నాగరికత వికసిస్తున్న తొలి రోజుల్లో...మనిషి తన మనుగడ కోసమే పోరాటాలు చేస్తున్న తొలినాళ్ళలో
సేద తీరేందుకు రూపొందించుకున్న వివిధ కళల్లో పుట్టిన జానపద కళారూపాలలో తోలుబొమ్మలాట ఒకటి..
తాను విన్న పురాణ కథల్లోని పాత్రలు కళ్ళముందు సాక్షాత్కరించడంతో....
భక్తి పారవశ్యంతో ఆనందానుభూతులకు లోనై...అనేక అనుభూతులకు లోనవుతూ ..
తన జీవిత గమనాన్ని చక్కదిద్దు కోవటమే కాకుండా... భవిష్య కళా రూపాలకు ఊపిరూదేలా...
తోలుబొమ్మలాట.ని మలచుకుని ఎన్నోకొత్త ప్రయోగాలకు నాందీ వాచకంగా వినియోగించుకున్నాడు.
తోలుబొమ్మలనే ప్రేరణగా పొందిన ఆధునిక మానవుడు సినిమాలు రూపొందించగా...
ఇప్పుడు ఆ కళ రాను రాను అంతరించుకు పోతూ అవసాన దశకు చేరుకుంది..
దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ....
కదలికలోని ఆనందాలే... మనిషి ఆలోచనకి కొత్త రూపం ఇచ్చా యి. ఆ ఆలోచనల నుండి పుట్టిందే బొమ్మలాట. అతి ప్రాచీన కళ అయిన బొమ్మలాటలో కొయ్య బొమ్మలాటలు, కట్టె బొమ్మలాటలు, తొడుగు బొమ్మలాటలు, బుట్ట బొమ్మ లాటలు, తోలుబొమ్మలాట లు ఇలా ఈ అనేక రకాలున్నాయి.
భారతీయ జానపద ప్రదర్శన కళల్లో దృశ్య రూపకంగా నిలచిన ఈ తోలుబొమ్మలాట. ఒకప్పుడు తొంభై ఆమడలు వెళ్ళైనా తోలు బొమ్మలాట, నలభై ఆమడలు వెళ్ళైనా నాటకం చూసి రావాలన్నది నానుడి. అంటే వాటికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసు కోవచ్చు.
క్రీ.పూ. 3వ శతాబ్దం నాటికే తెలుగునాట ప్రచారంలో ఉన్నట్లు ప్రచారం ఉంది. మహాభారతం రాసిన సోమన చీరుమరుగున బొమ్మలనాడించు వారై.. అనే పద్యంలో తోలు బొమ్మలను ప్రముఖంగా ప్రస్తావించగా... భగవద్గీతలో మనిషిని బొమ్మగా చేసి భగ వంతుడు ఆడిస్తున్నాడని ఇదో రకమైన తోలుబొమ్మలాట అంటూ చెప్పే వారూ ఈదేశంలోఅనేకులు కనిపిస్తారు. సామ్రాట్ అశోకు ని శిలా శాసనాల్లో జంబూ ద్వీపాలలోబొమ్మలాటనే ప్రద ర్శన రంగంగా పేర్కొనగా పతంజలి మహాభాష్యం లో వినోద సాధనాలలో ప్రధాన మైన వాహిక బొమ్మలాటని ప్రస్తావించగా... బౌద్ధ గ్రంథ మైన 'తేరి గాధ'లోనూ బొమ్మలాట ప్రస్తావనఉంది. ఇక ఈమానవాళికి కామసూత్రాలను వివరించిన వత్సాయనుడు సైతం కన్యలను ఆకర్షించడానికి బొమ్మలాటల ప్రదర్శన అవసర మని పేర్కొనటం విశేషం. విరాటపర్వంలో దుర్యోధనుడు కురు వృద్ధులతో విరాట రాజు గోవులను ఉత్తరంవైపు తరలించే ఉత్తర గోగ్రహణం కథను తోలుబొమ్మల ఆటగా ఆడిస్తే వర్షాలు కురుస్తాయని బహుధా ఒక నమ్మకం ఉంది. అనావృష్టి కాలం లో ఈ ఆటను ఆడించడం ఒక ఆనవాయితీగా ఉండేది.
ప్రాచీన భారతదేశంలో బొమ్మలాటని కేవలం వినోసాధనంగానే కాకుండా ప్రబోధాత్మక సాధనంగా మలచుకుని.... కావ్యాలు, పురా ణాల్లోని పాత్రలని కదిలిస్తూ.. విశేషాలను, రకరకాల విన్యాసాలతో సామూహిక, సంగీత, నాట్యం ఇలా అనేక అంశాలను మేళవించి తోలుబొమ్మలాటగా రూపాంతరం చెందిన ఈ కళ మొత్తం భారతీ య జానపద కళారూపాల్లోనే విశిష్ట ప్రాధాన్యత సంతరించు కుందని చెప్పడానికి అమరకోశంలోని శ్లోకాలే నిదర్శనం.
