15, నవంబర్ 2011, మంగళవారం

నువ్వొస్తానంటే నేనడ్డుంటాలే!

వర్షాకాలం ఇలా బైటకెళ్తామో లేదో... అర్ధంతరంగా వానొచ్చి..... మనల్ని తడిపి ముద్ద చేసింది చాలక మన పనులన్నిం టినీ పాడు చేసిన క్షణాన 'గొడుగు' తెచ్చుకోక పోవటం మన తప్పే... అంటూ తిట్టుకున్న సందర్భాలనేకం.తడిసి మద్దయితే కానీ 'గొడుగు' ప్రాధాన్యత మనకి తెలిసి రాదు. తీరా ఇంటి కొచ్చి మూల పెట్టిన గొడుగుల్ని పైకి తీసే పని చేసినా.. అవసరానికి మాత్రం వినియోగించుకోలేక పోతుండటం సర్వ సాధారణం కూడా.నాటి తరంలో గొడుగు నిత్యవసరంగా వెలుగొందింది. ఎండా, వాన కాలాలతో పాటుగా ఎప్పుడూ తమ వెంట గొడుగు ఉంటే కానీ బైటకు వచ్చే వారు కాదు. అయితే మారుతున్న కాలంతో ఆధునిక సమాజం తమతో పాటు గొడుగు తీసుకు వెళ్లడాన్ని ఓ చిన్న చూపు గా భావిస్తుండటం వల్ల ఆరోగ్య పరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా వాతావరణంలో వస్తున్న మార్పులు, సూర్యుడి నుండి నేరుగా వస్తున్న అతినీల లోహిత కిరణాల ప్రభా వంతో ప్రపంచ వ్యాప్తంగా చర్మ కేన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఎండ నుండి సరైన రక్షణ లేక పోవటం వల్ల చర్మం పూర్తిగా కమిలిపోతున్నట్లు అయిపోయి... యవ్వనం ముగియకుండానే ముసలితనం మీద పడిన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి ఇబ్బందుల నుండి బైట పడాలంటే ఖచ్చితంగా మీరు బైట తిరిగేప్పుడు గొడుగు నీడ అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణు లు కూడా చెప్తున్నారు.
ఇదో గొడుగు చరిత్ర... మన మహా భారతం లో ఈ గొడుగు గురించి ఓ చిన్న కధ కూడా ఉంది. విలువిద్యా సంపన్ను డైన జమదగ్ని తన విద్యకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ... తాను వదులుతున్న బాణాలు ఎక్కడ పడినా తిరిగి తనకి తెచ్చివ్వమని తన భార్య రేణుకని ఆదేశిస్తాడు. ఈ క్రమంలో ఓ రోజు ఆమె జమదగ్ని వేసిన బాణాలు ఏరుతూ.. ఆలస్యంగా ఇంటికి చేరుతుంది. తన ఆలస్యానికి కారణం సూర్య తాపమేనని... వేడిమి వల్ల అస్త్రాలను ఏరలేక పోయానని విన్న వించుకుంటుంది. తన భార్యని ఇబ్బం ది పెట్టేలా వేడిని వెద జల్లినందుకు తీవ్ర ఆగ్రహం చెంది సూర్యుడిపైకే తన అస్త్రాలు ఎక్కుపెడతాడు జమదగ్ని దీంతో సూర్యుడు తన తప్పు మన్నించమని... అయితే లోక కళ్యా ణం కోసమే ఇలా చేయా ల్సి వస్తుందని చెప్తూ.... తన నుండి వచ్చే వేడి నుండి తట్టుకునేందుకు ఓ 'ఛత్రం' అందిస్తాడు. ఇదే తరువాతి కాలంగా గిడుగుగా... ఆపై గొడుగుగా రూపొందింది.
ఈ గొడుగును ఇంగ్లీషులో 'అంబ్రెల్లా' అని పిలుచుకుంటాం. ఇది కూడా ఇంగ్లీషులోకి వచ్చి చేరిన అనేక పదాల్లోలా గ్రీకు పదమే. దీనిని 'పారా సాల్స్‌' అని కూడా కొందరు పిలుస్తారు. సాల్‌ అంటే సూర్యుడు అని అర్ధం... ఎండ నుండి కాపాడే వాటిని పారా సాల్స్‌గా, వాన నుండి రక్షించే వాటిని అంబ్రెలాగా యూరోపియన్లు చెప్తారు.
