నవరసాలపై ఆయన రాసిన పాటలను ప్రోగుచేసి, విడివిడిగా ప్రతి పదార్థ యుక్తంగా ఆకళింపు చేసుకొంటే...అర్థమవుతారు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించడం కోసం చేసే ప్రయత్నంలో వ్యక్తిగతం, అభిరుచి, సినీ ప్రస్థానం, రచనలు వంటి అనేక అంశాలను ఃఆంధ్రప్రభః స్పృశించింది. అంతర్లీనంగా ఆయనలోని ఆవేశాన్ని అక్షరాలుగా సంధించడానికి కారణం, భాష సరళమైనా... కాకున్నా భావ పటుత్వం ఉండాలనే పట్టుదల, తన మస్తి ష్కంలో ఉన్న భావనే పాటగా మలుస్తానని ఆయన చెప్పే మాటలో ఉన్న సూటి దనంతో పాటు తన గత జీవితంపై ఆయన పంచిన మాటల సారాంశం ఇది.
పరిపూర్ణమైన తెలుగు భాషా పాండిత్యం తనకు లేకపోయినా... తనకంటూ వచ్చిన పదాలను పాటలా కూర్చి రసజ్ఞులను రంజింప చేయడమే తన విధానమని నేర్పుగా చెప్పారు. అందరు డాక్టరు కాబోయి యాక్టరు అయ్యామని చెబితే... తాను డాక్టరు కావడానికి ఎంబిబిఎస్‌లో చేరి మధ్యలో ఆపిసి, ఆపై సినీరంగానికి వచ్చానని, 11ఏళ్లపðడే రాష్ట్రీయ స్వయంసేవక సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) సంస్థాపకులు హెగ్డేవార్, గురూజీల రచనల పరి చయం, శాఖాసాంగత్యం, దైవభక్తి కారణంగా శివునిపై వేయి పద్యాలు రాయాలని నిర్ణయించుకొని ఇప్పటికి 350 దాకా ఃశివదర్పణంఃలో పూర్తి చేశానన్నారు. సీతారామశాస్త్రి ఇంటిపేరు చేంబోలు అయినా...ఃసిరివెన్నెలః పాటలు ఆయనని ఃసిరివెన్నెలః సీతారామశాస్త్రిగా మార్చేసింది.
ఃనా ఉచ్ఛ్వాసం కవనం, నా నిస్వాసం గానంః అని సిరివెన్నెల చిత్రంలో వచించినా, ఃఈవేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో...ః అనే భావుకతా సాహిత్యాన్ని గులాబీ చిత్రం కోసం రాసినా, ఃచిలకా ఏ తోడు లేకః అంటూ శుభలగ్నం చిత్రం కోసం రాసినా, ఃవిధాత తలపున ప్రభవించినదీ ఈ అనాది జీవనవేదంః అంటూ ఓం కారాన్ని జోడీ చేసి హృదయవీణ మీటినా,అందరూ నవ్వుకునేలా మనీ చిత్రం కోసం ఃవారెవా ఏమి ఫేసు... అచ్చు హీరోలా ఉంది బాసూ...ః అన్నా, సిరివెన్నెల చిత్రంలోనే ఃమెరిసే తారల దేరూపంః అని ప్రశ్నించినా, ఃముక్కంటి, ముక్కోపి, తిక్కశంకరుడుః అని నిందాస్తుతి చేసినా ఆయనకే చెల్లింది.సమాజాన్ని ప్రశ్నిస్తూ తట్టిలేపే ఃఅర్థశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా, ఃనిగ్గదీసి అడుగు. .. ఈ సిగ్గులేని జనాన్ని, నిప్పుతోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్నిః అని ఆయన రౌద్రంగా రచించినా ప్రేక్షకులు కోపం తెచ్చుకోలేదు. కొంతమంది మాత్రం సత్యాన్వేషణ కోసం ఆలోచన చేయడం ప్రారంభిం చారు. కాలక్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయనని వరించాయి.