తోలుబొమ్మల తయారీకి జింక, దుప్పి, మేక, గొర్రె మొదలైన జంతువుల చర్మాలను వాడతారు. చైనాలో గాడిద చర్మంతోను, గ్రీసు లో ఒంటె చర్మంతోను తోలుబొమ్మ లనుతయారుచేస్తారు.అభినయంలో కదలి కకుగాను కాళ్ళు, చేతులు ప్రత్యేకంగా తయారుచేసి దారాలతో కీలు కట్టి , రెండు కాళ్ళ మధ్య భాగంలో పుల్లను పట్టుకొని బొమ్మను ఆడిస్తారు. వీటిలో ఏకపటం, సూత్ర బొమ్మ. అని రెండురకాలు కాగా తోలు బొమ్మలాటలు పౌరాణిక, సాంఘిక, జనపదాలుగా విభ జించారు. పలుచని తెర, తెర ముందు పెద్దదీపం, తెర వెనక తోలుతో తయారు చేసిన బొమ్మలు, బొమ్మల భాగాలకు దబ్బలు కట్టి వెనకనున్న వ్యక్తులు ప్రేక్షకులకు కనపడకుండా బొమ్మలను పాత్రలకను గుణంగా ఆడిం చడమే తోలుబొమ్మలాట. ఆటలు, పాటలు, మాటలు, మోతలు, ప్రదర్శన సంబంధమైన కదలికలకు అనుగుణంగా ప్రధాన గాయ కుడు పాడుతూ వుంటే, మిగిలిన వారు వంత పాడుతారు. రాగం తీయడం, ముక్తాయింపు, సంభాషణ ధోరణిలో స్త్రీగొంతు ముఖ్య పాత్ర కావటం గమనార్హం. హర్మోనియం, తాళాలకు తోడుగా రథా లు, గుఱ్ఱాలు, యుద్ధఘట్టాల అనుసరించి కాళ్ళ కింద బల్లచెక్కల ని టకటకా తొక్కుతుంటే మంచి రసవత్తరంగా ఉంటుంది. అలాగే ఉరుములు ఉరిమినట్టూ, పిడుగులు పడ్డ సన్నివేశాలలో ఖాళీ డబ్బాలు మోతలతో నానా హడావిడి చేస్తూ... ప్రజలను ఉర్రూత లూగిస్తారు. ప్రధాన కథకు అనుగుణంగా వ్యవహరించే హాస్యపాత్ర లు నాటి సామాజిక స్థితిగతులకు దర్పణంగా నిలుస్తూ... సామె తలు, లోకోక్తులు, పొడుపుకథలు, నీతికథలు చెప్తూనే.... సమా జంలోని దురాచారాలను, మూఢనమ్మకాలను ఎండగట్ట డం తదితరాలతో ఆహ్లాదకరంగా..ఉండటంతో ఏదైనా గ్రామంలో తోలు బొమ్మలాట ఉందంటే...చుట్టు గ్రామాల ప్రజలు తండోప తండాలుగా వెళ్లేవారు. అప్పట్లో వినోద సాధ నం ఇదొక్కటె కావటం వల్ల ఆదరణ బాగా ఉండేది. అనేక కుటుం బా లు ఇదే వృత్తిగా చేసుకొని జీవనం సాగించేవారంటే.... ఏస్ధాయి ఆదరణ లభించేదో అర్ధం చేసు కోవచ్చు. తోలు బొమ్మలాటలో ఎక్కువగా రామాయ ణం, మహాభారతాలే కథావస్తువులుగా నిలచాయి. లంకాదాహనం, సతీసులోచన, యయాతి, అంగద రాయబారం, మైరావణవధ, విరాటపర్వం, పద్య వ్యూహం, ఉత్తరగోగ్రహణం వంటి కథలతో ఆకట్టుకునే రీతిలో తోలుబొమ్మలాటల్ని ప్రదర్శించేవారు. పండిత పామరులు కులమత భేదభావాలు మరచి తిలకించేవారు.
ఈ తోలుబొమ్మలాట ప్రాచీన ఓడరేవుల ద్వారా విదేశాలకు భారతీయులతో పాటు వెళ్ళాయి. పర్షియా, టర్కీ, గ్రీసులలో ప్రవే శించి కొత్త రూపం సంతరించుకునిఆఫ్రికా, ఇతర ముస్లిం దేశాలకు, 17వ శతాబ్దంలో ఇటలీ నుంచి వెర్సయిల్స్, పారిస్, పేలేరాయల్ నగరాలకు వ్యాపించిందన్నది చరిత్రకారుల కధనం.
కళని కాపాడే ప్రయత్నమేదీ....
పాశ్చాత్య దేశాలలో నేటికీ జరిగే అనేక ఉత్సవాలలో తోలుబొమ్మల ఆటల్ని ప్రదర్శిస్తూ... సాంప్రదాయంగా వచ్చిన ఈ కళని కాపాడుకునే ప్రయత్నాలనుచేసున్నా.. మనదేశంలొ ఆ తరహా ప్రయత్నాలు జరగక పోవటం నిజంగా ఆందోళనకరం.