ఓ సారి కళ్లు మూసుకుని పూలు లేని ప్రకృతిని, బోసినవ్వులు లేని చిన్నారుల ప్రపంచాన్ని ఊహించండి...
ఎంత భయంకరంగా ఉన్నాయో గమనించారా అంటే నవ్వుకున్న ప్రాధాన్యత అదన్నమాట.
చిరునవ్వులతో బతకాలి... చిరంజీవిగా బతకాలి అంటూ గీత రచయితలు పాటలు రాసుకుంటే...
నవ్వటం ఓ యోగం... నవ్వించడం ఓ భోగం... నవ్వక పోవటం ఓ రోగం అంటూ జంధ్యాల లాంటి
హస్య రచయితలు నవ్వుకున్న ప్రాధాన్యతని చలోక్తులుగా జనం ముందు నిలిపారు.
నవ్వు నాలుగు విధాలు గా చేటన్న దిశ నుండి నవ్వు నాలుగు విధాల స్వీటన్న దిశకి
ప్రస్తుతం సమాజం చేరుకుందన్నది వాస్తవం.
నిత్య జీవితంలో కనిపించే కష్టాలని, పెరుగుతున్న ఒత్తిళ్లని అధిగ మించి మనసారా నవ్వునేందుకు చాలా మంది చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అంతెందుకు చిన్న చిన్న ఆనందాలు, నవ్వులూ విర బూయని కుండా నిత్యం గంభీరతతో ఉండే ఇళ్లలో ఏదో దెయ్యాలు తాండవం చేస్తున్నట్లు వైపు కన్నెత్తి చూసేందుకు కూడా మనం భయ పడి పోతాం. మనిషి మనసుకుకి, దేహానికి హాయిన్చే ఆరోగ్యాన్నిచ్చే దివ్య ఔషధంగా నవ్వు వెలుగు చూసాక జీవన గమనంలో మరిన్ని నవ్వులు పూయించడం కోసమే లాఫింగ్ క్లబ్బులు కూడా పుట్టుకొచ్చా యన్నది వాస్తవం. ఇవి క్రమేపీ విస్తరిస్తూ... సమాజానికి ఆరోగ్యాన్ని పంచి పెట్టేందుకు ప్రతిన బూనినట్లు పనిచేస్తున్నాయి కూడా... లాఫింగ్ ధెరఫీ ప్రాధాన్యత ఏపాటిదో శంకర్‌దాదా సినిమా చూసిన వారికి అర్ధమయ్యే ఉంటుంది. ఈ క్రమంలో నవ్వు ఎన్ని లాభాలు చేకూరుస్తుందో తెలియ చేసే చిన్న ప్రయత్నం ఇది.
నవ్వటం ప్రారంభించండి....
సహజంగానే నిత్య చిరువవ్వుతో ఉండే ముఖం ఇట్టే మనల్ని ఆకర్షి స్తుంది. మరి ఆ చిరునవ్వుని మనం ఎందుకు సొంతం చేసుకుని ఇతరును మనవై తిపðకోకూడదన్న ఆలోచన మొదలైదే... అనవసర ఆలోచనల్ని వదిలి పెడుతూ...చిన్న చిన్న హాస్య సన్నివేశాలని గుర్తు చేసుకుంటూ నవ్వటం ప్రారంభించండి.
విసవిసలాడుతూ ఉండే వారి కన్నా... సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంరితో మాట్లాడేందుకే ఎక్కువ మంది ఇష్టపడతారన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని నవ్వుతూ మాట్లాడటం అలవాటు చేసుకోండి.
నవ్వు ఓ అంటువ్యాధి లాంటిది...
నిజమే... ఓ వ్యక్తి ఏడుస్తూ... కనిపిస్తే... మనం ఏడవం... కానీ తెగ నవ్వుతూ కనిపిస్తే.. ఆతని చేష్టలు చూసి మీకూ నవ్వొచ్చేస్తుంది. ఆయా వ్యక్తుల మధ్య సంబంధం కానీ, సందర్భంకానీ లేకపోయినా... నవ్వు ఇట్టే పాకి ఇతరులని నవ్వించే ప్రక్రియ ప్రారంభిస్తుందనటానికి ఇంత కన్నా ఉదాహరణ ఏముంటుంది. లాఫింగ్ క్లబ్‌లు, జోక్స క్లబ్బు ల్లోనూ జరిగేది ఇదే... నవ్వేందుకు.. నవ్వించేందుకు అప్పటికపðడు జోకులు వేసుకుని నవ్వుకునే సందర్భాలే అనేక. ఇక్కడంతా టేకిటీజీ పాలసీనే పాటించాలి. లేదంటే మీరే నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంది.