తత్వం జీవితం కోసం బతకడం: పుట్టుక, మరణమూ మధ్య కాలమే జీవితం. అర్థాంతరంగా ముగిసే ఈ జీవితం అర్థవంతంగా ఉండాలన్నదే. నా జీవన విధానం, తత్వమూ కూడా. వేదం ఆది మూలం. వేదం అంటే ఏది తెలిసి కోవాలో అది తెలుసుకోవడం. అందుకే నా స్థాయిలో నేను సత్యాన్వేషణ చేస్తూ... అనుభవిస్తాను కాబట్టి అక్షర రూపం ఇస్తా.. నా భావాలను రుద్దను. అర్థం చేసుకొమ్మంటా.. అన్వయించు కునే పని చదివే వాళ్ళది. జీవితం కోసం బతకడం నా తత్వం. ఇది ఆచరిస్తున్న వాళ్ళను మరింత చైతన్యవంతులను చేయడం నా లక్ష్యం. ఇదే నా పాటలో నూచ నా మాటలోనూ ఉంటుంది.
బాల్యం దిగువ మధ్యతరగతి జీవనం: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షివోనిలో 1955 మే 20న జన్మించిన నేను నా తండ్రి డాక్టర్.సి.వి.యోగి ఉద్యోగ బదిలీ రీత్యా మూడు నెలల వయసులో అనకాపల్లి చేరుకున్నా.. పద వ తరగతి వరకు అక్కడే చదివా.. ఆపై మా నాన్న గారికి కాకినాడ ఏ.టి.ఏ కాలేజీలో లెక్చరర్‌గా బది లీ కావటంతో కాకినాడ మారాం. నేను పెద్ద కుమారుడిని కావడంతో నాన్న తనకు వచ్చిన సంస్కృతం, ఉర్దూ, పర్షియన్‌లతోపాటు 14 భాషలు, తెల్సిన విజ్ఞానాన్నంతా నాకు నేర్పించాలనుకునేవారు. నాతో తొమ్మిదో ఏటనే భగవద్గీత శ్లోకాలన్నీ కంఠస్తం చేయించారు. స్కూలులో ఉండగానే క్యాలిక్యులస్, త్రికోణమితి నేర్పించారు. ఐనా నాకెందుకో మూస పద్ధతిలో చదువుకోవడం ఇష్టం ఉండేది కాదు. మొత్తం 15 మంది కుటుంబ సభ్యులున్న ఉమ్మడి కుటుంబంలో. నాన్న మాత్రమే సంపాదన పరుడు. అనుదినం ఉదయం 6నుంచి 9వరకు ట్యూషన్లు చెప్పడం.. 10 నుంచి 5వరకు లెక్చరర్‌గా .. 5 నుంచి రాత్రి 8 వరకు హౌమియోపతి డాక్టర్‌గా ఆపై అర్థరాత్రి 1 వరకు తిరిగి ట్యూషన్ చెప్పి కష్టపడితేనే మా కుటుంబం గడిచేది కాదు.
ఃచందమామః పుస్తకం నాగురువు: చిన్నప్పటి నుంచి క్లాస్ రూంలో కన్నా లైబ్రరీలోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. తెలుగు పుస్తకాలను ఆపాదమస్తకం చదివేవాడిని. ఃచందమామః పుస్తకం నా గురువు, నాకు ప్రపంచ భాషా పరిజ్ఞాన పోకడలను నేర్పిందదే... అప్పట్లో నేనొక ఏకసంతాగ్రహిని. శివానందలహరిలోని 100 శ్లోకాలను గుర్తుంచుకొని వల్లెవేసేవాడిని. తెలుగు వక్తృత్వ పోటీలు పెడితే ప్రథమ బహుమతి నాకే . 15 ఏళ్లు వచ్చేటప్పటికే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి అన్ని పుస్తకాలను చదివా... నిజం శీల నిర్మాణానికి దోహదం చేస్తుందని, తప్పు చేసినా ఒప్పు కొమ్మనేవారు నాన్న. నిజం చెప్పడం అనేది నాకు ఒక అలవాటుగా మారింది.