అసలు 18వ శతాబ్ధంలో బ్రిట న్‌కి చెందిన ఓ వ్యక్తి వర్షాల నుండి తాను తడిచిపోకుం డా ఉండేందుకు రూపొందించుకున్న సాధనమే గొడుగు అన్న ప్రచారం కూడా ఉంది. అయితే తొలి నాళ్లలో చైనాలోనే కాగితం, వెదురు, మల్బరీ ఆకులతో చెట్లను పోలి ఉండే ఆకారాలను తయారు చేసి వినియోగించే వారని... నేటికీ చైనా, ధాయ్‌లాండ్‌, జపాన్‌ తదితర దేశాలలో జరిగే సాంప్రదాయ పండగలలో ఈ తరహాలో గొడుగులు రూపొందించి వాడుతుండటాన్ని పేర్కొంటారు.
వీటిని ఆదర్శంగా తీసుకునే నేడు ప్రపంచ వ్యాప్తంగా గొడుగుల పరిశ్రమ అభివృధ్ది చెందుతోంది. ఒకప్పుడు కేవలం నల్లని కాటన్‌ వస్త్రంతో రూపొందే గొడుగులు నేడుఅనేక రూపాలను సంత రించుకోవటమే కాకుండా వందలాది రంగులలో కనిపిస్తున్నాయి. కాటన్‌తో పాటు పాలిస్ట్టర్‌, నైలాన్‌ల తో వివిధ రంగుల్లో రూపొందించిన గొడుగుల చాన్నాళ్లు రాజ్యమేలాయి. అయితే ఇప్పుడు వర్షంలోం చి వస్తే.. క్షణాల్లో ఆరిపోయే టెఫ్లాన్‌ కోటింగ్‌తో కూడిన గొడుగులు వచ్చేసాయి. రెండు మడతల నుండి జేబులో పెట్టేసుకునేంతలా మారిపోయేలా గొడుగులు రూపొందిస్తున్నాయి కంపెనీలు.
ఇక అతినీలలోహిత కిరణాలను తట్టుకునేలా పరారుణ కిరణాలు విడుదల చేసే సిల్వర్‌ పూసిన గొడుగులు లభ్యమవుతున్నాయి. ఈ గొడుగులు వాడితే ఎంతటి ఎండలోనైనా చల్లని నీడని ఆస్వాదించి ముందుకే గొచ్చని తయారీ దారులు చెప్తున్నారు. నెదర్స్‌లాండ్‌ లాంటి దేశాలలో ఎక్కువగా వచ్చే ఈదురు గాలుల్ని తట్టుకుని నిలచేలా 'ఏరోడైనమిక్‌ ' సూత్రాన్ని పరిగణలోకి తీసుకుని గొడుగులని తయారు చేసే 'సెంజ్‌' కంపెనీ ప్రత్యేకంగా గొడుగుని రూపొందిం చడం విశేషం.మరోవైపు అంబ్రెలాకి తోడుగా చేతులతో పట్టుకోకుండా ఎంచక్కా నడచుకుని వెళ్లి పోయేందుకు విండ్రెలాలు, సుబ్రెల్లాలు రూపొందాయి. న్యూ యార్క్‌ మహానగరంలో ఎండా, వాన, మంచు ఇలా ప్రతి ఒక్కటి ఎక్కువగా ఉండటం వల్ల అంబ్రిలాకు ధీటుగా సుబ్రెలాని సృష్టించారు. ఇవి ముఖం నుండి మోజేతుల వరకు రక్షణ కవచంలా నిలుస్తాయి.
గొడుగుల పండగ :
ప్రతి ఏటా అంబ్రెలా ఫెస్టివల్‌ పేరుతో గొడుగులకు ఏకంగా పండగని నిర్వహిస్తారు థాయ్‌లాండ్‌ లోని బోరసాంగ్‌ అనే పట్టణం. పురాత నంగా ఈ పండగను ఆనవామితీగా జరుపుతుండటం వల్ల బోర సాంగ్‌ ఇప్పుడు అంబ్రెలా పట్టణంగా కూడా జగద్విదితమైంది. కాలానుగుణంగా జరు గుతున్న సాంకేతి క మార్పులు గొడుగులపైనా ప్రభావం చూపి అనేక విధాలుగా వీటిని రూపొందిస్తున్నారు.ప్రపంచంలోని అన్ని దేశాలలో అనేక రకాల గొడుగులు వాడుకలో మనకి కనిపిస్తున్నాయి. కేవలం ఎండ, వానల నుండే కాకుండా, మంచు పడేప్పుడు కూడా మనల్ని కాపాడుతూ..చర్మానికి రక్షణ గా నిలచే గొడుగులు అనేక రంగుల్లో మార్కెట్‌లో లభ్యమవుతు న్నాయి. ప్రేమికుల కోసం, పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా వివిధ రూపాలతో గొడుగులు దొరుకుతున్నాయి.