భావోద్వేగాలను అదుపులోకి తెండిలా...
మీరు గానీ మీరున్న వాతావరణంకానీ ఇబ్బందికరంగా తయారైతే... ఒక్కసారి ఏక బిగిన నవ్వేయండి... మొత్తం పరిస్ధితంతా కూల్ అయిపోవటమే కాదు... అక్కడితో భావోద్వేగాలు ఆగిపోయి.. మీతో పాటు అర్ధం కాకపోయినా చిరు నవ్వులతో నవ్వుల వాన మొదలవుతుంది. దీంతో అంత వరకు ఉన్న వేడి వాతావరణం ఒక్కసారిగా అద్భుతంగా మారి దాదాపు అందరి మనసులు ప్రశాంతత చెందుతాయి. అలాగే మీ మూడ్ బాగాల ఏదని మీకనిపించినపðడూ నవ్వే దానికి మంచి పరిష్కార మార్గం.
ఒత్తిడిని తగ్గించే నవ్వులు...
చాలా మంది మానసికంగా శారీరకంగా ఆలసిపోయి చేసే పనిపై దృష్టి పెట్టలేరు సరి కదా... విపరీతమైన చిరాకు ప్రదర్శిస్తుంటారు. దీంతో ఇంట్లో అయినా, ఆఫీస్‌లో అయినా వాతా వరణం కూడా గంభీరంగా మారిపోయి... ఏదో తెలియని ఇబ్బందికర పరిస్ధితిల్లో మీరున్నట్లు మీకే అనిపిస్తుంది. ఇలాంటపðడు ఇంట్లో ఉంటే చిన్న పిల్లల్లా మారిపోయి ఏ మిస్టర్ బీన్‌నో, టామ్ అండ్ జెర్రీ కార్డున్ నెట్ వర్కనో చూస్తూ ఎంజారు చేేయండి .ఆఫీస్‌లో ఉంటే క్యాంటిన్‌కో, బైటకో వెళ్లి కాసేపు మాట్లాడండి. మీకిష్టమైన జోక ఒకటి చెప్పి నవ్వే ప్రయత్నం చేయండి. దీంతో మీ మూడ్ మారి మళ్లీ ప్రశాంతతని పొందియధాస్ధితికి వస్తారు.
రక్తపోటు తగ్గించే మందు ఇది...
నిత్యం మీ రక్తపోటు చూసుకునేందుకు స్పిగ్నో మీటర్‌ని వాడు తున్నారా అయితే ఈ సారి రక్తపోటు కొలుచుకున్న తరువాత కాసేపు ప్రశాంతంగా నవ్వండి... ఆపై మళ్లీ మీలోని రక్త పోటుని కొలుచుకోం డి. ఇట్టేే తగ్గుదల కనిపిస్తుంది. అంటే నవ్వు అధిక రక్తపోటు ఉన్న వారి పై ప్రభావం చూపి తగ్గిందనేగా అర్ధం. అంతర్జాతీయంగా జరిగిన అనే క పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడించాయి కూడా. సైకిలింగ్, ఇత ర వ్యాయామాలు చేస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతుందో నవ్వినా అంతే ఖర్చు కావటమే కాకుండా ప్రోటీన్లు, రోగాలతో పోరాడే బి సెల్స్, టి సెల్స్ కణాలు పెరిగి మెదడుని చురుకుగా ఉంచుతాయని తద్వారా గుండె కూడా చరుకుదనం కలిగి రక్తపోటుని తగ్గించుకునేందుకు మార్గం ఏర్పడుతుందని వైద్యులు చెప్తారు.
మతిమరుపు మాయం చేస్తున్న నవ్వు
నిత్యం నవ్వుతూ ఉంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందని ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది. పదే పదే నవ్వుతున్న వారిలో మరు పు మాయమవుతుండగా ఎపðడూ మూడీగా ఉండే వారు చివరకి ఏ విషయం మీద ఆలోచిస్తున్నావెూబీ కూడా తెలియనంత మతి మరుపు ని మూటగట్టుకుంటున్నట్ల్లు ఈ సర్వే తేల్చి చెప్పింది. అంటే నవ్వు ఎన్ని అద్భుతాలు సృష్టిస్తోందో అర్ధమవుతోందా
ఉపాధి అవకాశాలిచ్చే నవ్వు...