నేనొక గాయకుడని అనుకునే వాడిని: నేను అద్భుతంగా పాటలు పాడుతున్నానని.. నేనొక గాయకుడనే భ్రమలో ఉన్న నాకు ఘంటసాల గారి ఃముక్కోటి దేవతలు ఒక్కటై నారుః పాట విన్న తర్వాత అసలు పాట పాడటం నాకు రాదని అర్థమయింది.
బాల్యంలోనే దేశభక్తి గేయాలు: బాల్యంలోనే ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయం దేశభక్తి గీతాలు రాసేందుకు తోడ్పడింది.
ఆర్‌ఎస్‌ఎస్‌లో నా గురువు వై. సత్యారావు. నాకన్నా 7 ఏళ్లు పెద్ద. వైజాగ్‌లో
ఉంటున్నారు.
అయితే ప్రస్తుతం వివిధ కారణాల రీత్యా ఆర్‌ఎస్‌ఎస్‌కి దూరంగా ఉంటున్నా..
చిన్నతనంలో శ్రీశ్రీ అంటే ఇష్టం: ప్రతి పదాన్నీ పద్యంగా వాడే శ్రీశ్రీ అంటే ఇష్టం. అయితే ఆయనవల్ల ఎవరైనా కవిత్వం రాయవచ్చనీ, రాసిందల్లా కవిత్వమేనన్న భావన నిర్మితమైం దన్నదే నా వేదన. నా ఉద్దేశ్యంలో భావనాబలం, అభ్యాసం, లయలు ఉన్నదే కవిత్వం అనిపిలవాలి.
ఎత్తుపల్లాల విద్యాభ్యాసం: ఇంటర్ తర్వాత ఎంట్రన్స్‌లో 18వ ర్యాంకొచ్చి ఎంబిబిఎస్ సీటొచ్చి..మెడిసిన్‌లో చేరా. అపðడే..పి అండ్ టి (టెలిఫోన్)లో క్లర్కు ఉద్యోగానికి దరఖాస్తు పెట్టా. కాలేజీలో సరదాగానే గడుస్తున్నా.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సమాచారం తో ఎంబిబిఎస్‌పై ఉన్న ఆసక్తి పోయి చివరికి ఉద్యోగంలో చేరా.. అయితే మా నాన్నకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానని ఇచ్చిన మాటకు. ఉద్యోగంలో చేరిన 7 ఏళ్ల తర్వాత ఆర్‌ఎస ్‌ఎస్ మాస్టర్ సత్యారావు ప్రోద్బలంతో డిగ్రీ పూర్తిచేశా.
తండ్రి మరణంతో బాధ్యత తెలిసింది: మా నాన్న ఉన్నంత కాలం బాధ్యతలకు దూరంగానే బ్రతికిన నాకు ఆయన మరణంతో బాధ్యతలు నెత్తినపడ్డాయి. తమ్ముడు చదువు, పెళ్లి కానిచెల్లెళ్లు.. అప్పటికి నా జీతం నెలకు 700. ఖర్చు రూ. 1500. దీంతో ట్యూషన్లను చెప్పడం ప్రారంభించా. తమ్ముడు డిస్పెన్సరీలో డాక్టర య్యాడు. తోబుట్టువుల కోసం నేను 23వ ఏట వివాహం చేసుకున్నా. నా భార్య పద్మావతి వయస్సు అప్పు డు కేవలం 15.సంöö. అయితే ఆమె తీసుకున్న బాధ్యతలు వయసుకు మించినవి. నా విజయం, కుటుంబం స్థిరపడడంలో ఆమె పాత్ర కీలకం.
సమాసం వ్రాయలేని వయసులోనే తొలి సన్మానం: కాకినాడలో ఉన్న సమయంలో ఃకళా సాహితీ సమితిః అనే సంస్థతో పరిచయమైంది. దాంట్లో వేదాంత ధోరణిలో సాగే కవితలు చదివేవాడిని.వాటిల్లో వ్యాకరణం లేదని కోప్పడేవారు కొందరు. అయితే అక్కడ నేనంటే చాలా ఇష్టపడే సి.వి.కృష్ణారావు 1978లో నాకు సన్మానం చేశారు. నిజం చెప్పాలంటే నాకప్పటికి సరిగా సమాసం వ్రాయటం రాని 23 ఏళ్ల వయసులో తొలిసారి జరిగిన సన్మానం అది.
