భారతావని ఎన్నో కళలకు పుట్ట్టినిల్ల్లు.... ప్రపంచమే అబ్బురపడే కళా ఖండాలెన్నింటినో అందించిన కళాకారులు మన దేశంలో పుట్టడం నిజంగా మనదేశం చేసుకున్న అదృష్ట మే... కాశ్మీరీ మహిళలు తమ చేతితో చేసే అద్భుతాలలో శాలువా ఒకటి. ప్రకృతి రమణీయత ఉట్ట్టిపడేలా రూపొందే షష్మినా శాలువలు ప్రపంచాన్ని కట్ట్టిపడేస్తు.. ప్రపంచంలోనే అత్యుత్తమంగా చలినుంచి కాపాడే వస్త్రంగా తన ప్రత్యేకతని నిలబెట్టుకుంటూ వస్తున్న కాశ్మీర్ శాలువాల విలువల్ని గుర్త్తించిన మొఘల్ చక్రవర్త్తులు, బ్రిటీష్, డచ్,ఫ్రెంచ్ పాలకులు... తమ రాజ్యానికి వచ్చే అతిధులని కాశ్మీరీ శాలువలతో సత్కరించేవారు. నేటికీ అనేక సత్కారాలలో, సన్మానాలలో శాలువలే తమ ప్రత్యేకతని నిలుపుకుంటున్నాయి.
మన శీతాకాలం వచ్చేస్తోందంటే చాలు... మనిళ్లలో రాత్రుళ్లు రొజారులు, రగ్గులు ఎలా పైకి తీస్తావెూ.. వర్షా కాలం పూర్తి కాకుండానే పగటి వేళలో చల్లటి వాతా వరణాన్ని తట్టుకునేలా అపðడే శాలువాలతో దర్శన మిచ్చేస్తు న్నారు. ఇక రాజకీయ నాయకుల్లో అయితే చెప్పనఖ్ఖర్లే... ఎంత వేసవి అయినా భుజం మీద శాలువ కనిపించాల్సిందే అన్న స్ధాయికి దానితోనే ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించేసుకున్న ప్రముఖుల్ని మనం చూడొచ్చు.
అంతెందుకు శాలువాలేని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితని ఊహించుకోగలమా కరుణానిధి భుజాన శాలువా లేకుంటే తమిళ సోద రులు తట్టుకోగలరా ఇందులో షీలాదీక్షిత్, సోనియా గాంధీ, నరేంద్ర వెూడీ ఇలా చెపðకుంటూ పోతే చేంతాడంత లిస్టు తయారవుతుంది. వారి వ్యక్తిగత ప్రతిష్టకి శాలువాలే కీలక భూమిక పోషిస్తున్న విషయాన్ని వారే అనేక సందర్భాలలో వెల్లడించారు కూడా..
సినీ రాజకీయ ప్రముఖులకు నిలువెత్తు హుందా తనాన్ని కలిగించడమే కాదు... వస్త్ర ధారణలోనూ మమేకమూ నిండైన ప్రేమ భావాన్ని వ్యక్తీకరించడం శాలువాలకే చెల్లిందనే చెప్పక తప్పదు. కేవలం రెండు మీటర్లుండి దీర్ఘ చతురస్త్రాకారంలో ఉన్న ఓ బట్ట పొందికగా భుజాపై కూర్చొని ఆ వ్యక్తి గౌరవ ప్రతిష్టలని పెంచుతోందంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశంగానే చెప్పకతప్పదు.
ఒకపðడు చలినుండి కాపాడుకునేం దుకు మాత్రమే వినియోగించే శాలువా ఇపðడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో సాంప్రదాయాలకు అనుగణంగా ఒదిగిపోతూ తన సత్తా చాటుకుంటూ వస్తోంది. ఒక్క భారత దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో వస్త్ర ధారణలో శాలువా కూడా ఓ ప్రత్యేక స్ధానాన్ని దక్కించుకోగా... మహిళల్లో శాలు వాలు ఫ్యాషన్ గార్మెట్‌గా మారి హల్‌చల్ చేస్తున్నాయి.