నిజమేనండి బాబు... మీరే ఇంటర్వూకో వెళ్లేపðడు కాస్త చిరాకుగా ముఖం పెట్టారో మీ పని ఔట్. అదే చిరునవ్వుతో ఇంటర్వూ చేసే వారి ని పలకరించారనుకోండి... 50 శాతం మార్కులు ఇట్టే కొట్టేసారన్న మాటే... రిసెప్షనిస్టుల ఉద్యోగానికి మాట తీరెంత ముఖ్యవెూ నవ్వులు చిందించడం అంతే ముఖ్యం. నిత్యం నవ్వుతూ ఉండటం వల్లనే ఈ ఉద్యోగాలలో పనిచేసే మహిళలు ప్రత్యేక వ్యాయామమే అవసరం లేకుండా ముఖ కండరాలు చరుగుగా వ్యవహరిస్తూ...నిత్యయవ్వనులు గా చూపిస్తున్నాయని...ఎలాంటి ఖర్చు లేకుండా నవ్వులతోనే అందం పొందేస్తుంటే మీరెందుకు ప్రయత్నించకూడదో చెప్పండి.
అసలు ఏ ఉద్యోగంలో అయినా నవ్వుతూ మాట్లాడుతూ.. కలగొలుప ుగా ఉన్నా వారికే అనేక అవకాశాలు పుట్టుకొస్తుంటాయని గమనించం డి. నిత్యం నవ్వుతూ మాట్లావారు ఆత్మ విశ్వాసంతో, ధైర్యంగా ముందు కు వెళ్లగలడు, అందరినీ కలుపుకు పోతూ... మన్నలనీ పొందగలడు.
నవ్వితే 17... బిగిస్తే 43..
అవును మీరు నవ్వితే 17 కండరాలలో కదిలే కలయిక మీలో కొత్త ఉత్సాహాలనిస్తుంది. అదే మూతి బికించుకుని సమాజంతో మనకేం పని లేదన్నట్లు కూర్చొంటే 43 కండరాల బిగుసుకుని పని చేయటం మానేసి అనేక రోగాలు తెచ్చి పెడతాయని వైద్య పరిశోధనల్లో తేలిన అంశం. పసి పిల్లలు సగటున రోజుకు300 వందల సార్లు నవ్వుతుం టే పెద్దలు కేవలం 17 సార్లే నవ్వుతున్నారని, అయితే పురుషుల కన్నా స్త్రీలు 126 శాతం అధికంగా నవ్వుతున్నారని... అందువల్లనే వారిలో రోగ నిరోధక శక్తి అనూహ్యంగా పెరుగుతోందని ఓ పరిశోధనలో తేలింది.
ఆఫీస్‌లోని వారో బైటవరోనే కాదు ఇంట్లో వాళ్లయినా మీరు చిరువ్వుతో చెపితే మాట వినేందుకు కనీసం ప్రయత్నిస్తారు. అలా కాకుండా హుం కరించారో.. ఓ వేళ తిరగ బడినా ఆశ్చర్యపోనఖ్ఖర్లే. సందర్భానుసారం గా జోక్స వేస్తు వాతావరణాన్ని మీకనుకూంగా మార్చుకోవాలంటే నవ్వే పెద్ద ఆయుధం.
ఏవిషయానైనా పాజిటివ్‌గా తీసుకుంటూ ముందుకు సాగితే నవ్వుతూ బతకడం ఇట్టే అలవడుతుందన్న విషయం గుర్తెరి మీ జీవితంలో నవ్వు కి ఎంత ఎనలేని ప్రాధన్యత ఉందో గమనించి నవ్వుల సాగరంలో నిండిపోతే... మంచిది.
రోగాలని మాయం చేసే నవ్వులు...
నిజమే అనేక రోగాలను నవ్వే మాయం చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. మనం ఎంత నవ్వితే అందగా మనలోని అంత: స్రావీ గ్రంధులు అనేక హార్మన్లని సెరోటోనైస్, ఎండో సైస్ ఎంజైమ్‌లని విడుదల చేస్తాయి. ఇవి మనలోని రోగనిరోధకతని పెంచడమే కాకుండా పాటు మన ఆరోగ్య స్ధాయిని కూడా పెంచుతాయి. దీంతో ఫ్లూ, జలుబు లాంటి వ్యాధుల నుండి తక్షణ ఉపశమనాన్ని పొందుతామని నిపుణులు చెప్తున్నారు.