సంఘటనలు, వ్యక్తులపై పాటలు వ్రాయను: ఃశంకరాభరణంః చిత్ర యూనిట్ కాకినాడ వస్తున్నపðడు ప్రముఖ నవలా రచయిత ఆకెళ్ళ పాటరాయమని కోరితే.. సంఘటనలు, వ్యక్తులపై పాటలు రాయనని చెప్పాను. నా ఆర్థిక పరిస్థితి అప్పట్లో బాగాలేని విషయం తెల్సిన వారు నా సమాధానం విని ఃమొండిః అని విమర్శించారు. నేను విధించుకున్న కట్టుబాటు అది. ఇప్పటికీ అంతే.
బదిలీ కోసం టెలిఫోన్‌పై కవిత్వం: పి అండ్ టిలో పని చేస్తున్నప్పుడు టెలిఫోనుపై కవిత్వం రాయమని నాపై అధికారి ఒత్తిడి చేశారు. ఐతే టెలిఫోన్ విభాగానికి బదిలీ చేస్తాననే మాట తీసుకుని కవిత రాసా ఇలా..
ఃఃదూర శ్రవణ యంత్రం
దూరాన్ని తీగతో కట్టిపడేసిన సవ్మెూహన మంత్రం
ప్రకృతి బంధనాలను తెంచేసిన వైజ్ఞానిక తంత్రం
ఆకాశానికి తంత్రులు బిగించి శ్రుతి చేసిన యంత్రం
మానవ వాణికి లోకాలోకన్నందించిన నేత్రం
విశ్వమంతట విశృంఖలముగ నర్తించె నరునిగాత్రం
విజ్ఞాన యజ్ఞ వాటికలో ఇది మానవీయ శ్రీ సూక్తం
మానవుని విజయకీర్తనలో ఇది ఆరోహణమంత్రం.ఃః
సినీ రంగం వైపు అడుగులు: కళా విహీనమైన తెలుగు సినీ ఒరవడిని దరిచేర్చడానికి ఏడిద నాగేశ్వరరావు సాహసించి, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన ఃశంకరాభరణంః గుర్తుకు వచ్చేలా జలం లేక ఇబ్బందు లు పడుతున్న జనం కోసం శివుడు గంగను జటాజూటిలో క్రమబద్దీకరించి మందాకిని రూపంలో భూమిపె ౖకి పంపిన వృత్తాంతాన్ని నేను ఇతివృత్తంగా ఃగంగాధరంఃపేరుతో పాటరాశాను. బాలకృష్ణ హీరోగా నటించిన ఃజననీ జన్మభూమిః చిత్రం కోసం వాడారు విశ్వనాధ్.
అలా వెండి తెరపై వేటూరి పేరుతో పాటు నా పేరు చూసుకోవడం ఆనందాన్నిచ్చింది. అపై చాలా పాటలు కె. విశ్వనాథ్ గార్కి పంపినా వాడలేదు.
ఃసిరివెన్నెలః ప్రస్థానం: ఓనాడు కె. విశ్వనాథ్ నుంచి వచ్చిన పిలుపందుకుని వెళ్లి కలిసా... ఃసిరివెన్నెలఃకథను చెప్పి..సందర్భానుసారంగా పాటరాయమ న్నారు. ఃవిధాత తలపున ప్రభవించినదిః అని ప్రారంభిం చా.. అది ఆయనకు నచ్చింది. వెంటనే ఈ మాటలకు సరితూగే పూర్తి పాట ఉందని ఃవిరించినై విరచించితి నిః వినిపించా.. అద్భుతంగా ఉందన్నారు. అసలు విషయం అప్పుడే చెప్పా.. గతంలోనే ఈ పాట పంపానని, వినియోగించ లేదని. కె. విశ్వనాథ్ దాన్ని సరి చూసుకుని.. నాతో సమ్మతించారు.ఆపాట ఆయనకి ఎంతో సంతృప్తినివ్వడంతో ఃసిరివెన్నెలఃలో పాటలన్ని నన్నే రాయమన్నారు. దీంతో ఇక వెనుతిరిగి చూడలేదన్న విషయం అందరికీ తెలిసిందే!
