పండ గలొచ్చేసాయ్.... ఊరూ వాడా దుర్గా మాతని కొలువు దీర్చి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. మరి దుర్గాదేవి ఆలయాలకు... కొలువు దీరిన మండపాలకు మీరెళ్లినప్పుడు పూజా సామాగ్రిని అందంగా అలంకరించి పెడితే కనువిందుగా ఉంటుంది. పూజా సామాన్లని, చక్కగా అలంకరించేందుకు వివిధ డిజైన్లు వాడండితే బాగుంటుంది. వీలైనంత వరకు మీ ఇంటిలోని వెండి పూజా పళ్లాలు వాడితే చూపులకు బాగుంటాయి. అవి లేదంటే ఇత్తడి లేదా స్టీలు పళ్ళాలు వాడేప్పుడు ఖచ్చితంగా పళ్ళెపు అంచులకు ఫెవికాల్‌తో జరీ అంచులు అంటిస్తే బాగుంటుంది. అలాగే వాటికి వేలాడే పూసలను పళ్ళానికి కడితే మరింత అందాలనిస్తుంది. పూజా సామాన్లతో పాటు మనం తీసుకెళ్లే కుంకుమ, పసుపు, బియ్యం ఇలా అన్నీ కలసి పోయి చూడటానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక వీటికి ప్రత్యేకం గా పేపరు బాక్సులు పెడితే బాగుంటుంది.
ఇక శరన్నవరాత్రుల సందర్భంగా దేవిని వివిధ రూపాల్లో కొలుస్తూ... పూజిం చటం మన సాంప్రదాయం. కనుక వివిధ రకాల పూలదండల్ని అమ్మవారికి సమర్పిస్తుంటా రు. ప్రసాదాలుగా పండ్లు, స్వీట్లు వుంచాలనుకునే వారు కొంచెం పెద్ద పళ్లెం తీసుకుని.... అలంకరణలో భాగంగా ఆకును అడుగున వేసి... కొన్ని పూలరేకులు వేయండి. అందులో మీరు అమ్మవారికి సమర్పించాలనుకున్న ఫలాలను వివిధ రకాల పుష్పాలను అలం కరించండి. అలాగే మండపాలలో పూజలు చేసే వారు కూడా ఓ పెద్ద పళ్లెంలో గుండ్రంగా దీపాలు వుంచి మధ్యలో పెద్ద దీపం పెడితే మరీ బాగుంటుంది. పళ్ళెం నూనెకు పాడవు తుందని అనుకుంటే... ఒక అరటి ఆకు వేసి దీపాలు పెట్టడమే కాకుండా కాస్త పూలతో అలంక రించండి. అమ్మవారి పూజకు మీరు తీసుకువెళ్లే పళ్ళెం మీకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఉంటే నవరాత్రి అలంకరణలతో కనువిందు చేసే దుర్గామాత అంతలా మీకు ఆశీస్సులందించిందన్న ఆనందం దక్కడం ఖాయం.