ఇక సన్మానాలు, సత్కారాలు జరిగినపðడు ప్రేమను పంచేలా, గౌరవాన్ని అందించేలా... అభినందన లకు ప్రత్యే కతగా నిలచింది శాలువానే అనటంలో సందేహం లేదెవ్వ రికీ... ఎంతో ప్రాముఖ్యత కలిగి సామాన్యుడి జీవితం లో సైతం ఒదిగి పోతూ వెచ్చదనాన్ని కలుగ చేస్తున్న ఈ శాలువా గురించి కాస్త తెలుసు కుంటే...
శాలువా పేరెత్తినా... మీరు కొన్నా... అది కాశ్మీర్
శాలువానా అని ప్రశ్నించే వారే మీకు ఎదురు పడ తారు. అంతలా కాశ్మీర్‌తో బంధాన్ని పెనవేసుకు పోయిన శాలువా తన ఇంటి పేరునే కాశ్మీర్‌గా నేటికీ నిలబెటు ్ట్టకుంటూ వస్తోంది. కాశ్మీర్ శాలువాలు ఇంటి ప్రత్యేకతల్ని సంతరించుకోవటానికి కారణం అక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలు శాలువాలపై అందంగా సన్నని దారాలతో అక్కడి మహిళ చేతిల్లో ఒదిగి పోవటమే. అక్కడి హిమ గిరి సొగసుల్నే కాదు మన పౌరాణికాలని కూడా ఓర్పుతో నేర్పుగా సన్నని ఊలు వస్త్రా లపై అద్భుతంగా సృష్టిం చడం ఇక్కడి వారికే చెల్లింద నటం అతిశయోక్తి కాదు.
కాశ్మీర్ శాలువలు మూడు రకాలుగా ఉంటాయి. సాదా ఊలు, పష్మీనా ఊలు, పాతూప్
ఊలు అనే ఈ మూడు రకాలలో ఎక్కడైనా సాధారణ ఊలుతో చేసిన శాలువలు దొరుకు తాయి. వీటి నాణ్యతను బట్టి ఒక్కో చోట ఒక్కోధరతో లభిస్తాయి. వీటినే కాశ్మీరీ శాలువా అంటూ అంటగట్టిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి కూడా..
ఇక పష్మీనా శాలువల విషయానికి వస్తే... కాశ్మీరీ శాలువల్లో ఇవే చాలా నాణ్యతకు, మన్నికకు పెట్టింది పేరు. పష్మీనా ఊలు కోసం హిమాలయ సానువులలో కాప్రా హిర్కస్ అనే మేకల్ని పెంచు తారు. ఈ మేకలలో ఉండే అత్యధిక ప్రోటీన్ల వల్ల దీని పొట్ట భాగంలో లభించే పొడవాటి వెంట్రుక లను కత్తిరించి తయారు చేసే ఊలుని పష్మీనా అని పిలుస్తారు. టిబెట్ కూడా హిమాలయ ప్రాంతం లోనే ఉండటంతో వీరు ఈ ఊలు కష్మేరీ అని అంటారు, మంచి రంగుతో అద్భుత మెరుపులతో ఉండే ఈ ఊలు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనది కావటం... అందునా ప్రపంచంలో అనేక శీత ప్రదేశాలున్నప్పటికీ కాప్రా హిర్కస్ మేకలు కాశ్మీర్ ప్రాంతంలోనే బతుకుతుండటంతో కాశ్మీర్ ఈ ఊలుని ఉత్పత్తి చేయటంలో ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వస్తోంది.