కవికుల కమలాలలో విరపూసిన పుష్పం: సినీరంగంలో మనసుకవి ఆత్రేయ, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి, చిత్రగీతాల గతిని మార్చిన వేటూరి సుందరరామమూర్తిల సరసన నిలబడ గలిగే శక్తికల కలం ఉన్న వ్యక్తి సీతారామ శాస్త్రి అనడంలో సందేహంలేదు. ఆయన పాటలు కొన్ని శ్రీశ్రీ స్థాయిలో ఉంటాయని, సీతారామశాస్త్రి కావాలనుకున్నప్పుడు శ్రీశ్రీలా ముందుకు ముందు, వద్దనుకున్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణలా వెనుక ఉండి అడుగులను కాలానుగుణంగా మలచుకుంటున్న కవి. కొసరాజు ని ఆదర్శం చేసుకుని చిన్ని పదాలతో శ్రోతలను అలరించేలా ఃఅయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే.. . అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనేః అనేస్ధాయిలో ఃవారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసూ, వచ్చింది సినిమా ఛాన్సు, ఇక నీవేలే ముందు డేసూః అంటూ సిరివెన్నెల చమత్కార పాట రాశారు.
ఎందరో మహానుఃభావ కవులుః: మల్లాది, దేవులపల్లి పాటలు ఇష్ట మని..సినిమాలకు పాటలు రాయపోయి నా నిర్మాతలు ఆయన రాసిన గీతా లను వాడుకునేలా చేసేంతటి కవితా శక్తి దేవులపల్లిదని సీతారామశాస్త్రి తెలి పారు. లలితంగా మాటలు పొదగడంలో అందెవేసిన చేయి సి.నారాయణ రెడ్డిది. ఆయన పాటల ప్రభావం నాపై చాలా ఉంది. ఃతెలిసిందేలే.. తెలిసిం దిలే, నెలరాజ నీ రూపు తెలిసిందిలేః అనే పాటలో సాహిత్యం నాకు బాగా నచ్చింది. ఏవెూ! అంతకన్నా బాగా ఎవరూ రాయలేరేవెూ...! ఆయన రచన లకు నేను అభిమాని. బంగారాన్ని శుద్ధి చేసే ద్రవంలో మాటలను ముంచి వరుసలో పేరిస్తే బహిర్గతమయ్యే పాటలు ఆత్రేయ కలం నుంచి వచ్చాయని పిస్తుంది. మనసుకు తట్టుకునే భావంతో పాటు, మాటలను లయబద్ధంగా పొదగడం తెలిసిన మనసుకవి. తెలుగు చలన చిత్ర గీతాల లక్ష్మణరేఖను చెరిపి తనకంటూ ప్రత్యేక శైలిని ప్రదర్శించిన వ్యక్తి వేటూరి సుందరరామ మూర్తి.అడవిరాముడు చిత్రంలోని ఃకోకిలమ్మ పెళ్లికి..కోనంతా సందడిః పాట లో పదాలు ఎంత సరళంగా ఉన్నాయో అంత మధురంగా ఉన్నాయని, పాట రాయడంలో ఆయన వేగం అసామాన్యం,ఆదర్శంగా తీసుకోవాల్సిన కవిత్వం అని కొనియాడారు. నేను చిన్న పదాలతో పాటలు రాయడానికి కొసరాజు సాహిత్యమే మార్గదర్శి. ఇలా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
పాటరాస్తుంటే నిద్రపట్టదు: పాట రాయమని కోరితే ఇక నాకు రాత్రి నిద్ర పట్టదు. ఒక్క పాటను 20 రకాలుగా,ఒక్కోసారి 150 రకాలుగా రాసిన సందర్భాలున్నాయి. రాత్రి 8 నుంచి ఉదయం 8లోపు పూర్తిచేసి దర్శకుల కిచ్చిన రోజులున్నాయి. ఎందుకంటే..వేటూరి గారి వేగం అందుకోవాలన్నదే నా తాపత్రయం. ఆయన ఒక పాటను అంతవేగంగా ఎలా రాయగలిగారో నాకు ఆశ్చర్యమేస్తుంది. అందుకే నేను దర్శక, నిర్మాతలను సన్నివేశం, సందర్భం అడిగేవాడిని. దీనివల్ల నాకుపాటరాయడం సులువయ్యేది.
