగా సర్వ మత ప్రార్ధనల్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం ప్రారంభమైన నాటి నుండి 'సంబల్‌ పూర్‌' జిల్లా కలెక్టర్‌ ఇతర ఉన్నత అధికారులు క్రమం తప్పకుండా ఇక్కడి ఉత్సవాలలో ప్రత్యేక ఆహ్వాని తులుగా పాల్గొనటం మరో విశేషం.