రెండు వందల ఏళ్ల క్రితం కాశ్మీర్‌కి వచ్చిన యూరోపియన్లు టిబెట్ ప్రాంతంలో ఃకష్మేరీఃతో చేసిన శాలు వలు కొనుగోలు చేసారని అనం తరం కాలంలో వాటి పేరుని పలకటం రాక తమ ప్రాంతానికి దిగుమతి చేసుకుంటూ... కాశ్మీర్ శాలువగా మార్చేసారని మరికొందరు చెప్తారు.
భారీ జర్కిన్‌లు, ఉలెన్ కోట్‌లు ఇవ్వలేని వెచ్చదనం కేవలం చేెతి ఉంగరం మధ్యలో దూరిపోయేంత పలుచగా ఉండే శాలువాలు ఇవ్వటం పట్ల ఆశ్చర్య పోయిన కొందరు దీనిపై ఏకంగా పరిశోధనలు చేపట్టగా.. కాప్రా హిర్కస్ మేకలు మనిషి వెంట్రుక మందం 75 మైక్రాన ్లకన్నా సన్నగా 12-14 మైక్రాన్ల మధ్య మందంతో అద్భుత వెచ్చదనాన్ని కలుగ చేస్తున్నాయని.. తేలింది.
ఇక శాలువల తయారీలోనూ యంత్రాలు ప్రారంభమయ్యాక కొత్త కొత్త పేర్లతో శాలువలు పుట్టకొస్తున్నాయి.
శాలువల పొడవు తగ్గించి తమ మీదుగా ముడిని వేసుకుంటే స్కార్ఫ్‌గా పిలుస్తుండగా... కాస్త శాలువ పెంచి వివిధ రకాల డిజైన్లతో మెడ చుట్టూ చేర్చేలా ఉంటే స్టోల్ అని పిలుస్తున్నారు. ఇవి కాక చుట్టకోనవసరం లేకుండా కుర్రకారుకి నచ్చేలా ఃషాల్ పాంబోస్‌ః పేరుతో శాలువకి కొత్త రూపం ఇచ్చేసాయి కొన్ని కంపెనీలు. చలికాలం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ గార్మెంట్ ఏ వస్త్ర ధారణకైనా సూట్ అవుతుండటం ఎగబడుతున్నారు.
అలాగే ఒకే దారంతో అల్లిక చేసే శాలువలు కొన్నయితే వివిధ రంగుల దారాలతో, సాధారణ ఊలు తో అల్లేవి మరికొన్ని... నేడు మిషన్లపై ఎన్నో రకాల అందాలతో శాలువలు తయారవుతున్నా ఃకష్మేరీః తో చేసిన శాలువలు తమ ప్రత్యేకతల్ని నిలబెట్టుకుంటునే వస్తోంది. అందునా కాశ్మీరీ మహిళలు చేతి నైపుణ్యం ముందు మిషన్ల డిజైన్లు బలాదూరే. అందుకే దేశ విదేశాల్లో కాశ్మీరీ శాలువల రేటుతో సంబంధంలేకుండా హాట్ కేకుల్లా అమ్ముడు పోతోంది. శాలువల్లో మహారాజులా నిలదొక్కుకొం టోంది. చైనా నుండి క్రేప్ శాలువలు దిగుమతి అవుతున్నాయిపðడు.
కుచ్చెళ్లు ఎక్కువగా ఉండే పట్టు శాలువలను కూడా చైనాలోని అనేక వస్త్ర కంపెనీలు విడుదల చేయటంతో ఎక్కువగా ఎంబ్రయిడరీ తో ఆకర్షించే విధంగా తయారవుతున్న ఈ శాలువల పట్ల నేటి తరం మక్కువ చూపిస్త్తోంది. కాశ్మీరీ శాలువల ధర ఎక్కువగా ఉండటంతో క్రేప్ శాలువలు వాటి స్ధానం పదిలం చేసుకుంటున్నా... ఎప్పటికపðడు కొత్త కొత్త డిజైన్లతో కాశ్మీరీ శాలువల వైపే ప్రపంచం మొగ్గు చూపుతుండటం వాటి నాణ్యతకు ప్రతీకగా చెపðకోవచ్చు.