నా పాటల వెనుక విజయ రహస్యం: సామాన్య మానవుల జీవితానికి దగ్గరైన పదాలతో పాటరాస్తే, అది వెంటనే ఆకర్షణకు గురవుతుంది. క్రమేణా నేనదే పాటిస్తూ వచ్చాను. అదే నా విజయ రహస్యం.
నువ్వేమి చేశావు నేరం
నిన్నెక్కడ అంటింది పాపం, చినబోకుమా!
చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా! పెళ్లి చేసుకుందాం చిత్రంలోని ఈ పాట వినగానే అనేకమంది తాము సమస్యలలో ఉన్నప్పుడు సమాజం ఆదుకో లేదనే భావనను గుర్తుకు తెచ్చుకొని అన్వయించుకోవడం వల్లే హిట్టయింది. 2500కు పైగా దాటిన ఇలాంటి పాటలు సీతారామశాస్త్రి అమ్ములపొదిలోంచి బయటకు వచ్చాయి. ఇలా చిన్న పదాల ద్వారా పెద్ద అర్థం వచ్చేలా పాటలు వ్రాయడం కెరీర్ సక్సెస్‌కు ఎంతో ఉపయోగపడింది.సీతారామశాస్త్రిని పలు సంస్థలు సత్కరించి, సన్మానించి తమ అభిరుచిని చాటుకున్నాయి. ఫిలింఫేర్, కళాసాగర్, మనస్విని, కిన్నెర, ఆప్జా, వంశీబర్కిలీ, రసమయి సంస్థలు సీతా రామశాస్త్రి వివిధ చిత్రాల కోసం రాసిన ఆణిముత్యాల్లాంటి పాటలను ఎంపిక చేసి, వాటికి అవార్డులను ప్రకటించాయి. ఆయన పాటలు విదేశాల్లోని తెలుగు వారి మనసును అలరించడంచే ఖ్యాతి ఖండాంతరాలకు చేరింది. వారిని కలుసుకోడానికి అక్కడా పర్యటించారు.
నటుడిగా సీతారామశాస్త్రి: గాయం (1993), మనసంతా నువ్వే (2001)లో తెరపై కనిపించారు.సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారే అక్షర అల్లికలు మరింత మందిని రంజింప చేయాలని మనమూ ఆశిద్దాం.
ఃన చోర హార్యం నచ రాజ హార్యం...న భాతృ భాజ్యం నచ భార కారి...
వ్యయోకృతే వర్థత ఏవనిత్యం...విద్యాధనం సర్వధన ప్రధానమ్!ః
అన్న భర్తృహరి సుభాషితం విద్యా ధనం కలిగిన సరస్వతీ పుత్రులకు సరిగ్గా పోల్చడానికి,
విద్యా ప్రాశస్త్యాన్ని వివరించడానికి. తన భాషా పాండిత్యంతో, మృదుమధుర గీతాలతో ఃసిరివెన్నెలఃలు కురిపించే సీతారామశాస్త్రి పరిచయం అక్కరలేని వ్యక్తి. ఇప్పటికే ఆయన సినీరంగంలో
తనకో ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నారు. అద్భుత సినీగేయ రచయితగా ఆయనను తరచి చూస్తే
మరో వ్యక్తి సైతం ఉన్నారని... ఆయనతో సంభాషిస్తే... బాణాల్లాంటి మాటలను అనర్గళంగా సంధిస్తారనీ అర్థమవుతుంది. ఆయన రాసిన పాట ప్రతిఒక్కరిలో ఏదో ఒక పార్వ్సాన్ని తాకుతుంది.
ఆయన అంతరంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆయన రచనలను చదవాల్సిందే.
పది నందులు
1986 సిరివెన్నెల విధాత తలపున ప్రభవించినది
అనాది జీవన వేదం.
1987 శృతిలయలు తెలవారదేవెూ స్వామి.
1988 స్వర్ణకమలం అందెల రవమిది పదములదా.
1993 గాయం సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని.
1994 శుభలగ్నం చిలకా ఏతోడులేక.
1996 శ్రీకారం మనసు కాస్త కలత పడితే.
1997 సింధూరం అర్థ శతాబ్దపు అజ్ఞానాన్నే.
1999 ప్రేమకథ దేముడు కరుణిస్తాడని,
వరములు కురిపిస్తాడని.
2005 చక్రం జగమంత కుటుంబం నాది.
2008 గమ్యం ఎంతవరకు ఎందుకొరకు.
సీతారామశాస్త్రి రచనలు
1. సిరివెన్నెల తరంగాలు
2. నంది వర్ధనాలు
3. కళ్యాణ రాగాలు
4. శివ దర్పణం
5. క్షీరసాగర మథనం
6. నాన్నా పులి
7. సన్మానోపనిషత్తు
8. ఎన్నో రంగుల తెల్లకిరణం
9. తాత్విక వ్యాసాలు.
సీతారామశాస్త్రి తరంగాలు
1. భావ తరంగం
2. కల్లోల తరంగం
3. రస తరంగం
4. ఆశాంత తరంగం
5. వ్యంగ్య తరంగం
6. సరాగ పరాగం
7. కుర్ర కురంగం
8. హాస్య తరంగం
9. అమృతాంతరంగం
కొన్ని ప్రముఖ అవార్డులు
కళైంజర్ కరుణానిధి (1988) అవార్డు రుద్రవీణ చిత్రానికని రాసిన ఃతరలిరాద తనే వసంతం. తన దరికిరాని వనాల కోసంః, ఃనమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయనిః వంటి తెలుగులోక విదిత పాటలకు లభించింది.
ఃఅపురూపమైనదమ్మ ఆడజన్మ-ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మః అనే పాట పవిత్రబంధం కోసం రాశారు. దీనికి 1996 ఏడాది భరతముని అవార్డు వచ్చింది.ఃకళ్ళుః చిత్రం కోసం 1988లో రసమయి అవార్డు ఃతెల్లారింది లెగండోరు కొక్కొరొక్క, మంచాలింక దిగండోరు కొక్కొరొక్కొః పాటకు వచ్చింది.
'ఆంధ్రప్రభ'తో అనుబంధం
మనసులోని భావాలను కాగితంపై పెట్టడం నేను చేసే పని.వాటిని జనబాహూళ్యంలోకి తీసుకెళ్లడానికి వేదికలు కావాలి. అందులో సాహిత్యాన్ని ప్రోత్సహించే పత్రికల్లో 'ఆంధ్రప్రభ' ఒకటి. దానికి నా కవితలు, రచనలు పంపేవాడిని. కలం పేరుతో రాయటం అన్నది ఓ సాంప్రదాయంగా వస్తున్న రోజుల్లో 'భరణ'ిని కలం పేరుగా ఎంచు కుని నేను చేసిన రచనలు తొలినాళ్లలో వెలుగులోని రావటానికి 'ఆంధ్రప్రభ' సహకారం చాలాఉంది.
నాటి 'భరణి'యే నేడు 'సిరివెన్నెల సీతారామశాస్త్రి' అనే విషయం కొద్ది మందికే తెలిసినా... నా రచనలకు వారధిగా నిలచిన 'ఆంధ్రప్రభ' అంటే నాకు ఎన్నటికీ అభిమానమే.